కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 4/1 పేజీలు 3-4
  • మతం—ఓ నిషేధిత చర్చాంశమా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మతం—ఓ నిషేధిత చర్చాంశమా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుని రాజ్యం అంటే ఏమిటి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2016
  • నిజమైన మతం ఏదో నేనెలా తెలుసుకోవాలి?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • మతాలు దేవునికి ఎలా చెడ్డపేరు తెస్తున్నాయి?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 4/1 పేజీలు 3-4

మతం—ఓ నిషేధిత చర్చాంశమా?

“నేనెన్నడూ చర్చించని అంశాలు రెండున్నాయి: మతం మరియు రాజకీయాలు!” యెహోవా సాక్షులు ఇతరులతో బైబిలు గురించి మాట్లాడినప్పుడు తరచూ వచ్చే ప్రత్యుత్తరం అదే. ఆ దృక్కోణం అర్థం చేసుకొనదగినది.

ప్రజలు రాజకీయాల గురించి తర్కించినప్పుడు కోపాగ్ని చెలరేగవచ్చు, తగాదాలేర్పడవచ్చు. అనేకులు శుష్క వాగ్దానాలచే మోసగించబడకుండా, రాజకీయవేత్తలు తరచూ కేవలం అధికారం, కీర్తి, డబ్బు వంటివాటి కొరకే చూస్తారని గ్రహిస్తారు. విచారకరంగా, రాజకీయ విబేధాలు కొన్నిసార్లు దౌర్జన్యానికి దారితీస్తాయి.

‘కాని, మతం విషయంలో కూడా అదే నిజం కాదా? మతాసక్తి నేటి అనేక వైరుధ్యాలను రగిలించలేదా?’ అని మీరు తర్కించవచ్చు. ఉత్తర ఐర్లాండులో, రోమన్‌ కాథోలిక్కులు ప్రొటెస్టంట్‌లు చాలాకాలం నుండి ఒకరితో ఒకరు వైరం కలిగివున్నారు. బాల్‌కాన్స్‌ రాష్ట్రాల్లో, తూర్పు ఆర్థడాక్స్‌ చర్చి సభ్యులు, రోమన్‌ కాథోలిక్కులు, మరితరులు స్థలం కొరకు పోటీపడుతున్నారు. ఫలితం? దుర్మార్గతలు, కొనసాగే శత్రుత్వం.

మరణ భయాన్ని ఎదుర్కోవడం వల్ల, అనేకులు తమ యొక్క మరియు తమ కుటుంబాల యొక్క వ్యక్తిగత నమ్మకాలను దాచటానికి ప్రయత్నిస్తారు. ఆఫ్రికాలో, క్రైస్తవమత సామ్రాజ్య ప్రజలకు, ఇతర విదేశీ మరియు మతసంబంధ తెగలకు మధ్యనున్న శతాబ్దాల వైరం, తల్లిదండ్రులు తమ పిల్లలకు కొంతమేరకు భద్రతను కలుగజేయగల రెండు పేర్లను పెట్టేలా వారిని పురికొల్పింది, ఆ ఆచారం నేటికీ ఆచరణలో ఉంది. ఒక బాలుడు, ఆ పేర్లలోని ఏదో ఒక పేరును మాత్రమే ఉపయోగించడం ద్వారా చర్చి సభ్యునిగానో లేక మరో మతస్థునిగానో చలామణీ కాగలడు. ఒక వ్యక్తి యొక్క మతసంబంధమైన నమ్మకాల కొరకు అతడు తన జీవితాన్నే పణంగా పెట్టవలసివచ్చేలా ఉంటే, మతాన్ని బహిరంగంగా చర్చించడానికి అతడు వెనుకాడడంలో ఆశ్చర్యంలేదు.

ఇతరులకు, వారి జీవితాలు ప్రమాదంలో లేనప్పుడు కూడా మతం ఒక నిషేధిత చర్చాంశమే. వేరే విశ్వాసం గల వారితో తమ విశ్వాసాలను గూర్చి మాట్లాడడం అనవసరమైన వాదనకు దారితీస్తుందేమోనని వారు భయపడతారు. ఇంకా ఇతరులు అన్ని మతాలు మంచివేనని నమ్ముతారు. ఒక వ్యక్తి నమ్మేది అతన్ని సంతృప్తిపరుస్తున్నంత వరకు, తేడాల గురించి మాట్లాడడం వ్యర్థమేనని వారు చెబుతారు.

మతస్వభావాన్ని గూర్చి గంభీరంగా అధ్యయనం చేసే విద్యార్థులు కూడా తమలో తాము ఏకీభావం కలిగి ఉండరు. “ది స్టడీ అండ్‌ క్లాసిఫికేషన్‌ ఆఫ్‌ రెలీజన్స్‌” అనే తన శీర్షికలో ది న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ఇలా అంగీకరిస్తుంది: “[మతం] యొక్క స్వభావాన్ని గూర్చి విద్వాంసులలో ఎంతో అరుదుగా ఐక్యత ఉండేది . . . ఆ విధంగా, చరిత్రంతటిలో, ఈ అంశంలో వివాదం ఇమిడివుండేది.”

ఒక నిఘంటువు మతాన్ని “విశ్వం యొక్క సృష్టికర్తగా, అధిపతిగా గుర్తింపబడిన మానవాతీత శక్తియందు మానవుని విశ్వాసం మరియు దాని యెడల భక్తిని వ్యక్తం చేయుట” అని నిర్వచిస్తుంది. జీవితంలో మతం ఒక ప్రముఖ పాత్ర నిర్వహించవలసిన అవసరతను ఇది కలిగిస్తుంది. వాస్తవానికి, మానవ చరిత్రను రూపించడంలో మతం ఒక విశ్వవ్యాప్త మూలాంశంగా ఉంది. ఆక్స్‌ఫర్డ్‌ ఇలస్ట్రేటడ్‌ ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ పీపుల్స్‌ అండ్‌ కల్చర్స్‌ ఇలా తెలియజేస్తుంది: “ఏదో ఒక విధమైన మతం ద్వారా జీవితానికి క్రమాన్ని, అర్థాన్ని ఇవ్వడానికి ప్రయత్నించని సమాజం ఏదీ లేదు.” జీవితానికి “క్రమం” మరియు “అర్థం” వంటి ప్రాథమికమైన వాటితో సహా, మతం కచ్చితంగా వాదన లేక తర్కం కాకుండా మరొకటి పొందదగినదే. బదులుగా, అది చర్చించదగినది అంటే, మరొకరితో సమగ్రమైన పరిశీలన చేయదగినది. కాని ఎవరితో, దాని ద్వారా ఏ ప్రయోజనం సాధించబడగలదు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి