కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 5/1 పేజీలు 30-31
  • యోబు యథార్థతకు ప్రతిఫలం లభించింది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యోబు యథార్థతకు ప్రతిఫలం లభించింది
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దోషవిముక్తి మరియు పునఃస్థాపనం
  • మనకొరకు పాఠాలు
  • ఇతరుల కోసం ప్రార్థిస్తే యెహోవా సంతోషిస్తాడు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • యోబు సహించాడు—మనము కూడా సహించగలము!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • “నా యథార్థతను విడిచిపెట్టను”
    వాళ్లలా విశ్వాసం చూపించండి
  • యెహోవా అతని గాయాన్ని మాన్పాడు
    వాళ్లలా విశ్వాసం చూపించండి
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 5/1 పేజీలు 30-31

వారు యెహోవా చిత్తాన్ని చేశారు

యోబు యథార్థతకు ప్రతిఫలం లభించింది

యోబు కనికరంగల వ్యక్తి, ఆయన విధవరాండ్ర, అనాధల, దీనజన ఉద్ధారకుడు. (యోబు 29:12-17; 31:16-21) తర్వాత, ఆయన తన సంపదను, పిల్లల్నీ, ఆరోగ్యాన్నీ కోల్పోయి హఠాత్తుగా కష్టాలపాలయ్యాడు. దుఃఖకరంగా, బాధితులకు మద్దతునిచ్చే స్థంభంగా ఉండిన ఈ ఉన్నతమైన వ్యక్తి తన అవసరత సమయంలో ఏ సహాయాన్నీ పొందలేదు. చివరికి ఆయన స్వంత భార్య కూడా ఆయనతో, “దేవుని దూషించి మరణము కమ్మ[ని]” చెప్పేసింది. ఆయన “స్నేహితులైన” ఎలీఫజు, బిల్దదు, జోఫరు ఏ ఓదార్పునూ ఇవ్వలేదు. బదులుగా, యోబు పాపం చేశాడనీ, కాబట్టి ఆయన వేదన పడడం సబబేననీ వాళ్లు పరోక్షంగా సూచించారు.—యోబు 2:9; 4:7, 8; 8:5, 6; 11:13-15.

ఎన్నో బాధలనుభవించినప్పటికీ, యోబు నమ్మకస్థుడుగా ఉన్నాడు. దీని మూలంగా, యెహోవా చివరికి యోబుపై దయ చూపించి ఆయనను ఆశీర్వదించాడు. ఆయనెలా అలా చేశాడనేదాన్ని గూర్చిన వృత్తాంతం, యథార్థవంతులైన దేవుని సేవకులందరూ అదే విధంగా ప్రతిఫలాన్ని పొందుతారనే హామీని వారికిస్తుంది.

దోషవిముక్తి మరియు పునఃస్థాపనం

యెహోవా మొదట ఎలీఫజును, బిల్దదును, జోఫరును గద్దించాడు. వారిలో పెద్దవాడని స్పష్టమౌతున్న ఎలీఫజును ఉద్దేశించి ఆయనిలా చెప్పాడు: “నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్నుగూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము నీమీదను నీ ఇద్దరు స్నేహితులమీదను మండుచున్నది. కాబట్టి యేడు ఎడ్లను ఏడు పొట్టేళ్లను మీరు తీసికొని, నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహనబలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థనచేయును.” (యోబు 42:7, 8) ఇదేమి సూచించిందో ఆలోచించండి!

యెహోవా ఎలీఫజు, బిల్దదు, జోఫరుల నుండి అంతటి బలిని కోరడానికి కారణం బహుశ వారి మనస్సులపై వారి పాపం యొక్క గంభీరతను గాఢంగా ముద్రించడానికై ఉండవచ్చు. వాస్తవానికి, దేవునికి ‘తన సేవకులయందు నమ్మకం లేదనీ,’ యోబు విశ్వసనీయంగా ఉన్నా లేకపోయినా ఆయనకు నిజానికి పట్టింపు లేదనీ చెప్పడం ద్వారా వారు తెలిసో తెలియకో దేవుడ్ని దూషించారు. దేవుని దృష్టిలో చిమ్మటకున్న విలువే యోబుకుందని కూడా ఎలీఫజు అన్నాడు! (యోబు 4:18, 19; 22:2, 3) “మీరు నన్నుగూర్చి యుక్తమైనది పలుకలేదు” అని యెహోవా అన్నాడంటే అందులో ఆశ్చర్యం లేదు!

అంత మాత్రమే కాదు. యోబుకు వచ్చిన సమస్యలు స్వయంకృతాపరాధమని ఆయనతో చెప్పడం ద్వారా ఎలీఫజు, బిల్దదు, జోఫరులు యోబుకు వ్యతిరేకంగా వ్యక్తిగతంగా కూడా పాపం చేశారు. నిరాధారమైన వారి ఆరోపణలూ, సానుభూతి లేకపోవడమూ యోబుకు బాధా వేదనలు కలిగించాయి, ఫలితంగా ఆయనిలా ఆవేదన వ్యక్తం చేశాడు: “ఎన్నాళ్లు మీరు నన్ను బాధింతురు? ఎన్నాళ్లు మాటలచేత నన్ను నలుగగొట్టుదురు?” (యోబు 10:1; 19:2) ఇప్పుడు తమ పాపాలను బట్టి వాళ్లు యోబుకు అర్పణ అర్పించవలసి రావడం, ఈ ముగ్గురు వ్యక్తులకు ఎంత తలవంపై ఉండివుంటుందో ఊహించండి!

కాని యోబు వారి అవమానాన్ని బట్టి అతిశయపడనవసరం లేదు. వాస్తవానికి, ఆయన తనను నిందించినవారి కోసం ప్రార్థించాలని యెహోవా కోరాడు. యోబు తనకు ఉపదేశించబడినట్లుగానే చేశాడు, దాన్ని బట్టి ఆయన ఆశీర్వదించబడ్డాడు. మొదట, యెహోవా ఆయన భయంకరమైన వ్యాధిని స్వస్థపర్చాడు. తర్వాత, యోబు సహోదరులూ సహోదరీలూ మునుపటి సహవాసులు ఆయనను ఓదార్చడానికి వచ్చి, “ఒక్కొక్కడు ఒక వరహాను ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను.”a అంతేగాక, యోబుకు “పదునాలుగు వేల గొఱ్ఱెలును ఆరువేల ఒంటెలును వెయ్యిజతల యెడ్లును వెయ్యి ఆడుగాడిదలును కలిగెను.”b యోబు భార్య ఆయనతో సమాధానపడిందని స్పష్టమౌతుంది. కొంతకాలానికి, యోబు ఏడుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలతో దీవించబడి, తన సంతానం యొక్క నాలుగు తరాలను చూసేంత వరకు జీవించాడు.—యోబు 42:10-17.

మనకొరకు పాఠాలు

ఆధునికదిన దేవుని సేవకులకు యోబు విశేషమైన మాదిరినుంచాడు. ఆయన “యథార్థవర్తనుడును న్యాయవంతుడునై” ఉండెను, ఆయనను యెహోవా ‘నా సేవకుడు’ అని పిలువడానికి గర్వపడ్డాడు. (యోబు 1:8; 42:7, 8) అయితే దీని భావం యోబు పరిపూర్ణుడని కాదు. తాను శ్రమలను అనుభవిస్తున్నప్పుడు ఒక సందర్భంలో, ఆయన తన బాధకు కారణం దేవుడేనని తప్పుగా భావించాడు. దేవుడు మానవులతో వ్యవహరించే విధానాన్ని కూడా ఆయన విమర్శించాడు. (యోబు 27:2; 30:20, 21) ఆయన దేవుని నీతికంటే తన నీతిని ఎక్కువగా ప్రకటించుకున్నాడు. (యోబు 32:2) కాని యోబు తన సృష్టికర్తను నిరాకరించేందుకు తిరస్కరించాడు, దేవుని దిద్దుబాటును ఆయన వినయంగా స్వీకరించాడు. “ఏమియు నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాటలాడితిని,” అని ఆయన అంగీకరించాడు. “నన్ను నేను అసహ్యించుకొని, ధూళిలోను బూడిదెలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను.”—యోబు 42:3, 6.

శ్రమలనెదుర్కుంటున్నప్పుడు మనం కూడా తగని విధంగా ఆలోచిస్తాము, మాట్లాడతాము లేక ప్రవర్తిస్తాము. (పోల్చండి ప్రసంగి 7:7.) అయినప్పటికీ, దేవుని ఎడల మనకున్న ప్రేమ ప్రగాఢమైనదైతే, మనం ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయము లేక మనం కష్టాలు అనుభవించడానికి ఆయన అనుమతిస్తున్నందుకు బాధపడము. బదులుగా, మనం మన యథార్థతను కాపాడుకుని, తద్వారా చివరికి గొప్ప దీవెనలను పొందుతాము. కీర్తనల గ్రంథకర్త యెహోవా గురించి ఇలా చెప్పాడు: “యథార్థవంతుల యెడల యథార్థవంతుడవుగా నుందువు.”—కీర్తన 18:25.

యోబు ఆరోగ్యవంతమైన స్థితికి తిరిగిరాక ముందు, ఆయన తనకు వ్యతిరేకంగా పాపం చేసినవారి కోసం ప్రార్థించాలని యెహోవా కోరాడు. మనకు ఎంత చక్కని మాదిరి! మన సొంత పాపాలు క్షమించబడడానికి ముందు మనం, మనకు వ్యతిరేకంగా పాపం చేసిన వాళ్లను క్షమించాలని యెహోవా అపేక్షిస్తున్నాడు. (మత్తయి 6:12; ఎఫెసీయులు 4:32) క్షమించడానికి తగిన ఆధారం ఉన్నప్పటికీ మనం క్షమించడానికి ఇష్టపడకపోతే, యెహోవా మన ఎడల కనికరం గలవాడై ఉండాలని మనం సరిగ్గా అపేక్షించగలమా?—మత్తయి 18:21-35.

మనమందరం ఎప్పుడో ఒకసారి శ్రమల నెదుర్కుంటాము. (2 తిమోతి 3:12) అయినప్పటికీ, యోబులా మనం మన యథార్థతను కాపాడుకోవచ్చు. అలా చేయడం ద్వారా, మనం గొప్ప ప్రతిఫలాన్ని పొందుతాము. యాకోబు ఇలా వ్రాశాడు: “సహించిన వారిని ధన్యులని ప్రకటిస్తున్నాము. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి మరియు యెహోవా అనుగ్రహించిన ప్రతిఫలమును చూచితిరి, యెహోవా జాలియు కనికరమును గలవాడని మీరు తెలిసికొనియున్నారు.”—యాకోబు 5:11, NW.

[అధస్సూచీలు]

a “వరహా” (హెబ్రీ, కెసిటాహ్‌) విలువను ఇంతని నిర్ధారించలేము. కాని యాకోబు కాలంలో “నూరు వరహాలకు” చెప్పుకోదగినంత పొలం వచ్చేది. (యెహోషువ 24:32) కాబట్టి, ఒకొక్క సందర్శకుడూ ఇచ్చిన “వరహా” ఉదారమైన బహుమానమే అయ్యుండవచ్చు.

b ఇక్కడ ఆడుగాడిదలని స్పష్టం చేయబడినది ఎందుకంటే బహుశ వాటికున్న సంతానోత్పత్తి శక్తినిబట్టి అవి విలువైనవిగా ఎంచబడి ఉండవచ్చు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి