కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 3/15 పేజీ 3
  • నిజమైన స్నేహితులు మనకవసరం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నిజమైన స్నేహితులు మనకవసరం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మనకు నిజమైన స్నేహితులు ఎందుకు అవసరం
  • ప్రేమలేని లోకంలో స్నేహాలను ఎలా కాపాడుకోవాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • శాశ్వతమైన స్నేహబంధాలను మీరు ఆస్వాదించగలరు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • స్నేహితుల్ని జాగ్రత్తగా ఎంచుకోండి
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • మంచి ఫ్రెండ్స్‌ ఎలా ఉంటారు?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 3/15 పేజీ 3

నిజమైన స్నేహితులు మనకవసరం

జెనీ మరియు సూ ఉత్సాహపూరితమైన సంభాషణను చేస్తున్నారు. చిరునవ్వులను చిందిస్తున్నారు, కళ్ళు మెరుస్తున్నాయి—వారి ప్రవర్తనలోని ప్రతిదీ ఎదుటి వ్యక్తి చెప్పనున్న విషయంలో అత్యంత ఆసక్తిని కనబరస్తుంది. విభిన్న పుట్టుపూర్వోత్తరాలైనప్పటికీ, స్పష్టంగా, వారిరువురికి చాలావరకు ఒకేవిధమైన విషయాల్లో ఆసక్తి ఉంది, ఒకరి ఎడల మరొకరికి ఎంతో గౌరవముంది.

ఇతరత్ర, ఎరిక్‌ మరియు డెన్నస్‌ తాము సంవత్సరాలుగా పనిచేస్తున్న ప్రాజెక్ట్‌లలో ఒకదానిపై కలిసి పనిచేస్తున్నారు. వారు విశ్రాంతి తీసుకుంటారు, ఊరకనే నవ్వొస్తుంది. సంభాషణ గంభీరమైన విషయాల్లోకి మళ్ళినప్పుడు, వారు తమ అభిప్రాయాలను యథార్థంగా తెలియజేసుకుంటారు. వారు ఒకరినొకరు గౌరవించుకుంటారు. జెనీ మరియు సూ వలె ఎరిక్‌ మరియు డెన్నస్‌లు కూడా నిజమైన స్నేహితులు.

ఈ వివరణలు మీ స్వంత స్నేహితులను గూర్చి మీరు తలంచేలా చేస్తూ మీ హృదయానికి ఆనందాన్ని కలిగించవచ్చు. మరోవైపు, అలాంటి స్నేహబంధాల కోసం అపేక్షించేలా అవి చేయవచ్చు. మీరు కూడా అలాంటి స్నేహబంధాలను కలిగి ఉండవచ్చు!

మనకు నిజమైన స్నేహితులు ఎందుకు అవసరం

ఆరోగ్యకరమైన స్నేహబంధాలు మన మానసిక మరియు శారీరక క్షేమానికి అత్యవసరం. అయితే, మనకు ఒంటరితనం అనిపిస్తే, మనలో ఏదో లోపం ఉందని భావం కాదు. ఒంటరితనమనేది ఒక ఆకలి అని, మనకు సాహచర్యం అవసరముందనే ఓ సహజ సూచన అని కొంతమంది పరిశీలకులు చెబుతున్నారు. ఏది ఏమైనా, ఎలాగైతే ఆహారం ఆకలిని తగ్గించి, దానిని తీరుస్తుందో, అలాగే సరైన స్నేహబంధాలు కూడా ఒంటరితనాన్ని తగ్గించగలవు లేక దానిని పూర్తిగా రూపుమాపగలవు. అంతేకాక, మంచి స్నేహితులుండడం అనేది అసాధ్యమేమీ కాదు.

మానవులు సాహచర్యము యొక్క అవసరతతోనే సృష్టించబడ్డారు. (ఆదికాండము 2:18) నిజమైన స్నేహితుడు లేదా సహచరుడు ‘దుర్దశలో సహోదరునిగా ఉంటాడు’ అని బైబిలు చెబుతుంది. (సామెతలు 17:17) అందువల్ల, నిజమైన స్నేహితులు సహాయం అవసరమున్నప్పుడు ఒకరినొకరు అడగగల్గాలి. అయితే, స్నేహబంధం అంటే సహాయం అవసరమైనప్పుడు అడగడానికి ఒకరు ఉండడం లేదా పనిచేయడానికి లేదా ఆడుకోవడానికి ఒక సహచరుడు ఉండడం అనే దానికన్నా మించినదే. మంచి స్నేహితులు ఒకరి సద్గుణాలను మరొకరు వృద్ధిచేస్తారు. ‘ఇనుముచేత ఇనుము పదునవుతుంది, అలా ఒకడు తన చెలికాడిని మరింత పదును చేస్తాడు’ అని సామెతలు 27:17 చెబుతుంది. ఇనుముతో చేయబడిన బ్లేడును పదును చేసేందుకు ఒక ఇనుప ముక్కను ఉపయోగించగలిగేటట్లే, ఒక స్నేహితుడు మరొకని మేథస్సుకు మరియు ఆత్మీయ పరిస్థితికి పదునుపెట్టడంలో సఫలులు కావచ్చు. ఆశాభంగం మనలను కృంగదీస్తున్నట్లయితే, ఒక స్నేహితుని సహానుభూతితో కూడిన చూపు మరియు లేఖనాధారితమైన ప్రోత్సాహం ఎంతో బలపరచేవిగా ఉండగలవు.

బైబిలులో స్నేహమనేది ప్రేమ, పరిచయం, నమ్మకం, సాహచర్యములతో ముడిపెట్టబడి ఉంది. స్నేహబంధాల్లో పొరుగువారు, తోటిపనివారు మున్నగువారు ఇమిడి ఉండవచ్చు. కొంతమంది బంధువులను కూడా తమ అతి సన్నిహిత స్నేహితులుగా కొందరు ఎంచుతారు. అయితే, నేడు చాలామందికి నిజమైన స్నేహితులను కనుగొనడం, మరియు దానిని కాపాడుకోవడమూ కష్టం. ఎందుకిదిలా? మీరు నిజమైన నిలిచే స్నేహబంధాలను ఆస్వాదించగలరా?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి