కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 6/15 పేజీలు 3-4
  • విధ్వంసకాండ—ఎందుకు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విధ్వంసకాండ—ఎందుకు?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • విధ్వంసకాండను ఎవరు ఆపివేయగలరు?
  • విధ్వంసకాండ నిర్మూలించబడగలదు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ద్వేషానికి బలైనవాళ్లు ప్రతీచోట ఉన్నారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2022
  • ఇతర యౌవనులు అంత సరదాగా ఎందుకు ఉంటారు?
    తేజరిల్లు!—1996
  • ద్వేషాన్ని లేకుండా చేయడం సాధ్యమే!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2022
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 6/15 పేజీలు 3-4

విధ్వంసకాండ—ఎందుకు?

“నేను చెప్పడానికి ఏమీ లేదు.” ఈ మాటలు సావోపౌలూ నగరానికి పొరుగున ఉన్న ఆహ్లాదకర ప్రాంతంలోని, క్రొత్తగా పెయింట్‌ వేయబడిన గోడపై పెద్దగా వ్రాయబడ్డాయి. విధ్యంసకాండలో ఇదీ ఒక భాగమే అని మీరనుకోవచ్చు. గోడలపై వ్రాయడమనేది ఒక రకం విధ్వంసకాండ మాత్రమే.

బాధ్యతలేని విధ్వంసకారులు మీ క్రొత్త కారును ధ్వంసం చేశారనుకోండి. లేదా, అనేకులకు ఉపయోగకరంగా ఉండే ప్రజా ఆస్తిని విధ్వంసకారులు పాడు చేశారని గానీ, మొత్తమే నాశనం చేయబడిందని గానీ మీరు గమనించారనుకోండి. ఎందుకలా జరిగివుంటుందంటారు? అవును, ఎందుకంటారు? విధ్వంసకాండ చర్యలు ఇలా ఎందుకు పెరిగిపోతున్నాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అనేక ప్రాంతాల్లో, విధ్వంసకారులు టెలిఫోన్‌ బూత్‌లను అందవికారంగా మార్చివేయడంలో, లేదా పాడుచేయడంలో ఆనందాన్ని కనుగొంటున్నట్లు కనిపిస్తుంది. తరచూ ట్రెయిన్‌లు, బస్సులు వంటి ప్రజా రవాణా సౌకర్యాలు విధ్వంసకాండకు గురవుతున్నాయి. విధ్వంసకారులు దేని గురించీ పట్టించుకోరు అని అనిపిస్తుంది. కానీ, మనం చూస్తున్న, లేదా మనలను బాధపెడుతున్న విధ్వంసకాండ వెనుక ఉన్నదేమిటి?

రియో డే జనైరోవాడైన మార్కూ,a తన జట్టు ఫుట్‌బాల్‌ ఆటలో ఓడిపోయాక, చాలా నిరాశకు గురయ్యాడు. ఎంత నిరాశకు గురయ్యాడంటే, గెలుపొందిన జట్టువాళ్ళ అభిమానులతో నిండివున్న బస్సుమీద రాళ్ళు రువ్వడం మొదలుపెట్టాడు. క్లవుస్‌ విషయమే తీసుకోండి. స్కూల్‌లో తనకు మంచి మార్కులు రాకపోయేసరికి, అతనికి బాగా కోపం వచ్చి, రాళ్ళు రువ్వి కిటికీలను పగులగొట్టాడు. అయితే, జరిగిన నష్టానికి పరిహారం చెల్లించమని తన తండ్రిని అడిగారు, దాంతో అతడి “ఆట” ఆగింది. ఎర్‌వీన్‌ అనే మరో యౌవనస్థుడు స్కూల్‌లో చదువుకుంటున్నాడు, అలాగే పని చేస్తున్నాడు. అతడూ, అతడి స్నేహితులూ మంచిపిల్లలుగా కనిపించేవారు. అయినప్పటికీ, వాళ్ళ కాలక్షేపం పొరుగుప్రాంతాన్ని విధ్వంసం చేయడమే. ఎర్‌వీన్‌ తల్లిదండ్రులకు ఈ విషయం ఏ మాత్రం తెలియదు. వాల్‌టర్‌ ఒక అనాథ. సావోపౌలూ వీధులను తన ఇల్లుగా చేసుకోవడం మినహాయించి తనకు వేరే మార్గం లేదు. విధ్వంసకారుల గుంపే అతడి సన్నిహిత స్నేహితులు. అతడు వాళ్ళతోపాటు విధ్వంసకాండకు వెళ్ళేవాడు, యుద్ధ కళలను కూడా నేర్చుకున్నాడు. విధ్వంసకాండ వెనుక కొందరు ఉన్నారనీ, దానికి కీలకంగా పని చేసే కారకాలూ, లేదా వాటిలో ఇమిడివున్న భావోద్వేగాలూ వివిధ విధాలుగా ఉంటాయనీ అలాంటి ఉదాహరణలు చూపిస్తున్నాయి.

“విధ్వంసకాండ అనేది ఒక ప్రతీకార చర్య కావచ్చు, లేదా రాజకీయ అభిప్రాయాన్ని వ్యక్తీకరించే ఒక పద్ధతే కావచ్చు. యౌవనస్థులూ, వయోజనులూ కొన్నిసార్లు, కేవలం ‘సరదా’ కోసం ఈ నేరం చేస్తారు” అని ద వాల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా అంటోంది. అయినప్పటికీ, విధ్వంసకాండ అనేది ఏదో యౌవనపు సరదాగా ఉండిపోకుండా, చాలా విపరీతమైన వినాశకారి కాగలదు, ప్రాణాంతకం కూడా కాగలదు. ఒక గుంపు యౌవనస్థులు “ఏదో సరదా” పని చేయాలనుకున్నారు. అలా ఉండగా, ఒక మనిషి నిద్రపోవడం వాళ్ళు చూశారు. సులభంగా నిప్పంటుకోగల ఒక ద్రవాన్ని అతడిపై పోసి నిప్పంటించారు. ఆ బాధితుడు ఒక ఇండియన్‌. అతడు తర్వాత ఆసుపత్రిలో మరణించాడు. ఒక నివేదిక ప్రకారం, “వీధిలో అనేక మంది భిక్షగాళ్ళను కాల్చివేస్తుండగా, ఏ చర్యలు తీసుకోబడలేదు కనుక, ఎవరైనా పట్టించుకుంటారని తాము అనుకోలేదని ఆ యౌవనస్థులు అన్నట్లు చెప్పబడుతుంది.” విధ్వంసకాండకు ఎవరూ బాధితులు కారు అన్నట్లు అనిపించినా అనిపించకపోయినా, దానికి చెల్లించవలసి వచ్చిన మూల్యం, అంటే ఆర్థిక మరియు భావోద్వేగపు మూల్యం వెలకట్టలేనిది. కనుక విధ్వంసకాండను ఏది అదుపు చేయగలదు, లేదా అంతం చేయగలదు?

విధ్వంసకాండను ఎవరు ఆపివేయగలరు?

పోలీసులుగానీ, స్కూళ్ళుగానీ విధ్వంసకాండను నివారించడం జరుగుతుందా? అధికారులు “బాధితులులేని” నేరాల కన్నా, మరింత పెద్ద నేరాలను, మత్తుమందుల రవాణా కేసులు, లేదా హత్యా కేసులు మొదలైనవాటిలో ఎక్కువ నిమగ్నమై ఉంటారన్నది ఒక సమస్య. ఒక పోలీస్‌ ఆఫీసర్‌ అభిప్రాయం ప్రకారం, ఒక యౌవనస్థుడు సమస్యలో చిక్కుకున్నప్పుడు, అతడి తల్లిదండ్రులు “అతడు ఎవరితో సహవసిస్తాడో ఆ పిల్లలను, లేదా పాఠశాలను, లేదా అతడ్ని పట్టుకున్నందుకు పోలీసులను” తరచూ, “నిందిస్తారు.” విద్యా, చట్టాన్ని అమలు చేయడమూ విధ్వంసకాండను తగ్గించవచ్చు; అయినప్పటికీ, తల్లిదండ్రుల దృకృథం మారకపోతే అప్పుడేమిటి? “ఈ సమస్యకు కారణాలు విసుగూ, అవకాశమూ. [పిల్లలు] చీకటిపడినా బయటే ఉంటారు, వాళ్ళకు మరి వేరే పనేమీ లేదు. బహుశా, వాళ్ళపై మంచి పర్యవేక్షణ లేదు—లేకపోతే వాళ్ళు బయట ఉండకపోదురు” అని బాలనేరస్థుల పరివీక్ష అధికారిణి అంటున్నారు.

అనేక ప్రాంతాల్లో, విధ్వంసకాండ జటిల సమస్యగా ఉన్నా, పరిస్థితులు ఎలా మారిపోగలవో చూడండి. మొదట్లో పేర్కొనబడిన యువ విధ్వంసకారులు మారిపోయారు; వాళ్ళు సామాజిక విరుద్ధమైన ప్రతి ప్రవర్తననూ ఇప్పుడు పూర్తిగా వదిలిపెట్టేశారు. మునుపు విధ్వంసకాండలో ఆనందించిన వీళ్ళు మారేలా చేసినదేమిటి? అలాగే, విధ్వంసకాండ తగ్గించబడడమే కాక, నిర్మూలించబడబోతున్నట్లయితే, మీరు ఆశ్చర్యపోతారా? తర్వాతి శీర్షికను చదవమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.

[అధస్సూచీలు]

a పేర్లు మార్చబడ్డాయి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి