మంచి వార్తలు ముందున్నాయి!
మనకు వ్యక్తిగతంగా చెడు వార్త ఏదైనా అందినప్పుడు మనమందరమూ దిగులు పడతాము. మరో వైపున, మంచి వార్త—మనకు గానీ మనం ప్రేమించే వారికి గాని అందినప్పుడు మనం ఆనందిస్తాము. అయితే చెడు వార్త మనకు కాకుండా ఇతరులకు బాధను కలిగించినప్పుడు, తరచూ ఎంతోకొంత జిజ్ఞాస ఉంటుంది; ఇతరుల కష్టాన్ని గూర్చి తెలుసుకుని కొందరు ఆనందిస్తారు కూడా. బహుశ ఇది చెడు వార్త ఎందుకు అంత ఎక్కువగా అమ్ముడుపోతుందో కొంతమేరకు వివరిస్తుంది కాబోలు!
రెండవ ప్రపంచ యుద్ధపు తొలి భాగం సమయంలో, కొంతమంది ప్రజలు విపత్తుల విషయంలో అనారోగ్యకరమైన ఆసక్తిని కల్గివుండిన దాని స్పష్టమైన ఉదాహరణ ఉంది. 10,000 టన్నుల అధిక సైనిక బలంతో వేగంగా కదిలే యుద్ధనౌకైన గ్రాఫ్ ష్పే, 1939లో జర్మన్ నౌకా దళానికి గర్వకారణంగా ఉండేది. దక్షిణ అట్లాంటిక్ మరియు హిందూ మహా సముద్రాల్లోని మిత్ర రాజ్యాల వ్యాపార నౌకల మధ్య ఈ యుద్ధ నౌక అనేక వారాల పాటు కలకలాన్ని సృష్టించింది. చివరికి, మూడు బ్రిటీషు యుద్ధనౌకలు గ్రాఫ్ ష్పేని పసిగట్టి ముట్టడించాయి, అలా అది జీవనష్టాన్ని కలిగించి, దెబ్బతిన్న ఆ నౌక మరమ్మత్తుకు ఉరుగ్వేలోని మోంటేవిడియో నౌకాశ్రయానికి వెళ్లవలసి వచ్చింది. ఉరుగ్వే ప్రభుత్వం, ఆ యుద్ధనౌక మళ్ళీ వెంటనే సముద్రంలోకి వెళ్ళిపోవాలని, లేని పక్షంలో అది నిర్బంధించబడుతుందని ఆదేశించింది. అలా ఓ భయంకరమైన ఏక పక్ష యుద్ధం జరుగుతుందన్నట్లు అనిపించింది.
దీన్ని విని, అమెరికాలోని సంపన్నులైన ఓ వాణిజ్యవేత్తల గుంపు, రక్తం ఏరులైపారే ఆ యుద్ధాన్ని చూడడానికి ఉరుగ్వేకు వెళ్ళేందుకు సుమారు ఒక్కొక్కరికి 2,500 డాలర్లలయ్యే ఓ విమానాన్ని అద్దెకు తీసుకున్నారు. వారికి నిరాశకల్గిస్తూ, ఆ యుద్ధం ఎన్నడూ జరగలేదు. గ్రాఫ్ ష్పే నౌకకు రంధ్రం చేయాలని అడోల్ఫ్ హిట్లరు ఆజ్ఞలను జారీ చేశాడు. ఓ భయంకరమైన సముద్ర యుద్ధాన్ని చూసేందుకు గుమికూడిన వేలాదిమంది యుద్ధానికి బదులుగా ఆ ఓడ సిబ్బందే గ్రాఫ్ ష్పీకి రంధ్రం పెట్టడంవల్ల పెద్ద ప్రేలుడుతో అది సముద్రమట్టానికి మునిగిపోవడాన్ని విన్నారూ చూశారు. తుపాకీతో తన తలను పేల్చుకుని కెప్టన్ ఆత్మహత్య చేసుకున్నాడు.
కొందరు ప్రజలకు కాస్త విపరీత నైజమున్నప్పటికీ, అనేకులు చెడు వార్తల కంటే మంచి వార్తలనే ఎక్కుగా ఇష్టపడతారు. మీరూ అలాగే భావించరా? మరి అయితే, చరిత్ర ఎందుకు అంత ఎక్కువ చెడు వార్తలను అంత తక్కువ మంచి వార్తలను కల్గివుంది? ఆ స్థితి ఎన్నడైనా మార్చబడగలదా?
చెడు వార్తలన్నింటికీ కారణాలు
కేవలం మంచి వార్తలే ఉండే ఒక కాలాన్ని గూర్చి బైబిలు చెబుతోంది. చెడు వార్తన్నది తెలియనిది, ఎన్నడూ వినందిగా ఉండేది. యెహోవా దేవుడు తన సృష్టి కార్యాలను ముగించినప్పుడు మానవులూ జంతువులూ ఆనందించేందుకు భూగృహం సిద్ధంగా ఉంది. ఆదికాండంలోని వృత్తాంతం మనకు ఇలా చెబుతోంది: “దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగనుండెను.”—ఆదికాండము 1:31.
మానవుని సృష్టి తర్వాత చెడు వార్త లేకపోవడం ఎక్కువ కాలం వరకూ ఉండలేదు. ఆదాము హవ్వలకు పిల్లలెవరూ కలుగకముందు, దేవుడు మరియు మంచి కొరకైన ఆయన క్రమమైన విశ్వ ఏర్పాటుకు వ్యతిరేకంగా చేయబడిన తిరుగుబాటును గూర్చి వార్త తెలియజేయబడింది. ఉన్నత శ్రేణికి చెందిన ఓ ఆత్మ కుమారుడు నమ్మకంతో అప్పగించిన తన స్థానానికి ద్రోహం చేసి, తన తిరుగుబాటు మరియు ద్రోహపు విధానంలోకి మొదటి మానవ దంపతులను మలచడంలో విజయం సాధించాడు.—ఆదికాండం 3:1-6.
మానవులు కనివినిన చెడు వార్తలు ఆ కాలంతో ప్రారంభమయ్యాయి. ఆ నాటినుండి ప్రపంచాన్ని ముంచెత్తిన చెడువార్తల్లో కుట్ర, మోసం, అబద్దం, అసత్యాలు, అర్ధసత్యాలు ఎంతో ప్రాముఖ్యంగా ఉండడంలో ఆశ్చర్యం లేదు. “మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చ గోరుచున్నారు. ఆదినుండి వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై యున్నాడు” అని తన కాలంలోని మతనాయకులతో అంటూ చెడు వార్తకు జనకుడనే నిందను అపవాదైన సాతానుపై యేసుక్రీస్తు నేరుగా మోపాడు.—యోహాను 8:44.
మానవ జనాభా పెరుగుతున్న కొలది, చెడు వార్తలు దానితో పాటు అధికమయ్యాయి. నిస్సందేహంగా, సంతోషానందాల కాలమే లేదని దానర్థం కాదు, జీవితంలో ఆనందానికి కారణమైన అనేక విషయాలున్నాయి. అయినప్పటికీ నేటి వరకూ కూడా మానవజాతిలోని ప్రతి తరంలోనూ కష్టాలూ వేదనల కారు మేఘాలూ అగపడుతూనే ఉన్నాయి.
ఈ దుస్థితికి మరో ముఖ్య కారణముంది. అది తప్పుడు పనులూ విపత్తుల ఎడల మొగ్గుచూపే వారసత్వ బలహీనత. “నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది” అని చెప్పడం ద్వారా యెహోవాయే స్వయంగా ఈ అనివార్య కారణాన్ని వేలేత్తి చూపుతున్నాడు.—ఆదికాండము 8:21.
చెడువార్తలు ఎందుకు పెరుగుతున్నాయి?
అయితే, ఈ 20వ శతాబ్దంలో చెడు వార్తలు పెరిగేందుకు ఓ కారణముంది. ఈ కారణం బైబిలులో స్పష్టంగా చెప్పబడింది, ఈ 20వ శతాబ్దపు మానవజాతి ‘అంత్యదినములు’ లేక ‘అంత్యకాలము’ అనే ఓ ప్రత్యేక కాలంలోకి ప్రవేశిస్తూందని అది ముందుగానే చెప్పింది. (2 తిమోతి 3:1; దానియేలు 12:4) బైబిలు ప్రవచనం మరియు బైబిలు కాలవృత్తాంతం 1914లో ప్రారంభమైన ఈ “అంత్యకాలము”ను గుర్తిస్తుంది. దీనికి వివరణాత్మక లేఖనాధార నిదర్శనంగా, వాచ్ టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు ప్రచురించిన నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకంలోని 11వ అధ్యాయాన్ని చూడండి.
భూమిమీది చెడు వార్తలు వాటంతటవే పెరిగేలా చేసే ఒక సంఘటనతో అంత్యదినాలు ప్రారంభమవ్వాలి. అదేమిటి? అపవాదియగు సాతాను మరియు అతని దయ్యముల సమూహములు క్రిందికి పడద్రోయబడుటయే. ప్రకటన 12:9, 12 నందు, అనివార్యమైన చెడు వార్తల పెరుగుదలను గూర్చిన స్పష్టమైన వివరణను మీరు చదవవచ్చు: ‘సర్వలోకమును మోస పుచ్చుచు, అపవాదియనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహా ఘటసర్పము పడద్రోయబడెను. అది భూమిమీద పడద్రోయబడెను; దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. . . . భూమీ, సముద్రమా, మీకు శ్రమ; అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహుక్రోధము గలవాడై మీయొద్దకు దిగివచ్చియున్నాడు.’
కనుక అంత్యదినాలు వాటి అంతమునకు వచ్చినంతవరకూ ఉన్న కాలమెంతైనా, చెడు వార్తలు కొనసాగుతాయని మరియు వాటి మోతాదు మరియు తీవ్రత పెచ్చు పెరిగిపోతుందని మనం అపేక్షించవచ్చు.
ఇది ఎల్లకాలం ఇలాగే ఉండదు
భూనివాసులకు సంతోషకరమైన విషయమేమంటే, నేటి చెడు వార్తల మహామారిని తయారుచేసే దారుణ విషయాలు ఎల్లకాలము ఉనికిలో ఉండవు. వాస్తవానికి, ఎడతెగక చెడు వార్తలు కొనసాగే రోజులు లెక్కించబడుతున్నాయని మనం నమ్మకంతో చెప్పగలం. ఏది ఎలా అనిపించినా, పరిస్థితి నిరాశాజనకమైనది కాదు. చెడు వార్తల అంతం అతి సమీపంలో ఉంది మరి దేవుని నిర్ణయకాలంలో అది తప్పక వస్తుంది.
దేవుడు చెడు వార్తలకు కారణమైన వాటన్నింటినీ నాశనం చేయడంతో అంత్యదినాలు తీరిపోతాయని లేక ముగుస్తాయనే నమ్మకాన్ని మనం కల్గివుండగలం. జగడాన్ని ఉధృతం చేస్తూ, మారకుండా తమ చెడు విధానాన్నుండి తప్పుకునేందుకు నిరాకరించే దుష్ట మానవులను ఆయన నిర్మూలిస్తాడు. ఇది సాధారణంగా అర్మగిద్దోను యుద్ధం అన్న సర్వశక్తిమంతుడైన దేవుని మహాదినాన జరిగే యుద్ధంతో ముగుస్తుంది. (ప్రకటన 16:16) ఆ తర్వాత వెంటనే, అపవాదియైన సాతాను అతని దయ్యాల సేనల సమూహాలు నిష్క్రికియులుగా చేయబడతారు. ప్రకటన 20:1-3 చెడు వార్తలన్నింటికీ జనకుడైన సాతానును కట్టిపడవేయడాన్ని ఇలా వివరిస్తోంది: “పెద్దసంకెళ్లను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపుచెవిగల యొక దేవదూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆదిసర్పమును, అనగా అపవాదియు సాతానును అను ఆ ఘటసర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి, ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్రవేసెను.”
ఈ నాటకీయ సంఘటనల తర్వాత, భూమికి, దానిలోని నివాసులకూ అనన్యసామాన్యమైన మంచి వార్తలుగల కాలం వస్తుంది. ఈ నివాసుల్లో అర్మగిద్దోను యుద్ధాన్ని తప్పించుకున్న లక్షలాదిమంది, అలాగే, సమాధుల్లో మరణ నిద్రలో ఉన్న కోట్లమంది పునరుత్థానము చేయబడేవారు ఉంటారు. అన్నిటికంటే అతి శ్రేష్ఠమైన మంచి వార్త బైబిలులోని చివరి పుస్తకంలో వర్ణించబడింది: “దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయె”ను.—ప్రకటన 21:3, 4.
ఆ ఆనందదాయకమైన కాలాన్ని మీరూహించగలరా? నిజంగా, చెడు వార్తలు ఇక ఎన్నడూ లేని అద్భుతమైన భవిష్యత్తే. అవును, చెడువార్తలన్నీ అంతమై మరి అవి ఎన్నడూ వినపడవు. మంచి వార్తలు అప్పుడు సర్వోన్నతంగా పరిపాలిస్తాయి మరి అవి నిత్యం పెరుగుతూనే ఉంటాయి.