ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహవాసాక్షులు—స్వీడన్
స్వీడన్, స్కాండినేవియన్ పెనిన్సులా తూర్పు ప్రక్కను ఆక్రమించుకుని ఉంది మరియు అది ఆర్కిటిక్ గోళానికి మించి కొనసాగుతుంది. సతత హరితారణ్యాలూ, సరస్సులూ, అలాగే పర్వతాలుగల దేశంగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన స్వీడన్, తక్కువ జనాబాగల ఐరోపా దేశాల్లో ఒకటి. అయినప్పటికీ, 1800 తర్వాత భాగంలో సత్యాన్ని ప్రేమించేవారిని యెహోవాసాక్షులు విజయవంతంగా వెదకగల్గారు. ఇటీవలి ఉదాహరణను పరిశీలించండి.
ఓ స్త్రీ సాక్షులతో బైబిలు పఠించింది, కానీ ఆమె భర్తకు అది నచ్చలేదు. పఠించడం మానుకోమని ఆమె భర్త ఆమెతో చెప్పాడు, ఆమె అలాగే చేసింది. ఆ వ్యక్తి మత్తుపానీయాల గిడ్డంగిలో పనిచేసేవాడు. ఒక రోజు ఓ ట్రక్ డ్రైవర్ ఆ గిడ్డంగిలోకి తన పదేండ్ల మనవడితో వచ్చాడు. తన ట్రక్‌ను తాను నింపేటప్పుడు ఆ పిల్లవాణ్ణి చూసుకోమని ఆ వ్యక్తిని ఈ తాత కోరాడు. ఏదొకటి మాట్లాడాలికదా అని, తన పుట్టినరోజు నాడు ఆ బాబుకు ఏ యే కానుకలు వచ్చాయని ఆ వ్యక్తి అడిగాడు. తానూ తన కుటుంబం యెహోవాసాక్షులు గనుక తామెన్నడు పుట్టినరోజును జరుపుకోలేదని ఆ బాబు చెప్పడం విని అతను ఆశ్చర్యపోయాడు. సంవత్సరంలో ఇతర రోజుల్లో తనకు కానుకలు వచ్చాయని మరి తనకు ఎంతో అనురాగప్రేమలతో నిండిన కుటుంబం ఉంది కనుక ఏదో కొరవడినట్లుగా భావించలేదని కూడా ఆ బాబు చెప్పాడు. అంత మంచి కుటుంబానికి ఏ కానుకలూ సరితూగవని కూడా ఆ బాబు చెప్పాడు.
ఆ బాబు తన తాతగారితో అనేక సార్లు వచ్చాడు. ప్రతిసారి, ఆ వ్యక్తి ఈ బాబును ఎన్నో ప్రశ్నలు అడిగేవాడు, మరి ఆ బాబు ఏ బిడియం లేకుండా చెప్పే యథార్థమైన సూటైన జవాబులకు అతను ఎంతగానో ముగ్ధుడయ్యాడు. నిజమైన విలువల ఎడల ఆ బాబుకుగల మెప్పును బట్టి అతను చలించిపోయాడు. ప్రపంచంలోని దారుణమైన పరిస్థితిని ఓ రోజు రాత్రి దూరదర్శినిలో చూసిన తర్వాత, ఆత్మీయ విషయాలను అతను మరింత గంభీరంగా తీసుకోవాలని గ్రహించాడు. తన భార్యతో పఠించిన సాక్షికి ఫోన్ చేసి, ఆమెను తిరిగి రమ్మని కోరాడు. త్వరలోనే, ఆ వ్యక్తితో ఓ సాక్షి పఠించడం ప్రారంభించాడు, మరి ఆయన త్వరగా అభివృద్ధి సాధించాడు. ఏప్రిల్ 10, 1994 నందు ఆయన బాప్తిస్మంపొందాడు. ఆయన భార్య కూడా ఇప్పుడు బాప్తిస్మంపొందింది.
పురోభివృద్ధివల్ల నిర్మాణం అవసరమైంది
స్వీడన్ ఇతర దేశాలనుండి వచ్చిన అనేకమంది శరణార్థులకు గృహంగా ఉంది మరి స్వీడన్ సాక్షులు వారికి ప్రకటించడంలో ఎంతో మంచి ఫలితాన్ని పొందారు. మొత్తంమీద, ప్రకటన పనియంతా ఎంత సఫలవంతమయ్యిందంటే, వారందరికీ సరిపడేందుకు క్రొత్త రాజ్యమందిరాలను నిర్మించవల్సివచ్చింది. త్వరగా నిర్మించే పద్ధతి ద్వారా 1986 నుండి 1993 వరకు 37 రాజ్య మందిరాలు త్వరగా నిర్మించబడ్డాయి, 8 హాళ్లను విశాలపర్చి నవీకరించారు. కేవలం 1994లోనే, ఏడు రాజ్యమందిరాలు నిర్మించబడ్డాయి మరియు మూడు నవీకరించబడ్డాయి.
ప్రస్తుతం, క్రొత్త రాజ్య మందిరాలను నిర్మించేందుకు లేక ఉన్నవాటిని విశాలపర్చి నవీకరించేందుకు సహాయం కొరకు అక్కడ 65 సంఘాలు వేచివున్నాయి. సుమారు 2,500 మంచి స్వచ్ఛంద సేవకులు అలాంటి నిర్మాణ పథకాలకు సహాయాన్నందిస్తున్నారు, మరి వారి ప్రేమపూర్వక సహాయాన్ని సంఘాలు ఎంతగానో మెచ్చుకున్నాయి.
ఆర్కిటిక్ గోళంపైవరకు విస్తరించే స్వీడన్ ఉత్తర భాగం కొన్నిసార్లు అర్థరాత్రి సూర్యుడుండే ప్రాంతమని పిలువబడుతుంది. ఎందుకంటే వేసవినందు కొంతకాలంలో సూర్యుడు ఎన్నడూ అస్తమించడు. అయితే, స్వీడనంతటిలోనూ సత్యపు వెలుగు ఎడతెగక దివ్యంగా వెలుగొందుతూనే ఉంది. యెహోవా ఆశీర్వాదంతో, ఆత్మీయ వెలుగు ఎన్నడు తక్కువ కాదు కానీ అది ఎడతెగకుండా వెలుగొందుతూనే ఉంటుంది.
[8వ పేజీలోని బాక్సు]
దేశ గణాంక వివరాలు
1994 సేవా సంవత్సరం
సాక్ష్యమిస్తున్నవారి శిఖరాగ్ర సంఖ్య: 24,246
నిష్పత్తి: 1 సాక్షికి 362
జ్ఞాపకార్థ దినానికి హాజరైనవారి సంఖ్య: 40,372
సగటు పయినీర్ ప్రచారకులు: 2,509
సగటు బైబిలు పఠనాలు: 11,306
బాప్తిస్మము తీసుకున్నవారి సంఖ్య: 850
సంఘాల సంఖ్య: 358
బ్రాంచి కార్యాలయం: అర్బోగా
[9వ పేజీలోని చిత్రం]
అర్బోగానందున్న బ్రాంచి కార్యాలయం మరియు బేతేలు గృహం
[9వ పేజీలోని చిత్రం]
జోనందున్న తొలి సాక్షులు, సుమారు 5,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని పూర్తిచేసేందుకు ఈ చిన్న బస్సును ఉపయోగించారు