కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 6/1 పేజీలు 3-4
  • అపహాసకులున్నారు జాగ్రత్త

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అపహాసకులున్నారు జాగ్రత్త
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఇంకా అంతా అలాగే ఉందా?
  • యెహోవాదినాన్ని ఆశతో అపేక్షించుడి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • “యెహోవా మహా దినము సమీపమాయెను”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • సహనంతో వేచివుండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • “యెహోవా ధర్మశాస్త్రమునందు” మీరు ఆనందిస్తున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 6/1 పేజీలు 3-4

అపహాసకులున్నారు జాగ్రత్త

నేడు, భవిష్య వాణులు ఎక్కువవుతున్నాయి, భవిష్య శాస్త్ర వ్యాపారం వర్థిల్లుతోంది. “2000వ సంవత్సరం సమీపిస్తుండగా, ఒక వింతైన సంగతి జరుగుతోంది, అయితే అది అనూహ్యమైన విషయమేమీ కాదు. ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది ప్రజలు భవిష్యత్తు గురించి వికారమైన, భయానకమైన దర్శనాల్ని చూస్తున్నారు” అని లండన్‌కు చెందిన ది డెయిలీ టెలిగ్రాఫ్‌ పేర్కొంటుంది. పరిస్థితిని గమనిస్తున్న అనేకమందికి, భవిష్యత్తును గూర్చిన ఈ తీవ్రమైన ఆసక్తి కేవలం మునుపు నిరీక్షించి నెరవేరని మార్పుల పునరావృతంలా ఉన్నదంతే.

పంతొమ్మిదవ శతాబ్దంలో గుఱ్ఱపు బగ్గీలు ఎక్కువైనప్పుడు, చివరికి యూరప్‌ నగరాలు గుఱ్ఱాల లద్దెలతో నిండిపోతాయని ఒక వ్యక్తి జోస్యం చెప్పాడు. అయితే ఆయన జోస్యం తప్పని తేలిందని మనకు తెలుసు. కాబట్టి, భవిష్య వాణులు ఎంత తరచుగా విఫలమౌతున్నాయనే విషయాన్ని నొక్కిచెబుతూ, “భవిష్యత్తు కేవలం గుఱ్ఱపు లద్దెలే” అని లండన్‌కు చెందిన ది టైమ్స్‌ వ్యాఖ్యానించింది.

ప్రమాదాన్ని ముందుగా పసిగట్టేవారిని ఇతరులు అపహసిస్తారు. ఉదాహరణకు, అమెరికాలోని ఒక విశ్వవిద్యాలయంలో వ్యాపార సంబంధ విషయాల ప్రొఫెసర్‌ ఒకాయన, ఇప్పుడున్న వైఖరి క్షీణిస్తుందా లేదా అనేదానిపై పందెం కాయమని పర్యావరణ క్షీణత గురించి హెచ్చరించే వారిని సవాలు చేశాడు. న్యూ సైంటిస్ట్‌ పత్రికలో నివేదించబడినట్లుగా, “మన జీవన నాణ్యత మెరుగవుతోంది, నిరంతరం అలాగే కొనసాగుతుంది” అని ఆయన వాదిస్తున్నాడు.

వాదోపవాదాల గందరగోళం మధ్య, ప్రాథమికంగా ఏ మార్పు లేకుండా అంతా అలాగే ఉంటుందని అనేకులు విశ్వసిస్తున్నారు. మానవ వ్యవహారాల్లో దేవుడు జోక్యం చేసుకోవడాన్ని గురించిన ఏ తలంపునైనా అపహసిస్తూ వారు, సా.శ. మొదటి శతాబ్దపు అపహాసకుల వంటి దృక్పథాన్ని కనబరుస్తారు.

ఇంకా అంతా అలాగే ఉందా?

దాదాపు సా.శ. 64లో క్రైస్తవ అపొస్తలుడైన పేతురు వ్రాసిన ప్రేరేపిత రెండవ పత్రిక ఇలా హెచ్చరించింది: “అంత్యదినములలో అపహాసకులు అపహసించుచువచ్చి, తమ స్వకీయ దురాశలచొప్పున నడుచు[కొందురు].”—2 పేతురు 3:3.

అపహాసకులు తాము ఎవరినైతే అపహసిస్తున్నారో వారిని వెర్రిబాగులవారిలా కనిపించేలా చేయడానికి ప్రయత్నిస్తారు. అపహాసకునిగా దిగజారే వ్యక్తి స్వార్థపు ఉరిలో చిక్కుకుపోవచ్చు, ఎందుకంటే అపహసించే వ్యక్తి తాను చెప్పేది వినేవాళ్లు తన దృక్పథాన్ని అలవర్చుకోవాలని తరచూ కోరుకుంటాడు. పేతురు ఎవరిని గురించి హెచ్చరించాడో వారిలో కొంతమంది అపహాసకులు ఆ వ్యక్తిలాగానే ఉండి, “తమ స్వకీయ దురాశలచొప్పున నడుచుకొను”వారై ఉండవచ్చు. తన పాఠకులను అప్రమత్తంగా ఉండమని చెప్పడంలో, నొక్కిచెప్పడాన్ని సూచించే వ్యక్తీకరణను అపొస్తలుడు ఉపయోగించాడు. “అపహాసకులు అపహసించుచు” రావడం గురించి ఆయన హెచ్చరించాడు. (ఇటాలిక్కులు మావి.)

ఆ మొదటి శతాబ్దపు అపహాసకులు, క్రీస్తు “రాకడను [“ప్రత్యక్షతను,” NW] గూర్చిన వాగ్దాన” సత్యత్వాన్ని ప్రశ్నిస్తూ, “ఆయన రాకడను [“ప్రత్యక్షతను,” NW] గూర్చిన వాగ్దానమేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచియున్నదే” అని అన్నారు. (2 పేతురు 3:4) అది వారికలా అనిపించింది. అయినప్పటికీ, యేసు యెరూషలేము నగరంపైకి రానైయున్న నాశనాన్ని గురించి పూర్వం సా.శ. 33లో ప్రవచించాడు. “నీ శత్రువులు నీ చుట్టు గట్టు కట్టి ముట్టడివేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి, నీలోనున్న నీ పిల్లలతో కూడ నిన్ను నేల కలిపి నీలో రాతిమీద రాయి నిలిచియుండనియ్యని దినములు వచ్చునని” ఆయన ప్రకటించాడు. ఆ హెచ్చరికను అపహసించినవారు ఎంత పొరబడ్డారో కదా! సా.శ. 70లో, రోమా సైన్యాలు యెరూషలేమును చుట్టుముట్టి, నగరాన్ని నాశనం చేశారు, విపరీతమైన ప్రాణనష్టం జరిగింది. నగర నివాసుల్లో ఎక్కువశాతం మంది ఈ విపత్తుకు ఎందుకు సంసిద్ధంగా లేరు? ఎందుకంటే దేవుడు తన కుమారుడైన యేసు ద్వారా తమను తనిఖీచేశాడని వాళ్లు గ్రహించలేదు.—లూకా 19:43, 44.

సర్వశక్తిమంతుడైన దేవుడు భవిష్యత్తులో జోక్యం చేసుకోవడం గురించి అపొస్తలుడైన పేతురు సూచిస్తున్నాడు. “ప్రభువు [“యెహోవా,” NW] దినము దొంగవచ్చినట్లు వచ్చును” అని పేతురు హెచ్చరిస్తున్నాడు. (2 పేతురు 3:10) ఆ సమయంలో దేవుడు, దైవభక్తి లేని వారిని మొత్తం భూగోళం మీది నుండి నిర్మూలించి, నీతిమంతులుగా తీర్పు తీర్చబడేవారిని కాపాడుతాడు. ఈ పత్రిక తరచూ వివరించినట్లుగా, క్రీస్తుయేసు “ప్రత్యక్షత” 1914లో ప్రారంభమైంది. అయితే దుష్టత్వాన్ని నిర్మూలించడానికి దేవుని అమలుకర్తగా ఆయన చర్యతీసుకోవడం భవిష్యత్తులో జరుగుతుంది. తత్ఫలితంగా, అపహాసకుల గురించి జాగ్రత్త వహించమని అపొస్తలుడు ఇచ్చిన హెచ్చరిక ఇప్పుడు మరింత అవశ్యంగా వర్తిస్తుంది.

మానవ వ్యవహారాల్లో దేవుడు జోక్యం చేసుకోవడం కొరకు మీరు ఇప్పటికే ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉండవచ్చు. అపహాసకులకు బలికాకుండా సహనంతో వేచివుండడంలో కొనసాగడానికి మీకు ఏది సహాయం చేస్తుంది? దయచేసి చదవడం కొనసాగించండి.

[4వ పేజీలోని చిత్రం]

“నీ శత్రువులు నీ చుట్టు గట్టు కట్టి ముట్టడివేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి, . . . నీలో రాతిమీద రాయి నిలిచియుండనియ్యని దినములు వచ్చు[ను].” అది అపహసించదగిన హెచ్చరిక కాదు. రోమా సైన్యాలు యెరూషలేమును నాశనం చేసినప్పుడు విపరీతమైన ప్రాణనష్టం జరిగింది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి