‘ప్రభువైన క్రీస్తుకు దాసులై ఉండండి’
చరిత్రయందంతటా, కోట్లాదిమంది బానిసత్వాన్ని సహించారు. ఉదాహరణకు, వేలాది సంవత్సరాల క్రిందట, ఇశ్రాయేలీయులు ఐగుప్తు అధికారుల చేతుల్లో ఎంతగానో బాధించబడ్డారు. బైబిలు చెబుతున్నట్లుగా, “తీవ్రమైన భారంక్రింద ఇశ్రాయేలీయులు మగ్గిపోయేలా చేయడానికి” విశేషంగా ఇటుకలు చేస్తున్నప్పుడు అలా మగ్గిపోయేలా చేయడానికి ఆ అధికారులు “వారిపై వెట్టిపనులు చేయించు అధికారుల్ని ఉంచారు.”—నిర్గమకాండము 1:11, ది జెరూషలేమ్ బైబిల్.
నేడు అనేక దేశాల్లో, అక్షరార్థ భావంలో ప్రజలు బానిసలుగా ఉండకపోవచ్చు. కానీ, అనేకమంది, కఠినమైన—కొన్నిసార్లు అననుకూలమైన—పరిస్థితిల్లో అనేక గంటలు పనిచేయాల్సివుంటుంది. వాళ్లు, ఆర్థిక బానిసత్వమని పిలువబడగలదాని తీవ్రమైన భారంక్రింద ఉన్నారు.
అయితే, భారరహితమైన బానిసత్వమొకటి ఉంది. అపొస్తలుడైన పౌలు తోటి విశ్వాసులకు ఇలా ఉద్బోధించాడు: “ప్రభువైన క్రీస్తునకు దాసులై” ఉండండి. (కొలొస్సయులు 3:23, 24) క్రీస్తు బానిసలుగా అయ్యేందుకు ఎంపిక చేసుకున్నవారు, తమ తీవ్రమైన భారమునుండి ఉపశమనాన్ని పొందుతారు. యేసు తానే ఇలా చెప్పాడు: “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.”—మత్తయి 11:28-30.
క్రీస్తు కాడిని అంగీకరించడం, తన కుటుంబ వస్తుదాయక అవసరాల్నితీర్చే కర్తవ్యాన్నుండి ఒకనిని విముక్తున్ని చేయదు. (1 తిమోతి 5:8) అయినప్పటికీ, అది వస్తుదాయక లక్ష్యాల చిక్కుల్లో అనేకమైన వాటినుండి స్వాతంత్ర్యాన్నిస్తుంది. వస్తుదాయక సౌకర్యాల్ని సమకూర్చుకోవడమే తమ జీవితంలో ప్రధాన ధ్యేయంగా చేసుకోవడానికి బదులు, క్రైస్తవులు కనీస అవసరతలతో సంతృప్తిచెందుతారు.—1 తిమోతి 6:6-10; 1 కొరింథీయులు 7:31, పోల్చండి.
క్రైస్తవులు దేవుని రాజ్య “సువార్త”ను ప్రకటించే తమ బాధ్యతను నెరవేర్చడంలో కూడా ఉపశమనాన్ని పొందుతారు. (మత్తయి 24:14) ఇది నిజమైన ఆనందాన్నీ, తృప్తినీ తెస్తుంది!
మనం ‘ప్రభువైన క్రీస్తునకు దాసులై’ ఉండగల్గుతున్నందుకు ఎంతో కృతజ్ఞులమై ఉండాలి.
[32వ పేజీలోని చిత్రసౌజన్యం]
Pictorial Archive (Near Eastern History) Est.