కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 4/15 పేజీలు 28-30
  • పాఠకుల ప్రశ్నలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠకుల ప్రశ్నలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఇలాంటి మరితర సమాచారం
  • కష్టపడి పనిచేసి సంతృప్తిని పొందండి
    ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’
  • ఈ మతాల దగ్గర సమాధానమున్నదా?
    తేజరిల్లు!—1993
  • మీ మనస్సాక్షి చెప్పేదానికి స్పందించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • “ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 4/15 పేజీలు 28-30

పాఠకుల ప్రశ్నలు

మతసంబంధమైన భవనాలలో లేదా ఆస్తులలో ఉద్యోగం చేయడానికి కొంతమంది యెహోవాసాక్షులకు అవకాశాలు లభించాయి. అటువంటి పనికి సంబంధించి లేఖనాధారమైన దృక్పథం ఏమిటి?

తన ఇంటివారిని వస్తుపరంగా పోషించాల్సిన అవసరతను నొక్కిచెబుతున్న 1 తిమోతి 5:8ని హృదయపూర్వకంగా అన్వయించుకోవాలనుకునే క్రైస్తవులు ఈ పరిస్థితిని ఎదుర్కొంటారు. క్రైస్తవులు తప్పకుండా ఆ సలహాను అన్వయించుకోవాలి. కానీ అలా అన్వయించుకోవడానికి వారు ఎటువంటి లౌకిక పనినైనా, అందులో ఏమి ఇమిడివున్నా స్వీకరించడాన్ని సమర్థించదు. దేవుని చిత్తం ఇంకా ఏమి సూచిస్తుందన్న విషయాల్ని పరిగణలోనికి తీసుకోవల్సిన అవసరాన్ని వారు గుర్తిస్తారు. ఉదాహరణకు, తన కుటుంబాన్ని పోషించాలనుకోవడం, అనైతికత లేదా హత్య వంటివాటి గురించి బైబిలు చెబుతున్నదాన్ని ఉల్లంఘించడాన్ని సమర్థించదు. (పోల్చండి ఆదికాండము 39:4-9; యెషయా 2:4; యోహాను 17:14, 16.) ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన మహా బబులోను నుండి బయటికి రమ్మన్న ఆజ్ఞకు అనుగుణ్యంగా క్రైస్తవులు చర్య తీసుకోవడం కూడా ప్రాముఖ్యం.—ప్రకటన 18:4, 5.

భూవ్యాప్తంగా దేవుని సేవకులు అనేక రకాలైన ఉద్యోగ సంబంధిత పరిస్థితుల్ని ఎదుర్కొంటారు. సాధ్యంకాగల అన్ని పరిస్థితులనూ పేర్కొని, వాటి విషయమై నియమాలు ఏర్పర్చడం అనేది నిరర్థకమే, అది మా అధికారానికి మించింది కూడా. (2 కొరింథీయులు 1:24) అయితే ఉద్యోగాలకి సంబంధించి వ్యక్తిగతమైన నిర్ణయాలు తీసుకోవడంలో క్రైస్తవులు పరిగణలోనికి తీసుకోవల్సిన కొన్ని అంశాలను మాత్రం మనం చర్చిద్దాము. ఈ అంశాలు క్లుప్తంగా 1982, జూలై 15, (ఆంగ్లం) కావలికోటలో, దేవుడిచ్చిన మనస్సాక్షి నుండి ప్రయోజనం పొందడం గురించిన శీర్షికలో చర్చించబడ్డాయి. అక్కడ ఇవ్వబడిన ఒక బాక్సు రెండు కీలకమైన ప్రశ్నలను లేవనెత్తి, అటుతర్వాత సహాయపడగల ఇతర అంశాలను చర్చించింది.

అందులోని మొదటి ప్రశ్న ఇది: బైబిలులో లౌకిక పని ఖండించబడిందా? దీనిపై వ్యాఖ్యానిస్తూ కావలికోట, దొంగిలించడాన్ని, రక్తాన్ని దుర్వినియోగం చేయడాన్ని, విగ్రహారాధనను బైబిలు ఖండిస్తుందని పేర్కొంది. పైన పేర్కొన్నటువంటి కార్యకలాపాలవంటి దేవుడు అంగీకరించని కార్యకలాపాలను, సూటిగా ప్రోద్బలపర్చే లౌకిక పనిని క్రైస్తవుడు విడనాడాలి.

రెండవ ప్రశ్న ఏమిటంటే: ఫలాని పనిచేయడం, ఏదైనా ఖండించబడిన పనిలో ఒక వ్యక్తిని భాగస్వామిని చేస్తుందా? జూదగృహంలో, గర్భస్రావం ఆసుపత్రిలో, వ్యభిచార గృహంలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి లేఖనాధారంకాని పనుల్లో భాగస్వామి అవుతాడన్నది స్పష్టం. ఆ స్థలాల్లో ప్రతిరోజు కేవలం నేల ఊడ్వడం లేక టెలిఫోన్‌ దగ్గర పనిచేయడం వంటివైనప్పటికీ దేవుని వాక్యం ఖండించే పనికి ఆయన దోహదపడుతున్నట్లే.

ఉద్యోగం విషయంలో నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఎదురైనప్పుడు చాలామంది క్రైస్తవులు కేవలం ఆ ప్రశ్నలను విశ్లేషించడం ద్వారానే వ్యక్తిగతమైన నిర్ణయం తీసుకోగల్గారు.

ఉదాహరణకు ఒక సత్యారాధకుడు ఒక చర్చి కోసం లేక చర్చీలో పూర్తికాలం పనిచేసే ఒక అబద్ధ మతసంస్థ ఉద్యోగిగా ఎందుకు ఉండకూడదో అన్న విషయాన్ని మనం ఆ రెండు ప్రశ్నల నుండి అర్థం చేసుకోవచ్చు. ప్రకటన 18:4 ఈ ఆజ్ఞను ఇస్తుంది: “నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారుకాకుండునట్లు . . . దానిని విడిచి రండి.” అబద్ధ ఆరాధనను బోధిస్తున్న ఒక మతంలో క్రమమైన ఉద్యోగిగా ఉన్నట్లైతే ఆ వ్యక్తి మహా బబులోను చేస్తున్న క్రియల్లో పాపాల్లో భాగస్థుడు అవుతాడు. ఆ ఉద్యోగి తోటమాలి అయినా, శుభ్రం చేసేవ్యక్తి అయినా, మరమ్మతు చేసేవ్యక్తి అయినా, జమాలెక్కలు చూసేవ్యక్తి అయినా సత్య మతానికి విరుద్ధమైన ఆరాధనని ప్రోత్సహించడానికి అతని పని ఉపయోగపడుతుంది. అంతేగాక, ఈ ఉద్యోగి చర్చిని తీర్చిదిద్దడాన్ని, దానికి మరమ్మతులు చేయడాన్ని లేదా దాన్లోని మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొనడాన్ని చూస్తున్న ప్రజలు ఆ వ్యక్తి ఆ మతానికి చెందినవాడేనని సహజంగానే అనుకుంటారు.

అయితే, ఒక వ్యక్తి చర్చిలోగాని ఏదైనా మతసంస్థలోగాని క్రమమైన ఉద్యోగి కానట్లైతే అప్పుడేమిటి? బహుశ చర్చి బేస్‌మెంట్‌లో పగిలిన నీటికుళాయి సంబంధంగా ఒక అత్యవసరమైన మరమ్మతు చేయడానికి ఆయన్ను పిలిపించి ఉండవచ్చు. దానికీ, బహుశ చర్చిపైకప్పుకి పెంకులు ఏర్పాటు చేయడం లేదా చర్చిపైకప్పుని ఇన్సులేట్‌ చేయడంవంటి కాంట్రాక్టులను ఒప్పుకోవడానికీ తేడా లేదా?

మరలా, మనం అనేక రకాలైన పరిస్థితులను ఊహించుకోవచ్చు. అందుకని కావలికోట పేర్కొన్న ఐదు అదనపు అంశాల్ని పునఃసమీక్షిద్దాము:

1. చేసే పని లేఖనాధారంగా అభ్యంతరకరమైనది కాక, కేవలం మానవ సేవ మాత్రమేనా? ఒక పోస్ట్‌మేన్‌ ఉదాహరణనే తీసుకోండి. ఆయన ఉత్తరాలను బట్వాడా చేస్తున్న ప్రాంతంలో ఒక చర్చిగాని లేదా ఏదైనా గర్భస్రావం ఆసుపత్రిగాని ఉన్నట్లైతే, ఆయన ఖండించబడిన ఒక పనిని ప్రోత్సహిస్తున్నాడని దాని భావం కాదు. దేవుడు చర్చీ లేక అటువంటి ఆసుపత్రితో సహా అన్ని బిల్డింగుల కిటికీల్లోనుండీ సూర్యరశ్మిని ప్రకాశింపజేస్తున్నాడు. (అపొస్తలుల కార్యములు 14:16, 17) పోస్ట్‌మేన్‌గా ఉన్న ఒక క్రైస్తవుడు తాను ప్రతిరోజు అందరికీ ఒక మానవసేవను అందిస్తున్నట్లు అనుకోవచ్చు. ఇది, ఒక చర్చిలో పంపు పగిలి నీళ్లు నిండిపోవడాన్ని ఆపడానికి పిలువబడిన మరమ్మతు చేసేవ్యక్తి లేదా చర్చి సర్వీసులో అకస్మాత్తుగా కూలబడిపోయిన వ్యక్తికి చికిత్స చేయమని పిలువబడిన ఒక అంబులెన్సు అటెండెంటు—వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రతిస్పందించే క్రైస్తవుని పరిస్థితితో సమానమైనదే. ఆ క్రైస్తవుడు ఈ పనుల్ని కేవలం మానవతా సహాయాన్ని పరిస్థితి మూలంగా అందించడంగానే పరిగణించవచ్చు.

2. ఒక వ్యక్తికి జరిగిన పనిపై ఎంత మేరకు అధికారం ఉంటుంది? ఒక క్రైస్తవ దుకాణదారుడు విగ్రహాలు, అభిచారం సంబంధిత తాయెత్తులు, సిగరెట్లు, రక్తం నుండి తయారుచేసిన సాసేజ్‌లు ఎంతమాత్రం అమ్మడం గాని ఆర్డరుచేయడం గాని చేయడు. ఒక యజమానిగా అక్కడ ఆయనే ఇన్‌చార్జి. లాభాలు గడించడానికి సిగరెట్లను గాని విగ్రహాలను గాని అమ్మమని ఇతరులు ఒత్తిడిచేయవచ్చు, కానీ ఆయన లేఖనాధార నమ్మకాలకు అంటిపెట్టుకుని ఉంటాడు. మరోవైపు ఆహారసామగ్రి అమ్మే దుకాణంలో ఒక క్రైస్తవుడు ఉద్యోగిగా ఉండవచ్చు. అందులో డబ్బు జమాఖర్చులు వ్రాసే, నేలను శుభ్రం చేసే, లేదా పద్దులు వ్రాసే పని ఆయనకు దొరకవచ్చు. అక్కడ ఏ ఉత్పత్తులను ఆర్డరు చేస్తారో, అమ్ముతారో అన్నవాటిపై ఆయనకు ఎటువంటి నియంత్రణా లేదు, వీటిలో కొన్ని సిగరెట్లు లేదా మతపరమైన సెలవుదినాల్లో అమ్మే వస్తువులు వంటి అభ్యంతరకరమైనవే కావచ్చు.a (పోల్చండి లూకా 7:8; 17:7, 8.) ఇది దీని తర్వాతి విషయానికి సంబంధం కల్గివుంది.

3. ఒక వ్యక్తి ఎంతమేరకు ఇమిడి ఉంటాడు? ఒక దుకాణం ఉదాహరణకు మళ్లీ వెళ్దాము. జమా ఖర్చుల రిజిస్టరును చూసుకోవడమో, అప్పుడప్పుడు మాత్రమే షెల్ఫుల్లో సిగరెట్లు లేదా మతపరమైన వస్తువులు నింపడమో వంటి పనులు ఒక ఉద్యోగికి అప్పగించబడవచ్చు; ఆయన మొత్తం పనిలో ఇది కేవలం చిన్న భాగం మాత్రమే. అయితే దానికి విరుద్ధంగా అదే దుకాణంలో పొగాకు కౌంటర్‌లోనే పనిచేసే వ్యక్తికి ఎంత తేడా ఉంది! ఈయన పనంతా ప్రతిరోజు క్రైస్తవ నమ్మకాలకు విరుద్ధమైన విషయాలపై కేంద్రీకృతమై ఉంటుంది. (2 కొరింథీయులు 7:1) ఉద్యోగపరమైన ప్రశ్నలకు జవాబులివ్వడంలో ఒక వ్యక్తి ఎంతమేరకు ఇమిడి ఉంటాడన్నది ఎందుకు నిర్ధారించాలో ఇది చక్కగా దృష్టాంతపరుస్తుంది.

4. ఆదాయం ఎక్కడినుండి లభిస్తుంది లేదా పనిచేయాల్సిన స్థలం ఏది? రెండు పరిస్థితుల్ని పరిశీలించండి. ప్రజల్లో తన ప్రతిష్ఠని పెంచుకోవడానికి ఒక గర్భస్రావం ఆసుపత్రి, ఇరుగుపొరుగున ఉన్న వీధుల్ని శుభ్రం చేయడానికి ఒక వ్యక్తికి డబ్బుచెల్లించడానికి నిర్ణయించుకుంటుంది. ఆ వ్యక్తికి ఆదాయం ఒక గర్భస్రావం ఆసుపత్రినుండి వస్తుంది, కానీ ఆయనక్కడ పనిచేయడు, రోజంతా కూడా ఎవరూ ఆయన అక్కడ పనిచేయడాన్ని చూడరు. బదులుగా ఆయన ఒక ప్రజాహితకార్యాన్ని చేస్తుండడాన్ని చూస్తారు, ఇది ఆయనకు ఎవరు డబ్బిస్తున్నారన్నదానితో నిమిత్తం లేనిది, లేఖనాలకు ఏమీ విరుద్ధంగా లేనిది. ఇప్పుడు దీనికి విరుద్ధమైన ఒక పరిస్థితి. వ్యభిచారం చట్టబద్ధమైన దేశంలో, ప్రజారోగ్య సేవా సంస్థ లైంగికంగా సంక్రమించే వ్యాధులు వ్యాపించడాన్ని నిరోధించడం కోసం వ్యభిచార గృహాల్లో ఆరోగ్య పరీక్షలు నిర్వహించమని ఒక నర్సుకి డబ్బిస్తుంది. ఆమెకు వచ్చే ఆదాయం ప్రజారోగ్య సంస్థ నుండైనా ఆమె చేసే పని పూర్తిగా వ్యభిచారాన్ని నడిపే గృహాల్లో ఉంటుంది, అనైతిక జీవితాల్ని మరింత సురక్షితం చేయడమూ, మరింత అంగీకారయోగ్యంగా చేయడమూనూ. ఒకరికి ఆదాయం ఎక్కడినుండి లభిస్తుంది, పనిచేయాల్సిన స్థలం ఏది అన్నవి ఎందుకు పరిగణలోనికి తీసుకోవల్సిన విషయాలో, ఈ రెండు ఉదాహరణలు చూపిస్తున్నాయి.

5. ఫలాని పనిచేయడం మూలంగా కలిగే ప్రభావం ఏమిటి; అది ఆ పనిచేసే వారి మనస్సాక్షిని పీడిస్తుందా లేదా ఇతరులను అభ్యంతరపరుస్తుందా? మనస్సాక్షిని కూడా పరిగణలోనికి తీసుకోవాలి, మనదీ ఇతరులదీను. ఫలాని పని (దాని స్థలమూ, డబ్బు ఎక్కడినుండి వస్తుందన్నదీ) అధిక క్రైస్తవులకు అంగీకారయోగ్యంగా అన్పించినా, ఆ పనిచేయడం తన మనస్సాక్షిని బాధపెట్టగలదని ఒక వ్యక్తి గ్రహించవచ్చు. అపొస్తలుడైన పౌలు చక్కని మాదిరినుంచాడు, ఆయనిలా అంటున్నాడు: “మేమన్ని విషయములలోను యోగ్యముగా ప్రవర్తింప గోరుచు మంచి మనస్సాక్షి కలిగియున్నామని నమ్ముకొనుచున్నాము.” (హెబ్రీయులు 13:18) మన మనస్సుల్ని తర్వాత కలచివేసే పనులు చేయకుండా ఉండడం ఉత్తమం; అయినా మనస్సాక్షికి కాస్త వేరుగా ఉన్న ఇతరుల విషయంలో విమర్శనాత్మకంగా ఉండకూడదు కూడా. బదులుగా, ఫలాని పనిచేయడం బైబిలుకు ఏమీ విరుద్ధం కాదని ఒక క్రైస్తవుడు అనుకోవచ్చు, కానీ అలా చేయడం సంఘంలో, సమాజంలో చాలామంది మనస్సుల్ని చాలా కలచివేయవచ్చని గ్రహించవచ్చు. పౌలు ఈ మాటల్లో సరైన దృక్పథాన్ని ప్రతిబింబించాడు: “మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరమేమియు కలుగజేయక . . . దేవుని పరిచారకులమై యుండి అన్ని స్థితులలో మమ్మును మేము మెప్పించుకొనుచున్నాము.”—2 కొరింథీయులు 6:3-8.

ఇప్పుడు మనం అసలైన ప్రశ్నకు వద్దాము, క్రొత్త కిటికీలు అమర్చడం, తివాచీలను శుభ్రం చేయడం, లేక కొలిమిని మరమ్మతు చేయడం వంటి పనులు చర్చి భవనంలో చేసే ప్రశ్నకు వద్దాము. పైనున్న అంశాలు ఇందులో ఎలా ఇమిడివున్నాయి?

అధికారం అనే అంశాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. ఇక్కడ క్రైస్తవుడు చర్చిలో అటువంటి పని చేయాలా వద్దా అన్నది నిర్ణయించగల్గే యజమాని లేదా మేనేజరు స్థానంలో ఉన్నాడా? అలాంటి అధికారం ఉన్న క్రైస్తవుడు, ఏదైనా పనిచేయడానికి ఒప్పకోవడంద్వారా లేదా కాంట్రాక్టును తీసుకోవడంద్వారా ఒక మతం తన అబద్ధ ఆరాధనను అభివృద్ధిచేయడానికి సహాయం చేసి మహాబబులోనుతో భాగస్థుడు అవ్వాలనుకుంటాడా? ఇలా చేయడం తన స్వంత దుకాణంలో సిగరెట్లనూ విగ్రహాలనూ అమ్మాలనుకోవడంతో సమానం కాదా?—2 కొరింథీయులు 6:14-16.

ఎటువంటి పనులు స్వీకరించాలి అన్న విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం లేని ఉద్యోగంలో ఒక క్రైస్తవుడు ఉన్నట్లైతే, ఇతర అంశాల్ని అంటే పనిజరిగే స్థలమూ, ఎంతమేరకు తాను ఇమిడి ఉంటాడు వంటి అంశాలను పరిగణలోనికి తీసుకోవాలి. కేవలం కొన్ని క్రొత్త కుర్చీలను డెలివరీ చేయడం లేదా ఏర్పాటు చేయడం మాత్రమే ఉద్యోగి నుండి కోరబడుతుందా? లేదా ఒక చర్చిలో రగులుకున్న మంటల్ని మరింత వ్యాపించకుండా అగ్నిమాపక దళం సభ్యుడు చేసేటువంటి మానవతా సేవను నిర్వర్తించాలని కోరబడుతుందా? దీనికీ, చర్చికి రంగులు వేయడం లేదా దాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి అందులో క్రమంగా తోటమాలి పని చేయడం వంటి దీర్ఘకాలం వెచ్చించాల్సివచ్చే ఒక బిజినెస్‌ వ్యవహారంలో పనిచేసే ఉద్యోగికీ తేడా ఉన్నట్లు చాలామంది గ్రహిస్తారు. ఆ విధంగా క్రమంగా లేదా దీర్ఘకాలంగా పనిచేయడం మూలంగా చాలామంది ఈ క్రైస్తవుడ్ని తాను అంగీకరించని ఒక మతంతో జతచేసే అవకాశం ఉంది, తద్వారా వారినిది అభ్యంతరపర్చవచ్చు కూడా.—మత్తయి 13:41; 18:6, 7.

ఉద్యోగానికి సంబంధించి మనం ప్రాముఖ్యమైన చాలా విషయాల్ని పరిశీలించాము. ఇవి ప్రాముఖ్యంగా అబద్ధమతం ఇమిడివున్న సందర్భాల్లో చర్చించబడ్డాయి. అయినా, ఇవి ఇతర రకాలైన ఉద్యోగాలకు సంబంధించి కూడా వర్తించవచ్చు. ప్రతి సందర్భంలోను నిర్దిష్టమైన అంశాల్ని పరిగణలోనికి తీసుకుంటూ—బహుశ ఫలాని సందర్భానికి మాత్రమే వర్తించే అంశాల్ని పరిగణలోనికి తీసుకుంటూ—ప్రార్థనపూర్వకమైన విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. పైన పేర్కొనబడిన అంశాలు, యెహోవా ఎదుట సూటిగాను నీతియుక్తంగాను నడుచుకోవాలన్న కోరికను వ్యక్తం చేసే నిర్ణయాలను మనస్సాక్షిపూర్వకంగా తీసుకోవడానికి ఇప్పటికే నిష్కల్మషంగా సేవచేసే చాలామంది క్రైస్తవులకు సహాయపడ్డాయి.—సామెతలు 3:5, 6; యెషయా 2:3; హెబ్రీయులు 12:12-14.

[అధస్సూచీలు]

a ఆసుపత్రుల్లో పనిచేసే కొంతమంది క్రైస్తవులు ఈ అధికారమనే అంశాన్ని పరిగణలోనికి తీసుకోవల్సివచ్చింది. ఒక రోగికి కావల్సిన మందుల్ని లేదా వైద్యపరమైన ప్రక్రియల్ని సిఫారసు చేసే అధికారం డాక్టరుకి ఉండవచ్చు. ఆ రోగికి అభ్యంతరం లేకపోయినప్పటికీ, అధికారంలో ఉన్న ఒక క్రైస్తవ డాక్టరు రక్తమార్పిడి గాని లేదా గర్భస్రావాన్ని గాని చేయమని, ఆ విషయాల్లో బైబిలు ఏమి చెబుతుందో తెలిసీ ఎలా ఆజ్ఞ ఇవ్వగలడు? దానికి విరుద్ధంగా, ఒక ఆసుపత్రిలో పనిచేసే ఒక నర్సుకు అటువంటి అధికారం ఉండకపోవచ్చు. ఆమె తన సేవలను మామూలుగా చేసుకుంటుండగా, డాక్టరు ఒక రోగికి రక్తపరీక్ష చేయమని లేదా గర్భస్రావం నిమిత్తం వచ్చిన ఒక స్త్రీపట్ల శ్రద్ధవహించమని ఆమెకు నిర్దేశించవచ్చు. 2 రాజులు 5:17-19లో ఉన్న ఉదాహరణకు అనుగుణ్యంగా, రక్తమార్పిడి గాని గర్భస్రావం గాని చేయమని నిర్దేశం ఇచ్చే అధికారం ఉన్నది తనకు కాదు గనుక ఆమె ఒక రోగిపట్ల మానవతా సేవలను నిర్వర్తించాలని నిర్ణయించుకోవచ్చు. నిజమే, ‘మంచి మనస్సాక్షి కలిగి దేవునియెదుట నడుచుకొనేందుకు’ ఆమె అప్పటికీ తన మనస్సాక్షిని పరిగణలోనికి తీసుకోవల్సిన అవసరం ఉంది.—అపొస్తలుల కార్యములు 23:1.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి