కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 6/15 పేజీలు 30-31
  • పాఠకుల ప్రశ్నలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠకుల ప్రశ్నలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఇలాంటి మరితర సమాచారం
  • పైఅధికారుల పాత్ర
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • దేవుడు, కైసరు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • కైసరువి కైసరుకి చెల్లించడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ‘నేను కైసరు ఎదుటనే చెప్పుకొందును!’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 6/15 పేజీలు 30-31

పాఠకుల ప్రశ్నలు

నేరస్థులకు విధించబడే మరణ శిక్షణను గురించి బైబిలు ఏమి సూచిస్తోంది?

జీవితంలోని మన అనుభవం ఆధారంగానో లేక పరిస్థితినిబట్టో మనలో ప్రతిఒక్కరికీ ఈ విషయంలో వ్యక్తిగత భావాలు ఉంటాయని ఒప్పుకోక తప్పదు. అయినప్పటికీ యెహోవాసాక్షులుగా మనం, మరణశిక్షను గూర్చిన ఈ వివాదాంశంపై అనేకమంది తీసుకునే రాజకీయసంబంధమైన స్థానం విషయంలో తటస్థంగావున్నప్పటికీ, దీని విషయంలో దేవుని తలంపుల్ని ధృవపర్చుకునేందుకు ప్రయత్నించాలి.

సంక్షిప్తంగా చెప్పాలంటే, దేవుడు తన లిఖిత వాక్యంలో మరణశిక్ష తప్పని సూచించలేదు.

మానవ చరిత్రారంభంలో, ఈ విషయంలో యెహోవా తన తలంపుల్ని వ్యక్తపర్చాడు. దాన్ని గురించి ఆదికాండము 9వ అధ్యాయంలో మనం చదువుతాం. ఇందులో, యావత్‌ మానవ కుటుంబానికీ పూర్వికులైన నోవహూ, ఆయన కుటుంబమూ ఉన్నారు. వాళ్లు ఓడలోనుండి బయటికి వచ్చిన తర్వాత, వాళ్లు జంతువుల్ని తినొచ్చనీ అంటే వాటిని చంపీ, రక్తాన్ని ఒలికించి వాటిని తినొచ్చని దేవుడు చెప్పాడు. తర్వాత, ఆదికాండము 9:5, 6 వచనాల్లో దేవుడు ఇలా చెప్పాడు: “మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును; దానిగూర్చి ప్రతిజంతువును నరులను విచారణ చేయుదును; ప్రతినరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరునివలననే చిందింపబడును; ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను.” కాబట్టి హంతకుల విషయంలో యెహోవా మరణశిక్షను అనుమతించాడు.

దేవుడు తన ప్రజలుగా ఇశ్రాయేలీయులతో వ్యవహరిస్తున్నప్పుడు, దైవిక ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చేయబడే గంభీరమైన ఇతర తప్పులనేకం, మరణశిక్షకు తగినవిగా ఉండేవి. సంఖ్యాకాండము 15:30వ వచనంలో మనం సమగ్రమైన ఈ వ్యాఖ్యానాన్ని చదువుతాం: “దేశమందు పుట్టినవాడేగాని పరదేశియేగాని యెవడైనను సాహసించి పాపముచేసిన యెడల వాడు యెహోవాను తృణీకరించినవాడగును గనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో నుండకుండ కొట్టివేయబడును.”

కానీ క్రైస్తవ సంఘం స్థాపించబడిన తర్వాతి విషయం ఏమిటి? మానవ ప్రభుత్వాలు ఉనికిలో ఉండేందుకు యెహోవా అనుమతించాడని మనకు తెలుసు, ఆయన వారిని సర్వోన్నతాధికారులని పిలిచాడు. వాస్తవానికి, అలాంటి ప్రభుత్వ అధికారులకు విధేయులై ఉండమని క్రైస్తవులకు సలహానిచ్చిన తర్వాత, వాళ్లు: “నీకు మేలు కలుగుటకు . . . దేవుని పరిచారకులు; . . . నీవు చెడ్డది చేసిన యెడల భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు; కీడు చేయువానిమీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతికారము చేయు దేవుని పరిచారకులు” అని బైబిలు చెబుతోంది.—రోమీయులు 13:1-4.

గంభీరమైన నేరాల్ని చేసిన వారి ప్రాణాల్ని తీయడానికి కూడా ప్రభుత్వాలు అనుమతించబడ్డాయని దీని భావమా? 1 పేతురు 4:15వ వచనంలోని మాటల్నిబట్టి, అవునని చెప్పకతప్పదు. ఆ ప్రకరణంలో, అపొస్తలుడు తన సహోదరులకు ఇలా ఉద్బోధించాడు: “మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరులజోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు.” “మీలో ఎవడును నరహంతకుడుగా . . . బాధ అనుభవింప తగదు” అనే విషయాన్ని మీరు గమనించారా? ఓ హంతకుడు చేసిన నేరాన్నిబట్టి అతన్ని బాధించే హక్కు ప్రభుత్వాలకులేదని పేతురు సూచించలేదు. దానికి భిన్నంగా, హంతకుడు తన నేరానికి తగిన శిక్షను పొందుతాడని ఆయన సూచించాడు. దానిలో మరణశిక్ష ఇమిడి ఉంటుందా?

మరణశిక్ష ఇమిడి ఉండగలదు. అపొస్తలుల కార్యములు 25వ అధ్యాయంలోని పౌలు మాటల ద్వారా ఇది స్పష్టమౌతుంది. తమ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పౌలు తప్పులు చేశాడని యూదులు ఆయన్ని నిందించారు. అపొస్తలుల కార్యములు 23:29వ వచనంలో తెలియజేసిననట్లుగా, తన ఖైదీయైన పౌలును రోమా అధిపతి యొద్దకు పంపుతూ సహస్రాధిపతి ఇలా నివేదించాడు: “వారు తమ ధర్మశాస్త్రవాదములనుగూర్చి అతనిమీద నేరము మోపిరే గాని మరణమునకైనను, బంధకములకైనను తగిన నేరము అతనియందేమియు కనుపరచలేదు.” (ఇటాలిక్కులు మావి.) రెండు సంవత్సరాల తర్వాత పౌలు, అధిపతియైన ఫేస్తు ఎదుట ఉన్నాడు. అపొస్తలుల కార్యములు 25:8 వచనంలో మనమిలా చదువుతాం: “అందుకు పౌలు—యూదుల ధర్మశాస్త్రమును గూర్చి గాని దేవాలయమును గూర్చి గాని, కైసరును గూర్చి గాని నేనెంతమాత్రమును తప్పిదము చేయలేదని సమాధానము చెప్పెను.” అయితే, ఇప్పుడు, శిక్షను గూర్చిన, చివరికి మరణశిక్షను గూర్చిన ఆయన వ్యాఖ్యానాలపై అవధానాన్ని నిలపండి. దాన్ని గూర్చి మనం అపొస్తలుల కార్యములు 25:10, 11 వచనాల్లో ఇలా చదువుతాం:

“అందుకు పౌలు—కైసరు న్యాయపీఠము ఎదుట నిలువబడి యున్నాను; నేను విమర్శింపబడవలసిన స్థలమిదే, యూదులకు నేను అన్యాయమేమియు చేయలేదని తమరికి బాగుగా తెలియును. నేను న్యాయము తప్పి మరణమునకు తగినదేదైనను చేసిన యెడల మరణమునకు వెనుకతీయను; వీరు నామీద మోపుచున్న నేరములలో ఏదియు నిజముకాని యెడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరితరముకాదు; కైసరు ఎదుటనే చెప్పుకొందుననెను.” (ఇటాలిక్కులు మావి.)

సక్రమంగా స్థాపించబడిన అధికారం ఎదుట నిలబడి, తప్పిదస్థులను శిక్షించే హక్కూ, వారిని ఉరితీసే హక్కూ కైసరుకుందని పౌలు అంగీకరించాడు. ఆయన అపరాధియైతే, శిక్షించబడ్డానికి అభ్యంతరం చెప్పలేదు. అంతేగాక, హంతకులకు మాత్రమే కైసరు మరణశిక్షను విధించాలని ఆయన చెప్పలేదు.

రోమా న్యాయవ్యవస్థ పరిపూర్ణమైనది కాదనే విషయాన్ని ఒప్పుకోవాల్సిందే; నేటి మానవ న్యాయవ్యవస్థలూ పరిపూర్ణమైనవి కావు. నాడూ నేడూ నిరపరాధులైన కొంతమంది ప్రజలు, అపరాధులుగా నిర్ణయించబడి, శిక్షించబడ్డారు. యేసును గురించి పిలాతు కూడా ఇలా చెప్పాడు: “ఇతనియందు మరణమునకు తగిన నేరమేమియు నాకు అగపడలేదు గనుక ఇతని శిక్షించి విడుదల చేతు[ను].” అవును, యేసు నిరపరాధియని ప్రభుత్వాధికారం ఒప్పుకున్నప్పటికీ, నిరపరాధియైన ఆయన శిక్షించబడ్డాడు.—లూకా 23:22-25.

పౌలుగానీ లేక పేతురుగానీ, మరణశిక్ష మౌలికంగా అనైతికమైనదని వాదించడానికి అలాంటి అన్యాయాలు కారణమవ్వలేదు. బదులుగా, సర్వోన్నతాధికారాలు ఉనికిలో ఉన్నంతవరకూ వాళ్లు ‘కీడు చేసేవారి ఎడల ఆగ్రహము చూపడానికే ఖడ్గము ధరిస్తారన్నది,’ ఈ విషయంలో దేవుని తలంపైవుంది. అందులో, మరణశిక్ష విధించడమనే భావంలో ఖడ్గం ధరించడం కూడా ఉంది. కానీ, హంతకుల్ని ఉరితీసే తమ హక్కును ఏ ప్రభుత్వమైనా వినియోగించుకోవాలా వద్దా అనే వివాదాస్పద ప్రశ్న విషయంలో నిజక్రైస్తవులు తటస్థంగా ఉండేందుకు జాగ్రత్తపడాలి. వారు క్రైస్తవమత సామ్రాజ్య మతనాయకుల్లా, ఈ విషయానికి సంబంధించిన ఏ చర్చల్లోనూ పాల్గొనరు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి