కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 6/1 పేజీలు 5-7
  • సహనంతో వేచివుండండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సహనంతో వేచివుండండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • స్పష్టంగా ఆలోచించండి
  • దేవుడు ఆలస్యం చేయడు
  • మాటలకంటే చేతలు ముఖ్యం
  • ముందే తెలిసిన సంగతులు
  • ‘దేవుని ప్రేమలో నిలిచియుండుడి’
  • యెహోవాదినాన్ని ఆశతో అపేక్షించుడి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • మన అమూల్యమైన విశ్వాసమును గట్టిగా పట్టుకొని ఉందాము!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఆయన తన బోధకుని దగ్గర క్షమించడం నేర్చుకున్నాడు
    వాళ్లలా విశ్వాసం చూపించండి
  • ఆయన తన బోధకుని నుండి క్షమించడం నేర్చుకున్నాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 6/1 పేజీలు 5-7

సహనంతో వేచివుండండి

ఏమీ లేకపోయినా “తోడేలు! తోడేలు!” అనో లేదా “నాన్నా పులి ! నాన్నా పులి!” అనో పదే పదే కేకలు వేసిన గొఱ్ఱెలకాపరి, అది నిజంగా వచ్చినప్పుడు, సహాయం కొరకు వేసిన కేకలను ఎవరూ వినిపించుకోలేదు. అలాగే నేడు, అబద్ధ హెచ్చరికలని నిరూపించబడిన అసంఖ్యాకమైన హెచ్చరికలను విన్నారు గనుక అనేకులు యెహోవా దినం ఆసన్నం కావడాన్ని అలక్ష్యం చేస్తారు. ఏది నిజమైన హెచ్చరిక, దేన్ని వినాలి అనేది గ్రహించడంలో అనేకులు విఫలమౌతున్నారనే వాస్తవం నుండే, దేవుని గొప్ప శత్రువు, అబద్ధ “వెలుగు దూత” అయిన సాతాను ప్రయోజనం పొందుతున్నాడు.—2 కొరింథీయులు 11:14.

కొంత కాలంపాటు యెహోవా సేవ చేసిన వారు కూడా అంతా బాగానే ఉందనే దృక్పథాన్ని అలవర్చుకోవడం ప్రమాదకరమైనది కాగలదు. ఎందుకు? మొదటి శతాబ్దంలో అపొస్తలుడైన పేతురు ఇచ్చిన హెచ్చరికను పరిశీలించండి.

స్పష్టంగా ఆలోచించండి

పేతురు వ్రాసిన రెండవ ప్రేరేపిత పత్రిక తొలి క్రైస్తవులకు జ్ఞాపిక వంటిది, అలాగే మనకు కూడా. ఆయనిలా వ్రాస్తున్నాడు: “ప్రియులారా, యీ రెండవ పత్రిక మీకిప్పుడు వ్రాయుచున్నాను . . . [ఒక జ్ఞాపికగా నేను,] నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను.” (2 పేతురు 3:1, 2) పేతురు ఇంత శ్రద్ధ చూపించడానికి కారణమేమిటి? దేవుని సేవకులు తాము నివసిస్తున్న కాలానికి సంబంధించి కలిగివుండవలసిన అత్యవసర భావాన్ని తగ్గించివేసేటటువంటి అపహాస్యాన్ని చేసే అపహాసకుల ఉనికిని పేతురు ఎత్తి చూపిస్తున్నాడు. అది ఎగతాళి చేసేవారి మూలంగా మోసపోకుండా జాగ్రత్త వహించవలసిన సమయం. అందుకే, “పరిశుద్ధ ప్రవక్తలచేత పూర్వమందు పలుకబడిన మాటలను . . . జ్ఞాపకము చేసికొనవలెన”ని పేతురు తన పాఠకులకు విజ్ఞప్తి చేస్తున్నాడు. (2 పేతురు 3:1, 2; అపొస్తలుల కార్యములు 3:22, 23) ప్రవక్తలు ఏమి చెప్పారు?

దేవుని నమ్మకమైన సేవకులు అనేక సందర్భాలలో, దైవిక తీర్పులు దుష్టత్వాన్ని ఎలా అంతమొందించాయనే విషయాన్ని ఇతరుల అవధానానికి తెచ్చారు. భూమి చెడుతనంతో నిండిపోయినప్పుడు, నోవహు కాలంలో జలప్రళయాన్ని రప్పించడం ద్వారా దేవుడు జోక్యం చేసుకున్నాడని పేతురు తన పాఠకులకు జ్ఞాపకం చేస్తున్నాడు. కుంభవృష్టితోకూడిన ఆ జలప్రళయం ఆ కాలంలోని లోకాన్ని ప్రభావవంతంగా నిర్మూలించింది. “సమస్త శరీరుల”కు ప్రాతినిధ్యం వహించిన జీవులతోపాటు నోవహునూ ఆయన కుటుంబాన్నీ దేవుడు ఒక ఓడలో కాపాడాడు. బైబిలు వృత్తాంతపు సత్యత్వానికి విశ్వవ్యాప్త పురాణాలు సాక్ష్యమిస్తున్నాయి.a—ఆదికాండము 6:19; 2 పేతురు 3:5, 6.

దేవుడు అలా జోక్యం చేసుకుంటాడన్నది, కొంతమంది ప్రజలు ‘బుద్ధిపూర్వకంగా మరిచిపోయే’ ఒక వాస్తవమని పేతురు అంటున్నాడు. ఇతరులు ఆ తర్వాత ఆ కాలంనాటి అపహాసకుల మూలంగా, అంతా బాగానే ఉందనే దృక్పథంలోకి జారిపోయారు. అయితే యెహోవా ఇప్పటికే చేసిన దానిని మనం ఎన్నడూ మరిచిపోకూడదు. “అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై, అదే వాక్యమువలన భద్రముచేయబడియున్నవి” అని పేతురు మనకు చెబుతున్నాడు. (2 పేతురు 3:7) అవును, దేవుడు మళ్లీ జోక్యం చేసుకుంటాడు.

దేవుడు ఆలస్యం చేయడు

ఇప్పటికే సహస్రాబ్దిల కాలం గడిచిపోయింది. మానవజాతి సమస్యల్ని పరిష్కరించడానికి దేవుడు ఎందుకింత కాలం ఆగాడు? మళ్లీ, పేతురు మరో వాస్తవంపై కేంద్రీకరిస్తున్నాడు. ఆయనిలా చెబుతున్నాడు: “ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు [“యెహోవా,” NW] దృష్టికి ఒక దినము వెయ్యిసంవత్సరములవలెను, వెయ్యిసంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి.” (2 పేతురు 3:8) సమయాన్ని గూర్చిన యెహోవా దృక్పథం మన దృక్పథానికి భిన్నంగా ఉంటుంది. నిత్యుడైన దేవుని దృష్టిలో, ఆదాము సృష్టి నుండి ఇప్పటి వరకు గడిచిన సమయం కనీసం ఒక వారం కూడా కాదు. అయితే సమయాన్ని గురించి మన దృక్పథం ఏదైనప్పటికీ, గడిచే ప్రతి సహస్రాబ్ది, ప్రతి దినం, మనల్ని యెహోవా సంకల్ప నెరవేర్పుకు దగ్గర చేస్తుంది.

“ఆత్రపడితే అన్నం త్వరగా ఉడకదు” అనే సామెత, ఏదైనా సంఘటన కొరకు కేవలం వేచి ఉండడం అది ఆలస్యమౌతున్నట్లు అనిపించేలా చేస్తుందని సూచిస్తుంది. అయితే, “దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు” ఉండమని పేతురు సిఫారసు చేస్తున్నాడు. (2 పేతురు 3:11) త్వరలో దేవుడు జోక్యం చేసుకోనైయున్నాడనేదాని గురించి జాగరూకత కల్గివుండేలా చేసే మానసిక దృక్పథాన్ని మనమెలా వృద్ధి చేసుకోవచ్చు?

మాటలకంటే చేతలు ముఖ్యం

పేతురు క్రియలపై, చేతలపై అవధానాన్ని నిల్పుతున్నాడు. ఆయన “పరిశుద్ధమైన ప్రవర్తన”ను, అలాగే “భక్తి”తో కూడిన క్రియలను ప్రస్తావిస్తున్నాడు. (2 పేతురు 3:11) వీటిలో ఏమి ఇమిడివుంది?

దేవుని నిజమైన సేవకుడు ఆయనకు ప్రీతి కలిగించే విధంగా ప్రవర్తిస్తాడు. అలాంటి నిజమైన ఆరాధకుని విశ్వాసం ఆయన ప్రవర్తనలో ప్రతిఫలిస్తుంది. దేవుని యందు, ఆయన వాగ్దానాల యందు నమ్మకం గురించి కేవలం మాట్లాడే వారి నుండి ఇది ఆయనను వేరుపరుస్తుంది. యెహోవాసాక్షుల బహిరంగ పరిచర్య వారిని ఇతరుల నుండి భిన్నమైనవారిగా చేస్తుందని బహుశ మీరు గమనించి ఉండవచ్చు. బైబిల్లో పొందుపర్చబడిన దేవుని వాగ్దానాలవైపుకు అవధానాన్ని మళ్లించడానికి వారు మీ ఇంటికి వస్తారు. అయితే, వారు ప్రజలను ఎక్కడ కలిసినా తమ నిరీక్షణ గురించీ నమ్మకాల గురించీ వారికి సాక్ష్యమిస్తారు కూడా.

తన విశ్వాసాన్ని ఇతరులకు ప్రకటించడంలో బిజీగా ఉండే సాక్షి నమ్మకాలు దృఢపర్చబడి, బలపర్చబడతాయి. మాటలు భావాలను దృఢపరుస్తాయి, అదే సమయంలో అంతర్గత ఆనందాన్నీ, సంతృప్తినీ తెస్తాయి. మనం దేవుని రాజ్యసువార్తను ప్రకటించినప్పుడు, మనం యెహోవాకు ఆనందం కలిగిస్తాము కూడా. పేతురు యొక్క తోటి అపొస్తలుడైన పౌలు ప్రకటిస్తున్నట్లుగా, ఆయన ‘తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు అన్యాయస్థుడు’ కాడని మనకు తెలుసు.—హెబ్రీయులు 6:10; రోమీయులు 10:9, 10.

ఈ ప్రస్తుత దుష్టవిధానపు అంతిమ దశలో రాజ్యసువార్తను వ్యాప్తి చేయడంలో ఇలా నిమగ్నమై ఉండడం యొక్క ఫలితమేమిటి? లక్షలాదిమంది యథార్థహృదయులు యెహోవాతో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకోవడాన్నీ, ఆయన అపారమైన కృపనుండి ప్రయోజనం పొందడాన్నీ, పరదైసు భూమిపై నిత్యజీవ ఉత్తరాపేక్షలో నిజమైన ఆనందాన్ని కనుగొనడాన్నీ నేర్చుకుంటున్నారు.

ముందే తెలిసిన సంగతులు

యెహోవా దేవుడు తన సమయంలో జోక్యం చేసుకుంటాడని బైబిలు ద్వారా మనకు తెలిసినప్పటికీ, పేతురు ఇస్తున్న అదనపు హెచ్చరికను మనం వినవలసిన అవసరం ఉంది. “ఈ సంగతులు ముందుగా తెలిసికొనియున్నారు గనుక మీరు నీతివిరోధుల తప్పుబోధవలన తొలగింపబడి, మీకు కలిగిన స్థిరమనస్సును విడిచి పడిపోకుండ కాచుకొనియుండుడి.”—2 పేతురు 3:17.

దృఢమైన విశ్వాసం లేని కొందరు, దేవుడు జోక్యం చేసుకోవడం ఆలస్యమౌతున్నట్లు అనిపిస్తుండడాన్ని బట్టి నిరుత్సాహపడతారని యెహోవాకు కచ్చితంగా ముందే తెలుసు. దైవభక్తిలేని ప్రజల ప్రభావం తన నిజ సేవకులను పాడు చేస్తుందనీ, లేక దేవుని నామం మహిమపర్చబడడం త్వరలో జరుగుతుందనే వారి నమ్మకాన్ని కనీసం బలహీనపరుస్తుందనీ కూడా ఆయనకు తెలుసు. ఈ చివరిదినాల్లో స్థిరమనస్సును కోల్పోవడం ఎంత దుఃఖకరం  !

యెహోవా ఏమి చేస్తాడనేదాని గురించి సందేహాలు ఉంచుకోవడానికి గానీ లేక సంశయంగా ఉండడానికి గానీ ఇది సమయం కాదు. (హెబ్రీయులు 12:1) బదులుగా యెహోవా సహనం ఏమి తెచ్చిందో దానిపట్ల మన మెప్పును అధికం చేసుకోవలసిన సమయం ఇదే—యెహోవా చూపిన ఆ సహనం, అంతర్జాతీయ గొప్ప సమూహంలో భాగమై, రానైయున్న మహా శ్రమను తప్పించుకోవడానికి ఎదురుచూసే లక్షలాదిమందికి రక్షణయనే ఉత్తరాపేక్షను తెచ్చింది. (ప్రకటన 7:9, 14) పేతురు ఇలా ఉద్బోధిస్తున్నాడు: “మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధిపొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంతదినము వరకును మహిమ కలుగునుగాక.”—2 పేతురు 3:18.

‘దేవుని ప్రేమలో నిలిచియుండుడి’

రాజ్య ప్రకటనలో బిజీగా ఉండడం, దేవుని వాక్య అధ్యయనం, ఆరాధన కొరకు క్రైస్తవ కూటాలకు క్రమంగా హాజరుకావడం మనకు భద్రతనిస్తాయి. అలా, నేటి దుష్ట విధానంలో క్షీణించిపోతున్న పరిస్థితుల గురించి అతిగా చింతించడానికి మనకు సమయం ఉండదు. నిజ క్రైస్తవుల జీవితంలో భయాందోళనలు ఉండవలసిన అవసరం లేదు. (1 కొరింథీయులు 15:58) మనం యెహోవా సేవ చేయడంలో ఎంత బిజీగా ఉంటే, సమయం అంత త్వరగా గడిచిపోతుంది.

పేతురు సమకాలీనుడూ, యేసు సహోదరుడూ అయిన యూదా మనల్నిలా పురికొల్పుతున్నాడు: “ప్రియులారా, మీరు విశ్వసించు అతిపరిశుద్ధమైనదానిమీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థనచేయుచు, నిత్యజీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరముకొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకొని యుండుడి.” (యూదా 20, 21) ప్రార్థనలో పట్టుదల కల్గివుండడం ద్వారా వృద్ధి అయ్యే అనుకూల దృక్పథం యొక్క ప్రాముఖ్యతను గమనించండి. (1 థెస్సలొనీకయులు 5:17) యూదా ఇంకా ఇలా కొనసాగిస్తున్నాడు: “సందేహపడువారిమీద కనికరము చూపుడి. అగ్నిలోనుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీరసంబంధమైనవారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పుకొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి.” (యూదా 22, 23, అధస్సూచి) ఈ కష్టకాలాల్లో ఒకరినొకరం బలపర్చుకోవడం ఎంత ప్రాముఖ్యం  ! పొడిగించబడిన ఈ ‘రక్షణ దినమును,’ నైతికంగా కలుషితమైవున్న నేటి ప్రపంచంలో సర్వవ్యాప్తంగావున్న ‘కామాతురత్వానికి’ ఒక సాకుగా ఉపయోగిస్తూ శోధనలో పడిపోకుండా ఉండడం ఎంతో ప్రాముఖ్యం.—యూదా 4; 2 కొరింథీయులు 6:1, 2.

పేతురు, పౌలు, యూదాల ప్రేమపూర్వక ఉపదేశాన్ని వినడం ద్వారా, దేవుని సేవలో బిజీగా ఉంటూ చురుగ్గా ఉండడం ద్వారా, మీరు యెహోవా జోక్యం చేసుకునే కాలం కోసం సహనంతో వేచివుండవచ్చు. మరి మీరు వేచి ఉంటారా?

నిత్యజీవాన్ని గూర్చిన సృష్టికర్త వాగ్దానంలో మీ విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి కావలసిన సహాయం కొరకు మీ ప్రాంతంలోని సాక్షులను సంప్రదించడానికి వెనుకాడకండి. రానైయున్న మహా శ్రమ సమయంలో ముగిసిపోయే, మరెన్నడూ పునరావృతం కాని విశ్వవ్యాప్త సాక్ష్యపు పనిలో భాగం వహించేందుకు అర్హులయ్యేందుకు ఏమి అవసరమో తెలుసుకోండి. (మార్కు 13:10) అప్పుడు మీకు, పేతురు వాగ్దానం చేస్తున్న నీతియుక్తమైన నూతన లోకంలో జీవించే ఉత్తరాపేక్ష ఉంటుంది. (2 పేతురు 3:13) ఆయన జ్ఞాపికలను వినండి  ! సహనంతో వేచివుండండి! బిజీగా ఉండండి  !

[అధస్సూచి]

a దయచేసి, వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించిన బైబిలు—దేవుని వాక్యమా లేక మానవునిదా? (ఆంగ్లం) అనే పుస్తకంలోని 116వ పేజీ చూడండి.

[7వ పేజీలోని చిత్రం]

రదైసును గూర్చిన దేవుని వాగ్దానం గురించి ఇప్పుడు తెలుసుకోండి

[5వ పేజీలోని చిత్రసౌజన్యం]

తోడేలు: Animals/Jim Harter/Dover Publications, Inc.; యౌవన గొఱ్ఱెలకాపరి: Children: A Pictorial Archive from Nineteenth-Century Sources/Grafton/Dover Publications, Inc.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి