కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 4/15 పేజీ 30
  • మీరు జ్ఞాపకమునకు తెచ్చుకొనగలరా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు జ్ఞాపకమునకు తెచ్చుకొనగలరా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీలో అమర్త్యమైన ఆత్మ ఉందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • ఇదే రక్షణ దినం!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • యేసు రక్షించును —కానీ ఎలా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • యేసు మాదిరిని అనుసరించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 4/15 పేజీ 30

మీరు జ్ఞాపకమునకు తెచ్చుకొనగలరా?

మీరు ఇటీవలి కావలికోట శీర్షికలను చదివి ఆనందించారా? ఈ క్రింది ప్రశ్నలకు జవాబివ్వగలరేమో చూడండి:

◻ పౌలు ఉపయోగించిన ‘క్రీస్తుకు రాయబారులు’ అనే వ్యక్తీకరణ అభిషిక్త క్రైస్తవులకు ఎందుకు అంత యుక్తమైనది? (2 కొరింథీయులు 5:20)

ప్రాచీన కాలాల్లో, ముఖ్యంగా శత్రుత్వమున్న కాలాల్లో, యుద్ధాలను నివారించే అవకాశమేమైనా ఉందా అని తెలుసుకునేందుకు రాయబారులను పంపేవారు. (లూకా 14:31, 32) పాపభరితమైన మానవజాతి దేవుడి నుండి వేరైపోయింది గనుక, ఆయన తన సమాధాన నిబంధనలను ప్రజలకు తెలిపేందుకు అభిషిక్త రాయబారులను పంపిస్తున్నాడు. వీరు దేవునితో సమాధానపడండి అని కోరుతున్నారు.—12/15, పేజీ 18.

◻ అబ్రాహాము విశ్వాసాన్ని బలపర్చిన నాలుగు విషయాలు ఏమిటి?

మొదటిది, దేవుడు చెప్పేది వినడం ద్వారా ఆయన యెహోవాయందు తన విశ్వాసాన్ని ప్రదర్శించాడు (హెబ్రీయులు 11:8); రెండవది, ఆయన విశ్వాసం ఆయనకున్న నిరీక్షణతో సన్నిహిత సంబంధం కల్గివుంది (రోమీయులు 4:18); మూడవది, అబ్రాహాము దేవునితో తరచుగా మాట్లాడాడు; నాలుగవది, అబ్రాహాము దేవుని నడిపింపును అనుసరించినప్పుడు ఆయనకు యెహోవా మద్దతునిచ్చాడు. అవే విషయాలు నేడు మన విశ్వాసాన్ని కూడా బలపర్చగలవు.—1/1, పేజీలు 17, 18.

◻ “మమ్మును శోధనలోనికి తేకుము” అన్న వ్యక్తీకరణకు అర్థం ఏమిటి? (మత్తయి 6:13)

ఆయనకు అవిధేయత చూపించేలా మనం శోధించబడినప్పుడు మనం తప్పిపోయేందుకు అనుమతించవద్దని దేవుణ్ని మనం అడుగుతున్నాము. మనం లొంగిపోకుండా, ‘దుష్టుడైన’ సాతానుకు చిక్కకుండా యెహోవా మనకు నడిపింపునివ్వగలడు. (1 కొరింథీయులు 10:13)—1/15, పేజీ 14.

◻ తప్పుచేసినప్పుడు దేవుని క్షమను పొందడానికి ఏమి చెయ్యాలి?

దేవుని క్షమను పొందడానికి, మనం మన తప్పును ఒప్పుకోవడమే కాదు దానితోపాటు పశ్చాత్తాపపడి, “మారుమనస్సునకు తగిన ఫలములు” ఫలించాలి. (లూకా 3:8) పశ్చాత్తాప దృక్పథమూ తప్పును సరిదిద్దుకోవాలనే కోరికా, క్రైస్తవ పెద్దల ఆధ్యాత్మిక సహాయాన్ని తీసుకునేందుకు కూడా మనల్ని పురికొల్పుతాయి. (యాకోబు 5:13-15)—1/15, పేజీ 19.

◻ మనం నమ్రతగా ఉండడానికి ఎందుకు కృషిచేయాలి?

నమ్రత గల వ్యక్తి సహనం గలవానిగాను, దీర్ఘశాంతము గలవానిగాను ఉంటాడు, తన గురించి తాను అధికంగా తలంచడు. నమ్రత మిమ్మల్ని ప్రేమించే నిజ స్నేహితులను ఆకర్షిస్తుంది. అన్నిటికంటే ప్రాముఖ్యంగా, అది యెహోవా ఆశీర్వాదాన్ని తెస్తుంది. (సామెతలు 22:4)—2/1, పేజీ 7.

▫ యేసు మరణానికీ, ఆదాము మరణానికీ మధ్య ఏ ప్రాముఖ్యమైన వ్యత్యాసం ఉంది?

ఆదాముకి మరణం తగినదే ఎందుకంటే అతడు తెలిసీ తన సృష్టికర్తపట్ల అవిధేయత చూపించాడు. (ఆదికాండము 2:16, 17) దానికి భిన్నంగా, యేసు మరణానికి ఎంత మాత్రమూ పాత్రుడుకాడు; ఎందుకంటే ఆయన ఏ “పాపము చేయలేదు.” (1 పేతురు 2:22) కాబట్టి యేసు మరణించేటప్పుడు ఆయన అత్యంత విలువైనదాన్నొకదాన్ని కల్గివున్నాడు. పాపియైన ఆదాము మరణించేటప్పుడు అతనికి అదిలేదు. అదే పరిపూర్ణ మానవ జీవితపు హక్కు. అలా యేసు మరణం మానవజాతికి విమోచన క్రయధనాన్నివ్వడంలో బలి అర్పణ విలువను కల్గివుంది.—2/15, పేజీలు 15, 16.

◻ యెహెజ్కేలు ప్రవచనాత్మక దర్శనంలో పట్టణం దేనికి చిత్రీకరణగా ఉంది?

పట్టణం “అపవిత్ర” (పరిశుద్ధంకాని) ప్రదేశం నడుమ ఉంది కాబట్టి అది భూసంబంధమైనదే అయివుండాలి. కాబట్టి ఇది నీతియుక్తమైన భూసమాజంగా ఏర్పడేవారందరికీ ప్రయోజనాన్ని తెచ్చే భూసంబంధమైన కార్యనిర్వహణ యంత్రాంగాన్ని సూచిస్తున్నట్లు అన్పిస్తుంది.—3/1, పేజీ 18.

◻ యేసు సా.శ. 33లో పస్కా ఆచరిస్తున్నప్పుడు తన శిష్యుల పాదాలను ఎందుకు కడిగాడు?

యేసు పాదాలు కడిగే విషయంలో ఒక ఆచారాన్ని ప్రారంభించడం లేదు. బదులుగా, తన అపొస్తలులు సరిక్రొత్త ఆలోచనా విధానాన్ని అలవర్చుకోవడానికి అంటే, నమ్రతను అలవర్చుకోవడానికి, తమ సహోదరుల కోసం ఎంతో అల్పమైన పనులు చేయడానికైనా సుముఖత కల్గివుండడానికి ఆయన వారికి సహాయం చేస్తున్నాడు.—3/1, పేజీ 30.

◻ మనం ఇతరులకు బోధించడంలో సహజసిద్ధమైన సామర్థ్యాలకంటే మరింత ప్రాముఖ్యమైనదేమిటి?

మనం ఎలాంటి లక్షణాలను కల్గివున్నాము, విద్యార్థులు అనుకరించదగిన ఏ ఆధ్యాత్మిక అలవాట్లను మనం అలవర్చుకున్నాము అన్నవే. (లూకా 6:40; 2 పేతురు 3:11, NW)—3/15, పేజీలు 11, 12.

◻ బహిరంగ ప్రసంగీకులు లేఖనాలను చదివే విషయంలో తమను తాము ఎలా మెరుగుపర్చుకోవచ్చు?

అభ్యాసం చేయడం ద్వారానే. అవును, తాము అనర్గళంగా చదవగలిగేంత వరకు పదే పదే బిగ్గరగా చదవడం ద్వారా మెరుగుపర్చుకోవచ్చు. మీ భాషలో ఆడియో క్యాసెట్లు అందుబాటులో ఉంటే, అందులో చదువుతున్న వ్యక్తి భావం వచ్చేలా నొక్కి పలకడాన్నీ, స్వరభేదం చూపించడాన్నీ వినడం, అలాగే పేర్లనూ, అసాధారణమైన పదాలనూ ఎలా ఉచ్చరిస్తున్నాడన్నదాన్ని గమనించడం జ్ఞానయుక్తం.—3/15, పేజీ 20.

◻ ఒక వ్యక్తి మరణించినప్పుడు ఎలా అతని “ఆత్మ [రూ-ఆహ్‌] దాని దయచేసిన దేవునియొద్దకు మరల పోవును”? (ప్రసంగి 12:7)

ఆత్మ [రూ-ఆహ్‌], జీవశక్తిని సూచిస్తుంది గనుక, అది “దేవుని యొద్దకు మరల పోవును” అంటే దానర్థం ఆ వ్యక్తికి సంబంధించిన భవిష్యద్‌ జీవిత ఉత్తరాపేక్ష ఏదైనా ఇప్పుడిక పూర్తిగా దేవుని చేతుల్లో ఉందని భావం. కేవలం దేవుడు మాత్రమే ఆ వ్యక్తి తిరిగి జీవానికి వచ్చేలా చేస్తూ అతని రూ-ఆహ్‌ను లేక ఆత్మను లేక జీవశక్తిని పునరుద్ధరించగలడు. (కీర్తన 104:30)—4/1, పేజీ 17.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి