దేవుని వాక్యంలో ఉన్న సంపద | యోబు 38-42
ఇతరుల కోసం ప్రార్థిస్తే యెహోవా సంతోషిస్తాడు
ఎలీఫజు, బిల్దదు, జోఫరు కోసం యోబు ప్రార్థించాలని యెహోవా కోరుకున్నాడు
యోబు దగ్గరకు వెళ్లి దహన బలి అర్పించమని ఎలీఫజు, బిల్దదు, జోఫరులతో యెహోవా దేవుడు చెప్పాడు
యోబు వాళ్లకోసం ప్రార్థించాలి
అలా చేశాక యోబు ఆశీర్వాదాలు పొందాడు
యోబు చూపించిన విశ్వాసం, సహనం బట్టి యెహోవా ఆయనను ఎంతో ఆశీర్వదించాడు
యెహోవా యోబుకు వచ్చిన కష్టాలు తీసేసి, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు
యోబు తన బాధను మర్చిపోవడానికి స్నేహితులు, బంధువులు చాలా సహాయం చేశారు
యోబు పోగొట్టుకున్న ఆస్తిని తిరిగి ఇచ్చి, ఆయన నష్టపోయిన దానికి రెండింతల్ని యెహోవా ఇచ్చాడు
యోబు ఆయన భార్యకు తర్వాత పది మంది పిల్లలు పుట్టారు
యోబు మరో 140 సంవత్సరాలు బ్రతికాడు, వాళ్ల కుటుంబంలో నాలుగు తరాలను చూశాడు