కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 2/15 పేజీలు 30-31
  • ఉదారత వలన లభించే దీవెనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఉదారత వలన లభించే దీవెనలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • క్రైస్తవ సంఘంలో ఉదారత
  • ప్రజలందరి ఎడలా ఉదారంగా ఉండాలా?
  • ఉదారత తీసుకొచ్చే దీవెనలను అనుభవించండి
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 2/15 పేజీలు 30-31

ఉదారత వలన లభించే దీవెనలు

ఉదారత అంటే ఇతరులను దీవించేందుకుగల ఉన్నతమైన, సహృదయతతో కూడిన సుముఖత. అందులో ఎటువంటి పిసినారి తనమూ లేకుండా మనస్ఫూర్తిగా గుప్పిలి విప్పి ఇవ్వడం చేరి ఉంటుంది. అయితే ఉదారత అనేది ఇచ్చే వ్యక్తికి, దాన్ని అందుకుంటున్న వ్యక్తి నుండీ అలాగే యెహోవా నుండీ కూడా అనేక దీవెనలను తెస్తుంది. ఉదారత అనే అర్థంగల నాధివ్‌ అనే హెబ్రీ పదం, యెషయా 32:8 నందు “ఘనకార్యము” అని అనువదించబడింది, అది “సమ్మతిగల” మరియు “వితరణశీలం” అని కూడా అనువదించబడింది. (కీర్తన 51:12; సంఖ్యాకాండము 21:18 అధఃస్సూచి, NW) హాప్లొతెస్‌ అనే గ్రీకు నామవాచకం 2 కొరింథీయులు 8:2 నందు “దాతృత్వము” అనీ మరియు 9:11 నందు “ఔదార్యము” అనీ, రోమీయులు 12:8 నందు “శుద్ధమనస్సు” అనీ, ఎఫెసీయులు 6:5 నందు “యథార్థమైన హృదయము” అనీ అనువదించబడింది. యెహోవా తానే ఉదారతకు ప్రతిరూపమై ఉన్నాడు. తనకు విధేయులైన జీవుల అవసరతలను అన్నింటినీ ఆయన తన “చిత్తానుసారముగా” తీరుస్తాడు. (1 యోహాను 5:14; ఫిలిప్పీయులు 4:19) శ్రేష్ఠమైన ప్రతి ఈవీ, సంపూర్ణమైన ప్రతి వరం కూడా ఆయననుండి వచ్చినవే, అందులో జ్ఞానం వంటి ఇంద్రియ గ్రాహ్యంకాని ఈవులు కూడా చేరివున్నాయి.—యాకోబు 1:5, 17.

అప్పిస్తున్నప్పుడు కూడా ఉదారత అనే ఈ దైవిక లక్షణాన్ని పెంపొందించుకోవాలని మోషే తన తోటి ఇశ్రాయేలీయులను పురికొల్పాడు. “బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండ నీ హృదయమును కఠినపరచు కొనకూడదు. . . . వానికొరకు అవశ్యముగా చెయ్యి చాచి . . . వానికి అప్పియ్యవలెను. . . . నీవు నిశ్చయముగా వాని కియ్యవలెను. వాని కిచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. . . . అందుచేత నేను—నీ దేశములోనున్న నీ సహోదరులగు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలెనని నీ కాజ్ఞాపించుచున్నాను.” (ద్వితీయోపదేశకాండము 15:7-11) ఈ దైవిక సలహాను అనుసరించడం, కష్టకాలాలను అనుభవిస్తున్న ఇశ్రాయేలీయులకు దీవెనలను తీసుకువస్తుంది.

అయితే, ఇతరుల ఎడల ఉదారంగా ఉన్న వారికి ఏ దీవెనలు లభిస్తాయి? సామెతలు 11:25 నందు మనమిలా చదువుతాము: “ఔదార్యముగలవారు [అక్షరార్థంగా, ఇతరులకు దీవెనకరంగా ఉండే వారు] పుష్టినొందుదురు [వర్థిల్లుదురు]. నీళ్లు పోయువారికి నీళ్లు పోయబడును.” యేసుక్రీస్తు దాన్ని ఈ విధంగా వ్యక్తపర్చాడు: “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము.” (అపొస్తలుల కార్యములు 20:35) “ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండుకొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడు[ను]” అని కూడా ఆయన అన్నాడు. (లూకా 6:38) కాబట్టి ఉదారత మూలంగా ఇటు ఇచ్చే వారికీ, అటు దాన్ని అందుకునే వారికీ కూడా దీవెనలు లభిస్తాయి, అంటే అది పరస్పరం లాభదాయకంగా ఉంటుంది.

క్రైస్తవ సంఘంలో ఉదారత

తొలి శతాబ్దం నాటి క్రైస్తవులకు ఉదారతను గురించి అపొస్తలుడైన పౌలు ఎంతో చెప్పాల్సి ఉంది. ఆయనిలా చెబుతున్నాడు: “కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకోయును.” విషయం అది గనుక, “సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును” అని అపొస్తలుడు తర్కించాడు. ఉదారత చూపే విషయంలో యెహోవా కనుపరచిన అతి గొప్ప మాదిరిని ఆయన సూచిస్తూ, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును సమృద్ధిగా అనుగ్రహించడమే కాకుండా, కొరింథునందలి సహోదరులు ఇతరుల ఎడల ఉదారంగా ఉండగలిగేందుకు వారిని ‘ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యముగలవారగునట్లు’ కూడా చేశాడని చెబుతున్నాడు. ఉదారత యొక్క అటువంటి వ్యక్తీకరణలు, ‘దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేందుకు’ దారితీశాయని పౌలు చెప్పాడు. (2 కొరింథీయులు 9:6-13) ఇది ఉదారతగల క్రైస్తవులకు యెహోవా నుండి దీవెనలు వచ్చేందుకు కూడా దారితీస్తుంది.

అదే విధమైన దైవిక ఉదారతను చూపమని పౌలు రోము నందలి క్రైస్తవులను ప్రోత్సహిస్తూ, ఆయన ఇలా వ్రాశాడు: “పంచిపెట్టువాడు శుద్ధమనస్సుతో . . . పని జరిగింపవలెను.” (రోమీయులు 12:8) మరి హెబ్రీ క్రైస్తవులకు ఆయనిలా వ్రాశాడు: “ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికిష్టమైనవి.” (హెబ్రీయులు 13:16) మాసిదోనియనందలి సంఘాలు ఉదారంగా ఇవ్వడంలో విశేషమైన మాదిరులుగా ఉన్నాయి. వారు నిరుపేదలైనప్పటికీ తమ “సామర్థ్యముకంటె ఎక్కువగా” ఇష్టపూర్వకంగా ‘తమంతట తామే ఇవ్వడం,’ “వారి దాతృత్వము బహుగా” విస్తరించేందుకు దారి తీసింది.—2 కొరింథీయులు 8:1-4.

ప్రజలందరి ఎడలా ఉదారంగా ఉండాలా?

అయితే, కొందరు ప్రజలకు ఉదార స్వభావంతోనూ శుద్ధమనస్సుతోనూ ఇవ్వడం అనుచితం కావచ్చు. బైబిలు కృతఘ్నులనూ, బద్దకస్తులనూ మరియు సోమరిపోతులను ఖండిస్తుంది. ఉదాహరణకు, చలి కాలంలో దున్నడం మానుకునే సోమరిపోతు కోతకాలంలో అడుక్కుంటున్నప్పుడు అతను ఏదీ పొందేందుకు అర్హుడు కాడు; పని చేసేందుకు ప్రతికూలంగా ఉండేవాడు ఇతరుల ఉదారత నుండి ప్రయోజనం పొందేందుకు పాత్రుడు కాడు. (సామెతలు 20:4; 2 థెస్సలొనీకయులు 3:10) యోగ్యులైన విధవరాండ్రను మాత్రమే సహాయ సహకారాలను అందుకునేవారి లెక్కలో చేర్చేవారు. (1 తిమోతి 5:9, 10) గలతీయ, మాసిదోనియ, అకయనందంతటా ఉన్న సంఘాలు ఇచ్చిన చందాలు అవసరతల్లో ఉన్న అన్యారాధికుల కోసం ఇవ్వబడలేదు, కానీ అవి అవసరతల్లో ఉన్న “పరిశుద్ధుల” కొరకు మాత్రమే ఇవ్వబడ్డాయి.—1 కొరింథీయులు 16:1; 2 కొరింథీయులు 9:1, 2.

ఉదారత తీసుకొచ్చే దీవెనలను అనుభవించండి

క్రైస్తవులు నేడు యెహోవా యొక్క చక్కని ఉదారమైన, దానశీల మాదిరిని అనుకరిస్తారు. అవసరాల్లో ఉన్న యోగ్యులకు వారు చేయి ముడవకుండా తమ వస్తుపరమైన సంపదను ఖర్చుపెడతారు. యెహోవా రాజ్యాసక్తులను ముందుకు నడిపే అన్ని ప్రాజెక్టుల్లో వాళ్లు ఔదార్యంతో భాగం వహిస్తారు. మరి వారు ‘మనుష్యులందరితో’ ఆధ్యాత్మిక సత్యాలను మనఃపూర్వకంగా పంచుకుంటారు.—1 తిమోతి 2:2-5.

అవసరతల్లో ఉన్న వారికి దీవెనలను తెచ్చే విషయంలో వారలా భాగం వహిస్తుండగా, దానికి ప్రతిగా వారు కూడా దీవెనలను అందుకోవడమనే గొప్ప బహుమానాన్ని పొందుతారు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి