కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 8/1 పేజీలు 4-7
  • మంచికాలాలు ముందున్నాయి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మంచికాలాలు ముందున్నాయి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆహార కొరతలు ప్రవచించబడ్డాయి
  • యెహోవా గతంలో తన సేవకుల ఎడల శ్రద్ధ కనపర్చాడు
  • తన సేవకులకు దేవుడు నేడు మద్దతునిస్తున్నాడు
  • మంచికాలాలు ముందున్నాయి
  • బీదవారు అయినా ధనవంతులే—అదెలా సాధ్యం?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • నిజమైన భద్రత—ఇప్పుడు మరియు నిరంతరం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • సహాయం కోసం మొరపెట్టుకునేవారిని ఎవరు విడిపించగలరు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • యేసు—“పరలోకమునుండి వచ్చిన నిజమైన ఆహారము”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 8/1 పేజీలు 4-7

మంచికాలాలు ముందున్నాయి

“మేము ఒకటి-సున్నా-ఒకటి చేస్తాము” అని ఓ స్త్రీ చెప్పింది.

“నా పరిస్థితులు అంతకంటే దారుణంగా ఉన్నాయి. నేను సున్నా-సున్నా-ఒకటే చేస్తాను” అని ఆమె స్నేహితురాలు చెప్పింది.

పశ్చిమ ఆఫ్రికాలోని కొన్ని భాగాల్లో, అలాంటి సంభాషణకు వేరే వివరణ అవసరం లేదు. రోజుకు మూడు పూటల భోజనం చేసే బదులు (ఒకటి-ఒకటి-ఒకటి), ఒకటి-సున్న-ఒకటి చేసే వ్యక్తి రోజుకు రెండు పూటలు మాత్రమే భోజనం చేయగల స్తోమతను కల్గివుండగలడు—అంటే ఉదయమొకసారి, సాయంకాలమొకసారి. సున్నా-సున్నా-ఒకటి చేసే ఒక యౌవనుడు తన పరిస్థితిని ఇలా వివరిస్తున్నాడు: “నేను రోజుకు ఒక్కసారి మాత్రమే భోజనం చేస్తాను. నా ఫ్రిడ్జ్‌ నిండా నేను నీళ్లు పెట్టుకుంటాను. రాత్రి పడుకునే ముందు నేను గారీని [కసావా దుంప] తింటాను. ఈ రకంగా నేను జీవిస్తున్నాను.”

నేడు అనేకమంది ప్రజల అవస్థ అలా ఉంది. ధరలు పెరుగుతున్నాయి, డబ్బు విలువ తరుగుతోంది.

ఆహార కొరతలు ప్రవచించబడ్డాయి

అపొస్తలుడైన యోహానుకు ఇచ్చిన దర్శనాల పరంపరలో, నేడు అనేకులు ఎదుర్కొనే కష్టతరమైన పరిస్థితిని గూర్చి దేవుడు ముందే చెప్పాడు. వాటిలో ఒకటి ఆహార కొరత ఉండవచ్చు. యోహాను ఇలా చెబుతున్నాడు: “ఇదిగో ఒక నల్లని గుఱ్ఱము కనబడెను; దానిమీద ఒకడు త్రాసుచేత పట్టుకొని కూర్చుండి యుండెను.” (ప్రకటన 6:5) ఈ అశుభ సూచక గుర్రము మరియు రౌతు క్షామాన్ని సూచిస్తున్నాయి—అంటే ఆహారం తూనికల కొలతలో ఇచ్చేంత తక్కువగా ఉంటుందన్నమాట.

తర్వాత అపొస్తలుడైన యోహాను ఇలా అంటున్నాడు: “దేనారమునకు ఒక సేరు గోదుమలనియు, దేనారమునకు మూడు సేర్ల యవలనియు . . . ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను.” యోహాను రోజుల్లో, ఒక సేరు గోదుమలు ఒక సైనికుని దిన బత్తెము మరియు ఒక దేనారము ఒక రోజు పనికి ఇచ్చే కూలి. అందుకనే, రిచర్డ్‌ వేమాత్‌ అనువాదం ఆ వచనాన్ని ఇలా చెబుతోంది: “ఒక్క రొట్టెముక్క వెల ఒక దిన బత్తెము, మూడు యవ్వల రొట్టెల వెల ఒక దిన బత్తెము.”—ప్రకటన 6:6

నేడు ఒక రోజంతటి బత్తెమెంత? ప్రపంచ జనాబా స్థితి 1994 రిపోర్టు ఇలా పేర్కొంది: “సుమారు 110 కోట్లమంది ప్రజలు, అంటే వర్ధమాన ప్రపంచ జనాబాలో సుమారు 30 శాతం మంది, రోజుకు ఒక్క డాలరుతో జీవిస్తున్నారు.” కనుక, ప్రపంచంలోని పేదవారు, ఒక దిన బత్తెముతో ఇంచుమించు అక్షరార్థంగా ఒక రొట్టె ముక్కను మాత్రమే కొనగల్గుతున్నారు.

నిస్సందేహంగా, నిరుపేదలకు ఇది ఆశ్చర్యకరమైనది కానేకాదు. “రొట్టా!” అని ఒక వ్యక్తి ఆశ్చర్యపోయాడు. “రొట్టెలను ఇప్పుడెవరు తింటున్నారు? ఈ రోజుల్లో రొట్టె అపురూపమైన ఖాద్యమైపోయింది!”

దీనికి విరుద్ధంగా, ఆహారకొరతన్నది లేదు. ఐక్యరాజ్య సమితి ఆధారాల ప్రకారంగా, గత పది సంవత్సరాల్లో ప్రపంచ ఆహార ఉత్పత్తి 24 శాతం వరకూ పెరిగింది, అది ప్రపంచ జనాబాకంటే ఎక్కువన్నమాట. అయితే, ఈ ఆహార పెరుగుదలను అందరూ అనుభవించడం లేదు. ఉదాహరణకు, ఆఫ్రికానందు ఆహార కొరత 5 శాతం వరకు తగ్గిపోయింది, అయితే జనాబా 34 శాతం పెరిగింది. కనుక ప్రపంచవ్యాప్తంగా ఆహార పెరుగుదల ఉన్నప్పటికీ, అనేక దేశాల్లో ఆహార కొరతలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఆహార కొరతలంటే ధరల పెరుగుదల. నిరుద్యోగం, తక్కువ జీతం, పెరిగే ద్రవోల్భణం, అందుబాటులో ఉన్న వాటిని కొనుక్కునేందుకు ధనాన్ని సంపాదించడాన్ని మరింత కష్టతరం చేస్తున్నాయి. మానవాభివృద్ధి నివేదిక 1994 ఇలా పేర్కొంటోంది: “ఆహారం అందుబాటులో లేనందుకు ప్రజలు ఆకలితో ఉండరు, కానీ దాన్ని కొనుక్కునే స్తోమత లేనందువల్లే ఆకలితో ఉంటారు.”

నిస్సహాయత, నిరాశ, నిస్పృహలు ఎక్కువగా ఉన్నాయి. “ఈ రోజు చెడ్డగా ఉంది కానీ రేపు మరి దారుణంగా ఉంటుంది అనే భావన ప్రజలకు ఉంది,” అని పశ్చిమ ఆఫ్రికా నందు నివసించే గ్లోరీ చెప్పారు. మరో స్త్రీ ఇలా చెప్పింది: “తాము ఒక వినాశనాన్ని సమీపిస్తున్నామని ప్రజలు భావిస్తున్నారు. బజారులో ఏమీ దొరకని రోజు వస్తుందని వారు భావిస్తున్నారు.”

యెహోవా గతంలో తన సేవకుల ఎడల శ్రద్ధ కనపర్చాడు

యెహోవా తన నమ్మకమైన సేవకులకు అవసరమైన వాటినిస్తాడని మరి కష్టతరమైన పరిస్థితిని తాళుకునేందుకు బలాన్ననుగ్రహిస్తాడని దేవుని సేవకులకు తెలుసు. అలా పోషించేందుకు దేవుడు శక్తిగలవాడు అనే నమ్మకం, వాస్తవానికి వారి విశ్వాసంలో ముఖ్యమైన భాగం. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను.”—హెబ్రీయులు 11:6.

యెహోవా ఎల్లప్పుడూ తన నమ్మకమైన సేవకుల ఎడల శ్రద్ధ కనపర్చాడు. మూడున్నర సంవత్సరాల క్షామం వచ్చినప్పుడు, యెహోవా ప్రవక్తైన ఏలీయాకు యెహోవా ఆహారాన్ని అందించాడు. తొలుత, ఏలీయాకు రొట్టెలనూ మాంసాన్ని తీసుకురమ్మని దేవుడు కాకోలములకు ఆజ్ఞాపించాడు. (1 రాజులు 17:2-6) తర్వాత, ఏలీయాకు ఆహారాన్నిచ్చిన విధవరాలికి పిండిని నూనెనిచ్చి అద్భుతంగా పోషించాడు. (1 రాజులు 17:8-16) ఆ క్షామం సమయంలోనే, యెజెబేలు రాణి వారి మీదికి తీవ్రమైన మతపర హింసను తీసుకువచ్చినప్పటికీ, యెహోవా తన ప్రవక్తలకు రొట్టెలు నీళ్లు అందేలా చూశాడు.—1 రాజులు 18:13.

తర్వాత, మతభ్రష్టమైన యెరూషలేమును బబులోను రాజు ముట్టడించినప్పుడు, ప్రజలు “తూనికె ప్రకారముగా బహు చింతతో రొట్టె” భుజించాల్సి వచ్చింది. (యెహెజ్కేలు 4:16) వారి పరిస్థితి ఎంతగా విషమించిందంటే, కొందరు స్త్రీలు తమ స్వంత బిడ్డల మాంసాన్నే భక్షించారు. (విలాపవాక్యములు 2:20) అయినా, ప్రచారంచేయడం వల్ల ప్రవక్తైన యిర్మీయా ఖైదు చేయబడినప్పటికీ, “పట్టణములో రొట్టెలున్నంతవరకు రొట్టెలు కాల్చువారి వీధిలోనుండి అనుదినము ఒక రొట్టె [యిర్మీయాకు] అతనికిచ్చుచు” ఉండేలా యెహోవా చూశాడు.—యిర్మీయా 37:21.

రొట్టెలు అయిపోయినప్పుడు యెహోవా యిర్మీయాను మర్చిపోయాడా? లేదని స్పష్టమౌతోంది, ఎందుకంటే ఆ పట్టణం బబులోను వారిచేతుల్లో పడినప్పుడు, యిర్మీయాకు ‘బత్తెమును బహుమానము ఇచ్చి అతని సాగనం’పడం జరిగింది.—యిర్మీయా 40:5, 6; కీర్తన 37:25 కూడా చూడండి.

తన సేవకులకు దేవుడు నేడు మద్దతునిస్తున్నాడు

మునుపటి తరాల్లో యెహోవా తన సేవకులను ఎలా పోషించాడో, అలాగే నేడు కూడా వారి విషయంలో అటు వస్తుపరంగానూ ఆత్మీయంగానూ శ్రద్ధ వహిస్తున్నాడు. ఉదాహరణకు, పశ్చిమ ఆఫ్రికాలో నివసించే లామిటున్‌డె అనుభవాన్ని పరిగణించండి. ఆయన ఇలా చెబుతున్నాడు: “నాకు పెద్ద కోళ్ళ ఫార్మ్‌ ఉండేది. ఒక రోజు, ఆయుధాలు ధరించిన దొంగలు ఫార్ముమీదపడి ఇంచుమించు అన్ని కోళ్లను, జనరేటరును, మా దగ్గరున్న డబ్బును దొంగిలించుకుపోయారు. అది జరిగిన కొంతకాలానికి, ఉన్న కొన్ని కోళ్లు రోగం వల్ల చచ్చిపోయాయి. అది నా కోళ్ల వ్యాపారాన్ని పాడుచేసింది. రెండు సంవత్సరాల పాటు నేను ఉద్యోగం కొరకు నిష్ఫలంగా ప్రయత్నించాను. పరిస్థితి నిజంగానే చాలా కఠినంగా ఉండేది, కానీ యెహోవా మమ్మల్ని పోషించాడు.

“మనలను మెరుగుపర్చడానికే ఇలాంటివి జరిగేందుకు దేవుడు అనుమతిస్తాడని గ్రహించడమే, ఆ కఠినమైన కాలాలను నేను తాళుకునేందుకు నాకు సహాయపడింది. నేనూ నా భార్య, మా కుటుంబ బైబిలు పఠనాన్ని కొనసాగించాము, అది మాకు నిజంగానే సహాయపడింది. ప్రార్థనకూడా మాకు ఎంతో బలాన్నిచ్చింది. కొన్నిసార్లు నాకు అసలు ప్రార్థించాలని అనిపించలేదు, అయినా నేను ప్రార్థించినప్పుడు నాకు మంచిగా అనిపించేది.

“ఆ కష్టమైన సమయంలో, లేఖనాలను ధ్యానించడంలోని విలువను నేను నేర్చుకున్నాను. యెహోవా మన కాపరి అని చెప్పే కీర్తన 23ను గూర్చి నేను ఎక్కువగా ఆలోచించేవాణ్ణి. నన్ను ప్రోత్సహించిన మరో లేఖనం ఫిలిప్పీయులు 4:6, 7, అది ‘సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమును’ సూచిస్తుంది. నన్ను బలపర్చిన మరో భాగం 1 పేతురు 5:6, 7, అక్కడ ఇలా ఉంది: ‘దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి. ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి.’ ఈ లేఖనాలన్నీ నాకు ఆ సమయంలో సహాయం చేశాయి. మీరు ధ్యానించేటప్పుడు, మిమ్మల్ని కృంగదీసే ఆలోచనలను మీ మనస్సులోనుండి తీసివేయగలరు.

“నాకిప్పుడు మరలా ఉద్యోగం దొరికింది, అయితే నిజం చెప్పాలంటే, ఇప్పటికీ పరిస్థితులు కఠినంగానే ఉన్నాయి. రెండవ తిమోతి 3:1-5 నందు బైబిలు ప్రవచించినట్లుగా, ‘అపాయకరమైన కాలములను’ సూచించే ‘అంత్యదినముల్లో’ మనం జీవిస్తున్నాము. లేఖనాలు చెప్పేవాటిని మనం మార్చలేము. కనుక జీవితం సులభంగా ఉండాలని నేను అపేక్షించడం లేదు. అయినప్పటికీ, యెహోవా ఆత్మ నేను తాళుకునేందుకు నాకు సహాయం చేస్తోందని నేను భావిస్తున్నాను.”

మనం జీవించే కాలం అపాయకరమైనప్పటికీ, యెహోవాయందు, రాజైన ఆయన కుమారుడు క్రీస్తు యేసునందు విశ్వసించేవారు, నిరుత్సాహపడరు. (రోమీయులు 10:11) యేసు తానే ఇలా అభయాన్నిస్తున్నాడు: “అందువలన నేను మీతో చెప్పునదేమనగా—ఏమి తిందుమో యేమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చియైనను చింతింపకుడి; ఆహారముకంటె ప్రాణమును, వస్త్రము కంటె దేహమును గొప్పవి కావా? ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్ఠులు కారా? మీలోనెవడు చింతించుటవలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేల?”—మత్తయి 6:25-28.

అపాయకరమైన ఈ కాలంలో అవి నిజంగానే హృదయాన్వేషిత ప్రశ్నలు. అయితే, యేసు ఈ అభయప్రదమైన మాటలను ఇంకా చెబుతూనే ఉన్నాడు: “అడవిపువ్వులు ఏలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒడకవు అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదానివలెనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంకరించినయెడల, అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా. కాబట్టి—ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించుకొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.”—మత్తయి 6:28-33.

మంచికాలాలు ముందున్నాయి

ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో, దిగజారుతున్న ఆర్థిక మరియు సాంఘిక పరిస్థితులు మరింత క్షీణిస్తూనే ఉంటాయనేందుకు ఎన్నో సూచనలున్నాయి. అయినప్పటికీ, ఈ పరిస్థితులు తాత్కాలికమని దేవుని ప్రజలు గ్రహిస్తున్నారు. రాజైన సొలొమోను మహనీయమైన పరిపాలన, భూమినంతటినీ పరిపాలించే సొలొమోను కంటే గొప్ప పరిపాలకుని నీతియుక్త పరిపాలనను సూచించింది. (మత్తయి 12:42) ఆ రాజు, “రాజులకు రాజును ప్రభువులకు ప్రభువు” అయిన క్రీస్తు యేసు.—ప్రకటన 19:16.

రాజైన సొలొమోను విషయంలో ప్రథమ నెరవేర్పుగల కీర్తన 72, యేసుక్రీస్తు మహిమాన్విత పరిపాలనను వర్ణిస్తోంది. క్రీస్తు రాజుగా ఉన్నప్పుడు భూభవిష్యత్తును గూర్చి అది చెప్పే అద్భుతమైన విషయాల్లో కొన్నింటిని పరిశీలించండి.

ప్రపంచవ్యాప్తంగా శాంతియుతమైన పరిస్థితులు: “అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు చంద్రుడు లేకపోవువరకు క్షేమాభివృద్ధి కలుగును. సముద్రమునుండి సముద్రమువరకు యూఫ్రటీసునది మొదలుకొని భూదిగంతములవరకు అతడు రాజ్యము చేయును.”—కీర్తన 72:7, 8.

నిరుపేదల ఎడల శ్రద్ధ: “దరిద్రులు మొఱ్ఱపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను నిరాధారులను అతడు విడిపించును. నిరుపేదలయందును బీదలయందును అతడు కనికరించును బీదల ప్రాణములను అతడు రక్షించును కపట బలాత్కారములనుండి అతడు వారి ప్రాణమును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును.”—కీర్తన 72:12-14.

సమృద్ధికరమైన ఆహారం: “దేశములోను పర్వత శిఖరములమీదను సస్య సమృద్ధి కలుగును దాని పంట లెబానోను వృక్షములవలె తాండవమాడుచుండును.”—కీర్తన 72:16.

యెహోవా మహిమ భూమిని నిండిస్తుంది: “దేవుడైన యెహోవా ఇశ్రాయేలుయొక్క దేవుడు స్తుతింపబడును గాక ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండును గాక.”—కీర్తన 72:18, 19.

కనుక మంచికాలాలు నిజంగానే ముందున్నాయి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి