కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 6/1 పేజీలు 3-4
  • దురభిమానానికి మీరు గురౌతున్నారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దురభిమానానికి మీరు గురౌతున్నారా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దురభిమానం హానికల్గించవచ్చు
  • వివక్ష​—⁠అది మీకూ అంటుకుందా?
    తేజరిల్లు!—2020
  • వివక్ష అంతం కావడం
    తేజరిల్లు!—2004
  • వివక్షకు ఉన్న వివిధ రూపాలు
    తేజరిల్లు!—2004
  • ఇక దురభిమానం ఎన్నడూ లేనప్పుడు!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 6/1 పేజీలు 3-4

దురభిమానానికి మీరు గురౌతున్నారా?

జాతి దౌర్జన్యం, కులీనత, విచక్షణ, విభేదాలు మరియు జాతి నిర్మూలనల్లోగల సామాన్యమైన విషయమేమిటి? అవన్నీ బహుళవ్యాప్త మానవ స్వభావంనుండి పరిణమించినవే—అదే దురభిమానం!

దురభిమానం అంటే ఏమిటి? ఒక ఎన్‌సైక్లోపీడియా దాన్ని, “నిష్పక్షపాత తీర్పుకు తగినంత సమయాన్నీ శ్రద్ధనూ చూపించకుండా ఒక అభిప్రాయం ఏర్పర్చుకోవడం” అని నిర్వచించింది. అపరిపూర్ణ మానవులుగా మనం కొంతమేరకు దురభిమానాన్ని కల్గివుండే ఉన్ముఖతను కల్గివున్నాము. వాస్తవాలన్నీ తెలుసుకోకుండా మీరు తీర్పుతీర్చిన సందర్భాలున్నట్లు బహుశ మీకు తెలుసు. అలాంటి దురభిమాన ఆలోచనలకు, యెహోవా దేవుడు తీర్పుతీర్చే విధానానికీ మధ్య తేడాను బైబిలు చూపిస్తుంది. అది ఇలా చెబుతోంది: “మనుష్యులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు; . . . మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.”—1 సమూయేలు 16:7.

దురభిమానం హానికల్గించవచ్చు

నిస్సందేహంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరివల్ల తప్పుగా తీర్పుతీర్చబడివుంటారు. (ప్రసంగి 7:21, 22 పోల్చండి.) సాధారణంగా చెప్పాలంటే, మనమందరమూ దురభిమానానికి గురౌతున్నవారిమే. అయితే, దురభిమానపు ఆలోచనలను త్వరగా తీసివేసినప్పుడు అవి ఎక్కువ హానిని లేదా ఏ హానిని కలిగించవు. అలాంటి ఆలోచనలను పెంచుకోవడమే హాని కల్గించగలదు. అది మనం అసత్యాన్ని నమ్మేలా మోసగించవచ్చు. ఉదాహరణకు, దురభిమాన ప్రభావంవల్ల ఓ వ్యక్తి తన మత, తెగ లేక జాతీయతనుబట్టి దురాశ, సోమరితనం, బుద్ధిహీనత లేక గర్వాన్ని కల్గివుండగలడని నిజంగా కొందరు నమ్ముతున్నారు.

అనేక విషయాల్లో అలాంటి తప్పుడు తీర్పు, ఇతరులతో అన్యాయంగాను, దుర్వినియోగకరంగాను, లేక దౌర్జన్యపూరితమైన రీతిలో వ్యవహరించేందుకు నడుపుతుంది. లక్షలమంది ప్రజలు, మారణహోమాల్లోనూ జాతి నిర్మూలనలోనూ తెగల హత్యల్లోనూ ఇతర విధాలైన తీవ్రమైన దురభిమాన క్రియల్లోనూ తమ జీవాలను కోల్పోయారు.

ప్రపంచమంతటా, స్వాతంత్ర్యం, భద్రత మరియు సమానత్వాలను భంగపర్చలేని హక్కులకు చట్టపరంగా గ్యారంటీని ఇవ్వడం ద్వారా ప్రభుత్వాలు దురభిమానానికి వ్యతిరేకంగా పోరాడాయి. మీ దేశానికి సంబంధించిన రాజ్యాంగ చట్టాన్ని లేక చట్టపు సూత్రాలను చదివినట్లయితే, జాతి, లింగ మత భేదాలు లేకుండా పౌరులందరి హక్కులను కాపాడేందుకుగల ఓ ప్రకరణాన్ని లేక సవరణ చట్టాన్ని మీరు చూడగలరు. అయినప్పటికీ, దురభిమానమూ వివక్షత ప్రపంచవ్యాప్తంగా ప్రబలివున్నాయి.

మీరు దురభిమాన బాధితులా? కేవలం మీ జాతి, వయస్సు, స్త్రీ పురుష భేదం లేక జాతీయత లేక మత విశ్వాసాలవల్ల మీరు దురాశాపరులనీ, సోమరులనీ, బుద్ధిలేనివారని, లేక గర్విష్టులనీ ముద్రవేయబడ్డారా? దురభిమానం వల్ల సరైన విద్య, ఉద్యోగం, ఇల్లు మరియు సాంఘిక సేవల అవకాశాలు మీకు ఇవ్వబడడంలేదా? అలాగైనట్లయితే, మీరు దాన్ని ఎలా తాళుకోగలరు?

[3వ పేజీలోని చిత్రం]

దురభిమానాన్ని పెరగనివ్వడం జాతి విద్వేషాన్ని ప్రేరేపిస్తుంది

[క్రెడిట్‌ లైను]

Nina Berman/Sipa Press

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి