సువార్తతో ఇంకా ఎక్కువమందిని చేరుకోవడం
నాస్వదేశంలోని ప్రజలను గురించి నేను ఆలోచించగా, అనేకమందికి యెహోవా సాక్షులను గురించి వార్తా నివేదికల ద్వారా మాత్రమే తెలుసనే విషయాన్ని నేను గుర్తించాను. యెహోవాసాక్షులు ఎవరు, వాళ్లు వాస్తవంగా ఏం నమ్ముతున్నారు అనేది ఈ ప్రజలు తెలుసుకోవాలంటే వాళ్లను కలుసుకోవాలని నేను భావించాను. అయితే నేను ఎలా సహాయం చేయగలను? క్రైస్తవ పెద్ద అయిన నా భర్త జ్ఞానయుక్తమైన నడిపింపునూ సలహాలనూ నాకిచ్చారు.
తేజరిల్లు! పత్రిక యొక్క 1995 జనవరి 8 సంచికలోని “ఆచరణాత్మకమైన రీతిలో ఆదరణను ఇచ్చే పత్రికలు” (ఆంగ్లం) అనే శీర్షికలో మేము ఒక కీలకాన్ని కనుగొన్నాము. ఒక సాక్షి యొక్క కార్యకలాపాన్ని గురించి ఆ శీర్షిక ఇలా చెబుతుంది: “ఇతర సాక్షుల ఇళ్లలో పోగయిన తేజరిల్లు! యొక్క కొన్ని పాత ప్రతులను సేకరించాలని ఆమె నిర్ణయించుకుంది. అందులోని కొన్ని అంశాల్లో ఆసక్తి చూపిస్తాయని ఆమె అనుకున్న ఏజెన్సీలను ఆమె సందర్శించింది.”
నా భర్త సహాయంతో, నేను త్వరలోనే పత్రికల అనేక వందల ప్రతులను సేకరించగలిగాను. నేను దర్శించాలని ప్రయత్నించే ప్రజలకు అనుగుణంగా ఉండే అనేక అంశాలను నేను వాటినుండి సేకరించగలిగాను.
టెలిఫోన్ డైరెక్టరీలనూ, ప్రజా రికార్డులనూ ఉపయోగిస్తూ నేను ఆసుపత్రుల, యౌవనుల హాస్టళ్ళ, నర్సింగ్ హోమ్‌ల లిస్టును తయారు చేశాను. నేను స్మశానవాటికల నిర్వాహకులను, పాఠశాల సూపర్‌వైజర్‌లనూ సలహాదారులను, వైద్య పరీక్షలు జరిపే వారినీ అలాగే చెరసాలల న్యాయస్థానాల అధికారులను గురించిన ఒక లిస్టును కూడా సిద్ధం చేశాను. త్రాగుబోతులు మరియు మాదకద్రవ్యాల బానిసలకొరకైన సంస్థల నిర్వాహకులు, పర్యావరణ సంబంధ విషయాల కొరకైన, వికలాంగులూ యుద్ధ బాధితులకొరకైన మరియు పోషకాహార పరిశోధన కొరకైన సమాఖ్యలు నా పట్టికలో ఉన్నాయి. సంక్షేమ, సాంఘిక సేవల మరియు కుటుంబ వ్యవహారాల కార్యాలయ అధికారులను నేను మర్చిపోలేదు.
నేనేమి చెబుతాను?
నేను సందర్శిస్తున్నప్పుడు నేను చేసిన మొదటి పని నేనెవరినో స్పష్టంగా తెలియజేయడమే. నా సందర్శనం కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే తీసుకుంటుందని నేను తెలియజేశాను.
అధికారంలో ఉన్న వ్యక్తిని ముఖాముఖిగా కలిసిన తర్వాత, నేనిలా చెప్పేదాన్ని: “నేను ఒక యెహోవాసాక్షిని. అయితే, నేను ఇక్కడ మతపరమైన చర్చ జరిపేందుకు రాలేదు, ఆఫీసు సమయంలో అలా చర్చించడం ఉచితం కాదు.” అప్పుడు అక్కడి వాతావరణం సాధారణంగా మరింత తేలికపడుతుంది. తర్వాత, నా వ్యాఖ్యానాలను పరిస్థితికి అనుగుణంగా మార్చుకుంటూ, నేనిలా కొనసాగుతాను: “నేను సందర్శించడానికి గల కారణం రెండంశాలు గలది. మొదటిగా, మీ కార్యాలయం చేస్తున్న పనిని నేనెంతగా మెచ్చుకుంటున్నానో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎంతైనా, సామాన్య ప్రజల సంక్షేమం నిమిత్తం ఎవరైనా తమ సమయాన్నీ శక్తినీ వెచ్చించినప్పుడు దాన్ని అలక్ష్యం చేయకూడదు. ఈ పని ఎంతో మెచ్చుకోదగినది.” అనేక సందర్భాల్లో ఈ విధంగా సమీపించిన వ్యక్తులు ఆశ్చర్యచకితులయ్యారు.
ఈ సరికల్లా ఆ వ్యక్తి నేను దర్శించడానికున్న రెండవ అంశాన్ని గురించి ఆలోచిస్తుంటాడు. నేనిలా కొనసాగిస్తాను: “నేను దర్శించేందుకు గల రెండవ కారణం ఇది: అంతర్జాతీయంగా ప్రచురించబడుతున్న మా తేజరిల్లు! పత్రిక నుండి, మీరు చేస్తున్న విధమైన పనితో, దానికి సంబంధించిన సమస్యలతో ప్రత్యేకంగా వ్యవహరించే కొన్ని శీర్షికలను నేను సేకరించాను. ఒక అంతర్జాతీయ పత్రిక ఈ సమస్యలను ఎలా దృష్టిస్తుందనే విషయాన్ని మీరు తెలుసుకోవాలని ఇష్టపడతారని నా దృఢవిశ్వాసం. ఈ ప్రతులను మీకు ఇచ్చి వెళ్లాలని నేను వచ్చాను.” నా ప్రయత్నాన్ని వాళ్లు మెచ్చుకుంటున్నారని వాళ్లు నాకు తరచూ చెప్పారు.
ఆశ్చర్యకరమైన, ప్రతిఫలదాయకమైన ఫలితాలు
నేను ఇలా సమీపించినప్పుడు, అనేకులు నేను చెప్పిన విషయాలను స్నేహపూర్వకంగా విన్నారు; 17 మందిలో కేవలం ఒకరే నేనందించిన పత్రికలను నిరాకరించారు. ఎంతో ఆశ్చర్యకరమైన మరియు ప్రతిఫలదాయకమైన అనుభవాలు అనేకం నాకు కలిగాయి.
ఉదాహరణకు, ఒక జిల్లా పాఠశాల పర్యవేక్షకుణ్ని కలిసేందుకు నేను నాలుగుసార్లు ప్రయత్నించాను, మరి ఎంతో ఓపికగా వేచి ఉన్న తర్వాత అతన్ని నేను చివరకు కలవగలిగాను. ఆయన ఎంతో బిజీ వ్యక్తి. అయినప్పటికీ, ఆయన ఎంతో స్నేహపూర్వకంగా ఉండి నాతో కాస్సేపు మాట్లాడాడు. నేను వచ్చేయబోతుంటే, ఆయనిలా చెప్పాడు: “నేను మీ ప్రయత్నాలను విలువైన వాటిగా భావిస్తున్నాను, నేను మీ ప్రచురణలను తప్పకుండా శ్రద్ధగా చదువుతాను.”
మరొక సందర్భంలో, నేను ఒక జిల్లా న్యాయస్థానానికి వెళ్లి, మధ్యవయస్కుడైన ముఖ్య న్యాయాధిపతిని కలిశాను. నేను ఆయన కార్యాలయంలోకి ప్రవేశించినప్పుడు, ఆయన తన కాగితాలను పరిశీలిస్తూ, మధ్యలో తలపైకెత్తి కాస్త విసుగ్గా చూశాడు.
“ఆఫీసు సమయం మంగళవారం ఉదయం మాత్రమే, ఏ సమాచారం విషయంలోనైనా నేను అప్పుడే అందుబాటులో ఉంటాను” ఆయన కటువుగా చెప్పాడు.
“నేను అనుచిత సమయంలో వచ్చినందుకు క్షమించాలి,” అని నేను వెంటనే అన్నాను, తర్వాత “మరో సమయంలో వచ్చేందుకు నాకు అభ్యంతరం లేదు. అయితే నేను మిమ్మల్ని దర్శించేందుకుగల కారణం వ్యక్తిగతమైనది.”
ఇక ఆ న్యాయాధిపతికి కుతూహలం కలిగింది. ఆయన కాస్త శాంతించి, నాకేం కావాలని అడిగాడు. నేను మంగళవారం వస్తానని మళ్లీ చెప్పాను.
“దయచేసి కూర్చోండి” అని ఆయన నొక్కి చెప్పడం నాకు ఆశ్చర్యం కలిగించింది. “మీకేమి కావాలి?”
ఉత్సాహవంతమైన చర్చ జరిగింది, మొదట్లో కాస్త చికాకు పడినందుకు ఆయన క్షమాపణ కోరాడు, ఆయన నిజంగానే చాలా బిజీగా ఉన్నాడు మరి.
“యెహోవాసాక్షులను గురించి నాకు బాగా నచ్చే విషయం ఏమిటో మీకు తెలుసా?” అని ఆ న్యాయాధిపతి కొంచెంసేపటి తర్వాత అడిగాడు. “వాళ్లు కలిగి ఉన్న సూత్రాలకు చక్కని ఆధారాలున్నాయి, మరి వాళ్లు వాటినుండి ఎన్నడూ ప్రక్కకు తొలగరు. తనకు సాధ్యమైనవన్నీ హిట్లర్ ప్రయత్నించాడు, కానీ సాక్షులు యుద్ధం చేసేందుకు అంగీకరించలేదు.”
మేమిద్దరము ఒక కార్యాలయంలోకి ప్రవేశించినప్పుడు, అక్కడున్న సెక్రటరీలు మమ్మల్ని గుర్తించారు. తర్వాత ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ తీవ్ర స్వరంలో స్పష్టంగా, నిష్కర్షగా ఇలా అన్నది, “ప్రెసిడెంట్ సందర్శకులను ఎప్పుడూ కలవరు.”
“అయితే ఆయన మమ్మల్ని కలుస్తారు” అని నేను ప్రశాంతంగా సమాధానమిచ్చాను, “ఎందుకంటే మేము యెహోవాసాక్షులము. మేము పిటిషన్ పెట్టుకునేందుకు రాలేదు, మా సందర్శనం మూడు నిమిషాలకంటే ఎక్కువ సేపు ఉండదు.” నేను నా హృదయంలో పట్టుదలతో ప్రార్థించాను, “యెహోవా, ఈ ఒక్కటి మంచిగా జరగనీ!”
సెక్రటరీ నిర్లక్ష్యంగా ఇలా ప్రతిస్పందించింది, “సరే మరి, నేను ప్రయత్నిస్తాను.” ఆమె వెళ్లిపోయింది. నాకు రెండు యుగాలుగా తోచిన రెండు నిమిషాల తర్వాత, ఆమె బయటకు వచ్చింది, అయితే ఆమె వెంట అధ్యక్షుడు కూడా వచ్చాడు. ఏమి చెప్పకుండానే, ఆయన రెండు ఇతర గదులను దాటుతూ తన కార్యాలయం వైపుకు తీసుకెళ్లాడు.
మేము చర్చించడం ప్రారంభించిన తర్వాత, ఆయన మరింత స్నేహపూర్వకంగా మెలిగాడు. మేము తేజరిల్లు! యొక్క ప్రత్యేక సంచికల పత్రికలను అందించినప్పుడు ఆయన ఇష్టపూర్వకంగా వాటిని తీసుకున్నాడు. మన పని యొక్క సంకల్పాన్ని గురించి చక్కని సాక్ష్యం ఇవ్వగల అవకాశం మాకిచ్చినందుకు మేము యెహోవాకు వందనాలు తెలుపుకున్నాము.
అనేక అద్భుతమైన అనుభవాలను నెమరువేసుకుంటూ, అపొస్తలుడైన పేతురు చెప్పిన విషయాలను నేను మరింత ఎక్కువగా గుణగ్రహించ గలుగుతున్నాను: “దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.” (అపొస్తలుల కార్యములు 10:34, 35) అన్ని రకాల నేపథ్యాలకూ, భాషలకూ, లేక సాంఘిక స్థితి గతులకూ చెందిన ప్రజలకందరికీ, మానవజాతిని మరియు భూమిని గురించిన సంకల్పాన్ని గూర్చి తెలుసుకునే అవకాశం ఇవ్వబడాలన్నదే దేవుని చిత్తం.—ఉచిత వ్యాసం.