మనం కలలుగనాలి
మీరు కలలుగంటారా? నిద్రపోతున్నప్పుడు మనందరం కలలుగంటాం గనుక, కలలుగనమని ఒకవేళ మనం అనినప్పటికీ మీరు కలలుగంటారని నమ్మడం శ్రేయస్కరం. కలలన్నింటిలో 95 కంటే ఎక్కువ శాతాన్ని జ్ఞాపకముంచుకోవడం జరగదని అంచనా వేయబడింది. మీరు వేటిని జ్ఞాపకముంచుకుంటారు? వాస్తవానికి, సాధారణంగా మనం జ్ఞాపకముంచుకునేవి మనం మేల్కొనే ముందు వచ్చేవే.
నిద్ర మొదటి కొన్ని గంటల్లో గాఢంగా ఉండి తర్వాత క్రమేపి తగ్గే క్రమానుసారమైన ప్రక్రియ అని కలలను దర్యాప్తు చేసే వారు కనుగొన్నారు. ప్రాముఖ్యంగా కలలు వచ్చేది, రెమ్ నిద్ర అని పిలువబడే రాపిడ్ ఐ మూమెంట్ సమయాల్లో వస్తుంది. దీని తర్వాత నాన్-రెమ్ నిద్ర వస్తుంది. నాన్-రెమ్/రెమ్ నిద్ర యొక్క ప్రతి చక్రం దాదాపు 90 నిమిషాలు ఉంటుంది, మరి ఈ చక్రాలు రాత్రిలో ఐదు లేక ఆరుసార్లు పునరావృత్తమౌతాయి, వీటిలో చివరిది మనం నిద్ర లేవడానికి కాస్త ముందు జరుగుతుంది.
నిద్రలో మీ మెదడు తక్కువ క్రియాశీలంగా ఉంటుందని భావించడం ఒక పొరపాటు. మెదడు నరంలో అవధానం మరియు జ్ఞాపకానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక న్యూరాన్‌లు మినహా, మెలకువగా ఉండే కొన్ని స్థితుల్లో కంటే మెదడు కలల్లో ఎక్కువ క్రియావంతంగా ఉంటుందని కనుగొనబడింది. ఆ న్యూరాన్‌లు రెమ్ నిద్ర సమయంలో అలసట తీర్చుకుంటుండవచ్చు. అయితే సాధారణంగా మెదడులోని నర్వ్ సెల్‌లు ఎడతెగని ఇంటర్‌సెల్యులార్ కమ్యూనికేషన్‌ను కలిగి ఉంటాయి.
మన మెదడు ఎంతో సంక్లిష్టమైన శరీరావయవం, అందులో క్షణానికి దాదాపు ఒక వంద నుండి రెండు లేక మూడు వందల సంకేతాలను ఉత్పన్నం చేస్తున్న వందలాది కోట్ల ఎలిమెంట్లు ఉంటాయి. ఒక మానవ మెదడులో ఉండే ఎలిమెంట్లు, ఈ భూమిపైనున్న ప్రజలకంటే ఎక్కువ ఉంటాయి. అది 2,000 కోట్ల నుండి 5,000 కోట్ల ఎలిమెంట్లను కలిగివుంటుందని కొందరు పరిశోధకులు అంచనావేశారు. మానవ శరీరాన్ని గురించి బైబిలు రచయితైన దావీదు ఏమి వ్రాశాడో అది దాని సంక్లిష్టతను నొక్కి చెబుతుంది: “నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు.”—కీర్తన 139:14.
కలల ప్రపంచం
మనం మెలకువగా ఉండే సమయంలో, మన ఐదు జ్ఞానేంద్రియాలు మెదడుకు సమాచారాన్ని, ఆకారాలను ఎడతెగక పంపిణీ చేస్తుంటాయి, అయితే నిద్రిస్తున్నప్పుడు మాత్రం అలా చేయవు. బాహ్య జ్ఞానేంద్రియాల సహాయం లేకుండానే మెదడు తనలో తాను ఆకారాలను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి, కలల్లో మనం ఏమి చూస్తామో, వాటిలో మనం ఏ చర్యలను అనుభవిస్తామో అవి కొన్నిసార్లు భ్రాంతులవలే ఉంటాయి. సూపర్ మాన్‌లా ఎగరడం లేక ఒక కొండ శిఖరంపైనుండి పడి గాయాలేమి తగలకుండా ఉండటం వంటివైన, ప్రకృతి ధర్మాలకు విరుద్ధమైన వాటిని చేసేందుకు ఇది మనకు వీలు కలిగిస్తుంది. గతం వర్తమానంవలె అనిపించేలా సమయం మార్పు చెందవచ్చు. లేక మనం పారిపోయేందుకు ప్రయత్నిస్తుంటే, మనం మన కదలికలను అదుపు చేయలేకపోతున్నట్లు ఉంటుంది—మన కాళ్లు సహకరించడానికి అంగీకరించవు. మనం మెలకువగా ఉన్న సమయంలో మనకు కలిగిన బలీయమైన భావాలు మరియు అనుభవాలు మన కలలను తప్పక ప్రభావితం చేస్తాయి. యుద్ధంలోని భయంకరమైన దారుణకృత్యాలను అనుభవించిన అనేకులు వాటిని సులభంగా మర్చిపోలేరు, మరి కొందరు నేరస్థుని దాడికి గురైన భావాలను కూడా మర్చిపోలేరు. మనం మెలకువగా ఉన్నప్పుడు కలిగిన అలాంటి కలతపరిచే అనుభవాలు మన కలల్లో వచ్చి మనకు పీడకలలు వచ్చేలా చేస్తాయి. మనం నిద్రపోడానికి కాస్త ముందు మన మనస్సులో ఉన్న మామూలు విషయాలు మన కలల్లో రావచ్చు.
కొన్నిసార్లు మనం ఓ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, మనకు నిద్రలో పరిష్కారం తెలుస్తుంది. నిద్రంతటిలోనూ కలలు రావని ఇది చూపవచ్చు. అందులోని కొంతభాగంలో ఆలోచించడం కూడా ఉంటుంది.
కలలు మరియు మన మెదడును గురించిన ఒక పుస్తకం ఇలా పేర్కొంటుంది: “నిద్రలో సర్వసాధారణంగా జరిగే మానసిక క్రియ కలలుగనడం కాదుగానీ ఆలోచించడమే. నిద్రలో ఆలోచించడం ఇంద్రియాల భ్రమ ద్వారా రాదు అది విచిత్రంగా ఉండదు. అది సామాన్యమైన విషయాల గురించి ఉంటుంది, తరచూ నిన్నటి లేక రేపటి సహజ జీవిత సంఘటనల గురించి ఉంటుంది, అందుకే సాధారణంగా, కల్పితాలు లేకుండా మరియు పునరావృత్తమౌతూ ఉంటాయి.”
తమ కలల అంశాలు తమ కొరకు ప్రత్యేక వర్తమానాలను కలిగివున్నాయని కొంతమంది ప్రజలు భావిస్తారు. కలల అర్థాన్ని తెలుసుకునేందుకు, వారు నిద్ర లేచిన వెంటనే వాటిని వ్రాసుకునేలా వారు తమ పరుపు ప్రక్కనే ఒక నోట్‌ప్యాడ్‌ను పెట్టుకుంటారు. కలల సూచనలకు భావాలను చెప్పేందుకు ప్రయత్నించే పుస్తకాల ఉపయుక్తతను గురించి, ఆన్ ఫారడే వ్రాసిన ద డ్రీమ్ గేమ్ అనే పుస్తకం ఇలా చెబుతుంది: “కలల అంశాల మరియు సూచనల అర్థం కొరకు మీరు చూసే కలల పుస్తకాలు, అవి పారంపర్యమైనవి అయినప్పటికీ లేక ఏదో ఆధునిక మనస్తత్వ శాస్త్ర సిద్ధాంతంపై ఆధారపడి ఉన్నప్పటికీ అవన్నీ కూడా ఎందుకూ పనికిరానివే.”
కలలు ముఖ్యంగా మెదడు నుండి వస్తున్నాయి అనిపిస్తుంది గనుక, అవి మన కొరకు ప్రత్యేక వర్తమానాలను కలిగివున్నాయని ఆలోచించడం సహేతుకం కాదు. మెదడును ఆరోగ్యకరమైన స్థితిలో ఉంచేందుకు దానికి సహాయం చేసే మామూలు పనిగా మనం వాటిని దృష్టించాలి.
తమ బంధువు లేక ఒక స్నేహితుడు మరణించాడని కలగన్నామని మరి ఆ వ్యక్తి మరణించాడని మర్నాడు తెలుసుకున్నామని చెప్పే వారి సంగతేమిటి? కలలు భవిష్యత్తు గురించి ముందే తెలియజేయగలవని అది సూచించదా? తదుపరి శీర్షికలో, ప్రవచనార్థక కలల వెనుక ఏముందో మనం పరిశీలిస్తాము.