మతాన్ని గూర్చి చర్చించడం ద్వారా ఏ ప్రయోజనం చేకూరగలదు?
తమ చంటి బిడ్డ పలికే తొలి పలుకుల కొరకు తల్లిదండ్రులు ఆతురతతో ఎదురుచూస్తారు. గరగర ధ్వని మధ్యన వారు బహుశా “మ మ” లేక “నా నా” అనే పదాల పునరుచ్చారణను విన్నప్పుడు వారి హృదయాలు ఆనందంతో ఉప్పొంగిపోతాయి. వాళ్లు వెంటనే ఈ వార్తను స్నేహితులతో, పొరుగువారితో ఒకే విధంగా పంచుకుంటారు. చంటిబిడ్డ యొక్క మొదటి సంభాషణ నిజంగా ఆనందాన్ని తీసుకువచ్చే సువార్తే.
చంటిబిడ్డ ఇంద్రియశక్తులు శబ్దాలను, దృశ్యాలను, వాసనలను గమనించినప్పుడు తగినట్లుగా ప్రతిస్పందిస్తాయి. అయితే ప్రతిస్పందనలు వేరువేరుగా ఉంటాయి. కాని, కొంతకాలం తర్వాత, ఈ ప్రేరణలకు తగినట్లు ప్రతిస్పందించడంలో బిడ్డ విఫలమైతే, తమ బిడ్డ యొక్క ఎదుగుదల సరైన విధంగా లేదేమోనని తల్లిదండ్రులు సరిగ్గానే చింతిస్తారు.
చంటిపిల్లలు తమకు తెలిసినవారితో మరింత చనువుగా ప్రతిస్పందిస్తారు. తల్లి బిడ్డను హత్తుకున్నప్పుడు, సాధారణంగా చక్కని చిరునవ్వులు చిందిస్తాడు. అయితే, దర్శించడానికి వచ్చిన బంధువు యొక్క స్పర్శ బిడ్డకు కన్నీళ్లు వచ్చేలా చేయగలదు, వారి చేతుల్లోకి వెళ్లడానికి మొండిగా నిరాకరించడం కూడా జరుగవచ్చు. దీన్ని అనుభవించే చాలామంది బంధువులు, అంతటితో విడిచిపెట్టరు. బిడ్డ బంధువును బాగా ఎరిగిన తర్వాత, వారికి ఆనందం కలిగేలా వారి మధ్యనున్న అపరిచితమనే అడ్డంకు తొలగిపోయి, మెల్లగా చంటిబిడ్డ చిరునవ్వులు చిందిస్తాడు.
అలాగే, అనేకమంది పెద్దవారు తమకు ఎక్కువకాలం నుండి పరిచయంలేని వారితో తమ మతసంబంధమైన నమ్మకాలను గూర్చి బహిరంగంగా చర్చించడానికి వెనుకాడతారు. వ్యక్తిగత విషయమైన మతం గురించి ఒక అపరిచిత వ్యక్తి ఎందుకు మాట్లాడాలనుకుంటున్నాడో వారు అర్థం చేసుకోలేకపోవచ్చు. ఫలితం ఏమిటంటే, వారు తమకు, తమతో సృష్టికర్త గురించి మాట్లాడేవారికి మధ్య ఒక అడ్డంకు ఏర్పడడానికి అనుమతిస్తారు. వారు చివరికి, మానవజాతి యొక్క స్వతఃసిద్ధ గుణమైన ఆరాధించాలనే కోరికను గూర్చి చర్చించడానికి కూడా నిరాకరిస్తారు.
వాస్తవంగా, మనం మన సృష్టికర్త గురించి తెలుసుకోవడానికి ఆసక్తి కలిగివుండాలి, ఇతరులతో చర్చించడం మనల్ని నేర్చుకునే స్థానంలో ఉంచగలదు. ఎందుకంటే దేవునికి బాహాటమైన సంభాషణతో చాలా కాలంనుండి సంబంధం ఉంది. అదెలాగో మనం చూద్దాము.
‘విని నేర్చుకోండి’
మానవునితో దేవుని మొదటి సంభాషణ ఏదెను తోటలో ఆదాముతో మాట్లాడినదే. అయినప్పటికీ, ఆదాము హవ్వలు పాపం చేసిన తర్వాత, దేవుడు వారిని పిలిచినప్పుడు, ఆయన వారితో ఇంకా సంభాషించాలనుకున్నప్పుడు, వారు మరుగున ఉండడానికి ఇష్టపడ్డారు. (ఆదికాండము 3:8-13) అయితే, దేవునితో సంభాషించాలని కోరుకున్న స్త్రీపురుషుల గురించిన వివరాలను బైబిలు పేర్కొంటున్నది.
నోవహు కాలంలో దుష్ట లోకంపైకి రానైయున్న నాశనాన్ని గూర్చి దేవుడు ఆయనతో సంభాషించాడు, ఆ తర్వాత నోవహు “నీతిని ప్రకటించిన” వాడయ్యాడు. (2 పేతురు 2:5) తన తరం వారికి దేవుని ప్రవక్తగా నోవహు, మానవునితో దేవుని వ్యవహారాలందు విశ్వాసముంచడమేకాక తాను యెహోవా వైపు ఉన్నట్లు బహిరంగంగా ప్రకటించుకున్నాడు. నోవహు ఎటువంటి ప్రతిస్పందనను గమనించాడు? విచారకరంగా, అతని సమకాలీకులు అనేకమంది, “జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొనిపోవు వరకు ఎరుగక పోయిరి.” (మత్తయి 24:37-39) అయితే మనకు సంతోషదాయకంగా, నోవహు కుటుంబంలోని ఏడుగురు సభ్యులు విని, దేవుని సూచనలను పాటించి, ప్రపంచ జలప్రళయాన్ని తప్పించుకున్నారు. నేడు జీవించివున్న మానవులందరూ వారి నుండే ఉద్భవించారు.
తర్వాత, దేవుడు ఒక పూర్తి జనాంగమైన ప్రజలతో సంభాషించాడు, వారు ప్రాచీన ఇశ్రాయేలీయులు. మోషే ద్వారా దేవుడు వారికి పది ఆజ్ఞలు, అంతే బాధ్యతాయుతమైన 600 ఇతర ఆజ్ఞలు ఇచ్చాడు. ఇశ్రాయేలీయులు అవన్నీ పాటించాలని యెహోవా నిరీక్షించాడు. ప్రతి ఏడు సంవత్సరాలకు, సాంవత్సరిక పర్ణశాలల పండుగ సమయంలో దేవుని ధర్మశాస్త్రం బిగ్గరగా చదువబడాలని మోషే సూచించాడు. ఆయనిలా ఉపదేశించాడు, “పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి నీ పురములలోనున్న పరదేశులేమి . . . అందరిని పోగుచేయవలెను.” ఏ సంకల్పం కొరకు? “మీ దేవుడైన యెహోవాకు భయపడి యీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనునట్లు . . . వాటిని విని నేర్చుకొనుటకై.” అందరూ విని, నేర్చుకోవాలి. వారు తాము విన్న దాన్ని చర్చించడానికి ఎంతగా ఆనందించి ఉంటారో ఊహించండి!—ద్వితీయోపదేశకాండము 31:10-12.
ఐదుకంటే ఎక్కువ శతాబ్దాల తర్వాత, యూదా రాజైన యెహోషాపాతు యెహోవా స్వచ్ఛారాధనను పునరుద్ధరించేందుకు రాజకుమారులను, లేవీయులను ఒకచోటికి సమకూర్చాడు. ఈ పురుషులు యూదా పట్టణములందంతట ప్రయాణించి అక్కడి నివాసులకు యెహోవా కట్టడల గురించి బోధించారు. వీటిని బహిరంగంగా చర్చించడం ద్వారా, రాజు స్వచ్ఛారాధన కొరకైన తన ధైర్యాన్ని ప్రదర్శించాడు. ఆయన రాజ్యప్రజలు విని నేర్చుకోవాలి.—2 దినవృత్తాంతములు 17:1-6, 9.
చర్చించడం ద్వారా సాక్ష్యమివ్వడం
తన వాక్యంగా వ్యవహరించడానికి దేవుడు తన స్వంత కుమారుడైన యేసును భూమిమీదికి పంపించాడు. (యోహాను 1:14) యేసు తమ యెదుట రూపాంతరం పొందడాన్ని ముగ్గురు శిష్యులు చూసినప్పుడు, దేవుని స్వంత స్వరం ఇలా ప్రకటించడం వారు విన్నారు: “ఈయన నా ప్రియకుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నాను, ఈయన మాట వినుడి.” (మత్తయి 17:5) వారు ఇష్టపూర్వకంగా విధేయులయ్యారు.
అలాగే, తన అపొస్తలులు దేవుని సంకల్పాల గురించి ఇతరులకు ప్రకటించడానికి యేసు వారికి నడిపింపునిచ్చాడు. కాని భూమిపై ఇంకా ఆరునెలల పరిచర్య మిగిలి ఉండగా, పరలోక రాజ్యాన్ని గూర్చి ప్రకటించే పని ఎంతో విస్తృతంగా ఉన్నందున ఇంకా ఎక్కువమంది శిష్యులు అవసరమని యేసు తెలియజేశాడు. ఆయన వారిలో 70 మందికి క్రొత్తవారితో దేవుని రాజ్యాన్ని గూర్చి ఎలా చర్చించాలో నేర్పించి, ఆ సమాచారాన్ని బహిరంగంగా వ్యాప్తి చేయడానికి వారిని పంపించాడు. (లూకా 10:1, 2, 9) యేసు, తన తండ్రి యొద్దకు పరలోకానికి వెళ్లడానికి కొంచెం ముందు, ఈ వర్తమానం గురించి ఇతరులతో మాట్లాడేందుకు చొరవ తీసుకొమ్మని తన అనుచరులకు ఉద్బోధిస్తూ, వారికిలా కూడా ఆజ్ఞాపించాడు: “మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, . . . నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి.” (మత్తయి 28:19, 20) నేడు ప్రపంచవ్యాప్తంగా, నిజ క్రైస్తవులు తమ పొరుగువారితో దేవుని రాజ్య సువార్తను చర్చించడం ద్వారా ఆ ఆజ్ఞను నెరవేరుస్తున్నారు. ఈ చర్చలు సృష్టికర్తయైన యెహోవాను గూర్చిన సత్యానికి సాక్ష్యమిచ్చేందుకు వారికి సహాయం చేస్తాయి.—మత్తయి 24:14.
సమాధానకరమైన, క్షేమాభివృద్ధికరమైన చర్చలు
యేసు శిష్యులు తమ నమ్మకాలను ఇతరులతో ఏ విధంగా చర్చించాలి? వారు వ్యతిరేకులకు చికాకు కలిగించకూడదు, లేక వారు వ్యతిరేకులతో వాదించకూడదు. బదులుగా, వారు సువార్తను స్వాగతించేవారి కొరకు వెదకి, దానికి మద్దతుగా లేఖనాధార రుజువును అందజేయాలి. “మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును; నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవాని చేర్చుకొనును” అని యేసు ప్రకటించినట్లుగా, తన కుమారుని శిష్యులను కలిసినవారి ప్రతిస్పందనలను దేవుడు గమనించాడు. (మత్తయి 10:40) యేసు సమకాలీనులు అనేకులు ఆయన వర్తమానాన్ని నిరాకరించినప్పుడు, వారు దేవున్నే నిరాకరించారు!
“ప్రభువుయొక్క దాసుడు . . . జగడమాడ” కూడదని క్రైస్తవ అపొస్తలుడైన పౌలు ఉపదేశించాడు. బదులుగా అతడు, “సత్యవిషయమైన అనుభవజ్ఞానము వారికి కలుగుటకై, దేవుడొకవేళ ఎదురాడు వారికి మారుమనస్సు దయచేయును; అందువలన . . . అట్టివారిని సాత్వికముతో శిక్షించుచు, . . . అందరి యెడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను, కీడును సహించువాడుగాను ఉండవలెను.” (2 తిమోతి 2:24, 25) ఏథెన్సు మరియు గ్రీసు ప్రజలకు పౌలు సువార్త ప్రకటించిన విధానం ఒక చక్కని మాదిరిని అందజేస్తుంది. ఆయన యూదులతో వారి సమాజమందిరాల్లో తర్కించాడు. ప్రతిరోజు సంతవీధిలో “తన్ను కలిసికొనువారితో” ఆయన మాట్లాడాడు. అయితే నిస్సందేహంగా, కొందరు పౌలు సూటిగా, దయాపూర్వకంగా మాట్లాడిన క్రొత్త సంగతుల్ని మాత్రమే వినడానికి ఇష్టపడేవారు. ఆయన తన శ్రోతలతో దేవుని వర్తమానాన్ని గూర్చి చర్చించేవాడు, వారు పశ్చాత్తాపపడడానికి ఇది వారిని పురికొల్పేది. వారి ప్రతిస్పందన చాలావరకు నేటి ప్రజల ప్రతిస్పందన వలెనే ఉండేది. “కొందరు అపహాస్యము చేసిరి; మరికొందరు—దీనిగూర్చి నీవు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి.” పౌలు చర్చలను పొడిగించడానికి ప్రయత్నించలేదు. అతడు తన వర్తమానాన్ని ప్రకటించి, “వారి మధ్యనుండి వెళ్లిపోయెను.”—అపొస్తలుల కార్యములు 17:16-34.
తర్వాత, పౌలు ‘ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను, ఇంటింటను మీకు తెలియ’ జేసితినని ఎఫెసునందలి క్రైస్తవ సంఘ సభ్యులకు చెప్పాడు. అంతేగాక, ఆయన ‘దేవుని యెదుట మారుమనస్సు పొంది ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలెనని, యూదులతోను గ్రీసుదేశస్థులతోను సమగ్రంగా’ చర్చించాడు.—అపొస్తలుల కార్యములు 20:20, 21.
బైబిలు కాలాల్లో దేవుని విశ్వాసులైన సేవకులు మతం గురించి ఎలా చర్చించారో ఈ లేఖనాధార ఉదాహరణలు తెలియజేస్తున్నాయి. గనుక నేడు, యెహోవాసాక్షులు తమ పొరుగువారితో మతం గురించి వినయంగా చర్చిస్తారు.
ఎంతో ఫలవంతమైన చర్చలు
‘దేవుని వాక్యాన్ని వినండి.’ ‘ఆయన ఆజ్ఞలు పాటించండి.’ బైబిలులో అలాంటి పురికొల్పులు ఎంత తరచుగా కనిపిస్తాయి! యెహోవాసాక్షులు మరోసారి మీతో మాట్లాడినప్పుడు బైబిలు సంబంధమైన ఈ నడిపింపులకు మీరు ప్రతిస్పందించవచ్చు. వారు బైబిలు నుండి మీ కొరకు తెచ్చే వర్తమానాన్ని వినండి. ఈ వర్తమానం రాజకీయమైంది కాదుగాని, దేవుని ద్వారా, ఆయన రాజ్యం ద్వారా వచ్చే పరలోక ప్రభుత్వాన్ని సమర్థిస్తుంది. ఇది ప్రస్తుత దిన వైరాలకు కారణమైన వాటిని నిర్మూలించడానికి దేవుని మూలమైయ్యుంది. (దానియేలు 2:44) పరలోకం నుండి దేవుని ద్వారా జరిగే ఈ పరిపాలన ఆ తర్వాత భూమంతా ఏదెను తోటవంటి పరదైసుగా మార్చే ఏర్పాటు చేస్తుంది.
ఒక మాజీ పోలీసు పరిశోధనాధికారి యెహోవాసాక్షులు తనతో బైబిలు గురించి మాట్లాడినప్పుడు వినడానికి తరచూ నిరాకరించేవాడు. కాని ఆయన ఎదుర్కొనవలసి వచ్చిన పెరిగిపోతున్న నేరాన్ని బట్టి, అతడు జీవితంతో విసుగుచెందాడు. కాబట్టి తనను తర్వాత కలిసిన సాక్షితో ఆయన, బైబిలు వర్తమానం యొక్క సాక్ష్యాధారాన్ని పరిశోధిస్తానని చెప్పాడు. క్రమ చర్చలు ప్రారంభమయ్యాయి. ఆ పోలీసు అనేకసార్లు తన నివాస గృహాన్ని మార్చినప్పటికీ సాక్షులు అతన్ని వెదకి, చర్చలు కొనసాగించడానికి అతని క్రొత్త ఇంటి దగ్గర అతన్ని సంతోషంగా కనుగొనేవారు. చివరికి ఆ అధికారి ఇలా అంగీకరించాడు: “నేను వెదకే సాక్ష్యాధారం ప్రతిసారి సరిగ్గా పరిశుద్ధ లేఖనాల్లో ఉండేది. నాతో మాట్లాడడానికి ఆ సాక్షులు అంతగా ప్రయాసపడి ఉండకపోతే, జీవితార్థం ఏమిటా అని ఆలోచిస్తూ నేను ఇంకా అక్కడే ఉండేవాన్ని. వాస్తవమేమిటంటే, నేను సత్యం నేర్చుకున్నాను, నేను వెదకినట్లే దేవుని కొరకు వెదుకుతున్న ఇతరులను చూసేందుకు నేను నా మిగిలిన జీవితాన్ని గడపబోతున్నాను.”
ఆసక్తిగల శ్రోతలు ఎక్కువ తెలుసుకోవాలని కోరుకుంటారు. అందజేయబడిన నమ్మకాలకు కారణాలుండాలని వారు సరిగ్గానే ఎదురుచూస్తారు. (1 పేతురు 3:15) చిన్నపిల్లవాడు తన తల్లిదండ్రులను ప్రశ్నలతో ఎలా వేధించి, వారు జవాబివ్వాలని ఎదురుచూస్తాడో అలాగే, సాక్షులు మీకు తగిన సమాధానాలివ్వాలని మీరు సరిగ్గానే ఎదురుచూస్తారు. వారు సంతోషంగా తిరిగి వచ్చి బైబిలు వర్తమానాన్ని మీతో ఇంకా ఎక్కువగా చర్చిస్తారని మీరు నిశ్చయత కలిగివుండవచ్చు.
బహుశా మీకు బైబిలు గురించి ఇప్పటికే కొంత తెలిసివుండవచ్చు. దేవుడు మీ నుండి కోరేదాని కొరకు మీరు మీ జీవిత విధానంలో కొంత మార్పులు చేసుకోవలసి ఉంటుందని మీరు గ్రహించవచ్చు. దేవుని కట్టడలు మీ నుండి ఎంతో కోరుతాయనే భయంతో విషయాలను పరిశీలించడానికి వెనుకాడకండి. అవి నిజమైన సంతోషాన్నే తీసుకువస్తాయి. మీరు ఒక సమయంలో ఒక్కో చర్యనే గైకొంటూ అభివృద్ధి సాధిస్తుండగా మీరు దీన్ని గుణగ్రహిస్తారు.
అన్నిటికంటే ముందు, యెహోవా ఎవరో, మీ నుండి ఆయన ఏమి కోరుతున్నాడో, ఆయన ఏమివ్వబోతున్నాడో పరిశీలించండి. దీని గురించి బైబిలు ఏమి చెబుతుందో చూపించమని సాక్షులను అడగండి. వారు చెప్పింది మీ స్వంత బైబిలు కాపీలో ఉందేమో పరిశీలించి చూసుకోండి. మతం గురించి సాక్షులు సత్యమని చెప్పేది కారణసహితమైనదని తెలుసుకోవడం ద్వారా, వారు లేఖనాల్లో నుండి మీతో పంచుకోగల అనేక మంచి సంగతుల గురించి పరిశోధించడానికి మీరు నిస్సందేహంగా ఇష్టపడతారు.—సామెతలు 27:17.
మీరు సాక్షులను వారి స్థానిక సమావేశ స్థలమైన రాజ్యమందిరం వద్ద గమనించడానికి మీరు ఆహ్వానితులే. అక్కడ మీరు దేవుని వాక్యాన్ని గూర్చిన ప్రయోజనకరమైన చర్చలను వింటారు. అక్కడ హాజరైయున్న వారందరు దేవుని సంకల్పాల గురించి ఒకరితో ఒకరు మాట్లాడడాన్ని ఎలా ఆనందిస్తారో మీరు చూస్తారు. నేడు మన కొరకు దేవుని చిత్తం ఏమైయుందనే దాన్ని గూర్చిన సత్యాన్ని నేర్చుకోవడానికి మీకు సహాయం చేసేందుకు ఈ సాక్షులకు అనుమతివ్వండి. సత్యారాధన గురించి చర్చించి, చిరునవ్వుతో ఆయనిచ్చే అంగీకారాన్ని మరియు పరదైసులో నిత్యజీవాన్ని పొందేందుకు దేవుని ఆహ్వానానికి ప్రతిస్పందించండి.—మలాకీ 3:16; యోహాను 17:3.
[5వ పేజీలోని చిత్రం]
దేవుని సంకల్పాన్ని గూర్చి నోవహు బహిరంగంగా మాట్లాడాడు
[7వ పేజీలోని చిత్రాలు]
ప్రాచీన ఏథెన్సులో పౌలు చేసినట్లుగా, యెహోవాసాక్షులు ఇతరులకు బైబిలు సత్యాలను బోధిస్తారు