కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 2/15 పేజీలు 8-13
  • ఆనందంతో కేకలు వేయడానికి మనకు కారణముంది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆనందంతో కేకలు వేయడానికి మనకు కారణముంది
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆనందించాల్సిన అవసరమున్న ప్రజలు
  • మారిన పరిస్థితినిబట్టి ఆనందించడం
  • దేశాన్ని పరదైసువలె చేయడం
  • పరదైసు పునఃస్థాపించబడింది!
    యెషయా ప్రవచనం—సర్వమానవాళికి వెలుగు సంపుటి I
  • ఇప్పుడు మరియు నిరంతరం ఆనందమయంగా ఉండడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • మీకు పరదైసు నిరీక్షణ ఉందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • ‘నేను సృజించుచున్నదానిగూర్చి మీరు ఎల్లప్పుడు ఆనందించుడి’
    యెషయా ప్రవచనం—సర్వమానవాళికి వెలుగు సంపుటి II
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 2/15 పేజీలు 8-13

ఆనందంతో కేకలు వేయడానికి మనకు కారణముంది

“వారు ఆనందసంతోషములు గలవారై వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును.”—యెషయా 35:9.

1. ఆనందించడానికి నేడు విశేష కారణం కల్గివున్నదెవరు?

ఈ రోజుల్లో తక్కువ మంది ప్రజలు నిజమైన ఆనందాన్ని కల్గివున్నట్లు మీరు గమనించేవుంటారు. అయినా నిజ క్రైస్తవులుగా యెహోవాసాక్షులకు ఆనందం ఉంది. సాక్షులతో సహవసిస్తున్న ఇంకా బాప్తిస్మం పొందని లక్షలాదిమంది యౌవనులు వృద్ధుల ఎదుట అదే ఆనందాన్ని పొందే ఉత్తరాపేక్ష సిద్ధంగా ఉంది. ఈ పత్రికలోని ఈ మాటల్ని మీరు ఇప్పుడు చదువుతున్నారనే వాస్తవం ఈ ఆనందం ఇప్పటికే మీదని లేక మీరు దాన్ని పొందగలరని తెలియజేస్తుంది.

2. క్రైస్తవుల ఆనందం, అనేక ప్రజల సాధారణ స్థితినుండి ఎలా భిన్నంగావుంది?

2 తమ జీవితాలలో ఏదో కొరతవుందని అనేకమంది ప్రజలు గుర్తిస్తారు. మీ విషయమేమిటి? నిజమే, మీరు ఉపయోగించగల ప్రతి వస్తువు మీకు ఉండకపోవచ్చు అంటే ఈనాటి ధనవంతులు, బలవంతులకు ఉన్నవన్నీ నిశ్చయంగా మీకు లేకపోవచ్చు. మీరు మంచి ఆరోగ్యాన్ని బలాన్ని కల్గివుండాలనుకోవచ్చు. అయినప్పటికీ, ఆనందం విషయానికొస్తే భూమిపైనున్న కోట్లాదిమందికన్నా మీరే ధనవంతులు ఆరోగ్యవంతులని నిస్సంకోచంగా చెప్పవచ్చు. అదెలా?

3. ఏ అర్థవంతమైన పదాలు మన అవధానాన్ని పొందే అర్హత కలిగివున్నవి, ఎందుకు?

3 యేసు మాటలను జ్ఞప్తికి తెచ్చుకోండి: “మీయందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను.” (యోహాను 15:11) “మీ సంతోషము పరిపూర్ణము కావలెను.” ఎంత గొప్ప వర్ణనో కదా! క్రైస్తవ జీవన విధానం యొక్క లోతైన పఠనం మనం పూర్తిగా ఆనందించడం కొరకైన అనేక కారణాల్ని బయల్పరుస్తుంది. అయితే ప్రస్తుతం, యెషయా 35:9లోని కొన్ని అర్థవంతమైన పదాలను గమనించండి. అవి నేడు మనకు ఎంతో వర్తిస్తాయి గనుకనే అవి అర్థవంతమైనవి. మనమిలా చదువుతాం: “యెహోవా విమోచించినవారు పాటలు పాడుచు (“ఆనందంతో కేకలు వేయుచు,” NW) తిరిగి సీయోనుకు వచ్చెదరు; వారి తలలమీద నిత్యానందముండును. వారు ఆనందసంతోషములు గలవారై వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును.”

4. యెషయా 35:9లో ఏ రకమైన ఆనందం ప్రస్తావించబడింది మరి దీనికి మనమెందుకు అవధానాన్ని ఇవ్వాలి?

4 “నిత్యానందముండును.” ‘నిత్యం’ అనే పదం హెబ్రీ భాషలో యెషయా వ్రాసిన దాని యొక్క సరియైన భాషాంతరీకరణయే. కాని ఇతర లేఖనాల్లో ఉన్నట్లుగా ఈ లేఖనములోని ప్రాముఖ్యత ‘నిత్యత్వం’ అనేదే. (కీర్తన 45:6; 90:2; యెషయా 40:28) కాబట్టి నిత్యానందాన్ని అనుమతించే పరిస్థితుల్లో—అవును, సమర్థనీయమైన రీతిలో—ఆనందం అంతం లేనిదౌతుంది. అది సంతోషభరితమైందిగా అన్పించటం లేదా? అయితే, ‘నా అనుదిన సమస్యలు మరియు చింతలు నాకెంత ప్రాముఖ్యమో అది అంత ప్రాముఖ్యం కాదు’ అని మీరు భావించేలా చేస్తూ బహుశా ఆ వచనం ఒక అస్వాభావిక పరిస్థితి యొక్క వివరణగా మీకు అనిపించవచ్చు. యెషయా 35:9లోని ప్రవచనాత్మక వాగ్దానం నేడు మీ విషయంలో భావాన్ని కల్గివుంది. ఈ చక్కని అధ్యాయాన్ని, అంటే యెషయా 35లోని పూర్వపర సందర్భంలోని ప్రతి భాగం ఎలా గుర్తింపబడిందో కనుగొనేందుకు దాన్ని మనం పరిశీలిద్దాం. మనం తెలుసుకొనే దానినిబట్టి మీరు నిశ్చయంగా ఆనందిస్తారని నమ్మవచ్చు.

ఆనందించాల్సిన అవసరమున్న ప్రజలు

5. యెషయా 35వ అధ్యాయం ఏ ప్రవచనాత్మకమైన ఏర్పాటునందు అమరివుంది?

5 ఓ సహాయకంగా, ఈ అపూర్వమైన ప్రవచనం కొరకు ఏర్పాటు చేయబడిన కొంత పూర్వ ప్రకరణంవైపు అంటే పూర్వ చరిత్రవైపు మన దృష్టిని సారిద్దాం. హెబ్రీ ప్రవక్తయైన యెషయా ఈ గ్రంథాన్ని సుమారు సా.శ.పూ. 732లో వ్రాశాడు. బబులోను సైన్యాలు యెరూషలేమును నాశనం చేయడానికి కొన్ని దశాబ్దాల ముందు అది జరిగింది. యెషయా 34:1, 2లో సూచిస్తున్నట్లుగా రాష్ట్రములపై (“దేశాలపై,” NW) దేవుడు తన ప్రతీకారాన్ని వ్యక్తపరుస్తున్నాడు, అందులో యెషయా 34:6లో ప్రస్తావించబడిన ఎదోము కూడా చేరివుంది. అలా చేయడానికి ఆయన బబులోనీయులను ఉపయోగించాడనేది సుస్పష్టం. అదేవిధంగా యూదుల అవిశ్వాసాన్నిబట్టి యూదాను నాశనం చేయడానికి దేవుడు బబులోనీయులను ఉపయోగించుకున్నాడు. ఫలితమేమిటి? దేవుని ప్రజలు చెర కొనిపోబడ్డారు, వారి స్వదేశం 70 సంవత్సరాలు నిర్మానుష్యంగా విడువబడింది.—2 దినవృత్తాంతములు 36:15-21.

6. ఎదోమీయుల పైకి రానైయున్న దానికి, యూదుల పైకి రానైయున్న దానికి మధ్య ఏ వ్యత్యాసం ఉంది?

6 అయినప్పటికీ, ఎదోమీయులకు యూదులకు మధ్య ఓ ప్రాముఖ్యమైన వ్యత్యాసం ఉంది. ఎదోమీయులపైకి వచ్చిన దైవిక ఉగ్రత ఎన్నటికీ అంతంకానిది; చివరకు వారు ఓ ప్రజగా కనుమరుగైపోయారు. అవును, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పెట్రా శిథిలాల వంటి ఎదోమీయులు నివసించిన ప్రాంతంలోని ఖాళీ శిథిలాలను మీరు ఇప్పటికీ సందర్శించగలరు. కానీ నేడు, ‘ఎదోమీయులుగా’ గుర్తించబడిన ఏ జనాంగమూ లేదు లేక ప్రజలూ లేరు. అయితే, బబులోనీయులు పాడుగా విడిచిపెట్టిన యూదా దేశం నిరంతరం విడువబడిందా, అంటే నిరంతరం ఆనందరహిత దేశంగా విడువబడిందా?

7. యెషయా 35వ అధ్యాయంలో సూచించబడిన దానికి బబులోనులో చెరపట్టబడిన యూదులు ఎలా ప్రతిస్పందించి ఉండవచ్చు?

7 యెషయా 35వ అధ్యాయంలోని ఈ అద్భుతమైన ప్రవచనం ఇక్కడ ఉత్తేజపర్చే భావాన్ని కల్గివుంది. సా.శ.పూ. 537లో యూదులు తమ స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు దీని మొదటి నెరవేర్పు జరిగినందున ఇది పునరుద్ధరణ ప్రవచనమని పిలువబడ్తుంది. బబులోనులో చెరగానున్న ఇశ్రాయేలీయులు తమ స్వదేశానికి వెళ్లడానికి స్వాతంత్ర్యం ఇవ్వబడింది. (ఎజ్రా 1:1-11) అయిననూ ఇది జరిగేంత వరకు ఈ దైవిక ప్రవచనాన్ని పరిగణలోనికి తీసుకున్న, బబులోనులో చెరపట్టబడిన యూదులు తమ జాతీయ స్వదేశమైన యూదాలో తాము ఎటువంటి పరిస్థితులను చూడబోతామోనని ఆశ్చర్యపోయి ఉండవచ్చు. వారే పరిస్థితిలో ఉంటారు? దానికిగల జవాబు, ఆనందంతో కేకలు వేయడానికి నిజంగా మనకు కారణమున్నదనే విషయానికి సూటిగా ముడిపెట్టబడి ఉన్నది. మనం చూద్దాం.

8. బబులోను నుండి తిరిగి స్వదేశానికి వచ్చినప్పుడు యూదులు ఏ పరిస్థితుల్ని కనుగొని ఉంటారు? (యెహెజ్కేలు 19:3-6; హోషేయ 13:8, పోల్చండి.)

8 తమ స్వదేశానికి వారు తిరిగి వెళ్లవచ్చని వినినప్పుడు కూడా ఆ పరిస్థితి యూదులకు కచ్చితం అన్నట్లుగా నిశ్చయంగా కనబడలేదు. ఏడు దశాబ్దాలపాటు అంటే ఓ జీవితకాలంపాటు వారి దేశం పాడుగా విడువబడింది. ఆ దేశానికి ఏమి సంభవించింది? ప్రతి సాగుభూమి ద్రాక్షతోటలు లేక ఫలవృక్షాల తోటలు మరుభూమిగా మారాయి. జలసమృద్ధిగల తోటలు లేదా నిర్దిష్టమైన ప్రాంతాలు ఎండిన బీడు భూములుగా లేక ఎడారులుగా మారాయి. (యెషయా 24:1, 4; 33:9; యెహెజ్కేలు 6:14) క్రూరమృగాలు యథేచ్ఛగా తిరగడాన్ని ఊహించండి. వీటిలో సింహాలు, చిరుత పులులు వంటి మాంస భక్షక జంతువులు చేరివున్నాయి. (1 రాజులు 13:24-28; 2 రాజులు 17:25, 26; పరమగీతము 4:8) పురుషున్ని, స్త్రీని లేక పిల్లవానిని పడగొట్టే సామర్థ్యమున్న ఎలుగుబంట్లను వారు తక్కువ అంచనా వేయలేరు. (1 సమూయేలు 17:34-37; 2 రాజులు 2:24; సామెతలు 17:12) రక్తపింజరి మరితర విష సర్పాలను లేక తేళ్లను గురించి ఇక ప్రస్తావించనవసరం లేదు. (ఆదికాండము 49:17; ద్వితీయోపదేశకాండము 32:33; యోబు 20:16; కీర్తన 58:4; 140:3; లూకా 10:19) సా.శ.పూ. 537లో బబులోను నుండి తిరిగి వచ్చిన యూదులతోపాటు మీరూ ఉన్నట్లైతే అలాంటి ప్రాంతంలో సంచరించడానికి మీరు వెనుకంజ వేసివుండేవారు. వారు అక్కడికి వెళ్లినప్పుడు అది పరదైసు కాదు.

9. ఏ కారణాన్నిబట్టి తిరిగి వచ్చినవారు నిరీక్షణా నమ్మకాల కొరకొక ఆధారాన్ని కలిగివున్నారు?

9 అయినప్పటికీ, యెహోవాయే తన ఆరాధికులను స్వదేశానికి తెచ్చాడు, పాడుపడిన పరిస్థితిని పూర్తిగా మార్చివేయగల సామర్థ్యం ఆయనకుంది. సృష్టికర్త అలా చేయగలడని మీరు నమ్ముతారా? (యోబు 42:2; యిర్మీయా 32:17, 21, 27, 37, 41) కాబట్టి, తిరిగి వస్తున్న యూదులకు మరి వారి దేశానికి—ఆయన ఏమి చేయబోతున్నాడు—ఆయన ఏమి చేశాడు? ఆధునిక కాలాల్లోని దేవుని ప్రజలపై ఇది ఏ ప్రభావాన్ని కల్గివుంది మరియు మీ ప్రస్తుత, భవిష్యత్‌ పరిస్థితిపై అదెలాంటి ప్రభావం చూపుతుంది? సరే, ఆనాడేమి జరిగిందో మనం మొదట పరిశీలిద్దాము.

మారిన పరిస్థితినిబట్టి ఆనందించడం

10. యెషయా 35:1, 2 ఏ మార్పును ప్రవచించింది?

10 పాడుగా విడువబడిన ఆ దేశానికి తిరిగి వెళ్లడానికి యూదులను కోరెషు అనుమతించినప్పుడు ఏమి జరిగింది? యెషయా 35:1, 2లోని ఈ పులకరింపజేసే ప్రవచనాన్ని చదవండి: “అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరిపుష్పమువలె పూయును. అది బహుగా పూయుచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును, లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మెలు షారోనులకున్న సొగసు దానికుండును. అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును.”

11. దేశాన్ని గురించి తనకు తెలిసిన ఏ విషయాన్ని యెషయా ఉపయోగించాడు?

11 బైబిలు కాలాల్లో, లెబానోను కర్మెలు షారోనులు పచ్చదనంతో నిండివున్న అందానికి పేరుగాంచాయి. (1 దినవృత్తాంతములు 5:16; 27:29; 2 దినవృత్తాంతములు 26:10; పరమగీతము 2:1; 4:15; హోషేయ 14:5-7) దేవుని సహాయంతో మార్చబడిన దేశం ఎలా ఉంటుందో వర్ణించేందుకు ఆ ఉదాహరణలపై యెషయా అవధానాన్ని నిలిపాడు. అయినా ఇది ప్రభావితం చేసేది నేలపై జరిగే మార్పులను మాత్రమేనా? కానేకాదు!

12. యెషయా 35వ అధ్యాయంలోని ప్రవచనం ప్రజలపై కేంద్రీకరించబడిందని మనమెందుకు చెప్పగలం?

12 దేశం ‘ఉల్లసిస్తుంది మరియు ఉల్లసించి సంగీతం పాడుతుందని’ యెషయా 35:2వ వచనం చెబుతున్నది. నిజానికి నేల, మొక్కలు అక్షరార్థంగా “ఉల్లసించ”వని మనకు తెలుసు. అయితే అవి సారవంతంగా ఫలదాయకంగా మారడం ప్రజలు అలా భావించడానికి కారణమౌతుంది. (లేవీయకాండము 23:37-40; ద్వితీయోపదేశకాండము 16:15; కీర్తన 126:5, 6; యెషయా 16:10; యిర్మీయా 25:30; 48:33) దేశంలో జరిగే అక్షరార్థమైన మార్పులు ప్రజల్లోని మార్పులకు సారూప్యంగా ఉంటాయి, ఎందుకంటే ప్రజలే ఈ ప్రవచనానికి కేంద్రస్థానం. కాబట్టి, తిరిగి వచ్చిన యూదుల్లోని మార్పులపై, విశేషంగా వారి ఆనందంపై ప్రాథమికంగా కేంద్రీకరించబడుతున్న యెషయా మాటల్ని అవగాహన చేసుకోవడానికి మనకు కారణముంది.

13, 14. యెషయా 35:3, 4 వచనాలయందు ప్రజల్లోని ఏ మార్పులు ప్రవచించబడ్డాయి?

13 అదే ప్రకారంగా, యూదులు విమోచించబడి, బబులోను నుండి తిరిగి వచ్చిన తర్వాత అదెలా నెరవేరిందో చూసేందుకు ఈ ప్రోత్సాహకరమైన ప్రవచనాన్ని మనం మరింతగా పరిశీలిద్దాం. తిరిగివచ్చిన ప్రజల్లోని ఇతర మార్పులను గురించి యెషయా 35:3, 4 వచనాలయందు యెషయా ఇలా మాట్లాడుతున్నాడు: “సడలిన చేతులను బలపరచుడి తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి. తత్తరిల్లు హృదయులతో ఇట్లనుడి—భయపడక ధైర్యముగా ఉండుడి ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతికారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును.”

14 పాడైపోయిన భూమిని పూర్తిగా మార్చివేయగల్గే మన దేవుడు, తన ఆరాధికులయందు ఎంతో ఆసక్తిని కల్గి ఉన్నాడన్న విషయాన్ని గురించి ఆలోచించడం మనల్ని బలపర్చదా? చెరగొనిపోబడిన యూదులు బలహీనులుగా, కృంగిపోయినవారిగా భావించాలని లేక భవిష్యత్తును గురించి చింతాక్రాంతులై ఉండాలని ఆయన కోరుకోలేదు. (హెబ్రీయులు 12:12) చెరపట్టబడిన ఆ యూదుల పరిస్థితిని గురించి ఆలోచించండి. తమ భవిష్యత్తును గూర్చిన దేవుని ప్రవచనాల నుండి వారు నిరీక్షణను పొందడం మినహా, ఆశావాదులుగా ఉండడం వారికి కష్టమై ఉంటుంది. సంచరించడానికి మరియు యెహోవా సేవలో చురుకుగా ఉండడానికి స్వేచ్ఛలేనట్లుగా, వారు ఒక చీకటి కారాగృహంలో ఉన్నట్టుంది. ఏవిధమైన భవిష్యత్‌ నిరీక్షణా లేనట్లుగా వారికి అది కన్పించవచ్చు.—ద్వితీయోపదేశకాండము 28:29; యెషయా 59:10, పోల్చండి.

15, 16. (ఎ) తిరిగి వచ్చినవారి నిమిత్తం యెహోవా ఏమి చేశాడనే నిర్ధారణకు మనం రావచ్చు? (బి) తిరిగి వచ్చినవారు అద్భుతమైన భౌతిక స్వస్థతల్ని ఎందుకు ఎదురు చూడలేదు, అయితే యెషయా 35:5, 6 వచనాలకు తగినట్లు దేవుడు ఏమి చేశాడు?

15 అయినా, స్వదేశానికి వెళ్లేందుకు వారిని విడుదల చేయడానికి యెహోవా కోరెషును ఉపయోగించుకోవడం ఎంతటి మార్పు తెచ్చిందో కదా! తిరిగివస్తున్న యూదుల్లో అంధులైన వారెవరి కళ్ళనైనా దేవుడు అద్భుతంగా తెరిచినట్లు, బధిరులెవరైనా వినేలా చేసినట్లు లేక అంగహీనులనెవరినైనా బాగుచేసినట్లు రుజువేమీ లేదు. అయితే ఆయన నిజానికి అంతకన్నా ఎక్కువే చేశాడు. ఆయన వారి అభిమాన దేశ వెలుగును స్వాతంత్ర్యాన్ని వారికి పునరుద్ధరించాడు.

16 అటువంటి అద్భుతమైన భౌతిక స్వస్థతలను యెహోవా చేస్తాడని తిరిగివచ్చిన వారు ఎదురు చూశారనేందుకు ఎటువంటి సూచన లేదు. ఇస్సాకు, సమ్సోను, లేక ఏలీ విషయంలో దేవుడు అలా చేయలేదని వారు గుర్తించి ఉండవచ్చు. (ఆదికాండము 27:1; న్యాయాధిపతులు 16:21, 26-30; 1 సమూయేలు 3:2-8; 4:15) కాని వారు తమ పరిస్థితి యొక్క దైవిక మార్పును అలంకారికంగా ఎదురు చూసివుంటే, వారు నిరుత్సాహాన్ని పొందలేదు. కచ్చితంగా అలంకారిక భావంలోనే యెషయా 35:5, 6 వచనాల్లో ఒక వాస్తవమైన నెరవేర్పు ఉంది. యెషయా కచ్చితంగానే ఇలా ప్రవచించాడు: “గ్రుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పివలె గంతులు వేయును, మూగవాని నాలుక పాడును.”

దేశాన్ని పరదైసువలె చేయడం

17. యెహోవా ఏ భౌతిక మార్పుల్ని తీసుకొచ్చాడు?

17 వాగ్దాన దేశానికి ఇప్పుడు తిరిగివచ్చిన యూదులు యెషయా ఈ క్రింది విధంగా వర్ణించిన పరిస్థితులవంటి పరిస్థితుల్నిబట్టి ఆనందంతో కేకలు వేయడానికి కారణముంది: “అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును, ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటిబుగ్గలు పుట్టును, నక్కలు పండుకొనినవాటి ఉనికిపట్టులో జమ్మును తుంగగడ్డియు మేతయు పుట్టును.” (యెషయా 35:6బి, 7) ఆ యావత్‌ ప్రాంతమూ అలా ఉండటాన్ని మనమీనాడు చూడలేకపోయినప్పటికీ, ఆ యూదా ప్రాంతం ఒకప్పుడు “పచ్చని పరదైసు”గా ఉండేదని రుజువు తెలియజేస్తుంది.a

18. తిరిగివచ్చిన యూదులు దేవుని ఆశీర్వాదాలకు ఏవిధంగా ప్రతిస్పందించి ఉంటారు?

18 ఆనందానికి కారణమయ్యేందుకు, శేషించిన యూదులు వాగ్దాన దేశానికి పంపబడినప్పుడు ఎలా భావించి ఉంటారో ఆలోచించండి! నక్కలకు, మరితర మృగాలకు నివాసిత స్థలంగావున్న ఈ ఎండిన భూమిని తీసుకొని, దానిని మార్చే ఆధిక్యతను వారు కలిగివుండిరి. విశేషంగా దేవుడు మీ ప్రయత్నాలను ఆశీర్వదిస్తున్నాడని మీకు తెలిస్తే, అలాంటి పునరుద్ధరణ పనిలో మీరు ఆనందించి ఉండరా?

19. బబులోను చెర నుండి తిరిగి రావడం ఏ భావంలో షరతుతో కూడినది?

19 అయితే విషయం, ఆ ఆనందభరితమైన మార్పులో భాగంవహించేందుకు, బబులోనులో చెరపట్టబడివున్న యూదులలో ఎవరైనా లేక అందరూ తిరిగి వెళ్లగలరా లేక వెళ్లారా అన్నదే కాదు. దేవుడు షరతులను ఉంచాడు. బబులోనీయ, అన్య మత సిద్ధాంతాలతో కలుషితమైపోయిన వారెవరికీ తిరిగి వచ్చే హక్కులేదు. (దానియేలు 5:1, 4, 22, 23; యెషయా 52:11) అజ్ఞానయుక్తమైన విధానాన్ని మూర్ఖంగా అలవర్చుకున్న వారెవరైనా తిరిగిరాలేరు. అలాంటి వారందరూ అనర్హులయ్యారు. మరో వైపున, దేవుని ప్రమాణాలను చేరుకున్న వారు, సాపేక్షికార్థంలో పరిశుద్ధులుగా ఆయన చేత పరిగణించబడిన వారు యూదాకు తిరిగి రాగలిగారు. పరిశుద్ధ మార్గంలో వచ్చినట్లుగా వారు ప్రయాణించగలిగారు. యెషయా 35:8వ వచనంలో యెషయా దానిని ఇలా స్పష్టపర్చాడు: “అక్కడ దారిగా నున్న రాజమార్గము ఏర్పడును అది పరిశుద్ధ మార్గమనబడును అది అపవిత్రులు పోకూడని మార్గము అది మార్గమున పోవువారికి ఏర్పరచబడును మూఢులైనను దానిలో నడచుచు త్రోవను తప్పక యుందురు [“ఏ మూఢుడూ దానిలో సంచరించడు” NW].

20. యూదులు తిరిగివచ్చినప్పుడు వారు దేనికి భయపడాల్సిన అవసరం లేకుండెను, ఏ ప్రతిఫలంతో?

20 మృగప్రాయులైన మనుష్యుల దాడిని లేక దోపిడీదార్లను బట్టి వారు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఎందుకంటే యెహోవా అలాంటి వారు తన విమోచిత ప్రజల మార్గంలో ఉండడానికి అనుమతించడు. కాబట్టి వారు ఆనందమయమైన ఆశావాదంతోనూ సంతోషకరమైన ఉత్తరాపేక్షలతోను ప్రయాణించగల్గుతారు. ఈ ప్రవచన ముగింపులో యెషయా దానిని ఎలా వర్ణించాడో గమనించండి: “అక్కడ సింహముండదు క్రూరజంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు విమోచింపబడినవారే అక్కడ నడచుదురు యెహోవా విమోచించినవారు పాటలుపాడుచు తిరిగి సీయోనునకు వచ్చెదరు వారి తలలమీద నిత్యానందముండును వారు ఆనందసంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును.”—యెషయా 35:9.

21. ఇప్పటికే జరిగిపోయిన యెషయా 35వ అధ్యాయం యొక్క నెరవేర్పును నేడు మనమెలా దృష్టించాలి?

21 మనకు ఇక్కడ ఎంత చక్కని ప్రవచనాత్మక చిత్రీకరణ ఉన్నదో కదా! అయితే, దీనిని మన పరిస్థితితోను లేక భవిష్యత్తుతోను ఏమీ సంబంధంలేని ఒక అందమైన వృత్తాంతం అన్నట్లుగా గతించిన చరిత్రవలె మనం దృష్టించకూడదు. ఈ ప్రవచనం, దేవుని ప్రజల్లో నేడు ఓ ఆశ్చర్యకరమైన నెరవేర్పును కల్గివుందన్న విషయం ఒక వాస్తవం, కాబట్టి అది మనలో ప్రతిఒక్కరికి నిజంగా సంబంధించిందే. ఆనందంతో కేకలు వేయడానికి తగిన కారణాన్ని అది మనకు ఇస్తోంది. ఇప్పుడు మరియు భవిష్యత్తులో మీ జీవితమందు చేరివున్న ఈ అంశాలు తర్వాతి శీర్షికలో ప్రస్తావించబడ్డాయి.

[అధస్సూచీలు]

a వ్యవసాయ శాస్త్రవేత్తయైన (ఐక్యరాజ్య సమితి ఆహార, వ్యవసాయ సంస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్న) వాల్టర్‌ సి. లాడర్‌మిల్క్‌ ఆ ప్రాంతాన్ని గూర్చిన తన అధ్యయనాల నుండి ఇలా నిర్ధారించాడు: “ఈ దేశం ఒకప్పుడు పచ్చని పరదైసుగా ఉంది.” “రోమీయుల కాలం నుండి,” అక్కడి వాతావరణం ఎక్కువగా మార్పుచెందలేదని మరియు “ఒకప్పుడు వర్థిల్లుతున్న దేశం ‘ఎడారి’గా మారడానికి కారణం ప్రకృతి కాదు మానవుడే” అని కూడా ఆయన సూచించాడు.

మీరు జ్ఞాపకం చేసుకోగలరా?

◻ యెషయా 35వ అధ్యాయం ఎప్పుడు దాని మొదటి నెరవేర్పును కల్గివుంది?

◻ ప్రవచనం యొక్క ప్రాథమిక నెరవేర్పు ఏ ప్రతిఫలాన్ని కల్గిస్తుంది?

◻ యెషయా 35:5, 6 వచనాల్ని యెహోవా ఎలా నెరవేర్చాడు?

◻ తిరిగి వచ్చిన యూదులు తమ దేశంలోను మరి పరిస్థితిలోనూ ఏ మార్పులను అనుభవించారు?

[9వ పేజీలోని చిత్రం]

ఒకప్పుడు ఎదోమీయులు నివసించిన పెట్రా శిథిలాలు

[క్రెడిట్‌ లైను]

Garo Nalbandian

[10వ పేజీలోని చిత్రం]

యూదులు చెరలో ఉండగా యూదా ప్రాంతంలో అధికం మరుభూమిగా మారి, ఎలుగుబంట్లు, సింహాల వంటి భయంకరమైన మృగాలతో నిండిపోయింది

[క్రెడిట్‌ లైను]

Garo Nalbandian

Bear and Lion: Safari-Zoo of Ramat-Gan, Tel Aviv

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి