కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 1/15 పేజీ 30
  • ఒక న్యాయపర అభివృద్ధి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఒక న్యాయపర అభివృద్ధి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 1/15 పేజీ 30

ఒక న్యాయపర అభివృద్ధి

ఏప్రిల్‌ 1995లో, ఒక విశేషమైన కోర్టుతీర్పును గెలవడం జరిగింది. 24 ఏళ్ల లూజ్‌ నరేడా ఆసెవెడో క్విల్స ఒక ఎన్నుకోగల శస్త్రచికిత్స కొరకు ప్యూర్టోరికోనందలి ఎల్‌ బావెన్‌ పాస్‌టర్‌ ఆసుపత్రిలో అడ్‌మిట్‌ చేయబడినప్పుడు, అంటే 1992 జనవరి 28వ తేదీన ఇదంతా ప్రారంభమైంది. అడ్‌మిట్‌ చేయబడినప్పుడు, యెహోవాసాక్షులలో ఒక సభ్యురాలిగా తాను రక్తాన్ని ఎక్కించుకోనని ఆమె అటు మౌఖికంగా ఇటు వ్రాతపూర్వకంగా పేర్కొన్నది. (అపొస్తలుల కార్యములు 15:28, 29) ఆమెకు వైద్యం చేస్తున్న వైద్యునితోసహా ఆసుపత్రి సిబ్బంది అంతటికీ ఆమె యొక్క ఈ అభీష్టాన్ని గురించి బాగా తెలుసు.

లూజ్‌కు శస్త్రచికిత్స జరిగిన రెండ్రోజుల తర్వాత ఆమె ఎక్కువ మోతాదుల్లో రక్తాన్ని కోల్పోయి, రక్తస్రావం మూలాన తీవ్ర రక్తహీనతకు గురైంది. అయితే, ఆమెకు సహాయం చేయగల ఒకటే మార్గం రక్తాన్ని ఎక్కించడమేనని ఆమె విషయమై శ్రద్ధ వహిస్తున్న వైద్యుడైన డా. హోసే రాత్రీగేత్‌ రాత్రీగేత్‌ భావించాడు. కాబట్టి, లూజ్‌కు తెలియకుండా, ఆమె అనుమతి లేకుండా, ఆమెకు రక్తాన్ని ఎక్కించేందుకు అతను కోర్టు అనుమతి కోరాడు.

లూజ్‌ పూర్తిగా స్మారకంలో ఉండి, తన విషయమై మాట్లాడే స్థితిలో ఉన్నప్పటికీ కేసు యొక్క అత్యవసర పరిస్థితి దృష్ట్యా ఎవరి అనుమతి తీసుకునేందుకు సమయం లేదని డా. రాత్రీగేత్‌ రాత్రీగేత్‌ పట్టుపట్టాడు. జిల్లా అటోర్ని అయిన ఎడ్‌వర్‌డో పెరెత్‌ సోటో ఆ ఫారమ్‌పై సంతకం పెట్టగా, జిల్లా న్యాయాధిపతియైన గౌరవనీయుడగు ఆంకెల్‌ లూయిస్‌ రాత్రీగేత్‌ రామస్‌ రక్తం ఎక్కించేందుకు కోర్టు అనుమతిని మంజూరు చేశాడు.

అలా, 1992 జనవరి 31న లూజ్‌ను ఆపరేషన్‌ గదిలోకి తీసుకువెళ్లారు, అక్కడ ఆమెకు రక్తాన్ని ఎక్కించారు. రక్తాన్ని ఎక్కించే సమయంలో, ఆసుపత్రి సిబ్బందిలో కొందరు నవ్వడాన్ని ఆమె విన్నది. ఆమెకు ఏమి చేయబడుతుందో అది ఆమె మేలుకేనని చెబుతూ ఇతరులు ఆమెకు చీవాట్లు పెట్టారు. ఆమె తన సామర్థ్యం కొలది పోరాడింది—అయితే అంతా వ్యర్థమైంది. ఆ దినాంతానికి, లూజ్‌కు మొత్తం నాలుగు యూనిట్‌ల రక్తం ఎక్కించబడింది.

రక్తాన్ని ఎక్కించడానికి మరియు యెహోవాసాక్షులకు సంబంధించినంత మేరకు ప్యూర్టోరికోలో లూజ్‌ వృత్తాంతం మొదటిదీ కాదు చివరిదీ కాదు. ఆమె అనుభవానికి పూర్వం, వయోజన యెహోవాసాక్షుల అభీష్టాలకు విరుద్ధంగా రక్తాన్ని ఎక్కించేందుకు కనీసం 15 కోర్టు అనుమతులు జారీ చేయడం జరిగింది, మరి ఆ తర్వాత ఇంకా ఎక్కువ చేయబడ్డాయి. దుఃఖకరంగా, ఒక వృత్తాంతంలో రోగి అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు, కోర్టు అనుమతిని అమలు చేస్తూ, ఆమెకు బలవంతంగా రక్తాన్ని ఎక్కించడం జరిగింది.

అయితే, లూజ్‌ పోరాటం ఆపరేషన్‌ గదిలోనే అంతంకాలేదు. 1993 అక్టోబరులో ప్యూర్టోరికో కామన్‌వెల్త్‌కు విరుద్ధంగా ఒక కేసు నమోదు చేయబడింది. ఆ కేసును ఉన్నత న్యాయస్థానం విని, 1995 ఏప్రిల్‌ 18న ఆమెకు అనుకూలంగా తీర్పుతీర్చింది. రక్తాన్ని ఎక్కించేందుకు “సరైన చట్టప్రకార చర్యలు లేకుండా” ఇవ్వబడిన మంజూరీ “రాజ్యాంగ విరుద్ధమైనది మరియు తన మతాన్ని అనుసరించేందుకు వాదికిగల స్వతంత్ర హక్కునుండి, తన శరీరానికి ఏమి చేయబడాలనే తన వ్యక్తిగత నిర్ణయం నుండి ఆమెను వంచించిందని” కోర్టు పేర్కొన్నది.

ప్యూర్టోరికోలో, రక్తాన్ని ఎక్కించుకునే విషయంలో యెహోవాసాక్షులకు అనుకూలంగా కోర్టు తీర్పునివ్వడం ఇదే మొదటిసారి గనుక, అదెంతో ప్రాముఖ్యమైన తీర్పు. ఆ న్యాయనిర్ణయం ఎంతో తీవ్రమైన ప్రతిస్పందనను రేపింది. విలేఖరుల సమావేశం నిర్వహించబడింది, దానికి ప్రముఖ వార్తాపత్రిక, రేడియో మరియు దూరదర్శిని విలేఖరులు హాజరయ్యారు.

ఆనాటి రాత్రి ఒక రేడియో కార్యక్రమం, లూజ్‌ కొరకు పోరాడిన ఒక న్యాయవాదితో ఇంటర్‌వ్యూను ప్రసారం చేసింది. శ్రోతలు ఫోన్‌ చేసి ప్రశ్నలు అడిగేందుకు ఆహ్వానించబడ్డారు. అనేకమంది వైద్యులు, న్యాయవాదులు ఫోన్‌ చేసి, ఆ కేసుపట్ల తమకుగల అనుకూల అభిప్రాయాన్ని తెలియజేశారు. అలా ఫోన్‌ చేసిన ఒక వ్యక్తి ఇలా చెప్పాడు: “రక్తాన్ని ఎక్కించుకోవడం జీవితాలను రక్షించగలదని విజ్ఞానశాస్త్రం నిరూపించలేక పోయింది, అది రక్షించగలదని అనుకోవడం మూర్ఖత్వం. రక్తమార్పిడి ఆధునిక వైద్యం యొక్క అతి పెద్ద తప్పిదాలు మరియు లోపాల్లో ఒకటని చరిత్రలో నిరూపించబడుతుంది.”

ఉన్నతంగా గౌరవించబడే ఒక న్యాయ పండితుడు తర్వాత వాచ్‌టవర్‌ సొసైటీ బ్రాంచి కార్యాలయానికి ఫోన్‌ చేసి, “ఒక ప్రతిధ్వనించే విజయం” అని తాను పేర్కొనిన ఆ విజయంపట్ల తన పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశాడు. కోర్టు యొక్క ఈ తీర్పు కేవలం యెహోవాసాక్షుల కొరకే కాకుండా ప్యూర్టోరికోలోని పౌరులందరికీ రాజ్యాంగ హక్కులను తెచ్చిపెట్టిందని కూడా ఆయన అన్నాడు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి