ఇక దురభిమానం ఎన్నడూ లేనప్పుడు!
ఈ ఉదాసీన లోకంలో ఓ పరమాణువును విచ్ఛిన్నం చేయడంకన్నా దురభిమానంతో వ్యవహరించడం మరింత కఠినం అని ఒకనాడు వైజ్ఞానికుడైన అల్బర్ట్ ఐన్స్‌టైన్ చెప్పినట్లుగా నివేదించబడింది. అదేవిధంగా, రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ప్రఖ్యాతిగాంచి ఆ తర్వాత అమెరికా సమాచార ఏజెన్సీ డైరెక్టరైన ఆర్. ముర్రో, “ఎవ్వరూ దురభిమానాన్ని తీసివేయలేరు—కేవలం దాన్ని గుర్తించగల్గుతారు” అని పేర్కొన్నాడు.
ఈ వ్యాఖ్యానాలు నిజమేనని అనిపిస్తున్నాయా? వివక్షతనూ జాతిబేధాలనూ తీసివేయడం అసాధ్యమా? దేవుడు దురభిమానాన్ని గూర్చి ఎలా భావిస్తున్నాడు?
దేవుడు పక్షపాతి కాడు
బైబిలు పక్షపాతం కూడదని చెబుతోంది. (సామెతలు 24:23; 28:21) “పైనుండివచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలముతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదియునై యున్నది” అని అది పేర్కొంటోంది. (యాకోబు 3:17) అలాంటి వివేకం పురాతన ఇశ్రాయేలులోని న్యాయాధిపతులకు తప్పనిసరిగా అవసరమని చెప్పబడింది. “అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు” అని వారికి ఆజ్ఞాపించబడింది.—లేవీయకాండము 19:15.
పక్షపాతము దురభిమానాలకు విరుద్ధంగా బైబిలులోని తెలుపబడిన దృఢమైన దృక్పథాన్ని యేసుక్రీస్తూ ఆయన అపొస్తలులైన పేతురు మరియు పౌలు నొక్కిచెప్పారు. “కాపరిలేని గొఱ్ఱెలవలె విసికి చెదరియు”న్న వారి ఎడల యేసు నిష్పక్షపాతంగా వ్యవహరించాడు. (మత్తయి 9:36) ఆయన ఇలా బోధించాడు: ‘వెలిచూపునుబట్టి తీర్పుతీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడి.’—యోహాను 7:24.
యెహోవా దేవుడు పక్షపాతి కాడని పేతురు, పౌలు మనకు అభయాన్నిస్తున్నారు. పేతురు ఇలా అన్నాడు: “దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.” (అపొస్తలుల కార్యములు 10:34, 35) అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు: “దేవునికి పక్షపాతములేదు.”—రోమీయులు 2:11.
బైబిలు ప్రభావం
బైబిలు నడిపింపును గైకొన్న వారి వ్యక్తిత్వాలను మార్చే శక్తి బైబిలుకు ఉంది. హెబ్రీయులు 4:12 ఇలా అంటోంది: ‘దేవుని వాక్యము సజీవమై బలముగలది.’ యెహోవా సహాయంతో దురభిమానంగల ఒక వ్యక్తి తన ఆలోచనా విధానాన్ని మార్చుకుని తాను ఇతరులతో వ్యవహరించడంలో నిష్పక్షపాతంగా ఉండగలడు.
ఉదాహరణకు, తార్సువాడైన సౌలును తీసుకోండి. బైబిలు వృత్తాంతం ప్రకారంగా, ఒకప్పుడు తాను నిష్ఠగల మతాచారాలను అనుసరించేవాడు కనుక క్రైస్తవ సంఘాన్ని అతడు తీవ్రంగా వ్యతిరేకించాడు. (అపొస్తలుల కార్యములు 8:1-3) క్రైస్తవులందరూ మతభ్రష్టులనీ, నిజమైన ఆరాధనకు శత్రువులనీ యూదా పారంపర్యాచార ప్రకారం ఆయన పూర్తిగా నమ్మాడు. అతని దురభిమానం, క్రైస్తవులను చంపేందుకై తన మద్దతునిచ్చే అతన్ని నడిపింది. “ప్రభువుయొక్క శిష్యులను బెదరించుటయును హత్యచేయుటయును తనకు ప్రాణాధారమైన”దని బైబిలు చెబుతోంది. (అపొస్తలుల కార్యములు 9:1) అలా చేయడంవల్ల తాను దేవునికి పరిశుద్ధసేవ చేస్తున్నాడని అనుకునేవాడు.—యోహాను 16:2 పోల్చండి.
అయినప్పటికీ, తార్సువాడైన సౌలు తనకున్న అత్యధిక దురభిమానాన్ని విడిచిపెట్టగలిగాడు. ఆయనే ఓ క్రైస్తవుడయ్యాడు! ఆ తర్వాత, యేసుక్రీస్తు అపొస్తలునిగా పౌలుగా ఆయన ఇలా వ్రాశాడు: “పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనై . . . తెలియక అవిశ్వాసమువలన చేసితిని గనుక కనికరింపబడితిని.”—1 తిమోతి 1:12, 13.
తన ఆలోచనా విధానంలో అలాంటి తీవ్రమైన మార్పులను చేసుకున్నది పౌలు మాత్రమేకాదు. తనతోటి సువార్తికుడైన తీతుకు పౌలు వ్రాసిన తన పత్రికలో, “మనుష్యులందరియెడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు, ఎవనిని దూషింపక, జగడమాడనివారును శాంతులునైయుండవలెననియు . . . ఎందుకనగా మనము కూడ మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానావిధములైన దురాశలకును భోగములకును దాసులమునైయుండి, దుష్టత్వమునందును అసూయయందును కాలముగడుపుచు, అసహ్యులమై యొకనినొకడు ద్వేషించుచు ఉంటిమి” అని క్రైస్తవులకు ఉద్బోధించాడు.—తీతు 3:2, 3.
దురభిమానపు అడ్డుకట్టలను అధిగమించడం
నేడు, యథార్థమైన క్రైస్తవులు ఆ సలహాను పాటించేందుకు ప్రయత్నిస్తారు. పైపై అభిప్రాయాలతో ప్రజలను తీర్పుతీర్చకుండా ఉండాలని వారు కోరుకుంటున్నారు. ఇది వారు ఇతరులను గూర్చి ‘హానికరంగా మాట్లాడకుండా’ ఉండేలా నివారిస్తుంది. ఈ లోకపు దేశాలు, జాతులు, తెగలన్నిటి సరిహద్దులు దాటిన అంతర్జాతీయ సహోదరత్వాన్ని కల్గివుండడంలో వారు ఆనందిస్తున్నారు.
నల్లవాడైన హెన్‌రీక్ అనే బ్రెజిల్ దేశస్థుని అనుభవాన్ని పరిశీలించండి. తానుగా వర్ణవివక్షతకు గురైన ఇతను, తెల్లవారి ఎడల లోతుగా పాతుకుపోయిన ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఆయన ఇలా వివరిస్తున్నాడు: “దేవుని నామాన్ని గూర్చి మాట్లాడేందుకు ఇద్దరు తెల్లవారైన సాక్షులు మా ఇంటికి వచ్చారు. నేను తెల్లవారిని నమ్మను కనుక మొదట్లో వాళ్లు చెప్పేది నేను వినాలనుకోలేదు. అయితే వారి సమాచారంలో సత్యముందని నేను చూడగలిగాను. మరి నేనొక బైబిలు పఠనాన్ని అంగీకరించాను. నాకున్న మొదటి ప్రశ్న, ‘మీ చర్చిలో నల్లవారు ఎక్కువమంది ఉన్నారా?’ అన్నదే. అందుకు వాళ్లు ‘ఉన్నారు’ అని అన్నారు. ఆ తర్వాత నా బైబిలు కథల పుస్తకంలోనిa (ఆంగ్లం) చివరి పేజీలో వివిధ వర్ణాల ప్రజలను చిత్రీకరించిన బొమ్మను చూపించారు. అందులో ఓ నల్లటి పిల్లవాడు కూడా ఉండడం నన్ను ప్రోత్సహించింది. ఆ తర్వాత నేను యెహోవాసాక్షుల రాజ్య మందిరాన్ని సందర్శించాను, అక్కడ అనేకమంది వివిధ వర్ణాలవారు ఒకరితోనొకరు గౌరవపూర్వకంగా వ్యవహరించడం నేను చూశాను. నాకు అది ఎంతో ప్రాముఖ్యమైన విషయం.”
ఇప్పుడు, ఓ యెహోవాసాక్షిగా హెన్‌రిక్ యథార్థమైన క్రైస్తవత్వానికి చెందిన వాడై ఉండటంలో ఆనందిస్తున్నాడు. ఆ ఘనత ఏ మానవులకూ చెందదని ఆయన గ్రహిస్తున్నాడు. ఆయన, “యెహోవా మరియు యేసు నా కొరకు చేసిన దానికంతటికీ నేడు నేను ఎంతో కృతజ్ఞుడను. అన్ని తెగలు, వర్ణాలు పుట్టుపూర్వోత్తరాల నుండి వచ్చి ఒకే సంకల్పంకొరకు పాటుపడుతున్న లక్షలమంది యెహోవా యథార్థమైన సేవకులతో నేను పనిచేస్తున్నాను” అని చెప్పాడు.
డార్యో పెరుగుతుండగా దురభిమాన బాధితుడయ్యాడు. తన 16వ ఏట యెహోవాసాక్షులతో అతను పఠించడం ప్రారంభించాడు. అతనిలా చెప్పాడు: “సాక్షుల్లో జాతి గర్వపు భావాలేవీ లేవని నేను కనుగొన్నాను.” యథార్థమైన ప్రేమవున్న ఆ వాతావరణాన్నిబట్టి అతను ముగ్ధుడయ్యాడు. వివిధ తెగల వ్యక్తులు సంఘంలోని బాధ్యతగల స్థానాలందు సేవచేస్తున్నట్లు అతను గమనించాడు. ఎప్పుడైనా సంఘం వెలుపటి ప్రజలనుండి దురభిమానానికి లేక వివక్షతకు గురైనప్పుడు, యెహోవా అన్ని జాతులు, తెగలు, భాషలు, ప్రజలను ప్రేమిస్తాడని డార్యో గుర్తుచేసుకుంటున్నాడు.
ఎలా తాళుకోవాలి
మనమందరమూ మర్యాదగానూ గౌరవప్రదంగానూ వ్యవహరించబడాలని కోరుకుంటాము. అందుకనే దురభిమానానికి గురికావడం సహించేందుకు ఎంతో కఠినమైన పరీక్ష అవుతుంది. క్రైస్తవ సంఘం మనల్ని ఈ దుష్ట లోకంలోని దురభిమాన దృక్పథపు ప్రమాద స్థితినుండి కాపాడదు. అపవాదియైన సాతాను లోకాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నంతకాలం అన్యాయం ఉంటుంది. (1 యోహాను 5:19) ప్రకటన 12:12 మనల్ని ఇలా హెచ్చరిస్తోంది: ‘భూమీ, సముద్రమా, మీకు శ్రమ: అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చియున్నాడు.’ అతని ఉద్దేశం కేవలం అసౌకర్యాన్ని కలిగించడం మాత్రమే కాదు. అతన్ని పరభక్ష జంతువుతో పోల్చవచ్చు. అపొస్తలుడైన పేతురు మనతో ఇలా చెప్పాడు: “మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.”—1 పేతురు 5:8.
“కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును” అని కూడ బైబిలు మనకు చెబుతోంది. (యాకోబు 4:7) “నా దేవా, భక్తిహీనుల చేతిలోనుండి నన్ను రక్షింపుము. కీడు చేయువారి పట్టులోనుండి బలాత్కారుని పట్టులోనుండి నన్ను విడిపింపుము” అని రాజైన దావీదు ప్రార్థించినట్లుగా, దురభిమానాన్ని తాళుకునేందుకు చక్కని సహాయం దేవుని రక్షణకొరకు చూడడమే. (కీర్తన 71:4) మనం కీర్తన రచయితలా కూడా ప్రార్థించవచ్చు: “దేవా, నన్ను కరుణింపుము మనుష్యులు నన్ను మ్రింగవలెనని యున్నారు. దినమెల్ల వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు.”—కీర్తన 56:1.
దేవుడు అలాంటి ప్రార్థనలకు ఎలా ప్రతిస్పందిస్తాడు? బైబిలు ఇలా జవాబిస్తుంది: “దరిద్రులు మొఱ్ఱపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను నిరాధారులను అతడు విడిపించును. నిరుపేదలయందును బీదలయందును అతడు కనికరించును బీదల ప్రాణములను అతడు రక్షించును.” (కీర్తన 72:12, 13) అన్యాయానికి గురైన వారికి దేవుడు ఉపశమనాన్ని తీసుకొస్తాడని తెలుసుకోవడం ఎంత బాగుంటుందో కదా!
‘వారు యే హానియు చేయరు’
ఈ లోకపు ప్రభుత్వాలు తమ చట్టాలూ కార్యక్రమాలతో దురభిమానానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నాయి. వారు సమానతనూ న్యాయాన్ని తెస్తామని వాగ్దానాలను చేయవచ్చు. కానీ వారు విజయం సాధించలేరు. (కీర్తన 146:3) దేవుడు మాత్రమే దురభిమాన వ్యవహారాన్నంతటిని తీసివేయగలడు, తీసివేస్తాడు. ఆయన మానవజాతిని ఓ ఐక్య కుటుంబంగా మార్చివేస్తాడు. “ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము” ఈ దుష్టవిధానాన్ని తప్పించుకుని, శాంతితో జీవిస్తారు.—ప్రకటన 7:9, 10.
వర్ణ, సాంఘిక దురభిమానం తీసుకువచ్చే హానినంతటినీ యెహోవా తీసివేస్తాడు. ఎవరూ అన్యాయంగా వ్యవహరించబడరు సుమా! “ఎవరి భయములేకుండ ప్రతివాడును తన ద్రాక్షచెట్టుక్రిందను తన అంజూరపు చెట్టుక్రిందను కూర్చుండును.” (మీకా 4:4) మరి యెషయా 11:9 ఇలా అంటోంది: ‘వారు యే హానియు కలుగజేయరు.’
ఇప్పుడు మీరు దురభిమానానికి గురైనట్లయితే, భవిష్యత్తుకొరకైన ఈ అద్భుతమైన నిరీక్షణ యెహోవాతో మీ సంబంధాన్ని బలపరుస్తుంది. ఈ దుష్టవిధానపు అన్యాయాన్ని సహించేందుకు అది మీకు సహాయపడుతుంది. మీరు దురభిమానాన్ని తాళుకుంటూ ముందుకు చూసినట్లయితే, బైబిలులోని ఈ వివేకయుక్తమైన సలహాను అనుసరించండి: “యెహోవాకొరకు కనిపెట్టువారలారా, మీరందరు మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి.”—కీర్తన 31:24.
[అధస్సూచీలు]
a వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించినది.
[4వ పేజీలోని చిత్రసౌజన్యం]
U.S. National Archives photo