కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 2/1 పేజీ 29
  • పాఠకుల ప్రశ్నలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠకుల ప్రశ్నలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఇలాంటి మరితర సమాచారం
  • రక్తముతో జీవమును రక్షించుకొనుట—ఎట్లు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • రక్తము—జీవాధారము
    రక్తము నీ జీవమును ఎట్లు కాపాడగలదు?
  • మీ జీవవరాన్ని అత్యంత విలువైనదిగా పరిగణించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 2/1 పేజీ 29

పాఠకుల ప్రశ్నలు

వార్తా నివేదికల ప్రకారం, బిడ్డ జన్మించిన తర్వాత, జరాయువు మరియు నాభీనాళంలోని రక్తం నుండి కొన్ని పదార్థాలను తీసుకునేందుకు కొన్ని ఆసుపత్రులు వాటిని దాచుకుంటాయి. ఇది క్రైస్తవులకు కలత కలిగించే విషయమా?

అనేక ప్రాంతాల్లో, అలాంటివి అసలు జరుగవు, కాబట్టి క్రైస్తవులు కలత చెందనవసరం లేదు. ఒక క్రైస్తవురాలు ప్రసవించబోయే ఆసుపత్రిలో అలాంటి సంగతులు జరుగుతున్నాయని నమ్మేందుకు కచ్చితమైన కారణం ఉంటే, జరాయువును నాభీనాళాన్ని పడేయాలని దాన్ని ఏ విధంగా కూడా ఉపయోగించకూడదని వైద్యునికి తెలియజేయడం మంచిది.

మానవ లేక జంతు అవయవాలైన జీవ శాస్త్రీయ మూలాల నుండి వేర్వేరు వైద్య ఉత్పత్తులు తీసుకోబడ్డాయి. ఉదాహరణకు, గర్భం ధరించి ఉన్న గుర్రాల యొక్క మూత్రం నుండి కొన్ని హార్మోన్‌లను తీసుకోవడం జరిగింది. గుర్రం రక్తము నుండి టెటనస్‌ సెర్రం తీసుకోబడుతుంది మరియు వ్యాధులకు విరుద్ధంగా పోరాడేందుకు గామా గ్లోబ్యులిన్‌ మానవ జరాయువుల (జననం తర్వాత) నుండి తీసుకోబడుతుంది. కొన్ని ఆసుపత్రులు జరాయువులను తీసుకుని వాటిని శీతలీకరిస్తాయి, ప్రతిరక్షకాలు ఎక్కువగా ఉన్న రక్తం నుండి గామా గ్లోబ్యులిన్‌ను తీసుకునేందుకు దానిని ప్రక్రియలకు గురి చేయగలిగేలా తర్వాత మందుల తయారీ లాబొరేటరీ వాటిని సేకరిస్తుంది.

ఇటీవలనే, ఒక విధమైన లుకేమియాను నయం చేసేందుకు జననం తర్వాత సేకరించిన రక్తాన్ని ఉపయోగించి పరిశోధకులు విజయాన్ని సాధించామని చెబుతున్నారు, అలాంటి రక్తాన్ని వ్యాధి నిరోధక వ్యవస్థలో కలిగే అనారోగ్యాలను నయం చేసేందుకు లేక ఎముకల మూలుగును మార్చే చికిత్సలో కూడా ఉపయోగించవచ్చని అంచనా వేయబడింది. కాబట్టి తలిదండ్రులు, ప్రసవం తర్వాతి రక్తాన్ని తీసి, రాబోయే సంవత్సరాల్లో తమ బిడ్డ చికిత్సకు దాన్ని ఉపయోగించేందుకు దాన్ని శీతలీకరించి, భద్రపరిచి ఉంచారన్న వార్తలు కూడా చాలా మేరకు ప్రాచుర్యం పొందాయి.

జరాయువును అలా వ్యాపార అవసరాలకు ఉపయోగించుకోవడం దేవుని పరిపూర్ణ నియమం అనుసారంగా తమ ఆలోచనావిధానానికి నడిపింపునిచ్చే క్రైస్తవులను ఎంతమాత్రం శోధించదు. మన సృష్టికర్త రక్తాన్ని పవిత్రమైన దానిగా, దేవుడిచ్చిన జీవానికి ప్రాతినిధ్యం వహించేదిగా దృష్టిస్తాడు. రక్తం యొక్క ఆయన అంగీకరించిన ఏకైక ఉపయోగం బలుల విషయంలో బలిపీఠంపై మాత్రమే. (లేవీయకాండము 17:10-12; రోమీయులు 3:25; 5:8 పోల్చండి; ఎఫెసీయులు 1:7.) లేకపోతే, ఒక జీవి నుండి తీయబడిన రక్తాన్ని నేలపై ఒలికించాలి, పడేయాలి.—లేవీయకాండము 17:13; ద్వితీయోపదేశకాండము 12:15, 16.

క్రైస్తవులు ఒక జంతువును వేటాడినప్పుడు లేక ఇంట్లోని కోడిని లేక మేకను చంపినప్పుడు వారు రక్తాన్ని ఒలికించి, పడేస్తారు. వారు దాన్ని అక్షరార్థంగా నేలపై ఒలికించనవసరం లేదు, ఎందుకంటే ముఖ్యమైన విషయం వారు రక్తాన్ని మళ్లీ దేనికైనా ఉపయోగించే బదులు దాన్ని పడేయాలన్నదే.

ఆసుపత్రిలో చేర్చబడిన క్రైస్తవులు, తమ నుండి తీయబడిన భౌతిక ఉత్పాదకాలు అవి శరీర వ్యర్థ పదార్థాలైనా, రోగగ్రస్త కణజాలమైనా లేక రక్తమైనా అది పడవేయబడుతుందని అర్థం చేసుకుంటారు. మూత్ర పరీక్ష, కంతిగల కణజాలం యొక్క వైద్య పరీక్ష లేక రక్తపరీక్షల వంటి వాటిని ముందు చేయాలని ఒక వైద్యుడు నిర్ణయించుకోవచ్చు. అయితే, దాని తర్వాత ప్రాంతీయ చట్టాన్ననుసరించి, ఆ వస్తువులను పడేస్తారు. ఆ ఆసుపత్రిలో ఉండే రోగి ఆ విషయం గురించి ప్రత్యేక విజ్ఞప్తి చేయనవసరం లేదు, ఎందుకంటే అలాంటి వస్తువులను పడవేయడం సహేతుకం మరియు వైద్య పరంగా జ్ఞానయుక్తం కూడా. అయితే అలాంటి మామూలు అలవాటు ఇక్కడ ఉందో లేదో అనే విషయంలో రోగి సందేహించేందుకు సరైన కారణం ఉంటే, మతపరమైన కారణాలనుబట్టి అలాంటి వస్తువులను అన్నింటినీ పడవేయాలని తాను కోరుకుంటున్నానని అతను లేక ఆమె సంబంధిత వైద్యునితో చెప్పవచ్చు.

అయితే, ప్రస్తావించబడిన విధంగా, జననం తర్వాతి ఉత్పాదకాలను లేక ఇతర వాటిని దాచి ఉంచాలని మరియు తిరిగి ఉపయోగించాలని అనేక స్థలాల్లో అసలు ఆలోచించరు మరి దాన్ని క్రమంగా చేయటం అనేది పూర్తిగా జరగని విషయం గనుక ఒక మామూలు రోగి ఆ విషయాలను పట్టించుకోనవసరం లేదు.

జనవరి 1, 1997 “కావలికోట”లోని “చెడ్డ దానిని అసహ్యించుకుందాము” అనే శీర్షిక, శిశుకాముకతపై కేంద్రీకరించబడినట్లు అనిపిస్తుంది. ఈ అలవాటును ఎలా నిర్వచించాలి?

వెబ్‌స్టర్స్‌ నైంత్‌ న్యూ కాలేజియేట్‌ డిక్షనరీ “పెడోఫిలియా”ను “లైంగిక సంపర్కానికి పిల్లలను ఉపయోగించేందుకు ఎంచుకునే విపరీతమైన లైంగిక దుర్‌వ్యవహారమని” నిర్వచిస్తుంది. ఈ అలవాటు యొక్క అంశాలు ద్వితీయోపదేశకాండము 23:17, 18 నందు ఖండించబడ్డాయి. అక్కడ దేవుడు పురుషగామి (“లేక, ‘ఒక కాటమైట్‌,’ విపరీతమైన లైంగిక దుర్‌వ్యవహారం కొరకు ఉంచబడిన ఒక పిల్లవాడు” అధఃసూచి, NW) కాకూడదని చెప్పాడు. ఈ వచనాలు “కుక్క” (“బహుశ ఒక గుద్దభోగి; ప్రాముఖ్యంగా ఒక పిల్లవానితో గుద సంపర్కం చేసే వ్యక్తి,” అధఃసూచి, NW) విలువను “యెహోవా యింటికి” తీసుకురాకూడదు అని కూడా నిషేధిస్తున్నాయి. ఆ కావలికోట, ఒక పిల్లవాడు ఒక పురుషుని చేత లైంగిక దురాచారానికి గురికావడాన్ని గురించి మాట్లాడుతుందని అందులో సరసాలాడటం కూడా ఇమిడి ఉందని ఈ లేఖనాధార మరియు లౌకిక ఉదాహరణలు సూచిస్తున్నాయి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి