రాజ్య ప్రచారకుల నివేదిక
గ్రీన్లాండ్నందలి సుదూర చిన్న గ్రామం చేరుకోవడం
అనేక దశాబ్దాలుగా యెహోవాసాక్షులు సువార్త ప్రకటించడంలో కావలికోట మరియు తేజరిల్లు! పత్రికలను ఉపయోగించారు. ఈ పత్రికలు తన వాక్యమైన బైబిలులో వ్యక్తపర్చినట్లుగా యెహోవా జ్ఞానాన్ని ఉన్నతపరుస్తున్నాయి. బైబిలు ప్రవచనాలకు సంబంధించిన ప్రపంచ సంఘటనలను వారు గమనిస్తారు, అంతేకాకుండ బైబిలులోని సహేతుకమైన సలహాలను ఒక్కసారిగా వచ్చిపడే సమస్యలకు అన్వయిస్తారు.—యాకోబు 3:17.
గ్రీన్లాండ్నందలి సాక్షులు కావలికోట మరియు తేజరిల్లు! పత్రికలను వీలున్నంతమందికి అందించేందుకు ప్రత్యేక ప్రయత్నాన్ని చేశారు. వేసవి కాలంలో, గ్రీన్లాండ్లోని అతి సుదూర చిన్న గ్రామాల్లో కొన్నింటిని సందర్శించేందుకు వారు ఏర్పాట్లను చేశారు. పశ్చిమ తీరాన ఉన్న గ్రానార్గ్కు (తులె) వెళ్లేందుకు ఒక గుంపు రాజ్య ప్రచారకులు పడవ సహాయంతో 4,000 కంటే ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణించారు, అలా వారు భూగోళంలోని కొన్ని సుదూర ఉత్తర ప్రాంతాలను చేరుకునేందుకు ప్రయత్నించారు. వారి ప్రయాణానికి ఏడు వారాలు పట్టింది. తూర్పు తీరాన, సాక్షులైన దంపతులు ఇడ్డార్గొగ్రాడొర్మెట్లోని గ్రామాన్ని చేరుకుని, మొట్టమొదటిసారిగా ఆ ప్రాంతమంతటిలోనూ సువార్తను క్రమంగా వ్యాపింపజేశారు.
ఆ సంవత్సరం ఏప్రిల్ నెలలో 7,513 కావలికోట, తేజరిల్లు! ప్రతులను గ్రీన్లాండ్ ప్రజలకు అందించారు. అంటే, 127 రాజ్య ప్రచారకులలో ప్రతి ఒక్కరూ సగటున 59 పత్రికలను అందించారు—ప్రతి ఏడుగురు నివాసులకు ఒక పత్రిక అన్నమాట. ఆ నెల తేజరిల్లు! పత్రికలో “రొమ్ము క్యాన్సర్—ప్రతి స్త్రీకివున్న భయము” అనే ముఖ అంశంపైన శీర్షికల పరంపర వెలువడింది. నూటా నలభై పత్రికలను అందించిన ఒక సాక్షి దూరదర్శని విలేఖరికి తేజరిల్లు! ప్రతులను ఇచ్చింది. రెండు రోజుల తర్వాత, దూరదర్శని వార్తా కార్యక్రమం రొమ్ము క్యాన్సర్‌పై ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. గ్రీన్లాండ్ భాషలోకి దాని అనువాదాన్ని ప్రశంసిస్తూ అందులోని అనేక పేజీలను చూపిస్తూ ఆ విలేఖరి ఆ పత్రికను దూరదర్శనిలో ప్రదర్శించింది. తేజరిల్లు! పత్రికలోని ఆచరణాత్మకమైన సలహాలను, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నివారణా పద్ధతులను ఆమె నొక్కి తెలిపింది.
ఆ దూరదర్శిని కార్యక్రమంలోనే, మొదట ఆమెకు ఈ పత్రికలను అందించిన సాక్షిని పరిచయంచేశారు. యెహోవాసాక్షులను గూర్చిన అనేక ప్రశ్నలకు ఆమె జవాబులను చెప్పింది అంతేకాకుండ ఆ నెల పత్రికలను విస్తృతంగా పంచిపెట్టడాన్ని గూర్చి మాట్లాడింది. అంతేకాకుండ బైబిలులో కనిపించే ఆచరణాత్మకమైన వివేకంపై ఆమె వ్యాఖ్యానించింది మరియు మనం నేటి సమస్యలను ఎదుర్కొనేందుకు అలాంటి సహేతుకమైన సలహా సహాయపడుతుందని సూచించింది.
గ్రీన్లాండ్ క్యాన్సర్ సంస్థ అధ్యక్షునితో జరిపిన పరిచయంతో ఆ కార్యక్రమం ముగిసింది. ఈ విషయంపై తన భాషలో ఇంత చక్కని, ఉపదేశాత్మక సమాచారాన్ని తానెన్నడూ చూడలేదని ఆమె చెప్పింది. ఆ తర్వాత, రొమ్ము క్యాన్సర్ విషయంలో ఆసక్తిగలవారందరూ తేజరిల్లు! శీర్షికలను చదవమని ఆహ్వానించింది. యెహోవాసాక్షులు తీసుకున్న చొరవకు కృతజ్ఞులై ఉండేందుకు మంచి కారణముందని ఆమె చెప్పింది.
గ్రీన్లాండ్లోలా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు “ఆకాశముక్రింద ఉన్న సమస్తసృష్టికి” సువార్తను ప్రకటిస్తూనే ఉన్నారు. (కొలొస్సయులు 1:23; అపొస్తలుల కార్యములు 1:8) కావలికోట, తేజరిల్లు! పత్రికలతో సహా బైబిలు ప్రచురణల సహాయంతో, ప్రస్తుతదిన సమస్యలను అన్ని రకాల ప్రజలు తాళుకునేందుకు వారు సహాయపడతారు అంతేకాకుండ శ్రేష్ఠమైన భవిష్యత్తు ఉందనే నిరీక్షణను వారిస్తారు.
[8వ పేజీలోని చిత్రం]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
గ్రానార్గ్ (తులె)
ఇడ్డార్గొగ్రాడొర్మెట్
నుక్ (గోడ్థ్బ్)