కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 6/15 పేజీలు 8-9
  • “విశ్వాసగృహమునకు చేరిన”వారియెడల ప్రేమ

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “విశ్వాసగృహమునకు చేరిన”వారియెడల ప్రేమ
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 6/15 పేజీలు 8-9

“విశ్వాసగృహమునకు చేరిన”వారియెడల ప్రేమ

యథార్థ క్రైస్తవుల మధ్య ఒక కుటుంబంలో ఉండేటటువంటి అనుబంధం ఉంటుంది. నిజానికి, సా.శ. మొదటి శతాబ్దం మొదలుకొని వాళ్ళు, ఒకరినొకరు “సహోదరుడు,” “సహోదరి” అని పిలుచుకున్నారు. (మార్కు 3:31-35; ఫిలేమోను 1, 2) అవి కేవలం మాటలు మాత్రమే కావు; దేవుడి ఆరాధకులు ఒకరి గురించి ఒకరు ఎలా భావిస్తారనే దాని గురించిన వివరణను అవి ఇస్తాయి. (పోల్చండి 1 యోహాను 4:7, 8.) “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందుర[ని]” యేసు అన్నాడు.—యోహాను 13:35.

అలాంటి ప్రేమ, 1997 జూలై నెలలో చిలీలో చాలా రోజులుగా వర్షాలు పడకుండా ఉండి, ఆ తర్వాత, కుండపోతగా వర్షం పడి, వరద వచ్చినప్పుడు వ్యక్తమయ్యింది. ఆకస్మికంగా, అనేకులకు ఆహారపదార్థాలూ, వస్త్రాలూ, మరితర వస్తువులూ అవసరమయ్యాయి. “కాబట్టి మనకు సమయము దొరకినకొలది అందరియెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలు చేయుదము” అని పౌలు గలతీయులకు చేసిన ఉద్బోధను విపత్తులు సంభవించిన పరిస్థితుల్లో అనుసరించడానికి యెహోవాసాక్షులు శ్రమిస్తారు.—గలతీయులు 6:10.

కనుక, యెహోవాసాక్షులు ప్రతిస్పందించేందుకు త్వరగా తమకు తాము సంఘటితమయ్యారు. ఆహార పదార్థాలూ, వస్త్రాలూ మొదలైనవాటిని సేకరించి, వేరు చేసి, ప్యాక్‌ చేసి, విపత్తు జరిగిన చోటికి పంపించారు. పిల్లలు ఆటవస్తువులను విరాళాలుగా ఇచ్చారు కూడా! రాజ్యమందిరం సహాయ సరఫరాలతో నిండిపోయి ఉండడం చూసి ఒక సహోదరి ఆశ్చర్యచకితురాలయ్యింది. “నాకు నోట మాట రాలేదు, నవ్వాలో ఏడ్వాలో తెలియలేదు. అవన్నీ సరిగ్గా మాకవసరమున్నవే” అని ఆమె అంటోంది.

తర్వాత, ఆ వరద బాధిత ప్రాంతంలోని ఒక భాగంలో అనుకోకుండా భూకంపం సంభవించింది. అనేక ఇండ్లు కూలిపోయాయి. అక్కడి అవసరాన్ని తీర్చేందుకు, మరిన్ని రిలీఫ్‌ కమిటీలు రూపొందాయి. సాధారణంగా, యెహోవాసాక్షులు కూడుకునే హాల్‌ల నిర్మాణ కార్యాలను చూసే రీజనల్‌ బిల్డింగ్‌ కమిటీ కూడా ముందుకువచ్చి మద్దతునిచ్చింది. ఫలితం? సహోదరులు చిన్న ఇండ్లకు రూపకల్పన చేసి, నిర్మించి వాటిని ఇండ్లను పొగొట్టుకున్నవారికి విరాళంగా ఇచ్చారు. ఈ ఇండ్లు మరీ పెద్దవి కాకపోయినప్పటికీ, ఋణాల మీద సహాయాన్నందిస్తూ లౌకిక సంస్థలు నిర్మించి ఇచ్చిన ఇండ్లతో పోల్చి చూస్తే చాలా వ్యత్యస్తంగా ఉన్నాయి. ఆ సంస్థలు కట్టి ఇచ్చిన ఇండ్లకు గచ్చుగానీ, కిటికీలుగానీ లేవు. పెయింట్‌ వేయలేదు.

కొంత మంది సహోదరులు సహాయం చేసేందుకు చాలా దూరాలు ప్రయాణం చేశారు. ఒక రీజనల్‌ బిల్డింగ్‌ కమిటీ చెయర్మన్‌ తాను వీల్‌చెయర్‌లోనే ఉంటారు. అయినప్పటికీ, వరుసగా రెండు రోజులు ప్రమాదానికి గురైన ఆ స్థలమంతా తిరిగి చూశారు. అంధుడైన ఒక సహోదరుడు చాలా కష్టపడి పనిచేశారు. కావలసిన పరిమాణంలో కలపను కోసి ఇచ్చే వడ్రంగి దగ్గరికి, దూలాలను మోసుకువెళ్ళారు. చెవుడున్న ఒక సహోదరుడు దూలాలను అక్కడి నుండి అవి అవసరమున్న చోటికి చేరవేశారు.

సహోదరులు అందించిన సహాయం చాలా మంది చూపరులపై చెరగని ముద్రవేసింది. ఒక పట్టణంలో, ఒక సహోదరి ఇల్లు మరమ్మతు జరుగుతుండగా, సమీపాన ఒక పోలీస్‌ వాహనం ఆగి ఉంది. ఆ పోలీసులు చాలా జిజ్ఞాసతో ఉన్నారు. “ఎంతో సంతోషంగా కనిపిస్తున్న ఈ పనివాళ్ళు ఎవరు, వాళ్ళకు ఎంత కూలి ఇస్తున్నారు?” అని వాళ్ళలో ఒకరు ఒక సహోదరుడ్ని అడిగారు. వాళ్ళందరూ స్వచ్ఛంద సేవకులని సహోదరుడు వాళ్ళకు వివరంగా చెప్పారు. ఆయన తన చర్చికి ప్రతినెలా దశమభాగాన్ని చెల్లిస్తూనే వచ్చాడు, అయినప్పటికీ, భూకంపం వచ్చినది మొదలుకొని, వాళ్ళ పాస్టర్‌ ఇంతవరకూ ఆయనను సందర్శించడానికి కూడా రాలేదు! మరుసటి రోజు, ఒక పోలీస్‌ అధికారి దగ్గర నుండి ఆ సహోదరికి ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఆయన కూడా ఆ పనివాళ్ళను గమనించాడు. ఆ పనివాళ్ళ స్ఫూర్తి తనను ఎంతో ఆకర్షించిందనీ, తను కూడా వాళ్ళతో చేరాలన్న ప్రలోభం తనకు కలిగిందనీ ఆయన చెప్పాడు!

నిజమే, చిలీలో జరిగిన ఆ సహాయ కార్యక్రమం స్వచ్ఛంద సేవకులకు ఆనందభరితమైన అనుభవంగాను, చూపరులకు అమోఘమైన సాక్ష్యంగానూ ఉంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి