కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 11/1 పేజీలు 3-4
  • వాళ్ళెందుకు హింసకు పాల్పడతారంటే

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వాళ్ళెందుకు హింసకు పాల్పడతారంటే
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రజలు ఎందుకు బలాత్కారులుగా మారుతున్నారంటే
  • హింస లేని ప్రపంచం వస్తుందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2016
  • కుటుంబ కలహానికి కారణమేమిటి?
    తేజరిల్లు!—1993
  • కుటుంబంలో కలహం చెలరేగితే
    తేజరిల్లు!—1993
  • దౌర్జన్యం అంతటా ఉంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 11/1 పేజీలు 3-4

వాళ్ళెందుకు హింసకు పాల్పడతారంటే

అమెరికాలోని, కాలరాడోలోని డెన్వర్‌లో నెలలు నిండకుండా 27 వారాలకే ఒక బిడ్డ పుట్టింది. బిడ్డ బతికాడు. హాస్పిటల్‌లో మూడు నెలలు ఉన్న తర్వాత, ఆ బాబును తల్లిదండ్రుల చేతికిచ్చి ఇంటికి పంపించేశారు. మూడు వారాల తర్వాత ఆ బాబును మళ్ళీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఎందుకని? వాడి తండ్రి వాడిని పట్టుకుని విపరీతంగా ఊపేయడం వల్ల వాడి మెదడుకు తీవ్రమైన హాని కలిగింది. ఆ బాబు ఏడ్పును ఆ తండ్రి భరించలేకపోయాడు. ఆ చిన్న బాబు గ్రుడ్డివాడైపోయాడు, అశక్తుడైపోయాడు. ఆధునిక మందులు వాడిని జనన లోపం నుండి రక్షించినప్పటికీ, వాడి తండ్రి హింసించడం వల్ల కలిగిన ఫలితాల నుండి రక్షించలేకపోయాయి.

అసంఖ్యాకమంది పిల్లలపై అత్యాచారం చేస్తున్నదీ, వారిని చావబాదుతున్నదీ, లేదా చంపుతున్నదీ, ఎక్కడో కాదు, భూమిమీది అత్యంత హింసాత్మకమైన ప్రాంతాల్లో ఒకటైన ఇంట్లోనే ! కేవలం అమెరికాలోనే సంవత్సరానికి 5,000 మంది పిల్లలు తమ సొంత తల్లిదండ్రుల చేతుల్లోనే చనిపోతున్నారని కొందరు అంచనా వేస్తున్నారు! హింసకు బలౌతున్నది పిల్లలు మాత్రమే కాదు. వాల్డ్‌ హెల్త్‌ పత్రిక ప్రకారం, అమెరికాలో “సంతానోత్పాదనశక్తిగల ప్రాయంలోని స్త్రీలకు హాని కలుగుతున్నది ముఖ్యంగా భర్త తనను చిత్రవధ చేయడం వల్లే.” ఇతర దేశాల విషయమేమిటి? “[వర్ధమాన దేశాల్లో] సర్వే చేయబడిన మూడింట ఒక వంతు మంది నుండి సగం కన్నా ఎక్కువ మంది స్త్రీలను వారి జీవిత భాగస్వాములే కొట్టినట్లు నివేదించబడింది.” అవును, హింస విలయతాండవం చేస్తోంది, ముఖ్యంగా ఇండ్లలో.

చాలా మంది భర్తలూ, భార్యలు తమ అభిప్రాయ వ్యత్యాసాలను పరిష్కరించుకునే ప్రయత్నంలో హింసకు పాల్పడతారు. కొన్ని దేశాల్లో, తల్లిదండ్రులూ, ఉపాధ్యాయులూ పిల్లలపై తమకు కలిగిన కోపాన్ని వ్యక్తం చేసేందుకు పిల్లలను హింసిస్తారు. క్రూరులు బలహీనులను హింసిస్తూ వినోదిస్తుంటారు. మానవులు అంత హింసాయుతంగా ఎందుకు మారుతున్నారు?

ప్రజలు ఎందుకు బలాత్కారులుగా మారుతున్నారంటే

మానవులు సహజంగానే బలాత్కారులని కొందరంటారు. అమెరికాలో హింసాత్మక నేరాలు మొత్తం మీద తగ్గినప్పటికీ, యౌవనస్థుల మధ్య మాత్రం వాటి రేటు పెరిగింది. హింసపై ఆసక్తి పెరిగింది. మూడు ముఖ్య టెలివిజన్‌ నెట్‌వర్క్‌లు తాము ప్రసారం చేసే నేరాల కథల సంఖ్యను రెండింతలు చేశాయి, హత్యలు గల కథలను మూడింతలు చేశాయి. అవును, నేరమే ఇతివృత్తంగాగల కథలు వాణిజ్యాన్ని మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లజేస్తున్నాయి. “మేము హింసను సహించడమే కాక, వాటిని మా వార్తాపత్రికల మొదటి పేజీల్లో వేస్తాం. మూడింట ఒక వంతు టెలివిజన్‌ ప్రోగ్రామ్‌లు పిల్లలకు వినోదాన్నివ్వడానికి నేర కథలను ఉపయోగిస్తాయి. మేము వాటిని హానిరహితమైనవిగా దృష్టిస్తాం! ప్రియ మిత్రులారా, మేము వాటిని చాలా ఇష్టపడతాం కూడా” అని మనశ్శాస్త్రజ్ఞుడైన కార్ల్‌ మనిన్జర్‌ చెప్పారు.

మానవుల ఆక్రమణ ప్రవృత్తికి మెదడు ప్రక్రియ మరియు పర్యావరణమూ కారణంకాగలవని ఇటీవలి విజ్ఞానశాస్త్ర అధ్యయనాలు తెలుపుతున్నాయి. “చాలా మంది పిల్లలు పెరుగుతున్న చెడు వాతావరణమే వాస్తవానికి హింస అనే మహావ్యాధికి జన్మనిస్తోందనే నిర్ధారణకు మేము వస్తున్నాం. చుట్టుప్రక్కల జరిగే సంఘటనలు మెదడులో సూక్ష్మ మార్పులను కలుగజేసి, ప్రజలు అకస్మాత్తుగా అప్పటికప్పుడు అనూహ్యమైన పనులు చేసేలా చేస్తాయి” అని యూనివర్సిటీ ఆఫ్‌ లినోయ్‌స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫొర్‌ జువనైల్‌ రిసెర్చ్‌లోని డా. మార్కస్‌ జె. క్రూసీ చెబుతున్నారు. “కుటుంబ వ్యవస్థ కూలిపోవడం, తల్లి/తండ్రి మాత్రమే ఆలనా పాలనా చూసుకునే వైనం పెరగడం, కడు బీదరికం, ఎంతోకాలంగా మత్తుమందులను ఉపయోగించడం” వంటి కారకాలు “మెదడులోని రసాయనిక ప్రక్రియ ఆక్రమణ స్వభావంపై ప్రభావం చూపవచ్చు.” “అయితే ఇలా జరగడం అసాధ్యమని ఒకప్పుడు అనుకున్నారు” అని ఇన్‌సైడ్‌ ద బ్రెయిన్‌ అనే పుస్తకం చెబుతుంది.

మెదడులో జరిగే మార్పుల్లో, ఆక్రమణ స్వభావాన్ని అదుపులో ఉంచే రసాయనమైన సెరోటొనిన్‌ లెవల్‌ తగ్గిపోవడం కూడా ఇమిడి ఉందని చెప్పుకోబడుతుంది. కొన్ని అధ్యయనాలు, మెదడులోని సెరోటొనిన్‌ పరిమాణాన్ని మద్యం తగ్గించగలదనీ వెల్లడి చేస్తూ, ఆ విధంగా హింసకూ, మద్యపాన దురుపయోగానికి సంబంధముందని ఎంతో కాలంగా తెలిసిన విషయానికే కొన్ని శాస్త్రీయ ఆధారాలను తెలియజేస్తున్నాయి.

నేడు హింస చెలరేగడంలో మరో కారకం ఇమిడి ఉంది. “అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఏలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు . . . అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు[నై] . . . యుందురు. ఇట్టివారికి విముఖుడవై యుండుము” అని నమ్మదగిన ప్రవచన పుస్తకమైన బైబిలు చెబుతుంది. (2 తిమోతి 3:1-5) అవును, “అంత్య దినాల”ను గురించిన బైబిలు ప్రవచన నెరవేర్పే నేడు మనం చూస్తున్న హింసాయుత క్రియలు.

ఈ కాలాన్ని మరింత హింసాపూరిత కాలంగా చేస్తున్న మరొకటి ఉంది. “భూమీ, సముద్రమా, మీకు శ్రమ; అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధముగలవాడై మీయొద్దకు దిగివచ్చియున్నాడని” బైబిలు చెబుతుంది. (ప్రకటన 12:12) అపవాదీ, వాడి దయ్యముల సైన్యమూ పరలోకం నుండి పడద్రోయబడి, తమ దుష్ట లక్ష్యాన్ని చేరుకునేందుకు మానవజాతిపై ఇప్పుడు తమ అవధానాన్ని ఉంచుతున్నారు. అపవాది “వాయుమండల సంబంధమైన అధిపతి”గా, “అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి”ని కౌశలంగా ఉపయోగిస్తూ, భూమిని మరింత హింసాపూరితమైన స్థలంగా చేస్తున్నాడు.—ఎఫెసీయులు 2:2.

అయితే, మరి నేటి ప్రపంచపు హింసాయుత ‘వాయువు’ను ఎలా అధిగమించగలం? అభిప్రాయ వ్యత్యాసాలను హింసకు తావివ్వకుండానే ఎలా పరిష్కరించుకోవచ్చు?

[3వ పేజీలోని చిత్రం]

అసంఖ్యాకమంది పిల్లలపై అత్యాచారం చేస్తున్నదీ, వారిని చావబాదుతున్నదీ, లేదా చంపుతున్నదీ, ఎక్కడో కాదు, భూమిమీది అత్యంత హింసాత్మకమైన ప్రాంతాల్లో ఒకటైన ఇంట్లోనే!

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి