కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 8/1 పేజీలు 3-4
  • కాలాలు మారాయి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కాలాలు మారాయి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఇలాంటి మరితర సమాచారం
  • సొలొమోను జ్ఞానంగల రాజు
    బైబిలు—దానిలో మీకు ఒక సందేశం ఉంది
  • ఆయన జీవితం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • పేదరికాన్ని రూపుమాపడానికి చేసిన ప్రయత్నాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • సహాయం కోసం మొరపెట్టుకునేవారిని ఎవరు విడిపించగలరు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 8/1 పేజీలు 3-4

కాలాలు మారాయి

నమ్మకమైన సొలొమోను రాజు యొక్క వైభవోపేతమైన పరిపాలన ఆధ్వర్యంలోని ప్రాచీన ఇశ్రాయేలులో జీవించడం ఎంత ఆనందదాయకంగా ఉండి ఉంటుందో కదా! అది శాంతీ సౌఖ్యాలూ మరియు ఆనందంతో నిండిన యుగం. సత్యారాధనకు సొలొమోను నమ్మకంగా మద్దతునిచ్చినంతకాలం, యెహోవా ఆ రాజ్యాన్ని మెండుగా ఆశీర్వదించాడు. దేవుడు సొలొమోను రాజుకు ఎంతో సంపదనే కాకుండా, నీతియందు ప్రేమయందు సొలొమోను పరిపాలించేందుకు “బుద్ధి వివేకములు గల హృదయమును” కూడా అనుగ్రహించాడు. (1 రాజులు 3:12) బైబిలు ఇలా చెబుతోంది: “దేవుడు సొలొమోనుయొక్క హృదయమందుంచిన జ్ఞానోక్తులను వినుటకై భూరాజులందరును అతని ముఖదర్శనము చేయగోరిరి.”—2 దినవృత్తాంతములు 9:23.

ప్రజలకు, శాంతి భద్రతలనూ ఎన్నో మంచి విషయాలను యెహోవా అనుగ్రహించాడు. దేవుని వాక్యం ఇలా చెబుతోంది: “యూదావారును ఇశ్రాయేలు వారును సముద్రపు దరినున్న యిసుక రేణువులంత విస్తార సమూహమై తినుచు త్రాగుచు సంభ్రమపడుచు నుండిరి.” అటు అక్షరార్థంగానూ సూచనార్థకంగానూ ప్రజలు, “సొలొమోను దినములన్నిటను . . . తమ తమ ద్రాక్షచెట్ల క్రిందను అంజూరపుచెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి.”—1 రాజులు 4:20, 25.

కాలాలు మారాయి. గతంలోని ఆ ఆనందమయ రోజులకూ నేటి జీవితానికి ఎంతో తేడా ఉంది. సొలొమోను కాలంలోలా కాకుండ, నేటి ముఖ్యమైన సమస్య పేదరికం. సంపన్న దేశాల్లోకూడా పేదరికం ఉంది. ఉదాహరణకు, అమెరికాలోనూ ఐరోపా ఐక్య రాజ్యాల్లోనూ సుమారు 15 శాతం మంది ప్రజలు పేదరికంలో జీవిస్తున్నారని ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం తెలిపింది.

యూనిసెఫ్‌ (ఐక్యరాజ్య సమితి పిల్లల నిధి) వారి 1994 ప్రపంచ పిల్లల స్థితి నివేదిక, భౌగోళిక లెక్కను గూర్చి అయిదు వంతుల ప్రపంచ జనాబా పూర్తి పేదరికంలో జీవిస్తోందని, ప్రపంచంలోని పేదవారి జీవితం “మరింత దుర్భరంగానూ దయనీయంగానూ అవుతోంది,” అని కూడా తెలిపింది.

కొన్ని దేశాల్లో, ఆకాశాన్నంటే ద్రవ్వోల్భణం, నిరుపేదల కష్టాలను మరింత అధికం చేస్తోంది. ఒకానొక ఆఫ్రికా దేశంలోని ఓ స్త్రీ ఇలా చెప్పింది: “బజారులో ఒక వస్తువును చూసి, ‘సరే, దీన్ని కొనుక్కునేందుకు ఇంటికెళ్లి డబ్బు తీసుకువస్తాను’ అని మీరనుకుంటారు. ఒక గంట తర్వాత మీరు వెళ్లితే, దాని ధర ఇప్పుడే పెరిగింది కనుక మీరు దాన్ని కొనలేరని మీతో చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఎవరైనా ఏమి చేస్తారు? నిజంగా అది ఎంతో నిరాశను కలిగిస్తుంది.”

అదే ప్రాంతానికి చెందిన మరో స్త్రీ ఇలా చెప్పింది: ‘మనం బ్రతికి ఉండేందుకు, మన ఇతర అవసరతలను మనం మర్చిపోతాం. మనకిప్పుడున్న చింతల్లా ఆహారాన్ని ఎలా సంపాదించాలన్నదే.’

ఐక్యరాజ్య సమితి ప్రకారం, భవిష్యత్తు కృంగదీస్తుందన్నట్లుగా కనిపిస్తోంది. ఉదాహరణకు, యూనిసెఫ్‌, ప్రస్తుత జనాబా పెరుగుదల ఇలాగే కొనసాగినట్లైతే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేద ప్రజల సంఖ్య, “ఒక జీవిత కాలంలోనే” నాలుగింతలౌతుంది.

అయితే, ఆర్థిక మరియు సాంఘిక పరిస్థితులు క్షీణిస్తున్నప్పటికీ, దేవుని సేవకులు అనుకూల దృక్పథాన్ని కల్గివుండేందుకు కారణం ఉంది. అధికమౌతున్న ప్రతికూల భావనగల ప్రజల మధ్య జీవిస్తున్నప్పటికీ, దేవుని సేవకులు భవిష్యత్తు కొరకు ఆనందంతోనూ నమ్మకంతోనూ ఎదురుచూస్తారు. దానికి కారణాలను తర్వాతి శీర్షిక పరిశీలిస్తుంది.

[3వ పేజీలోని చిత్రసౌజన్యం]

De Grunne/Sipa Press

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి