పాఠకుల ప్రశ్నలు
యేసు ఇలా ఉద్బోధించాడు: “ఇరుకు ద్వారమున ప్రవేశింప మీరు తీవ్రంగా పోరాడండి; నేను చెప్పేదేమనగా, అనేకులు ప్రవేశింప జూస్తారు గాని వారివలన కాదు.” (లూకా 13:24, NW) మనం ఎలా తీవ్రంగా పోరాడాలి మరియు ద్వారమున ప్రవేశింప ప్రయత్నించే వారెందుకు ప్రవేశింపలేరు?
ఆసక్తికరమైన ఈ వాక్యభాగాన్ని మనం దాని సందర్భాన్ని పరిశీలించడం ద్వారా చక్కగా అర్థం చేసుకోగలం. ఆయన మరణానికి దాదాపు ఆరు నెలల ముందు, ఆలయ వార్షిక ప్రతిష్ఠిత పండుగ సమయంలో యేసు యెరూషలేములో ఉన్నాడు. తాను దేవుని గొఱ్ఱెలకు కాపరినై ఉన్నాననీ, కానీ యూదులు ఆయన చెప్పేది వినేందుకు నిరాకరించారు గనుక వారు సాధారణంగా ఆ గొఱ్ఱెల్లో లేరని ఆయన చెప్పాడు. తానూ తన తండ్రీ “ఏకమై” ఉన్నామని ఆయన చెప్పినప్పుడు, ఆయనపై రాళ్లు రువ్వేందుకు యూదులు రాళ్లెత్తారు. ఆయన యొర్దానుకు అవతల ఉన్న పెరియాకు తప్పించుకునిపోయాడు.—యోహాను 10:1-40.
అక్కడ ఒకతను ఇలా అడిగాడు: “ప్రభువా, రక్షణపొందు వారు కొద్దిమందేనా?” (లూకా 13:23) కేవలం కొద్దిమంది మాత్రమే రక్షణకు అర్హులని ఆ కాలం నాటి యూదులు నమ్మేవారు గనుక, ఆ వ్యక్తి అలా అడగడం యుక్తమే. అయితే యూదుల దృక్పథం దృష్ట్యా, వారనుకునే ఆ కొద్దిమంది ఎవరో ఊహించడం అంత కష్టం కాదు. తర్వాతి సంఘటనలు చూపిన విధంగా, వారెంతగా తప్పుడు దృక్పథంలో ఉన్నారో గదా!
దాదాపు రెండు సంవత్సరాలుగా, యేసు వారికి బోధిస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, మరి పరలోక రాజ్యానికి వారు వారసులయ్యే అవకాశాన్ని వారికి అందజేశాడు. ఏ ఫలితాలు కలిగాయి? వాళ్ళూ, ప్రత్యేకించి వాళ్ళ నాయకులు, అబ్రాహాము సంతతి అయి ఉన్నందుకూ దేవుని ధర్మశాస్త్రం వారికి అప్పగించబడినందుకూ ఎంతో గర్వంగా భావిస్తున్నారు. (మత్తయి 23:2; యోహాను 8:31-44) కానీ వాళ్ళు మంచి గొఱ్ఱెల కాపరి స్వరాన్ని గుర్తించి, దానికి ప్రతిస్పందించరు. వాళ్ళ ముందు ఒక ద్వారం తెరువబడి ఉన్నట్లు ఉంది, మరి దానిలోకి వెళ్లడం వాళ్ళు రాజ్యంలో సభ్యులు అయ్యే ముఖ్య బహుమానాన్ని తెరిచింది, కానీ వాళ్ళు నిరాకరించారు. సాపేక్షికంగా చాలా కొద్దిమంది, ముఖ్యంగా క్రింది తరగతి వాళ్ళు యేసు సత్య వర్తమానాన్ని విని దానికి ప్రతిస్పందించారు, మరి ఆయనకు హత్తుకుని ఉన్నారు.—లూకా 22:28-30; యోహాను 7:47-49.
సా.శ. 33 పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మచే అభిషేకింపబడనై ఉన్న వారి వరుసలో ఈ తర్వాతి వర్గం వారే ఉన్నారు. (అపొస్తలుల కార్యములు 2:1-38) వారు, తమ ఎదుటనున్న అవకాశాన్ని చేజార్చుకున్నందుకు ఏడ్చుచు పండ్లు కొరుక్కుంటూ ఉండే, యేసు ప్రస్తావించిన అక్రమం చేసేవారిలో లేరు.—లూకా 13:27, 28.
తుదకు, మొదటి శతాబ్దంలోని ఆ “అనేకులు” సాధారణ యూదులూ, ప్రాముఖ్యంగా యూదా మత నాయకులూ అయి ఉండిరి. వీరు దేవుని ప్రమాణాలూ మార్గాల అనుసారంగా కాక తమ స్వంత ప్రమాణాల అనుసారంగా దేవుని అనుగ్రహాన్ని పొందాలనుకుంటున్నామని చెప్పుకున్నారు. దానికి విరుద్ధంగా, రాజ్యంలో భాగమై ఉండాలనే యథార్థమైన ఆసక్తి మూలంగా ప్రతిస్పందించిన సాపేక్షికంగా “కొద్దిమంది”గా ఉన్నవారు, క్రైస్తవ సంఘంలో అభిషిక్త సభ్యులు అయ్యారు.
ఇప్పడు మన దినంలో జరుగుతున్న మరింత విస్తృతమైన అన్వయింపును పరిశీలిద్దాం. క్రైస్తవమత సామ్రాజ్య చర్చీలకు హాజరయ్యే లెక్కలేనన్ని మందికి వ్యక్తులకు వారు పరలోకానికి వెళ్తారని బోధించబడుతుంది. అయితే, ఈ అభిలాష లేఖనాలను గురించిన ఖచ్చితమైన బోధలపై ఆధారపడిలేదు. పూర్వం యూదుల విషయంలో వలెనే, వీరు కూడా తమ స్వంత ప్రమాణాలపై ఆధారపడి దేవుని అనుగ్రహాన్ని పొందాలనుకుంటున్నారు.
అయితే మన కాలంలో రాజ్య వర్తమానం పట్ల వినయంతో ప్రతిస్పందించి, యెహోవాకు తమను తాము సమర్పించుకుని, ఆయన అనుగ్రహాన్ని పొందేందుకు యోగ్యులైన వారు సాపేక్షికంగా చూస్తే సంఖ్యలో తక్కువగా ఉన్నారు. ఇది వారు “రాజ్యసంబంధులు” అయ్యేందుకు దారి తీసింది. (మత్తయి 13:38) ఇటువంటి అభిషిక్త “సంబంధుల”కు సా.శ. 33 నుండి ఆహ్వానం లభించడం ప్రారంభమైంది. తన ప్రజలతో దేవుని వ్యవహారాల రుజువు, ప్రధానంగా పరలోక తరగతి యొక్క సభ్యులు పిలువబడ్డారనే విషయాన్ని సూచిస్తుందని యెహోవాసాక్షులు ఎంతో కాలంగా విశ్వసిస్తూ ఉన్నారు. కాబట్టి, ఇటీవల సంవత్సరాల్లో సత్యం నేర్చుకున్న వారు, భూ పరదైసు మీద నిత్యము జీవించే ఆనందకరమైన నిరీక్షణ ఇవ్వబడుతోందని ఇప్పుడు అర్థం చేసుకున్నారు. వీరు, వాస్తవంగా పరలోకానికి వెళ్లే ఉత్తరాపేక్షగల, ఇప్పుడు సంఖ్యాపరంగా తగ్గిపోతున్న అభిషిక్త క్రైస్తవ శేషం కంటే చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. పరలోకానికి వెళ్లాలనే నిరీక్షణలేని వారికి లూకా 13:24 ముఖ్యమైన అన్వయింపును కలిగి లేదు, అయితే అది వారికొరకు జ్ఞానయుక్తమైన సలహాను కలిగివుంది.
మనం తీవ్రంగా పోరాడాలని మనలను పురికొల్పడం ద్వారా, తాను గానీ తన తండ్రిగానీ మన ప్రవేశాన్ని అడ్డుకోవడానికి మార్గమందు అనేక ఆటంకాలను ఉంచుతారని యేసు చెప్పడం లేదు. అయితే దేవుని కట్టడలు ఎలాంటివంటే అవి అనర్హులైన వారిని అడ్డుకుంటాయని లూకా 13:24 నుండి మనం అర్థం చేసుకుంటాం. “మీరు తీవ్రంగా పోరాడండి” అనేది గట్టి పోరాటం చేయాలని, ఎక్కువ కృషిచేయాలని సూచిస్తుంది. మనం ‘నేను ఎక్కువ కృషి చేస్తున్నానా?’ అని ప్రశ్నించుకోవాలి. లూకా 13:24ను వేరే మాటల్లో ఇలా చెప్పవచ్చు, ‘ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి నేను తీవ్రంగా పోరాడాలి, ఎందుకంటే అనేకులు ప్రవేశించడానికి ప్రయత్నిస్తారు గాని వారలా ప్రవేశించలేరు. నేను నిజంగా తీవ్రంగా పోరాడుతున్నానా? బహుమతి సంపాదించడానికి ప్రాచీనకాల స్టేడియంలో తాను చేయగలిగినదంతా చేయడానికి పూనుకునే అథ్లెట్‌లా నేనున్నానా? అలాంటి క్రీడాకారుడు అర్థ హృదయంతో లేదా తనకు పట్టనట్టు ఉండడు. నేనలా ఉన్నానా?’
కొందరు తమకు అనుకూలంగా ఉన్న సమయంలో లేదా తాము కోరిన రీతిలో సావధానంగా మాత్రమే ద్వారమున ‘ప్రవేశింపజూతురని’ యేసు మాటలు సూచిస్తున్నాయి. అటువంటి దృక్పథం ఆయా సాక్షులను వ్యక్తిగతంగా ప్రభావం చేయగలదు. ‘అనేక సంవత్సరాలుగా చాలా కృషి చేసిన, అనేక త్యాగాలు చేసిన దైవభక్తిగల క్రైస్తవుల గురించి నాకు తెలుసు; అయినప్పటికీ, వాళ్లు చనిపోయేనాటికి కూడా ఈ దుష్ట విధానాంతం రాలేదే. గనుక నేను కాస్త మెల్లిగా సాగిస్తాను, సాధారణ జీవితాన్నింకా గడుపుతాను’ అని కొందరు తర్కించవచ్చు.
అలా ఆలోచించడం సులభమే అయినా, అది నిజంగా జ్ఞానయుక్తమైనదేనా? ఉదాహరణకు, అపొస్తలులు అలా ఆలోచించారా? ఎంత మాత్రం ఆలోచించలేదు. వాళ్లు సత్యారాధనకు తమ సర్వస్వాన్నీ సమర్పించుకున్నారు, మరి వారు తమ మరణపర్యంతం అలా చేశారు. ఉదాహరణకు, పౌలు ఇలా చెప్పగలిగాడు: ‘మేము క్రీస్తును ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా, కార్యసిద్ధికలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను.’ తర్వాత ఆయనిలా వ్రాశాడు: “మనుష్యులకందరికి రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవముగల దేవుని యందు మనము నిరీక్షణ నుంచియున్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము.”—కొలొస్సయులు 1:28, 29; 1 తిమోతి 4:10.
పౌలు తాను ప్రయాసపడటం ద్వారా పూర్తిగా సరైనదే చేశాడని మనకు తెలుసు. “మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని” అని పౌలు చెప్పిన విధంగా చెప్పగలిగేందుకు మనందరమూ ఎంత సంతృప్తిని అనుభవిస్తామో కదా. (2 తిమోతి 4:7) కాబట్టి, లూకా 13:24 నందు రికార్డు చేయబడిన యేసు మాటలకు అనుగుణ్యంగా, ‘నేను కష్టించి, పరిశ్రమించి, ముందుకు సాగుతున్నానా? అవును, “ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి” అని యేసు ఇచ్చిన సలహాను నేను పాటిస్తున్నాననేందుకు నేను తగినంత, ఖచ్చితమైన రుజువునిస్తున్నానా’ అని మనలో ప్రతి ఒక్కరమూ ప్రశ్నించుకోగలం.