కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 2/15 పేజీలు 3-4
  • దౌర్జన్యం అంతటా ఉంది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దౌర్జన్యం అంతటా ఉంది
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • గృహంలో దౌర్జన్యం
  • ఉద్యోగస్థలంలో దౌర్జన్యం
  • క్రీడలు మరియు వినోదంలో దౌర్జన్యం
  • పాఠశాలలో దౌర్జన్యం
  • దౌర్జన్యపూరితమైన సాంప్రదాయం
  • హింస లేని ప్రపంచం వస్తుందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2016
  • కుటుంబ కలహానికి కారణమేమిటి?
    తేజరిల్లు!—1993
  • హింస
    తేజరిల్లు!—2015
  • కుటుంబంలో కలహం చెలరేగితే
    తేజరిల్లు!—1993
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 2/15 పేజీలు 3-4

దౌర్జన్యం అంతటా ఉంది

తన కారులో కూర్చొని ట్రాఫిక్‌ లైటు మారడం కొరకు ఎదురు చూస్తున్న డ్రైవరు హఠాత్తుగా, ఒక బారీ మనిషి బూతులు తిడుతూ, పిడికిలి గాలిలోకి విసురుతూ తనవైపు వస్తూండడాన్ని గమనించాడు. తన కారు తలుపులు కిటికీలు మూయడానికి డ్రైవరు వేగిరపడ్డాడు, కాని ఆ బారీ మనిషి వస్తూనే ఉన్నాడు. దగ్గరికి వచ్చాక, ఆ వ్యక్తి కారును కుదిపేసి, కారు తలుపును లాగివేశాడు. చివరికి, కోపంతో అతడు తన పిడికిలి పైకెత్తి కిటికీ అద్దాలపై గుద్దాడు, దానితో అది ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది.

ఇది ఓ చలన చిత్రంలోని దృశ్యమా? కాదు! ఇది ప్రశాంతమైన, నెమ్మదిగల వాతావరణానికి పేరుపొందిన హవాయిలోని ఓహు ద్వీపంలో జరిగిన వాహన రాకపోకలకు సంబంధించిన ఘర్షణ.

అది ఆశ్చర్యకరమైనదేమీ కాదు. తలుపులకున్న తాళాలు, కిటికీలకున్న చువ్వలు, భవనాల వద్ద ఉండే భద్రతా సిబ్బంది, చివరికి “డ్రైవరు వద్ద డబ్బు లేదు” అని బస్సులపై వ్రాసివుండే చిహ్నాలు—ఇవన్నీ ఒకే విషయాన్ని సూచిస్తున్నాయి: దౌర్జన్యం అంతటా ఉంది!

గృహంలో దౌర్జన్యం

గృహం ఎంతోకాలం నుండి మనిషి యొక్క సురక్షితమైన ఆశ్రయంగా వర్ధిల్లింది. ఈ ఆదర్శవంతమైన భావన త్వరితంగా మారిపోతోంది. పిల్లల దుర్వినియోగం, భార్యా భర్తలు కొట్టుకోవడం, నరహత్య వంటివి చేరివున్న కుటుంబ దౌర్జన్యం ప్రపంచమంతటి వార్తలలో ముఖ్యాంశమౌతోంది.

ఉదాహరణకు, మాన్‌చెస్టర్‌ గార్డియన్‌ వీక్లీ ఇలా చెబుతోంది: “బ్రిటన్‌లో కనీసం 7,50,000 మంది పిల్లలు గృహ దౌర్జన్యానికి గురౌతున్న కారణంగా దీర్ఘకాల గాయాన్ని అనుభవించవలసి రావచ్చు.” “ప్రశ్నించబడిన నలుగురు స్త్రీలలో ప్రతి ముగ్గురు స్త్రీలు తమ పిల్లలు దౌర్జన్యపూరితమైన సంఘటనల్ని చూశారని, దాదాపు మూడింట రెండొంతులమంది పిల్లలు తమ తల్లులు కొట్టబడడాన్ని చూశారని” కూడా కనుగొనిన సర్వే ఆధారంగా ఆ నివేదిక తయారు చేయబడింది. అలాగే, యు.ఎస్‌. న్యూస్‌ అండ్‌ వరల్డ్‌ రిపోర్ట్‌ ప్రకారం, “ప్రతి సంవత్సరం 2,000 మంది పిల్లలు, వారిలో అనేకులు 4 సంవత్సరాల లోపు వారే, తలిదండ్రుల చేతుల్లో లేక తమ గురించి శ్రద్ధ తీసుకొనేవారి చేతుల్లోనే మరణిస్తున్నారని” పిల్లల దుర్వినియోగం మరియు నిర్లక్ష్యం వంటివాటికి సంబంధించిన అమెరికా సలహా సంఘం అంచనా వేస్తోంది. వాహన రాకపోకల దుర్ఘటనలు, నీళ్లలో మునిగిపోవడం, లేక క్రింద పడిపోవడం వంటివాటివల్ల సంభవించే మరణాల సంఖ్యను ఇది మించిపోతోంది.

త్రోయడం లేక నెట్టడం దగ్గరి నుండి చెంపదెబ్బ వేయడం, తన్నడం, గొంతు నులమడం, కొట్టడం, కత్తి లేక తుపాకీతో బెదిరించడం లేక చివరికి చంపడం వరకు ఇలాంటివన్నీ చేరివున్న భార్యాభర్తల దుర్‌వ్యవహారం కూడా గృహ దౌర్జన్యంలో భాగమే. నేడు ఈ విధమైన దౌర్జన్యానికి ఇరువురూ కారకులే. భార్యాభర్తల మధ్య జరిగే దౌర్జన్యంగా నివేదించబడినవాటిలో నాలుగింట ఒక వంతు కేసులు పురుషుడు ప్రారంభించినవని, మరో వంతు స్త్రీ ప్రారంభించినవని, మిగతా వాటికి ఇరు వర్గాలు నిందార్హులేనని వివరించడం శ్రేష్ఠంగా ఉంటుందని ఒక అధ్యయనం ద్వారా తేలింది.

ఉద్యోగస్థలంలో దౌర్జన్యం

ఇంటి వద్దనే కాకుండా ఉద్యోగ స్థలంలో కూడా ఒక వ్యక్తి క్రమాన్ని, గౌరవాన్ని, మర్యాదను కనుగొనడం సాంప్రదాయంగా ఉండేది. కాని పరిస్థితి ఇప్పుడలా ఉన్నట్లు లేదు. ఉదాహరణకు, ప్రతి సంవత్సరం 9,70,000 కంటే ఎక్కువమంది ఉద్యోగ స్థలంలో జరిగే దౌర్జన్యపూరితమైన నేరానికి బలౌతున్నారని అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన లెక్కలు చూపిస్తున్నాయి. మరో విధంగా చెప్పాలంటే, ప్రొఫెషనల్‌ సేఫ్‌టీ—జర్నల్‌ ఆఫ్‌ ది అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ సేఫ్‌టీ ఇన్జినీర్స్‌ నందలి ఒక నివేదిక ప్రకారం, “ఉద్యోగస్థులు ఉద్యోగ స్థలంలో ఏదో విధమైన దౌర్జన్యానికి బలయ్యే అవకాశం నాలుగింట ఒక వంతు ఉంది.”

ఎక్కువ చింతను కలుగజేసే విషయమేమిటంటే, ఉద్యోగ స్థలంలోని దౌర్జన్యం వాగ్వివాదాలు మరియు దూషణలకే పరిమితంకాదు. “ప్రత్యేకంగా, ఉద్యోగస్థులు యజమానులకు అలాగే తోటి ఉద్యోగస్థులకు వ్యతిరేకంగా చేసే దౌర్జన్యం ఇప్పుడు అమెరికాలో త్వరితంగా పెరుగుతున్న ఒక విధమైన హత్య” అని అదే నివేదిక తెలియజేస్తుంది. 1992లో, ఉద్యోగ సంబంధ దుర్ఘటనలో ఆరింట ఒకటి హత్యనే; స్త్రీల విషయంలో ఆ సంఖ్య దాదాపు రెండింట ఒకటి. ఒకప్పుడు క్రమబద్ధమైనదిగా ఉండిన ఉద్యోగ స్థలంలో దౌర్జన్యపు అల వ్యాపిస్తోందనేది నిరాకరించలేని విషయం.

క్రీడలు మరియు వినోదంలో దౌర్జన్యం

జీవితంలోని మరింత గంభీరమైన పనులు నిర్వహించేందుకై ఒక వ్యక్తి సిద్ధపడే నిమిత్తం క్రీడలను, వినోదాన్ని ఒక విధమైన విశ్రాంతికి లేక అవధాన మళ్లింపుకు మార్గంగా చేపట్టేవారు. నేడు వినోదం అనేది కోటానుకోట్ల డాలర్ల పరిశ్రమ. ఈ లాభదాయకమైన విపణి నుండి వీలైనంత ఎక్కువ లాభాన్ని సంపాదించుకోవాలనే తపనతో, మోదీలు [వినోదాన్నందించేవారు] తమకు అందుబాటులోవున్న దేనిని ఉపయోగించుకోవడానికైనా వెనుకాడడం లేదు. అలాంటి వాటిలో దౌర్జన్యం ఒకటి.

ఉదాహరణకు, వీడియో క్రీడల ఉత్పాదకుని దగ్గర ఒక పేరుపొందిన యుద్ధ క్రీడ ఉండేది. దానిలో, ప్రేక్షకులు “వాన్ని చంపు! వాన్ని చంపు!” అని నినాదాలు చేస్తుండగా, యుద్ధం చేసే వ్యక్తి తన ప్రత్యర్థి తలను, వెన్నెముకను చీల్చి వేస్తాడని పోర్బ్స్‌ అనే వ్యాపార పత్రిక నివేదించింది. అయితే, మరో పోటీ కంపెనీ కొరకు సిద్ధం చేయబడిన అదే క్రీడకు సంబంధించిన మరో కాపీలో ఆ రక్తసిక్తమైన దృశ్యం లేదు. ఫలితం? దౌర్జన్యం అధికంగావున్న కాపీ దాని పోటీ కాపీకంటే మూడింట రెండు నిష్పత్తితో అమ్ముడుపోతోంది. ఇది పెద్ద మొత్తంలో డబ్బు తెస్తుంది. దీనికి సంబంధించి, ఇళ్లలో చూడడానికి రూపొందించబడిన క్రీడలు మార్కెట్‌లోకి విడుదల చేయబడినప్పుడు, ఆ కంపెనీలు మొదటి రెండు వారాల్లోనే అంతర్జాతీయంగా 650 లక్షల అమెరికన్‌ డాలర్లను సంపాదించాయి! లాభం చేరి ఉన్నప్పుడు, వినియోగదారులను ఆకర్షించేందుకు దౌర్జన్యం అనేది కేవలం మరో ఎర మాత్రమే.

క్రీడల్లో దౌర్జన్యం మరో విషయం. తరచూ తాము చేయగల నష్టాన్నిబట్టి క్రీడాకారులు గర్విస్తుంటారు. ఉదాహరణకు, 1990లో జరిగిన ఒక హాకీ క్రీడలో మునుపెన్నడూ లేనన్ని 86 పెనాల్టీలు సంభవించాయి. ఆ క్రీడలో మూడున్నర గంటలపాటు గొడవ మూలంగా అంతరాయం ఏర్పడింది. ఒక క్రీడాకారునికి ముఖంలోని ఎముక విరిగిపోవడం, శుక్లమండలం గీసుకుపోవడం, పెద్ద గాయం వంటివాటికి చికిత్స చేయడం జరిగింది. ఎందుకు అలాంటి దౌర్జన్యం జరిగింది? ఒక క్రీడాకారుడు ఇలా వివరించాడు: “మీరు ఎన్నో పోరాటాలు చేసి ఒక నిజమైన మానసిక క్రీడను గెలుచుకున్నప్పుడు, మీరు ఇంటికి వెళ్లాక మీరు మీ జట్టులోని వారితో సన్నిహితమైనట్లు భావిస్తారు. పోరాటాలు దాన్ని నిజమైన ఆత్మీయ క్రీడగా చేశాయని నేను తలంచాను.” నేడు క్రీడల్లో దౌర్జన్యం అన్నది కోరుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక మూలం మాత్రమే కాదుగాని అదే ఒక లక్ష్యం అయింది.

పాఠశాలలో దౌర్జన్యం

యౌవనస్థులు తమ ఇతర వ్యాపకాలన్నీ మరచిపోయి తమ మనస్సులను శరీరాలను పెంపొందింపజేసుకోవడంపై కేంద్రీకరించగల స్థలంగా పాఠశాల ఎల్లప్పుడూ దృష్టించబడింది. అయితే, నేడు పాఠశాల ఏ మాత్రం అలాంటి సురక్షితమైన మరియు భద్రమైన స్థలం కాదు. అమెరికాలోని పబ్లిక్‌ పాఠశాలల్లో దౌర్జన్యం మరియు అల్లరిమూకలు ప్రముఖ సమస్యగా ఉన్నాయని, గత సంవత్సరంలో ప్రముఖమైనదిగా ఉన్న ఆర్థికపరమైన సమస్యను ఇది అధిగమించిందని 1994లో చేయబడిన ఒక సర్వే కనుగొన్నది. పరిస్థితి ఎంత చెడుగా ఉంది?

ఒక సర్వేలో, “పాఠశాలలో లేక దాని చుట్టుప్రక్కల సంభవించిన దౌర్జన్యపూరిత చర్యకు మీరెప్పుడైనా గురయ్యారా?” అని వేయబడిన ప్రశ్నకు దాదాపు ప్రతి నలుగురిలో ఒక విద్యార్థి అవునని సమాధానమిచ్చారు. పదింట ఒక వంతు మంది ఉపాధ్యాయులు కూడా అవునని సమాధానమిచ్చారు. విద్యార్థుల్లో 13 శాతం అంటే మగపిల్లలు మరియు ఆడపిల్లలు ఒకసారి కాకపోతే మరోసారి పాఠశాలకు ఆయుధాన్ని తీసుకువెళ్లినట్లు అంగీకరించారని అదే సర్వే కనుగొన్నది. కేవలం ఇతరులను ప్రభావితం చేయడానికి లేక తమను తాము కాపాడుకోవడానికి మాత్రమే అలా చేశామని వారిలో అనేకులు తెలియజేశారు. కాని ఒక ఉపాధ్యాయుడు ఒక విద్యార్థి యొక్క తుపాకీని తీసుకోవడానికి ప్రయత్నిస్తుండగా 17 సంవత్సరాల ఆ విద్యార్థి తన ఉపాధ్యాయుని గుండెల్లో దాన్ని పేల్చాడు.

దౌర్జన్యపూరితమైన సాంప్రదాయం

నేడు దౌర్జన్యం ప్రతి చోట ఉందన్నది నిరాకరించలేని విషయం. గృహంలో, ఉద్యోగ స్థలంలో, పాఠశాలలో మరియు వినోదంలో మనం దౌర్జన్యాన్ని ఎదుర్కొంటాము. ప్రతి రోజూ దానికి గురౌతున్నందున అనేకులు—దానికి తాము బలయ్యేవరకు—దాన్ని సాధారణమైన విషయంగానే అంగీకరిస్తున్నారు. ఆ తర్వాత, వారిలా ప్రశ్నిస్తారు, అదెన్నడైనా అంతమౌతుందా? సమాధానం తెలుసుకోవాలని మీరు కూడా ఇష్టపడుతున్నారా? అయితే, దయచేసి తరువాయి శీర్షిక చదవండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి