కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w91 6/1 పేజీలు 16-20
  • పైఅధికారుల పాత్ర

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పైఅధికారుల పాత్ర
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • నిజమైన క్రైస్తవులు ‘అధికారమును ఎదిరించరు’
  • శాసనమునకు లోబడుట
  • భయపడుటకు కారణముగా యున్నారు
  • “దేవుని పరిచారకులు”
  • విశ్వాసము అవసరము
  • ప్రభుత్వము సహాయము చేయనప్పుడు
  • అధికారాన్ని గూర్చి క్రైస్తవ దృక్పథము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • పై అధికారుల విషయములో క్రైస్తవుల దృష్టి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • మీరు ఎవరి అధికారాన్ని గుర్తించాలి?
    నిత్యజీవానికి నడిపించే జ్ఞానము
  • అధికారం పట్ల గౌరవం ఉండడం—ఎందుకంత ప్రాముఖ్యం?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
w91 6/1 పేజీలు 16-20

పైఅధికారుల పాత్ర

నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. . . . నీవు చెడ్డది చేసినయెడల భయపడుము.”—రోమీయులు 13:4.

1, 2. క్రీస్తుమత సామ్రాజ్యములోని అనేకులు ఎట్లు విప్లవ కార్యకలాపములలో చేరియున్నవారైరి?

రెండు సంవత్సరముల క్రితము బిషప్పుల సమావేశమొకటి న్యూయార్కు పోస్ట్‌ నందు ఆగ్రహపూరితమైన సంపాదకీయము వ్రాయుటకు రెచ్చగొట్టినది. ఆ సమావేశము లామ్‌బెత్‌లో జరుగగా. దానికి ఆంగ్లికన్‌ సమాజపు బిషప్పులు దాదాపు 500 మంది హాజరైరి. వారు “సమస్త విషయములను పరీక్షించి చివరకు, న్యాయము కొరకు సాయుధ పోరాటము మాత్రమే” ప్రజలు “ఎంపిక చేసుకొనవలసిన ఏకైక మార్గమని” వ్యక్తపరచుటద్వారా ఈ ఆగ్రహమునకు చిచ్చురగిల్చినట్లయినది.

2 పోస్ట్‌ బలవత్తరముగా, ఇది ఉగ్రవాదమును ఆమోదించినదని చెప్పినది. అయితే, బిషప్పులు కేవలము పెరుగుచున్న వైఖరిని మాత్రమే అనుసరించుచుండిరి. వారి దృక్పధము ఆఫ్రికాను విడిపించుటకు వేగమైన, నిశ్చయమైన మరియు సురక్షితమైన మార్గముగా గెరిల్ల పోరాటమును సిఫారసు చేసిన ఘానాలోని ఆ కాథోలిక్కు మతాధికారినుండి; లేక “అనుకున్నది సాధించేవరకు విడుదల కొరకు పోరాడవలెనని” ప్రతినబూనిన ఆఫ్రికా మెథడిస్టు బిషప్పునుండి; లేక ఆసియా మరియు దక్షిణ అమెరికాలోని స్థిరమైన ప్రభుత్వములకు వ్యతిరేకముగా తిరుగుబాటుదారులతో కలిసి పోరాడిన క్రీస్తుమతసామ్రాజ్య మిషనరీలనుండి ఏమాత్రము భిన్నముగాలేదు.

నిజమైన క్రైస్తవులు ‘అధికారమును ఎదిరించరు’

3, 4. (ఎ) విప్లవమును ప్రోత్సహించు నామకార్థ క్రైస్తవులద్వారా ఏ సూత్రములు ఉల్లంఘింపబడుచున్నవి? (బి) యెహోవా సాక్షులనుగూర్చి ఒకవ్యక్తి ఏమి కనుగొనెను?

3 మొదటి శతాబ్దములో, యేసు తన అనుచరులనుగూర్చి ఇట్లుచెప్పెను: “నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు.” (యోహాను 17:14) విప్లవమును ప్రోత్సహించు ఏ క్రైస్తవుడైనను బహుగా ఈ లోక సంబంధియైయున్నాడు. అతడు క్రీస్తు అనుచరుడు కాదు; లేక అతడు “పైఅధికారులకు లోబడియుండు” వాడు కాడు. (రోమీయులు 13:1) “అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు; ఎదిరించువారు తమమీదికి తామే శిక్షను తెచ్చుకొందురని” పౌలు చేసిన హెచ్చరికను లక్ష్యపెట్టుట అతనికి మేలుకరము.—రోమీయులు 13:2.

4 క్రీస్తుమత సామ్రాజ్యమందలి అనేకులకు భిన్నముగా, యెహోవా సాక్షులు సాయుధ హింసతో ఎటువంటి సంబంధమును కలిగిలేరు. ఐరోపాలోని ఒకవ్యక్తి దీనిని కనుగొనెను. ఆయనిట్లు వ్రాయుచున్నాడు: “రాజకీయము మరియు మతము ఉత్పన్నము చేసినదానిని చూసిన మీదట, స్థిరపరచబడిన సామాజిక క్రమమును కూలదోయుటకు అంకితమైన వ్యక్తిగా నేను తయారయితిని. నేనొక ఉగ్రవాద గుంపులోచేరి అన్నిరకముల ఆయుధములు ఉపయోగించుటకు శిక్షణ పొందితిని; నేను అనేక సాయుధ దోపిడీలలో పాల్గొంటిని. నా జీవితము ప్రతిక్షణము అపాయములో ఉండెను. కాలము గడచుకొలది మేము చివరకు ఓడిపోవు పోరాటమును పోరాడుచుంటిమను విషయము స్పష్టమాయెను. నేను నిరాశనిస్పృహలకు లోనై, జీవితములో ఎలాంటి నిరీక్షణ లేనివాడనైతిని. ఆ సమయములో సాక్షి ఒకరు నా ఇంటి తలుపు తట్టినది. ఆమె నాతో దేవుని రాజ్యమునుగూర్చి తెలియజేయగా, ఇది కేవలము సమయమును వృధా చేయుట మాత్రమేయని, నా భార్య ఇలాంటి విషయములు వినునని చెప్పితిని. అలా తను నా భార్యతో గృహబైబిలు పఠనమును ప్రారంభించెను. చివరకు నేనుకూడ పఠనమునకు హాజరగుటకు అంగీకరించితిని. మానవజాతిని చెడుచేయుటకు ఇంతబలముగా నడిపించుచున్న శక్తి ఏమిటో అర్థము చేసుకొనిన పిదప నాకు కలిగిన ఉపశమనం మాటలకందనిది. అద్భుతకరమైన రాజ్య వాగ్దానము నాకు జీవితములో సజీవమైన నిరీక్షణను, సంకల్పమును ఇచ్చెను.”

5. క్రైస్తవులు ఎందుకు పైఅధికారులకు సమాధానపూర్వకముగా లోబడియుందురు, ఇలా ఎప్పటివరకు?

5 క్రైస్తవులు దేవునికి మరియు క్రీస్తుకు రాయబారులు లేక దూతలైయున్నారు. (యెషయా 61:1, 2; 2 కొరింథీయులు 5:20; ఎఫెసీయులు 6:19, 20) కావున, వారు ఈలోక వివాదముల విషయములో తటస్థముగా నిలిచియుందురు. కొన్ని రాజకీయ విధానములు వేరేవాటికంటే ఆర్ధికముగా ఎక్కువ విజయవంతముగా, మరియు ఎక్కువ స్వాతంత్ర్యమును అనుమతించునట్లు కన్పించినను, క్రైస్తవులు ఒక విధానమును మరొకదానికంటె గొప్పదని లేక ఉన్నతమని హెచ్చించిచెప్పరు. ప్రతి విధానము అసంపూర్ణమని వారికి తెలుసు. ఆయన రాజ్యము వచ్చు పర్యంతము, ఇవి ఉనికిలో కొనసాగుట “దేవుని నియమమై” యున్నది. (దానియేలు 2:44) కాబట్టి, క్రైస్తవులు రాజ్యసువార్తను ప్రకటించుటద్వారా ఇతరుల నిత్య సంక్షేమమును ప్రోత్సహించుచు, పైఅధికారులకు సమాధానపూర్వకముగా లోబడియుందురు.—మత్తయి 24:14; 1 పేతురు 3:11, 12.

శాసనమునకు లోబడుట

6. “లోకమంతయు దుష్టునియందున్నను,” మానవ శాసనములు అనేకము ఎందుకు మేలుకరమై యున్నవి?

6 జాతీయ ప్రభుత్వములు ఎన్నో శాసనములు చేయును, వీటిలో అధికశాతము మేలైనవి. “లోకమంతయు దుష్టునియందున్నదను” వాస్తవము దృష్ట్యా, ఇది మనలను ఆశ్చర్యపరచవలెనా? (1 యోహాను 5:19) లేదు. యెహోవా మన ఆది తండ్రియైన ఆదాముకు మనస్సాక్షినిచ్చెను, కాగా మంచిచెడులను వివేచించు ఈ అంతరంగ స్వభావము మానవ నియమములలో అనేక విధములుగా ప్రతిబింబించినది. (రోమీయులు 2:13-16) ప్రాచీన బబులోను శాసనకర్తయైన హమ్మురబి, తన శాసనస్మృతి పీఠికలో ఇట్లుచెప్పెను: “ఆ సమయములో హమ్మురబి అను నేను, ప్రజల సంక్షేమమును ఉన్నతిచేయువాడని, అంకితమైనవాడని, దైవభక్తిగల యువరాజని, దేశములో న్యాయము జరుగునట్లు చేయువాడని, దుష్టత్వమును చెడును నాశనము చేయువాడని, బలశాలి బలహీనులను అణగద్రొక్కనివాడని నాకు [వారు] పేరుపెట్టిరి.”

7. ఎవరైనను శాసనమును ఉల్లంఘించినట్లయిన, శిక్షించు హక్కు ఎవరికి కలదు, ఎందుకు?

7 అనేక ప్రభుత్వములు వారి శాసనముల ఉద్దేశ్యముకూడా, పౌరుల సంక్షేమమును, సమాజములో మంచి క్రమమును ఉన్నతిచేయుటకే అని అందురు. కాబట్టి, వారు హత్య, దొంగతనము వంటి సంఘవ్యతిరేక చర్యలను శిక్షార్షమైనవి చేయుచు, వేగనిరోధము మరియు వాహనములను నిలుపుటవంటి విషయములలో నియమములను పెట్టుదురు. వారి శాసనములను ఉద్దేశ్యపూర్వకముగా ఉల్లంఘించువారు అధికారమునకు వ్యతిరేకముగా నిలిచినవారై, “తమమీదికి తామే శిక్ష (తీర్పు) తెచ్చుకొందురు.” తీర్పు ఎవరినుండి? దేవునినుండి కాదు. ఇక్కడ తీర్పు అని తర్జుమాచేయబడిన గ్రీకు పదము యెహోవానుండి వచ్చు తీర్పులకు బదులు పౌరవిధానమును సూచించగలదు. (1 కొరింథీయులు 6:7 పోల్చుము.) శాసనమునకు వ్యతిరేకముగా ఎవరు ప్రవర్తించినను, శిక్షించు అధికారమును పైఅధికారులు కలిగియున్నారు.

8. ఒక గంభీరమైన నేరమును సంఘ సభ్యుడొకరు చేసినట్లయిన సంఘమెట్లు ప్రతిస్పందించును?

8 యెహోవా సాక్షులు మానవ అధికారులను ఎదిరించరను మంచిపేరు కలిగియున్నారు. సంఘమందలి ఏ వ్యక్తియైనను నియమమును ఉల్లంఘించుటవలన, అతనిమీదికి శాసనము ప్రకారమువచ్చు శిక్షను తప్పించుకొనుటకు సంఘము ఎటువంటి సహాయము చేయదు. ఎవరైనను దొంగతనము, హత్య, అపఖ్యాతి కలిగించుట, పన్నులు చెల్లించుటలో మోసముచేయుట, అత్యాచారము, మోసము, చట్టరహితమైన మాదక ద్రవ్యములను ఉపయోగించుట, లేక ఇతరత్రా శాసన అధికారమును ఏ విధముగా ఎదిరించినను, అతనిమీద సంఘము కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకొనును—కాగా అతడు లౌకిక అధికారులద్వారా శిక్షింపబడినప్పుడు తాను హింసింపబడుచున్నానని తలంచకూడదు.—1 కొరింథీయులు 5:12, 13; 1 పేతురు 2:13-17, 20.

భయపడుటకు కారణముగా యున్నారు

9. అక్రమ శక్తులు బెదిరించినప్పుడు క్రైస్తవులు సరియైన రీతిలో ఏ ఆశ్రయమును కలిగియున్నారు?

9 పౌలు పైఅధికారులనుగూర్చిన చర్చను ఇంకను కొనసాగించుచు ఇట్లనుచున్నాడు: “ప్రభుత్వము చేయువారు చెడ్డకార్యములకేగాని మంచి కార్యములకు భయంకరులు కారు; . . . వారికి భయపడక ఉండకోరితివా, మేలుచేయుము, అప్పుడు వారిచేత మెప్పుపొందుదువు.” (రోమీయులు 13:3) అధికారులనుండి శిక్ష వచ్చునని యథార్థమైన క్రైస్తవులు కాదుగాని, ‘చెడుకార్యములు’ నేరక్రియలు జరిగించు తప్పిదస్థులు భయపడుదురు. అటువంటి అక్రమ శక్తులు బెదిరించినప్పుడు, యెహోవా సాక్షులు సరియైన రీతిలో పోలీసు లేక సైనిక కాపుదలను అంగీకరింతురు.—అపొ.కార్యములు 23:12-22.

10. అధికారులనుండి యెహోవా సాక్షులు ఎట్లు ‘మెప్పుపొందియున్నారు’?

10 పైఅధికారుల శాసనమునకు లోబడు క్రైస్తవునికి, పౌలు చెప్పునదేమనగా, “[నీవు] వారిచేత మెప్పుపొందుదువు.” దీనికి ఉదాహరణగా, బ్రెజిల్‌లో యెహోవా సాక్షుల జిల్ల సమావేశముల తర్వాత వారికివచ్చిన కొన్నిలేఖలను విచారించుము. పురపాలక క్రీడా శాఖ అధ్యక్షునినుండి: “మీ సమాధానకరమైన ప్రవర్తన ఎంతగానో కొనయాడదగినది. ఈనాటి కలతనిండిన లోకములో అనేకులు ఇంకను దేవునియందు నమ్మికయుంచి ఆయనను ఆరాధించుచున్నారని తెలుసుకొనుట ఎంతో ఓదార్పుకరము.” పురపాలక క్రీడాస్థల సంచాలకునినుండి: “పెద్దఎత్తున ప్రజలు హజరైనను, సమావేశమును పాడుచేయు సంఘటన ఒక్కటికూడ జరగలేదు, లోపరహిత సంస్థకు ధన్యవాదములు.” నగరపాలకుని కార్యాలయమునుండి: “ఈ అవకాశమును పురస్కరించుకొని మీ క్రమమునకు, అద్భుతకరమైన, స్వతహసిద్ధమైన క్రమశిక్షణ విషయమై శుభాకాంక్షలు, మరియు మీ భవిష్యత్‌ సమావేశములలో సహితము మీకు ప్రతి విషయములోను విజయము చేకూరవలెనని మేము అభిలషించుచున్నాము.”

11. సువార్త ప్రకటించు పని ఏ విధముగాకూడ చెడ్డపనియని చెప్పుటకు వీలులేదు?

11 “మంచి కార్యము” అని చెప్పబడిన మాట పైఅధికారుల శాసనములకు విధేయతతోచేయు పనులైయున్నవి. అంతేకాకుండ, ఏ మానవుడు కాదుగాని, దేవుడు మనకు ఆజ్ఞాపించిన ప్రకటించు పని చెడుకార్యము కాదు—ఇది రాజకీయ అధికారులు గుర్తించవలసిన అంశము. ప్రతిస్పందించు వారిలో అది నైతిక సామర్థ్యమును పెంపొందించు ప్రజా సేవయైయున్నది. కాబట్టి, ఇతరులకు ప్రకటించు మన హక్కును పైఅధికారులు కాపాడుదురని మనమాశిద్దాము. సువార్త ప్రకటించుటను చట్టబద్ధముగా స్థిరపరచుటకు పౌలు అధికారులకు విన్నపము చేసెను. (అపొ.కార్యములు 16:35-40; 25:8-12; ఫిలిప్పీయులు 1:7) ఇటీవల కాలములో, యెహోవా సాక్షులుకూడ అదేప్రకారముచేసి, తూర్పు జర్మని, హంగేరీ, పోలెండు, రుమేనియా, బెనిన్‌, మ్యాన్‌మార్‌ (బర్మా)లలో తమ పనికి చట్టబద్ధమైన గుర్తింపును పొందిరి.

“దేవుని పరిచారకులు”

12-14. (ఎ) బైబిలు కాలములలో (బి) ఆధునిక కాలములలో, పైఅధికారులు ఎట్లు దేవుని పరిచారకులుగా పనిచేసిరి?

12 లౌకిక అధికారమునుగూర్చి పౌలు ఇంకను మాట్లాడుచు, “నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు; . . . నీవు చెడ్డది చేసినయెడల భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు; కీడుచేయువానిమీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతికారముచేయు దేవుని పరిచారకులని” చెప్పెను.—రోమీయులు 13:4.

13 కొన్ని ప్రత్యేక విధానములలో జాతీయ అధికారులు కొన్నిసార్లు దేవుని పరిచారకులుగా పనిచేసిరి. బబులోనునుండి తిరిగివచ్చి దేవుని మందిరమును తిరిగి కట్టవలెనని, కోరెషు యూదులను పిలిచినప్పుడు, ఆయన అట్లు చేసెను. (ఎజ్రా 1:1-4; యెషయా 44:28) మందిరమును తిరిగి నిర్మించుటకు కానుకలిచ్చి ఎజ్రాను పంపినప్పుడు, ఆ తర్వాత యెరూషలేము ప్రాకారములను తిరిగి కట్టుటకు నెహెమ్యాను ఆజ్ఞాపించినప్పుడు అర్తహషస్త దేవుని పరిచారకునిగా పనిచేసెను. (ఎజ్రా 7:11-26; 8:25-30; నెహెమ్యా 2:1-8) పౌలును ఒకగుంపు దాడినుండి విడిపించినప్పుడు, ఓడ బ్రద్దలైనప్పుడు ఆయనను రక్షించినప్పుడు, రోమాలో ఆయన ఒక స్వంతగృహము కలిగియుండుటకు ఏర్పాటుచేసినప్పుడు, అదేవిధముగా రోమా పైఅధికారులును పరిచారకులుగా పనిచేసిరి.—అపొ.కార్యములు 21:31, 32; 28:7-10, 30, 31.

14 అదేవిధముగా, ఆధునిక కాలములలో సహితము లౌకిక అధికారులు దేవుని పరిచారకులుగా పనిచేసిరి. 1959లో, ఉదాహరణకు, కెనడా సర్వోన్నత న్యాయస్థానము, విద్రోహకరమైన మానహానికరమైన విషయములను యెహోవా సాక్షులలో ఒకరు క్యుబక్‌లో ప్రకటించుచున్నాడను ఆరోపణ విషయములో ఆయన నిర్దొషియని చెప్పుచు—ఆ విధముగా అప్పటి క్యుబెక్‌ ప్రధానమంత్రియగు మోరిస్‌ డ్యూప్లిసిస్‌ దురభిమానముకు వ్యతిరేకముగా తీర్పునిచ్చినది.

15. ఏ సాధారణరీతిలో అధికారులు దేవుని పరిచారకులుగా పనిచేయుదురు, మరియు ఇది వారికి ఏ హక్కునిచ్చుచున్నది?

15 అంతేకాకుండ, సాధారణ రీతిలో, దేవుని రాజ్యము బాధ్యత తీసుకొను పర్యంతము జాతీయ ప్రభుత్వములు సమాజ క్రమమును కాపాడుటలో దేవుని పరిచారకులుగా పనిచేయును. దీనిని చేయుటలో పౌలు ప్రకారము, శిక్షవిధించు తమ హక్కుకు సూచనగా అధికారులు “ఖడ్గము ధరింతురు.” సాధారణముగా, దీనియందు చెరసాలలో వేయుట లేక జరిమానా విధించుట ఇమిడియున్నది. కొన్ని దేశములలో దీనియందు మరణదండన విధించుటకూడ చేరియున్నది.a మరొక వైపున, అనేక దేశములు మరణదండన విధించకూడదని తీర్మానించుకొనియున్నవి, కాగా అది కూడ వారి హక్కుయైయున్నది.

16. (ఎ) అధికారులు దేవుని పరిచారకులు గనుక దేవుని సేవకులు కొంతమంది ఏమిచేయుట సరియని తలంచిరి? (బి) ఎటువంటి ఉద్యోగమును ఒక క్రైస్తవుడు అంగీకరించడు, మరియు ఎందుకు చేయడు?

16 లౌకిక అధికారములు దేవుని పరిచారకులను వాస్తవము, దానియేలు, ముగ్గురు హెబ్రీయులు, నెహెమ్యా, మొర్దెకై వీరు బబులోను మరియు పారసీక ప్రభుత్వములలో ఎందుకు బాధ్యతాయుతమైన స్థానములను అంగీకరించిరో వివరించుచున్నది. ఆ విధముగా వారు దేవుని ప్రజల మేలుకొరకు ప్రభుత్వాధికారులకు విన్నపములు చేయగలిగిరి. (నెహెమ్యా 1:11; ఎస్తేరు 10:3; దానియేలు 2:48, 49; 6:1, 2) ఈనాడుకూడ కొంతమంది క్రైస్తవులు, ప్రభుత్వ ఉద్యోగములు చేయుచున్నారు. అయితే వారు లోకమునుండి వేరుగాయుందురు గనుక, వారు రాజకీయ వర్గములలో చేరరు, రాజకీయ పదవులు చేపట్టరు, లేక రాజకీయ సంస్థలలో విధాననిర్ణయములుచేయు స్థానములను అంగీకరించరు.

విశ్వాసము అవసరము

17. క్రైస్తవులు కాని వారిని ఏ పరిస్థితులు అధికారమును ఎదిరించుటకు రెచ్చగొట్టును?

17 సరే, అధికారము అవినీతిని లేక అణచివేతను సహించినట్లయిన అప్పుడు సంగతియేమి? అప్పుడు క్రైస్తవుడు దీనిని తొలగించి మంచిదనుకున్న దానిని అధికారమునకు తీసుకు రావలెనా? ప్రభుత్వముల అన్యాయము, అవినీతి క్రొత్తసంగతులేమి కాదు. మొదటి శతాబ్దములో, రోమా సామ్రాజ్యము దాసత్వమువంటి అన్యాయములను ఆమోదించినది. అది అవినీతి పరులైన అధికారులను సహితము సహించినది. మోసము చేసిన సుంకరులనుగూర్చి, అన్యాయస్థుడైన ఒక న్యాయాధిపతినిగూర్చి, లంచము కొరకు ఎదురుచూసిన ఒక రాష్ట్ర అధిపతినిగూర్చి బైబిలు మాట్లాడుచున్నది.—లూకా 3:12, 13; 18:2-5; అపొ.కార్యములు 24:26, 27.

18, 19. (ఎ) ప్రభుత్వ అధికారుల పక్షముగా దుర్వినియోగము లేక అవినీతి ఉన్నట్లయిన క్రైస్తవులెట్లు ప్రతిస్పందింతురు? (బి) ఒక చరిత్రకారుడు మరియు క్రింది బాక్సు సూచించిన విధముగా, కొంతమంది వ్యక్తుల జీవితములను క్రైస్తవులెట్లు అభివృద్ధిపరచిరి?

18 క్రైస్తవులు అప్పుడే అటువంటి దుర్వినియోగములను అంతమొందించుటకు ప్రయత్నించియుండేవారే, అయితే వారట్లు చేయలేదు. ఉదాహరణకు, పౌలు దాసత్వము నశించవలెనని ప్రకటించలేదు, మరియు ఆయన తమయొద్ద దాసులుగాయున్న వారిని విడుదల చేయుమని క్రైస్తవులకు చెప్పలేదు. బదులుగా, ఆయన దాసులను, దాసుల యజమానులను ఒకరితో ఒకరు వ్యవహరించుకొనుటలో కృపజూపుమని సలహానిచ్చెను. (1 కొరింథీయులు 7:20-24; ఎఫెసీయులు 6:1-9; ఫిలేమోను 10-16; 1 పేతురు 2:18 కూడ చూడుము.) అదే ప్రకారము, క్రైస్తవులు విప్లవ కార్యకలాపములలో పాల్గొనలేదు. వారు “సమాధానకరమైన సువార్తను” ప్రకటించుటలో పనిరద్దీని కలిగియుండిరి. (అపొ.కార్యములు 10:36) సా.శ. 66లో రోమా సైన్యము యెరూషలేమును ముట్టడివేసి ఆ పిమ్మట విరమించుకొనెను. పట్టణములోని తిరుగుబాటుదారులతో అక్కడే నిలిచియుండుటకు బదులు, హెబ్రీ క్రైస్తవులు యేసు నడిపింపుకు లోబడి ‘కొండలకు పారిపోయిరి.’—లూకా 21:20, 21.

19 తొలి క్రైస్తవులు ఉన్న పరిస్థితులలోనే జీవించిరి మరియు వారు బైబిలు సూత్రములను అనుసరించుటకు ఇతరులకు సహాయము చేయుటద్వారా ఆయా వ్యక్తుల జీవితములను అభివృద్ధి పరచుటకు ప్రయత్నించిరి. చరిత్రకారుడైన జాన్‌ లార్డ్‌ తన పుస్తకమగు ది ఓల్డ్‌ రోమన్‌ వరల్డ్‌ నందు ఇట్లువ్రాసెను: “బయటకు జనసమ్మతమైన సంస్థలను, లేక ప్రభుత్వములను, లేక నియమములను మార్చుటకు బదులు, నిజమైన క్రైస్తవత్వ సిద్ధాంతములను నమ్ముచున్నామని చెప్పుకొను మంచివ్యక్తులను తయారుచేయుటయందు దాని నిజమైన విజయమును చూడవచ్చును.” ఈనాడు క్రైస్తవులు ఏ విధముగానైనను భిన్నముగా ప్రవర్తింపవలెనా?

ప్రభుత్వము సహాయము చేయనప్పుడు

20, 21. (ఎ) మేలు విషయమై ఒకానొక లౌకిక అధికారము దేవుని పరిచారకునిగా పనిచేయుటలో ఎట్లు విఫలమైనది? (బి) హింసింపబడినప్పుడు ఆ చెడుపనిలో పాలుపంచుకొన్న ప్రభుత్వముతో యెహోవా సాక్షులు ఎట్లు ప్రతిస్పందింతురు?

20 ఒకానొక మధ్య ఆఫ్రికా దేశమందు యెహోవా సాక్షులకు వ్యతిరేకముగా 1972లో బహుకౄరమైన హింస చెలరేగెను. వేలాదిమంది దోపిడికి గురియైరి, కొట్టుట, హింసించుట, హత్యలతోపాటు, వారికున్న సమస్తము దోచుకొనబడెను. సాక్షులను కాపాడుటలో పైఅధికారులు తమ విధిని నెరవేర్చిరా? లేదు! బదులుగా, వారు హింసను ప్రోత్సహించుచు, ఈ నిరపాయకరమైన క్రైస్తవులను భద్రతకొరకు పొరుగు దేశములకు పారిపోవుటకు వారిని వత్తిడిచేసిరి.

21 అటువంటి హింసకులకు వ్యతిరేకముగా యెహోవా సాక్షులు కోపముతో ఎదురు తిరగవద్దా? లేదు. క్రైస్తవులు వినయముతో యేసును అనుకరించుచు, ఓపికతో అటువంటి అవమానములను సహించవలెను: “ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పుతీర్చు దేవునికి తన్నుతాను అప్పగించుకొనెను.” (1 పేతురు 2:23) గెత్సేమను తోటలో యేసు బంధింపబడినప్పుడు, ఆయన ఖడ్గముతో తనను రక్షింపవచ్చిన శిష్యుని గద్దించిన విషయమును, ఆ తర్వాత పొంతిపిలాతుతో, “నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు; నా రాజ్యము ఈ లోకసంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురుగాని నా రాజ్యము ఇహసంబంధమైనది కాదని” చెప్పిన విషయమును వారు గుర్తుతెచ్చుకొందురు.—యోహాను 18:36; మత్తయి 26:52; లూకా 22:50, 51.

22. తీవ్ర హింస ఎదుర్కొనినప్పుడు ఒక ఆఫ్రికా దేశములోని సాక్షులు ఎటువంటి శ్రేష్ఠమైన మాదిరినుంచిరి?

22 యేసు మాదిరిని మనస్సునందుంచుకొని, ఆ ఆఫ్రికా సాక్షులు పౌలు సలహాను అనుసరించు ధైర్యమును కలిగియుండిరి: “కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు; మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటినిగూర్చి ఆలోచన కలిగియుండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి ‘పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని యెహోవా చెప్పుచున్నాడు.” (రోమీయులు 12:17-19 NW; హెబ్రీయులు 10:32-34 పోల్చుము.) మనందరికి ఈనాడు మన ఆఫ్రికా సహోదరులు ఎంతగా ప్రేరేపించు మాదిరియై యున్నారు! గౌరవపూర్వకముగా అధికారులు ప్రవర్తించుటకు నిరాకరించినను, నిజమైన క్రైస్తవులు బైబిలు సూత్రములను విడిచిపెట్టరు.

23. చర్చించుటకు ఇంకా ఏ ప్రశ్నలు మిగిలియున్నవి?

23 మరి, పైఅధికారులు క్రైస్తవులనుండి ఏమి అపేక్షించగలరు? వారు సరియైన విధముగా అడుగగల విషయములకు పరిమితులు ఏమైనా ఉన్నాయా? ఈ విషయములు తర్వాతి శీర్షికలో చర్చించబడును. (w90 11/1)

[అధస్సూచీలు]

a ప్రాచీన ఇశ్రాయేలీయులకిచ్చిన ధర్మశాస్త్రములో ఘోరమైన నేరములకు మరణశిక్ష విధించుట చేరియుండెను.—నిర్గమకాండము 31:14; లేవీయకాండము 18:29; 20:2-6; సంఖ్యాకాండము 35:30.

మీరు వివరించగలరా?

◻ ఒకడు పైఅధికారులకు ‘వ్యతిరేకముగా నిలువబడగల’ కొన్ని విధానములు ఏమైయున్నవి?

◻ ప్రభుత్వ అధికారము సంబంధముగా “దేవుని ఏర్పాటు” ఏమైయున్నది?

◻ ఏ విధముగా అధికారులు ‘భయపడుటకు కారణమైయున్నారు’?

◻ మానవ ప్రభుత్వములు ఎట్లు “దేవుని పరిచారకులుగా” పనిచేయుదురు?

[19వ పేజీలోని బాక్సు]

పోలీసు ముఖ్యాధికారినుండి ఒక ఉత్తరము

“పబ్లిక్‌ సర్వీస్‌ ఫర్‌ది స్టేట్‌ మైనాస్‌ జెరియస్‌” అను అధికారిక చిహ్నముగల ఒక ఉత్తరము, బ్రెజిల్‌లోని వాచ్‌టవర్‌ సొసైటి బ్రాంచి కార్యాలయమునకు వచ్చినది. కాంక్వెస్ట పట్టణ పోలీసు ముఖ్యాధికారినుండి అది వచ్చినది. ఏదైనా తప్పిదము జరిగినదా? ఆ ఉత్తరాన్నే తెలియజేయనివ్వండి. అది ఇట్లు తెల్పినది:

“డియర్‌ సర్‌:

“ఈ ఉత్తరముద్వారా నన్ను నేను పరిచయము చేసుకొనుటకు సంతోషించుచున్నాను. నేను, దాదాపు మూడు సంవత్సరములనుండి, మైనాస్‌ జెరియస్‌, కాంక్వెస్ట పట్టణములో పోలీసు ముఖ్యాధికారిగా యున్నాను. పనిలో, నేను అన్ని సమయములలో అప్రమత్తంగా ఉండుటకు ప్రయత్నిస్తాను, అయితే జైలులో నెమ్మదిని కాపాడుటలో నాకు సమస్యలుండేవి. జైలులో ఉన్నవారు, కొన్ని వృత్తులలో శిక్షణ ఇవ్వబడినను, వారు అశాంతిగా యుండేవారు.

“కొన్నినెలల ముందు, సెన్‌హర్‌ ఒ____________ మా పట్టణమునకు వచ్చి తననుతాను ఒక యెహోవా సాక్షిగా పరిచయము చేసుకొనెను. అతడు వారిలో కొంతమంది ఖైదీలకు బైబిలు ప్రకటించుటకు ఆరంభించి, వారికి చదువను వ్రాయను నేర్పించుచు, పరిశుభ్రతనుగూర్చి, సామాజిక నైపుణ్యతలనుగూర్చి ప్రాథమిక విషయములను చూపించుచు, ఆలాగే పరిశుద్ధ బైబిలునుగూర్చి వారికి చెప్పెను. ఈ ప్రచారకుడు పనిచేసిన తీరు అంకిత భావమును, ప్రేమను, స్వయం-త్యాగమును చూపించెను. చూసేవారు ఆశ్చర్యపడి మెచ్చుకొనదగినంతగా, చెరసాలలోయున్న వారి ప్రవర్తన, త్వరలోనే గమనించదగినంత మంచిగా మారిపోయినది.

“మా జైలులో జరిగినదాని దృష్ట్యా, మన సమాజములో ఒక విలువగల ప్రచారకునిచే జరిగింపబడిన శ్రేష్ఠమైన పని విషయమై నేను అధికారికముగా మా మెప్పును వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్టు సొసైటికి తెలియజేయవలెనని అభిలషించుచున్నాను.”

ప్రభుత్వ అధికారములను గూర్చి, అపొస్తలుడైన పౌలు ఇట్లుచెప్పెను: “మేలుచేయుము, అప్పుడు వారిచేత మెప్పుపొందుదువు.” (రోమీయులు 13:3) ఇది పై సంఘటనలో నిశ్చయముగా వాస్తవమై యున్నది. కొన్ని సంవత్సరములలో శిక్షావిధానము చేయలేని దానిని సువార్త కొన్నినెలలలోనే నెరవేర్చుట దేవుని వాక్యముయొక్క మార్చుశక్తికి ఎంత చక్కని సాక్ష్యము!—కీర్తన 19:7-9.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి