కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 1/15 పేజీలు 26-29
  • ఓ అంధకార యుగాన్ని అంతమొందించిన వెలుగు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఓ అంధకార యుగాన్ని అంతమొందించిన వెలుగు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పర్షియా కాలంనాటి యూదా జీవనం
  • గ్రీసు కాలం
  • మత మార్పులు
  • యూదామతం వివిధ ఏకాభిప్రాయ వర్గాల్ని ఆహ్వానించాయి
  • లోకాన్నే మార్చిన ఒక బైబిలు అనువాదం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • మక్కబీయులు ఎవరు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • హస్మోనియన్లు వారి ప్రభావం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • “పరిసయ్యులు, సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్తపడండి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 1/15 పేజీలు 26-29

ఓ అంధకార యుగాన్ని అంతమొందించిన వెలుగు

యేసుక్రీస్తు మరియు ఆయన అపొస్తలులు జీవించిన ప్రపంచం, హెబ్రీ లేఖనాల కాలంనాటి ప్రపంచానికి ఎంతో భిన్నమైనది. ఈ విషయం తెలియని బైబిలు పాఠకులు, ప్రవక్తయైన మలాకీ నుండి సువార్త రచయితయైన మత్తయి మధ్యనున్న 400 సంవత్సరాల కాలంలో జరిగిన దానిని స్పష్టంగా గ్రహించకుండా మలాకీ నుండి మత్తయి వరకు ఒకే విధమైన సామాజిక, మత పరిస్థితులు కొనసాగాయని ఊహించవచ్చు.

ప్రస్తుత కాలంలోని అనేక బైబిళ్లలో హెబ్రీ లేఖనాల చివరి పుస్తకమైన మలాకీ, ఇశ్రాయేలీయుల శేషం బబులోను చెరనుండి విడిపింపబడిన తర్వాత తమ స్వదేశంలో మళ్లీ స్థిరపడడంతో ముగుస్తుంది. (యిర్మీయా 23:3) ప్రపంచంలోని దుష్టత్వాన్ని తుడిచివేసి, మెస్సీయ యుగాన్ని పరిచయంచేసే దేవుని తీర్పు దినం కొరకు వేచివుండేందుకు దైవ-భక్తిగల యూదులు ప్రోత్సహింపబడ్డారు. (మలాకీ 4:1, 2) ఈ మధ్య కాలంలో పర్షియా పరిపాలించింది. యూదాలో బసచేసిన పర్షియా దళాలు, సైనిక శక్తి ద్వారా శాంతిని కాపాడి రాజరిక శాసనాలను ఉన్నతపర్చాయి.—ఎజ్రా 4:23, పోల్చండి.

అయితే, ఆ తర్వాతి నాలుగు శతాబ్దాలలోను బైబిలు ప్రాంతాలు మార్పు చెందకుండా ఉండలేదు. ఆత్మీయ అంధకారం మరియు గందరగోళం వాటిలోనికి ప్రవేశించడం ఆరంభమైంది. తూర్పు సామీప్య ప్రాంతాలు హింస, ఉగ్రవాదం, అణచివేత, మతపరమైన హేతువాద ఆలోచనలు, నిరర్థక తత్వజ్ఞానం మరియు సాంస్కృతిక దిగ్భ్రాంతులతో గగుర్పాటు చెందాయి.

క్రైస్తవ గ్రీకు లేఖనాల మొదటి పుస్తకమైన మత్తయి , ఓ భిన్నమైన శకంలో వ్రాయబడింది. రోమా సైన్యాలు పాక్స్‌ రోమానా లేక రోమా శాంతిని బలాత్కారంగా విధించాయి. బాధల్ని, క్రూరత్వాన్ని మరియు బీదరికాన్ని నిర్మూలించి, జీవితం, సంపద, ఉపశమనాలపై వెలుగును ప్రసరింపచేసేందుకు మెస్సీయ రాక కొరకు భక్తిగల ప్రజలు ఆసక్తితో ఎదురుచూశారు. (లూకా 1:67-79; 24:21; 2 తిమోతి 1:10, పోల్చండి.) యేసుక్రీస్తు జన్మించడానికి పూర్వమున్న శతాబ్దాల్లో యూదా సమాజాకృతిని మార్చిన బలమైన శక్తుల్ని మరింత సునిశితంగా పరిశీలిద్దాం.

పర్షియా కాలంనాటి యూదా జీవనం

సా.శ.పూ. 537లో బబులోను చెరనుండి యూదుల విడుదలను గూర్చిన కోరెషు ప్రకటన తర్వాత యూదుల సమూహం, యూదాయేతర సహవాసులూ బబులోనును విడిచిపెట్టారు. ఆత్మీయంగా ప్రతిస్పందింపబడిన ఈ శేషం, నాశనం చేయబడిన పట్టణాల యొక్క ప్రాంతానికి, నిర్జన ప్రదేశానికి వచ్చారు. ఎదోమీయులు, ఫినోసియన్లు, సమరయులు, అరబ్బీ తెగలు మరితరులు ఇశ్రాయేలీయుల ఒకప్పటి విశాలమైన ప్రాంతాన్ని హరించివేశారు. యూదా, బెన్యామీను గోత్రాలకు మిగిలిన ప్రాంతం, పర్షియన్‌ సామ్రాజ్యంలో (నదికి ఆవలివున్న) ఆబాఅర్‌ నాహారా అని పిలువబడిన యూదా రాష్ట్రంగా తయారైంది.—ఎజ్రా 1:1-4; 2:64, 65.

పర్షియా పాలన క్రింద, యూదా “ఓ విస్తరణా కాలాన్ని, జనాబా పెరుగుదలను” చవిచూడడం ఆరంభించిందని ది కేంబ్రిడ్జ్‌ హిస్టరీ ఆఫ్‌ జూడయిజమ్‌ తెలియజేస్తోంది. యెరూషలేమును గూర్చి అదింకా ఇలా తెలియజేస్తోంది: “కర్షకవర్గం, యాత్రికులు కానుకలు తెచ్చారు, ఆలయం, పట్టణం ఐశ్వర్యవంతమయ్యాయి, వాటి సంపద విదేశీ వ్యాపారుల్ని, చేతి పనులు చేసే వారిని ఆకర్షించింది.” పర్షియన్లు స్థానిక ప్రభుత్వం విషయంలోనూ మతం విషయంలోనూ ఎంతో సహనాన్ని కలిగివున్నా, పన్నులు భారంగా ఉండేవి మరియు ప్రశస్తమైన లోహాల రూపంలో మాత్రమే వాటిని చెల్లించాలి.—నెహెమ్యా 5:1-5, 15; 9:36, 37; 13:15, 16, 20, పోల్చండి.

పర్షియన్‌ సామ్రాజ్యపు చివరి సంవత్సరాలు, మండలాధిపతుల తిరుగుబాటుచే గుర్తింపబడిన తీవ్రమైన సంక్షోభం కల్గిన సమయాలు. మెడిటరేనియన్‌ తీరం వెంబడి జరిగిన తిరుగుబాటులో అనేకమంది యూదులు చేరారు మరియు వారు ఉత్తరానికి దూరంగానూ కాస్ఫియన్‌ సముద్ర తీరానున్న హిర్కానియాకూ వెళ్లగొట్టబడ్డారు. అయినా, యూదుల్లో అనేకమంది పర్షియాచే విధింపబడిన శిక్షకు గురైనట్లుగా కన్పించడం లేదు.

గ్రీసు కాలం

సా.శ.పూ. 332లో మధ్య ప్రాచ్య ప్రాంతంపైకి అలెగ్జాండర్‌ ది గ్రేట్‌ చిఱుతపులివలె దుమికినా, గ్రీకు ఎగుమతుల ఎడల అభిరుచి ఆయనకన్నా ముందే ఉండేది. (దానియేలు 7:6) గ్రీకు నాగరికత రాజకీయ విలువ కల్గినదని గుర్తెరిగి, ఆయన తన విస్తృతమౌతున్న సామ్రాజ్యాన్ని ఉద్దేశపూర్వకంగా హెల్లేనీయం చేయడం ఆరంభించాడు. గ్రీకు భాష అంతర్జాతీయ భాషగా మారింది. అలెగ్జాండరు యొక్క తక్కువ కాల పరిపాలన, కుతర్కవాదాల ఎడల ప్రేమ, క్రీడల ఎడల మక్కువ, రసజ్ఞాన కళల ఎడల మెప్పుదలను పెంపొందింపజేసింది. క్రమంగా, యూదా సాంప్రదాయం కూడా హెల్లేనీయవాదానికి మార్గాన్ని తెరిచింది.

సా.శ.పూ. 323లో అలెగ్జాండరు మరణం తరువాత సిరియా, ఐగుప్తులయందు ఆయన ఉత్తరాధికార్లుగా వచ్చినవారు, ప్రవక్తయైన దానియేలు “ఉత్తరదేశపురాజు” మరియు “దక్షిణదేశపురాజు” అని పిలిచిన పాత్రల్ని నెరవేర్చే మొదటి పాత్రధారులు అయ్యారు. (దానియేలు 11:1-19) ఐగుప్తుకి రాజైన టొలెమి II పిలడెల్‌పస్‌ అనే “దక్షిణదేశపురాజు” పరిపాలనా కాలంలో (సా.శ.పూ. 285-246) హెబ్రీలేఖనాలు సామాన్య గ్రీకు భాషయైన కొయినీ గ్రీకులోనికి అనువదించడం ఆరంభమయింది. ఈ వర్షన్‌ సెప్టాజెంట్‌ అని పిలువబడింది. ఈ అనువాదంలో నుండే అనేక వచనాలు క్రైస్తవ గ్రీకు లేఖనాల్లోనికి ఎత్తి వ్రాయబడ్డాయి. ఆత్మీయ గందరగోళంలో, అంధకారంలో ఉన్న ప్రపంచానికి భావాల యొక్క ప్రబోధనాత్మక స్థాయిల్ని తెలియజేయడానికి ఈ గ్రీకు భాష మేలైనదని రుజువైంది.

అంతియొకపసు IV ఎపిఫనెసు సిరియాకు రాజుగానూ పాలస్తీనా పరిపాలకుడుగానూ అయిన తరువాత (సా.శ.పూ. 175-164), ప్రభుత్వ ప్రకటిత హింసచే యూదా మతం దాదాపు తుడిచి పెట్టుకు పోయింది. మరణ భయంతో యూదులు, యెహోవా దేవుని విడిచి గ్రీకు దేవతలకు మాత్రమే బలులర్పించేందుకు బలవంతం చేయబడ్డారు. సా.శ.పూ. 168 డిశంబరు నెలలో యెరూషలేము ఆలయంలోని యెహోవా యొక్క గొప్ప బలిపీఠంపై ఓ అన్యమత బలిపీఠం నిర్మించబడి, దానిపై ఒలింపియన్‌ జియస్‌ అనే దేవతకు అర్పణలు అర్పించబడ్డాయి. జూడాస్‌ మక్కాబీస్‌ నాయకత్వం క్రింద పల్లెసీమల్లోని దిగ్భ్రాంతి చెందినా ధైర్యంగావున్న పురుషులు గుంపుగా సమకూడి, వారు యెరూషలేమును స్వాధీనం చేసుకొనేంత వరకు తీవ్రమైన పోరాటాన్ని పోరాడారు. ఆలయం మరలా దేవునికి ప్రతిష్ఠ చేయబడింది మరియు అది అపవిత్రపర్చబడిన మూడు సంవత్సరాల తర్వాత అనుదిన బల్యర్పణలు మరలా అర్పించబడ్డాయి.

గ్రీకు సామ్రాజ్యం అవసాన కాలంలో, యూదా సమాజానికి చెందిన వారు, తమ ప్రాంతాన్ని దాని ప్రాచీన సరిహద్దుల వరకూ విస్తరింపజేయడానికి తీవ్రంగా ప్రయత్నించారు. భక్తిహీన మార్గంలో క్రొత్తగా కనుగొనిన సైనిక శౌర్యాన్ని వారు అన్యులైన తమ పొరుగువారిని మతమార్పిడి చేయడానికి, ఒప్పుకొకపోతే చంపుతామని భయపెట్టి బలవంతం చేసేందుకు ఉపయోగించారు. అయినప్పటికీ, నగరాల్ని పట్టణాల్ని పరిపాలించడానికి గ్రీకు రాజకీయ సిద్ధాంతమే అమలులోవుంది.

ఈ కాలంలో, ప్రధాన యాజకత్వం కొరకైన పోరాటవాదులు తరచూ భ్రష్టులయ్యారు. కుట్రలు, హత్యలు, రాజకీయ ఎత్తుగడలు వారి అధికారానికి కళంకాన్ని తెచ్చాయి. యూదుల్లో భక్తిహీనస్ఫూర్తి పెరుగుతున్నకొద్దీ, గ్రీకు క్రీడలు మరింత ప్రసిద్ధికెక్కసాగాయి. ఆటల్లో పాల్గొనేందుకు యౌవన యాజకులు తమ కర్తవ్యాల్ని నిర్లక్ష్యపెట్టారని తెలుసుకోవడం ఎంత విస్మయాన్ని కలుగజేస్తుందో కదా! యూదా అథ్లెట్లు నగ్నంగా అన్యులతో పోటీపడినప్పుడు ఇబ్బంది లేకుండా ఉండడానికి, వారు “సున్నతి పొందని” వారిగా అవ్వడానికి బాధాకరమైన శస్త్రచికిత్సను కూడా చేయించుకున్నారు.—1 కొరింథీయులు 7:18 పోల్చండి.

మత మార్పులు

యూదా ప్రవాసానంతర తొలి సంవత్సరాల్లో, విశ్వాసులైన యూదులు హెబ్రీలేఖనాల్లో బయల్పర్చబడిన నిజమైన మతం అన్య సిద్ధాంతాలు మరియు తత్వజ్ఞానాలచే మిశ్రితం కావడాన్ని ప్రతిఘటించారు. 60 సంవత్సరాలకుపైగా పర్షియాతో సన్నిహితంగా సహవసించిన తర్వాత వ్రాయబడిన ఎస్తేరు గ్రంథం, జొరొస్ట్రియా మతానికి సంబంధించిన జాడలేదు. అంతేకాకుండా, బైబిలు పుస్తకాలైన ఎజ్రా, నెహెమ్యా లేక మలాకీ గ్రంథాలు పర్షియా కాలారంభంలో (సా.శ.పూ. 537-443) వ్రాయబడినా వాటియందు పర్షియన్‌ మత ప్రభావం ఏమీ కన్పించదు.

అయితే, పర్షియా కాలం యొక్క చివరి భాగంలో, పర్షియా ముఖ్య దేవతయైన అహురా మజ్దాను ఆరాధికుల్ని గూర్చిన కొన్ని తలంపుల్ని అనేకమంది యూదులు స్వీకరించడం ఆరంభించారని పండితులు విశ్వసిస్తున్నారు. యూదా ఎస్సీనీయుల ప్రఖ్యాతిగాంచిన మూఢాచారాల్లోనూ నమ్మకాల్లోనూ ఇది కన్పిస్తోంది. నక్కలు, ఇతర ఎడారి ప్రాణులు, నిశాచర పక్షుల కొరకు ఉపయోగింపబడిన సాధారణ హెబ్రీ పదాలు యూదులకు దుష్టాత్మలను మరియు బబులోను, పర్షియన్‌ జనాచార నమ్మకమైన నిశాచర వికృతజీవుల్ని జ్ఞప్తికి తెస్తాయి.

యూదులు అన్యమత అభిప్రాయాల్ని ప్రత్యేకమైన కోణంలో నుండి చూడడం ఆరంభించారు. పరలోకం, నరకం, ప్రాణము, వాక్యం (లోగోస్‌) మరియు జ్ఞానం వంటి సిద్ధాంతాలన్నీ క్రొత్త అర్థాల్ని సంతరించుకున్నాయి. మరియు అటుతర్వాత బోధింపబడినట్లుగా, దేవుడు మనుష్యులతో సంభాషించలేనంత దూరంలో ఉండివుంటే, ఆయనకు మధ్యవర్తులు అవసరమయ్యుండేవారు. మధ్యవర్తిత్వాన్ని నిర్వర్తించే ఈ రక్షణాత్మల్ని గ్రీకులు డైమోన్లు అని పిలిచారు. డైమోన్లు (దయ్యాలు) మంచిగానూ లేక చెడుగానూ ఉండగలవనే అభిప్రాయాన్ని అంగీకరించడం ద్వారా యూదులు దయ్యాల ఆధిపత్యానికి లొంగిపోయారు.

స్థానిక ఆరాధనలో ఓ నిర్మాణాత్మకమైన మార్పు చేరివుంది. పొరుగునున్న యూదా సంఘాలు మతపరమైన విద్య, సేవల కొరకు సమకూడే స్థలాలుగా యూదా సమాజ మందిరాలు ఉద్భవించాయి. యూదా సమాజ మందిరాలు ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రారంభమయ్యాయో సరిగ్గా తెలియదు. దూర దేశాల్లోని యూదులు ఆరాధన కొరకు ఆలయానికి వెళ్లలేనప్పుడు వారి అవసరాల్ని అవి తీర్చాయి గనుక ప్రవాస కాలంలో లేక ప్రవాసానంతర కాలంలో సమాజమందిరాలు స్థాపించబడ్డాయని సాధారణంగా విశ్వసించబడ్తుంది. ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే అవి యేసు, ఆయన శిష్యులు ‘చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి జనుల్ని పిలిచిన దేవుని గుణాతిశయములను ప్రచురించడానికి’ శ్రేష్ఠమైన బహిరంగ చర్చా స్థలాలుగా మారాయి.—1 పేతురు 2:9.

యూదామతం వివిధ ఏకాభిప్రాయ వర్గాల్ని ఆహ్వానించాయి

సా.శ.పూ. రెండవ శతాబ్దంలో వివిధ ఏకాభిప్రాయ వర్గాలు ఉద్భవించనారంభించాయి. అవి ప్రత్యేకమైన మత సంస్థలు కావు. బదులుగా, అవి యూదా మతగురువులు, తత్వవేత్తలు మరియు దేశాన్ని అదుపుచేసి యూదామతం క్రిందకు అందరినీ తేవడానికి ప్రజల్ని ప్రభావితుల్ని చేయాలని అపేక్షించిన రాజకీయ కార్యశీలుల యొక్క చిన్న చిన్న సంఘాలే.

ఈ రాజకీయకరణ సద్దూకయ్యులు ముఖ్యంగా సా.శ.పూ. రెండవ శతాబ్ద మధ్య కాలంలో హస్‌మోనైన్‌ తిరుగుబాటు జరిగినప్పటి నుండి దౌత్యాన్ని నెరపడంలోగల చాతుర్యాన్నిబట్టి పేరుగాంచిన, సంపన్నులైన కులీన వర్గానికి చెందినవారు. వారిలో కొందరు వ్యాపారవేత్తలు, భూస్వాములు ఉన్నా అనేకమంది యాజకులే. యేసు జన్మించిన కాలం నాటికి, పాలస్తీనాలోని రోమా పరిపాలన ఎంతో పటిష్ఠమైనదిగానూ యథాస్థితిని కొనసాగించేదిగానూ ఉన్నట్లు కన్పించినందున సద్దూకయ్యుల్లో అనేకమంది దానిని అభిమానించారు. (యోహాను 11:47, 48 పోల్చండి.) జాతి దృక్పథానికి హేరోదు కుటుంబ పరిపాలన బాగా సరిపోతుందని ఓ అల్పసంఖ్యాక వర్గం (హేరోదీయులు) విశ్వసించింది. ఏదేమైనా, దేశాన్ని యూదా అతివాదుల చేతుల్లో పెట్టడంగాని, ఆలయం యాజకుల ఆధీనంలో తప్ప మరెవరి ఆధీనంలోనైనా ఉండడంగాని సద్దూకయ్యులకు ఇష్టం లేదు. సద్దూకయ్యుల నమ్మకాలు సాంప్రదాయ పాక్షికమైనవి, అవి ప్రధానంగా మోషే రచనలపై వారు చేసిన అర్థవివరణలమీద ఆధారపడి, పరిసయ్యులనే శక్తివంతమైన శాఖ ఎడలగల వారి వ్యతిరేకతను ప్రతిబింబించేవి. (అపొస్తలుల కార్యములు 23:6-8) సద్దూకయ్యులు హెబ్రీ లేఖనాల్లోని ప్రవచనాలు ఊహలని తిరస్కరించారు. బైబిలులోని చారిత్రక, కావ్య, సామెత గ్రంథాలు ప్రేరేపితంకానివని అనవసరమైనవని వారు తలంచారు.

యూదా వ్యతిరేక హెల్లేనీయ వాదానికి ఓ శక్తివంతమైన ప్రతిచర్యగా గ్రీకు పాలనా కాలంలో పరిసయ్యుల తెగ ఆరంభమైంది. అయితే, యేసు కాలం నాటికే వాళ్లు మొండివారిగానూ పారంపర్యాలకు కట్టుబడిన వారిగానూ చట్టానికి అనుయాయులుగానూ గర్విష్టులుగానూ స్వనీతిపరులైన యూదా మతావలంబికులుగానూ సమాజ మందిరంలో ఇచ్చే ఉపదేశాల ద్వారా జాతిని అదుపులో పెట్టడానికి ప్రయత్నించిన బోధకులుగానూ ఉన్నారు. వారు ప్రధానంగా మధ్యతరగతి నుండి వచ్చి, సామాన్య ప్రజల్ని ఉపేక్షించారు. యేసు అనేకమంది పరిసయ్యుల్ని స్వనీతిని వెదికేవారిగానూ వేషధారణను క్రుమ్మరించిన నిర్దయులైన ధనాపేక్షులుగానూ దృష్టించాడు. (మత్తయి, అధ్యాయము 23) వారు హెబ్రీ లేఖనాలన్నింటినీ తమ స్వంత వివరణల ప్రకారంగా అంగీకరించారు కాని తమ మౌఖిక పారంపర్యాలకు అంతే విలువను లేక అంతకన్నా ఎక్కువ విలువనే ఇచ్చారు. తమ పారంపర్యాలు “ధర్మశాస్త్రం చుట్టూ ఓ కంచె” అని వారు తెలియజేశారు. అయితే, ఓ కంచెగా ఉండడానికి బదులు వారి పారంపర్యాచారం దేవుని వాక్యాన్ని నిరర్థకం చేసి, ప్రజల్ని కలతపర్చింది.—మత్తయి 23:2-4; మార్కు 7:1, 9-13.

ఎస్సీనీయులు కొన్ని ఏకాసవాంత సమాజాల్లో జీవించిన గుప్తమతవాదులు. వారు తామే నిజమైన ఇశ్రాయేలీయ శేషమని, వాగ్దాన మెస్సీయను పొందడానికి పవిత్రతతో వేచివున్నామని తమనుగూర్చి తాము భావించుకున్నారు. ఎస్సీనీయులు ఎంతో నిష్ఠగల ధ్యాన జీవితాన్ని గడిపారు మరియు వారి నమ్మకాల్లో అనేకం పర్షియన్‌ గ్రీకు సిద్ధాంతాల్ని ప్రతిబింబించాయి.

ఉన్మాదితులైన స్వదేశాభిమాన భక్తులు అనేకమైన విభిన్న మతాలచే ప్రేరేపింపబడిన వారై స్వతంత్ర యూదా రాజ్యం జోలికి వచ్చిన ప్రతి ఒక్కరినీ శత్రువులుగా క్రూరమైన దృష్టితో చూశారు. వారు హస్‌మోనైనీయన్‌ను పోలి ఉన్నారు మరియు ఆదర్శప్రాయులూ సాహసవంతులైన యౌవనుల్ని ప్రధానంగా ఆకర్షించారు. వారు బందిపోటు హంతకులుగా లేక ప్రతిరోధించే పోరాటకులుగా గుర్తింపబడి, గెరిల్లా ఎత్తుల్ని ఉపయోగించడంతో దేశ రహదార్లు కూడళ్లు అపాయకరంగా తయారయ్యాయి, ఆకాలంలోని ఉద్రేకాలు మరింత పెరిగాయి.

అలెగ్జాండ్రియానందలి యూదుల్లో ఐగుప్తు, గ్రీకులలోని తత్వజ్ఞానం ప్రబలమయ్యింది. అక్కడ నుండి అది పాలస్తీనాకు, చెదిరిపోయిన యూదులు నివసిస్తున్న ప్రాంతాలకు వ్యాపించింది. అపొక్రిఫా, స్యూడోపిగ్రాఫాలను రచించిన యూదా సిద్ధాంతవేత్తలు మోషే రచనలను సందిద్ధమైనవిగానూ బలహీనమైన దృష్టాంతాలుగానూ భావాంతరీకరణ చేశారు.

రోమా శకం ఆరంభమయ్యే నాటికి, హెల్లీనీయత్వం పాలస్తీనాను సాంఘికంగానూ రాజకీయంగానూ తాత్వికంగానూ శాశ్వతంగా మార్చివేసింది. యూదుల బైబిలులోని మతం స్థానంలో కొన్ని ప్రత్యేక లేఖనాల ఆధారిత సత్యంతో సమ్మిళతమైన బబులోను, పర్షియా, గ్రీకు సిద్ధాంతాల మిశ్రమ మతమైన యూదా మతం వచ్చింది. అయితే, సద్దూకయ్యులు, పరిసయ్యులు మరియు ఎస్సీనీయులు కలిసి దేశంలోని 7 శాతం కన్నా తక్కువే. ఈ పోట్లాడుకుంటున్న శక్తుల మధ్య చిక్కుకున్న యూదా ప్రజల గుంపు “కాపరిలేని గొఱ్ఱెలవలె విసికి చెదిరి” ఉన్నారు.—మత్తయి 9:36.

ఆ అంధకారమయ ప్రపంచంలో యేసు అడుగుపెట్టాడు. అభయాన్నిచ్చే ఓదార్పుదాయకమైన ఆయన ఆహ్వానం ఇలా ఉంది: “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును.” (మత్తయి 11:28) “నేను లోకమునకు వెలుగును,” అని ఆయన చెబుతుండగా వినడం ఎంత పులకరింపును కలుగజేస్తుందో కదా! (యోహాను 8:12) మరి నిశ్చయంగా ఉత్తేజకరమైనది. ‘నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండును,’ అనే ఆయన వాగ్దానం హృదయాన్ని పులకరింపజేస్తుంది.—యోహాను 8:12.

[26వ పేజీలోని చిత్రం]

యూదా మత నాయకులు ఆత్మీయ అంధకారంలో ఉన్నారని యేసు చూపించాడు

[28వ పేజీలోని చిత్రం]

అంతియొకప IVను (ఎపిఫనెస్‌) పోలిన రూపాన్ని కల్గివున్న నాణెము

[క్రెడిట్‌ లైను]

Pictorial Archive (Near Eastern History) Est.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి