గ్రీసు నందు విజయవంతమైన సాక్ష్యపు విస్తృత కార్యక్రమం
యెహోవాసాక్షులు ఎంతో కాలంగా గ్రీస్‌లో వ్యతిరేకతను ఎదుర్కుంటున్నారు. పొలీసులు, కోర్టు మరియు ప్రభుత్వ అధికారులు కొందరు సాక్షులను హింసించారు, ఎందుకంటే తరచు ఒత్తిడి గ్రీక్ ఆర్థడాక్స్ మతనాయకులనుండే వచ్చేది. కొన్నిసార్లు గ్రీక్ మతమార్పిడి చట్టాన్ని, మరి కొన్నిసార్లు యుద్ధంలో చేరేందుకు లేదా రక్తమార్పిడులను సాక్షులు బైబిలు ప్రకారం అంగీరించకపోవడం ఓ సాకుగా తీసుకున్నారు.—యెషయా 2:2-5; అపొస్తలుల కార్యములు 15:28, 29.
గ్రీస్ నందలి యథార్థహృదయులైన అధికారుల్లో అధిక అవగాహనను పెంపొందించేందుకు చేసిన ప్రయత్నంలో భాగంగా, గ్రీక్ ప్రభుత్వం మత సేవకులుగా గుర్తించిన 200 మంది సాక్షులు అలాగే న్యాయ వృత్తివున్న కొందరు సభ్యులు దేశ వ్యాప్తంగా విస్తృత ప్రచారంలో పాల్గొన్నారు. వారు, గ్రీస్‌లో యెహోవాక్షులు అనే ఓ ప్రత్యేకమైన బ్రోషూరునూ యెహోవాక్షులూ—దేవుని జ్య ప్రచారకులు (ఆంగ్లం) అనే పుస్తకాన్ని అందించారు. అంతేకాకుండా, యెహోవా సాక్షులను హింసించేందుకు సరైన చట్టపరమైన ఆధారం లేదని చూపించే దస్తావేజులుగల ఓ ప్యాకెట్టును వారు అందించారు. సాక్షులు పోలీసు ప్రముఖులనూ, మేయర్లలనూ, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను, ఇతర ఆధికారులనూ సందర్శించారు.
దాని ప్రతిస్పందనేమిటి? వందలకొలది మంచి అనుభవాలు నివేదించబడ్డాయి. కొన్ని ఉదాహరణలను పరిశీలించండి.
ఉత్తర మాసిడోనియాలోని పోలీసు స్టేషన్ కమాండరు సహోదరులను ఆహ్వానించి ఇలా అన్నాడు: “మీ గురించి నాకు ఎంతో కాలం నుంచీ తెలుసు . . . మరి నేను మీ క్రమ పద్ధతిని ఎంతో మెచ్చుకుంటున్నాను. . . . మత మార్పిడి శాసనాన్ని నేనంగీకరించడంలేదు, మరి నాకు అధికారం ఉండివుంటే దాన్ని నేను తీసివేసుండేవాణ్ణి.”
అనేక నగరాల్లోని వివిధ పోలీసు స్టేషన్లల్లోని కమాండర్లు ఇలాంటి వ్యాఖ్యానాలను చేశారు: “మీరు చేసే సాంఘిక సేవకు మేము మిమ్మల్ని మెచ్చుకుంటున్నాము.” “మీ సమాజం పోలీసులకు ఎన్నడూ పనిపెట్టదు; మీరు ఓ సాంఘిక కార్యాన్ని సాధిస్తారు.” “మాకు మీతో ఏ సమస్యా లేదు. మేము మిమ్మల్ని గౌరవించి, మెచ్చుకుంటున్నాము.”
పైరీయస్లో పోలీసు భద్రతా దళంలో ఉన్న ఉన్నతాధికారి, తనకు యేసుక్రీస్తు నామము ద్వారా యెహోవాకు ప్రార్థించడం తెలుసునని కన్నీటితో చెప్పాడు. వారు అర్మగిద్దోనుకు ముందుగా కొంత హింస వస్తుందని ఎదురుచూస్తున్నారని, మరి వారికి సహాయం చేసేందుకు దేవుడు తన్ను ఉపయోగించుకుంటాడని దానిని తాను నిరీక్షిస్తున్నాడని చెప్పి సాక్షులను ఆయన మరింత ఆశ్చర్యపర్చాడు! మరిన్ని విషయాలను చర్చించేందుకు సహోదరులిచ్చిన ఆహ్వానాన్ని ఆయన అంగీకరించాడు.
ప్రభుత్వాధికారులు ప్రతిస్పందించడం
ప్రచారకులు పుస్తకాన్ని గూర్చి థెస్సలిలోని ఓ మేయర్ ఇలా చెప్పాడు: “మున్సిపల్ గ్రంథాలయంలో అది స్థానమివ్వదగినది—మొదటి స్థానం!” ఆ తర్వాత అతను తన పుస్తకాల షెల్ఫును ఖాళీ చేసి ప్రచారకులు పుస్తకం అట్ట కనిపించేలా పెట్టాడు.
ఉత్తర గ్రీస్‌లోని ఓ మేయరు సహోదరులను సాదరంగా ఆహ్వానించి ఇలా చెప్పాడు: “నా మున్సిపల్ ప్రాంతంలో ఉండాలని కోరుకునే ప్రజల్లో మీరు శ్రేష్ఠమైన వారు.” ఉత్తర యుబీయాలోని ఓ దయగల మేయర్ సహోదరులతో ఇలా అన్నాడు: “నేను ఓ మాజీ సైనికాధికారిని. కానీ మిమ్మల్ని నేనెంతో మెచ్చుకుంటాను.” సాక్షులు చెప్పిన వాటిని ఆయన ఎంతో ఉత్సాహపూరితంగా అంగీకరించాడు. వాచ్ టవర్ సొసైటీ వారు ప్రచురించిన పుస్తకాలను వారు చూపించినప్పుడు ఆయన ఇలా అన్నాడు: “వాటన్నింటినీ చదువుతానని నేను మాటిస్తే వాటిని నాకిస్తారా?” అందుకు వారు ఇలా జవాబిచ్చారు: “తప్పకుండా—అవి మీ సొంతమే!” అందుకు ఆయన ఎంతో ఆనందించాడు, మరి సహోదరులు వెళ్ళేందుకు ససేమిరా అనుమతించలేదు.
అటికాలోని నగర శివార్లలో, సహోదరులు అందించిన ప్రచురణలను ఓ మేయర్ సంతోషంగా అంగీకరించాడు, అంతేకాకుండా సంస్థ ప్రచురణలను తీసుకొస్తూ ఉండమని కోరాడు. వారు వెళుతుండగా ఆయన వారితో ఇలా చెప్పాడు: “ప్రజలు తమ రాజకీయనాయకులవల్ల ఎంతో నిరుత్సాహ పడ్డారు మరి నిజమైన సత్యంకొరకు వారు వెదుకుతున్నారు. మీ దగ్గర సత్యం ఉంది కనుక ఇప్పటినుండి మీరు బిజీగా ఉంటారని నేను నమ్ముతున్నాను.”
పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ప్రతిస్పందించడం
ఉత్తర గ్రీసులోని డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని కలిసిన సహోదరులు ఇలా జ్ఞాపకం చేసుకున్నారు: “మన ప్రచురణలూ మన అందింపు, అలాగే మన వాళ్ళు రక్త మార్పిడి వంటి గంభీరమైన వివాదాన్ని ఎదుర్కొన్నప్పుడు వారు నిస్సహాయులుగా ఉండకుండా చూసేందుకు మనం చేసే ప్రయత్నాలవల్ల ఆయన ముగ్ధుడయ్యాడు. చివరికి ఆయన మాకు కృతజ్ఞతలు చెప్పి, ఆయన్ను సందర్శించి ఆయనకు ఆ సమాచారాన్ని అందించేందుకు చొరవ తీసుకున్నందుకు ఆప్యాయంగా మెచ్చుకున్నాడు. నాలుగేళ్ళ క్రితం పోలీసులను పిలిచి ప్రాంతీయ సేవ చేస్తున్న ఇద్దరు సహోదరులను అరెస్టు చేసేందుకు ఆజ్ఞలు జారీ చేసింది ఈయనేనని ఆ తర్వాత మాకు తెలిసింది.”
ఏథెన్స్లోని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయాన్ని సందర్శించిన న్యాయవాదులైన ఇద్దరు సాక్షులు ఓ ప్రఖ్యాత మరియు వృద్ధుడైన, ఎంతో గౌరవనీయుడైన ఓ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తమ వైపుకు రావడం చూసి ఆశ్చర్యపోయారు. ఆయన వారిని ప్రక్కకు తీసుకు వెళ్ళి, మతమార్పిడి వ్యతిరేక చట్టానికి ఏ ఆధారమూ లేదని అంతేకాకుండా గ్రీక్ న్యాయస్థాన విధానంలో గందరగోళాన్ని సృష్టిస్తోందని చెప్పాడు. ఆప్యాయంగా కరచాలనం చేసి వారికి కృతజ్ఞతలు చెప్పాడు.
గ్రీస్ ఉత్తర భాగంలో ఓ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎంతో స్నేహంగా ఉండి ప్రచురణలను తీసుకున్నాడు. యౌవనస్థులు అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మక సమాధానాలు (ఆంగ్లం) అనే పుస్తకాన్ని తిరగేసేటప్పుడు, విషయసూచికలోని వివిధ అధ్యాయాలను చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. ఆయన ఇలా వ్యాఖ్యానించాడు: “ఈ పుస్తకం అందించేవి నేను ఏ గ్రీక్ ఆర్థడాక్స్ చర్చిలోనూ చూడలేదు.”
బీయోషీయలోని ఓ పబ్లిక్ ప్రాసిక్యూటర్, గతంలో సాక్షుల ఇష్టానికి వ్యతిరేకంగా రక్తాన్ని ఎక్కించమని తాను ఆజ్ఞలు జారీ చేసినట్లుగా అంగీకరించాడు. అయితే ఈ విషయాన్ని గూర్చి సహోదరులు ఆయనతో తర్కించిన తర్వాత ఆయన ఇలా ప్రకటించాడు: “భవిష్యత్తులో ఇక ఎన్నడూ నేను అలాంటి ఆజ్ఞను జారీచేయను!” రక్త ప్రత్యామ్నాయాల కొరకు స్థానిక యెహోవాసాక్షుల ఆసుపత్రి అనుసంధాన కమిటీని సంప్రదించాలని నిశ్చయించుకున్నాడు. ఆయన యౌవనస్థులు అడుగు ప్రశ్నలు (ఆంగ్లం) అనే పుస్తకాన్ని అంగీకరించాడు.
గ్రంథాలయ అధికారులు ప్రతిస్పందించడం
ఆ సమాచారం అనేక మంది గ్రంథాలయ అధికారికి కూడా అందించబడింది. ఏథెన్స్లోని ఒక గ్రంథాలయంలో మర్యాదస్తుడైన ఓ గ్రంథాలయ అధికారులకు ప్రచురణలను అంగీకరించి ఇలా వ్యాఖ్యానించాడు: “మీరు మీ పుస్తకాలను తేవడం మంచిదైంది ఎందుకంటే మావద్ద ఉన్న పుస్తకాల్లో అత్యధికం మీకు వ్యతిరేకమైనవే. . . . ఓ ప్రీస్టు మీ పుస్తకాలను ఇక్కడ చూసి ఎంతో కోపగించుకున్నాడు. . . . అయినా ఫరవాలేదు. అందరి అభిప్రాయాలూ వినాలి.”
సైనిక శిబిరంలో యెహోవాసాక్షులను గూర్చి తెలుసుకున్న ఓ అధికారి కీట్ నందలి ఓ మున్సిపల్ గ్రంథాలయంలో, వారు యుద్ధాల్లో పాల్గొనకపోవడాన్నిబట్టి తాను ముగ్ధుడయ్యాడని సహోదరులతో చెప్పాడు. ఆయన తన్నుతాను ఇలా ప్రశ్నించుకునేవాడు, ‘ఈ ప్రజలు ఎందుకు బాధననుభవించాలి?’ ఆయన సహోదరుల దగ్గరనుండి ప్రచురణలను అంగీకరించి, వారి ప్రస్తుత ప్రచారాన్ని గూర్చి ఇలా చెప్పాడు: “మీరు అద్భుతమైన పనిని చేస్తున్నారు, దీన్ని సంవత్సరాలక్రితమే చేయాల్సింది. . . . గ్రీస్ నందు ఎంతో దురభిమానం ఉంది.” ఆయన, సహోదరులు త్వరగా తనను మరలా కలవమని కోరాడు.
ఈ విస్తృత ప్రచారంలో, సహోదరులు 1,000 కంటే ఎక్కువ ప్రచారకులు అనే పుస్తకాలనూ, 1,600 గ్రీస్‌లో యెహోవాసాక్షులు అనే బ్రోషూర్లనూ అలాగే వందల కొలది పుస్తకాలనూ, పత్రికలనూ అందించారు. అంతకంటే ఎక్కువగా, వారు వందలకొలది గ్రీక్ ఆధికారులతో ముఖాముఖిగా మాట్లాడారు. ఇప్పుడు, గ్రీస్ నందలి యథార్థహృదయులైన అధికారులు యెహోవాసాక్షుల విషయంలో ఇక మరింత నిష్పక్షపాత దృష్టిని అవలంబిస్తారని గ్రీస్‌లోని మరియు ప్రపంచమంతటిలోని నమ్మకమైన యెహోవా సేవకులు నిరీక్షిస్తున్నారు.