కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 1/1 పేజీలు 30-31
  • క్షమించడం రక్షణకు దారి తీసింది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • క్షమించడం రక్షణకు దారి తీసింది
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • కనికరము, విడుదల
  • మరి గొప్ప యోసేపు
  • మన కోసం పాఠం
  • “నేను దేవుని స్థానమందున్నానా?”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • యెహోవా ఎప్పుడూ యోసేపును మర్చిపోలేదు
    నా బైబిలు పుస్తకం
  • యోసేపు సహోదరులు ఆయనను ద్వేషించడం
    నా బైబిలు కథల పుస్తకము
  • ఆయన సంరక్షించాడు, పోషించాడు, తన బాధ్యతను నమ్మకంగా నిర్వర్తించాడు
    వాళ్లలా విశ్వాసం చూపించండి
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 1/1 పేజీలు 30-31

వారు యెహోవా చిత్తాన్ని చేశారు

క్షమించడం రక్షణకు దారి తీసింది

ఐగుప్తు ప్రధానమంత్రి ముందు నిలబడి ఉన్న యాకోబు పదిమంది కుమారులు ఒక భయంకరమైన రహస్యాన్ని గూర్చి మాట్లాడుకున్నారు. కొన్ని సంవత్సరాలక్రితం, వారు తమ సహోదరుడైన యోసేపుని దాసత్వానికి అమ్మివేసి, ఒక దుష్టమృగము చంపివేసిందని తమ తండ్రికి చెబుదామని పథకం వేసుకున్నారు.—ఆదికాండము 37:18-35.

ఇప్పుడు, ఇరవై సంవత్సరాల తర్వాత, తీవ్రమైన కరవు వల్ల ఈ పదిమంది మనుష్యులు ధాన్యం కొనడం కోసం ఐగుప్తుకు తప్పనిసరై రావల్సివచ్చింది. కాని సంగతులు సజావుగా సాగలేదు. ధాన్యంపైన అధికారిగా కూడా ఉన్న ఆ ప్రధానమంత్రి, వారిని వేగులవారని నిందించాడు. ఆయన వారిలో ఒకర్ని బంధించి, మిగిలిన వారిని తిరిగి ఇంటికి వెళ్ళి వారి కనిష్ఠ సహోదరుడైన బెన్యామీనుని తీసుకొని రమ్మన్నాడు. వారు తీసుకొచ్చినప్పుడు ఆ ప్రధానమంత్రి బెన్యామీనును బంధించాలన్న తన పథకాన్ని అమల్లో పెట్టాడు.—ఆదికాండము 42:1–44:12.

యాకోబు కుమారుల్లో ఒకడైన యూదా ఇలా అభ్యంతరం తెలిపాడు. ‘మేము బెన్యామీను లేకుండా వెళ్ళిన యెడల మా తండ్రి చనిపోవును.’ అప్పుడు యూదా కానీ ఆయనతో ఉన్న వారెవరూ ఊహించనిదొకటి జరిగింది. యాకోబు కుమారులు తప్ప మిగిలిన వారందరినీ బయటికి వెళ్ళమని ఆజ్ఞాపించిన తర్వాత ఆ ప్రధానమంత్రి ఎలుగెత్తి ఏడ్చాడు. తనను తాను సంభాళించుకున్న తర్వాత అతడు ఇలా అన్నాడు: ‘నేనే యోసేపును.’—ఆదికాండము 44:18–45:3.

కనికరము, విడుదల

“నా తండ్రి యింక బ్రతికియున్నాడా?” అని యోసేపు తన సహోదరులను అడిగాడు. కానీ ప్రతిస్పందన లేదు. నిజానికి యోసేపు సహోదరులందరూ అప్రతిభులై పోయారు. వారు ఆనందపడి పోవాలా? లేక భయపడిపోవాలా? ఎంతైనా ఇరవై ఏండ్ల క్రితం వాళ్లు ఆయన్ని దాసత్వానికి అమ్మివేశారు. వాళ్లని ఖైదులో బంధించడానికి, ఆహారం ఇవ్వకుండా తిరిగి ఇంటికి పంపించడానికి లేక—ఇంకా చెప్పాలంటే వాళ్ళను చంపడానికి కూడా యోసేపుకి అధికారం ఉంది! మంచి కారణంతోనే యోసేపు సహోదరులు “అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేకపోయిరి.”—ఆదికాండము 45:3.

వెంటనే యోసేపు వారిని శాంతపర్చాడు. “నా దగ్గరకు రండని చెప్పినపుడు వారు అతని దగ్గరకు వచ్చిరి.” అప్పుడు ఇలా అన్నాడు: “ఐగుప్తునకు వెళ్లునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. అయినను నేనిక్కడికి వచ్చునట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి; అది మీకు సంతాపము పుట్టింప నియ్యకుడి; ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను.”—ఆదికాండము 45:4, 5.

యోసేపు తన కనికరాన్ని సరైన ఆధారం లేకుండా ప్రదర్శించలేదు. ఆయన వారి పశ్చాత్తాపానికి గల రుజువుని అప్పటికే గమనించాడు. ఉదాహరణకి, వేగులవారని తన సహోదరులని నిందించినప్పుడు వారు తమలో తాము “నిశ్చయముగా మన సహోదరుని యెడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. . . . అందువలన ఈ వేదన మనకు వచ్చెనని ఒకనితో ఒకడు మాటలాడు”కున్నప్పుడు విన్నాడు. (ఆదికాండము 42:21) అంతేగాక, బెన్యామీను తన తండ్రియొద్దకు తిరిగి వెళ్లగల్గునట్లు యూదా తనను తాను బెన్యామీను స్థానంలో దాసునిగా ఉంటానని కూడా చెప్పాడు.—ఆదికాండము 44:33, 34.

అందుకని, యోసేపు తన కనికరాన్ని కనపర్చడం న్యాయమే. వాస్తవానికి, తాను అలా చేయడం వల్ల తన కుటుంబమంతా రక్షణ పొందగలదని గ్రహించాడు. కాబట్టి, యోసేపు తన సహోదరులను వెళ్ళి వారి తండ్రియైన యాకోబుతో ఇలా చెప్పమన్నాడు: “మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్లి అతనితో—నీ కుమారుడైన యోసేపు—దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు; నీవు గోషెను దేశమందు నివసించెదవు, అప్పుడు నీవును నీ పిల్లలును నీ గొఱ్ఱెలమందలును నీ పశువులును నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా నుండును. . . . నీకును నీ యింటి వారికిని నీకు కలిగినదంతటికిని పేదరికము రాకుండ అక్కడ నిన్ను పోషించెదనన్నాడని చెప్పుడి.”—ఆదికాండము 45:9-11.

మరి గొప్ప యోసేపు

యేసుక్రీస్తు మరి గొప్ప యోసేపు అని పిలువబడగలడు, వీరిద్దరి మధ్య కొన్ని చెప్పుకోదగిన సమాంతరాలున్నాయి. యోసేపు వలె యేసు తన సహోదరులైన అబ్రాహాము కుమారులచే దుర్వ్యవహారానికి గురయ్యాడు. (అపొస్తలుల కార్యములు 2:14, 29, 37 పోల్చండి.) అయితే, ఈ ఇద్దరు మనుష్యులు అసాధారణమైన రీతిలో పరిస్థితులు తారుమారు కావడాన్ని చూశారు. తగిన సమయంలో యోసేపు స్థితి దాసుని స్థాయి నుండి ప్రధానమంత్రికి—ఫరో తర్వాతి స్థానానికి మారింది. అలాగే, యెహోవా యేసుని మృతులలో నుండి లేపి ఉన్నతస్థానమైన “తన కుడి పార్శ్వమునకు హెచ్చిం”చెను.—అపొస్తలుల కార్యములు 2:33; ఫిలిప్పీయులు 2:9-11.

ప్రధానమంత్రిగా, యోసేపు ధాన్యం కొనడం కోసం ఐగుప్తుకు వచ్చిన వారందరికీ ఆహారాన్ని పంచిపెట్టగల్గాడు. ఈనాడు మరి గొప్ప యోసేపు భూమ్మీదనున్న నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతి ద్వారా ఆధ్యాత్మిక ఆహారాన్ని “తగినవేళ” పంచిపెడుతున్నాడు. (మత్తయి 24:45-47; లూకా 12:42-44) వాస్తవానికి, యేసునొద్దకు వచ్చే “వారికి ఇకమీదట ఆకలియైనను దాహమైనను ఉండదు, . . . ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొఱ్ఱెపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకును వారిని నడిపించును.”—ప్రకటన 7:16, 17.

మన కోసం పాఠం

యోసేపు కనికరానికి ఒక విశిష్ఠమైన మాదిరినుంచాడు. న్యాయాన్ని కచ్చితంగా అమలుపర్చి ఉంటే తనను దాసత్వంలోకి అమ్మిన వారిని శిక్షించాల్సివచ్చేది. లేదా వారి తప్పులను ఉపేక్షించేలా చేయవచ్చు. కానీ యోసేపు వీటిలో ఏదీ చేయలేదు. వాస్తవానికి ఆయన తన సహోదరుల పశ్చాత్తాపాన్ని పరీక్షించాడు. వారి దుఃఖం నిజమైందని అతడు చూసినప్పుడే తాను వారిని క్షమించాడు.

మనం యోసేపుని అనుకరించగలము. మనపట్ల ఎవరైనా తప్పు చేసినప్పుడు వారు హృదయపూర్వకంగా మారారని కనుపర్చినప్పుడు మనం వారిని క్షమించాలి. నిజమే, జరుగుతున్న గంభీరమైన తప్పులను చూడకుండా మన సెంటిమెంట్లు మనల్ని గ్రుడ్డివారినిగా చేయనీయకూడదు. మరోవైపున, యథార్థమైన పరివర్తనకు తగిన క్రియలు కనబడినప్పుడు మన ఉక్రోషం వాటిని గమనించనీయకుండా చేయకూడదు. కాబట్టి, మనం ‘ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనినయెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుకుందాము.’ (కొలొస్సయులు 3:13) అలా చేయటం ద్వారా “క్షమించుటకుకు సిద్ధమైన మనస్సుగల”వాడైన మన దేవుడైన యెహోవాను మనం అనుకరించేవారమవుతాము.—కీర్తన 86:5; మీకా 7:18, 19.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి