మీరు యెహోవాను స్తుతిస్తారా?
“దేవా, నీ నామము ఎంత గొప్పదో నీ కీర్తియు భూదిగంతములవరకు అంత గొప్పది.” కోరహు కుమారుల ఒక ప్రవచనార్థక పాటలోని పదాలే ఇవి. (కీర్తన 48:10) నేడు, లక్షలాది మంది యెహోవాసాక్షుల గొప్ప ఐక్యగానం దేవున్ని స్తుతిస్తోంది మరియు తన రాజ్య సువార్తను ప్రకటించడం ద్వారా ఆయన నామాన్ని వారు తెలియజేస్తున్నారు. దీన్ని 232 దేశాలూ సముద్ర దీవులందు, 300 భాషలకుపైగా చేయడం ద్వారా వారు అక్షరార్థంగా “భూదిగంతములవరకు” చేరుకున్నారు.
వివిధ సాంస్కృతిక, సామాజిక, వివిధ భాషల గుంపుల నుండి వచ్చి యెహోవాను స్తుతించేందుకు ప్రజలను ఏది బలవంతంచేస్తుంది? దేవుని వాక్యమైన బైబిలును గూర్చిన వారి కచ్చితమైన జ్ఞానమే దానికి ముఖ్య కారణం. ఆత్మీయ జ్ఞానం వారిని మూఢ నమ్మకాల నుండి నిత్యాగ్ని హింస వంటి మతపర నమ్మకాల దాసత్వం నుండి విడిపించింది. (యోహాను 8:32) ప్రేమ, శక్తి, జ్ఞానము మరియు కనికరంతో మెత్తనైన న్యాయము వంటి దేవుని అద్భుతమైన లక్షణాల యెడల వారు మెప్పుదలను కల్గివుండేటట్లు కూడ ఆ సత్యం వారికి సహాయపడుతుంది. మానవజాతి కొరకు విమోచన క్రయధన బలిగా, దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును అర్పించినదాని గ్రహింపును అందుకోవడం, నీతిమంతులైన ప్రజలు యెహోవాను స్తుతించి, సేవించేందుకు వారిని నడుపుతుంది.
బైబిలు పుస్తకమైన ప్రకటన ప్రకారం, ఒక పరలోక బృందగానం ఇలా అబ్బురంతో పాడుతోంది: “ప్రభువా, (యెహోవా, NW) మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవియుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నర్హుడవు.” (ప్రకటన 4:11) అలాంటి స్తుతి కేవలం అది చేయాల్సిందే అన్న భావననుండి కలుగదు. బదులుగా, అది యెహోవా యెడల పూజ్య భావం వల్ల కలుగుతుంది.
సువార్తను ప్రకటించడం ద్వారా దేవున్ని స్తుతించండి
యెహోవాను స్తుతించడం ద్వారా, ఒక వ్యక్తి దేవుని ప్రధాన స్తుతికర్తయైన యేసుక్రీస్తు యొక్క చక్కని మాదిరిని అనుకరిస్తున్నవాడౌతాడు. యేసు అడుగుజాడలను అనుసరించడం అంటే దేవుని రాజ్య సువార్త పనిలో పాల్గొనడం ఇమిడి ఉంటుంది. (మత్తయి 4:17, 23; 24:14) యెహోవాను స్తుతించడంలో ఈ ప్రకటనా పని ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్ప ప్రయత్నం అయ్యింది.
ఈ ప్రకటనా పని ఎంత ప్రాముఖ్యమంటే, బైబిలు దాన్ని రక్షణతో స్పష్టంగా బంధపర్చింది. రోమీయులు 10:13-15 నందు ఇలా ఉంది: “ప్రభువు (యెహోవా, NW) నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపనివానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విననివానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండ వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడని యెడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై—ఉత్తమమైనవాటిని గూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి. అని వ్రాయబడి యున్నది.”
కేవలం గత సంవత్సరంలోనే, యెహోవాసాక్షులు ప్రకటనా పనికొరకు నూరు కోట్ల గంటలకుపైగా వెచ్చించారు. మరి ఇలా దేవున్ని స్తుతించడం వల్ల ఎంత మంచి ఫలితాలు వచ్చాయో గదా! నీటి బాప్తిస్మం ద్వారా సుమారు 3,14,000 మంది యెహోవాకు తమ సమర్పణను కనపరుస్తూ స్తుతికర్తల ఐక్యగానంలో చేరారు.
అయినప్పటికీ, క్రీస్తు మరణ జ్ఞాపకార్థ దినానికి 1994 నందు హాజరైన 1,22,88,917 మందిని గూర్చి ఏమని చెప్పవచ్చు? వారిలో సువార్త ప్రచారకులుగా ఇంకా యెహోవాను స్తుతించని 70,00,000 మందికిపైగా ఉన్నారు. అయితే ఈ ప్రాముఖ్యమైన సందర్భంలో వారు అక్కడ ఉండడం, స్తుతికర్తల ఐక్యగానానికి ఇంకా లక్షలాదిమంది చేరేలా చివరికి ఫలించగలదు. ఈ ఆసక్తిగలవారు యెహోవా స్తుతికర్తలయ్యేలా సహాయపడేందుకు ఏమి చేయవచ్చు?
అందుబాటులో ఉన్న సహాయం
ఆసక్తిగల అనేకమంది వ్యక్తులకు యెహోవాను స్తుతించాలనే కోరిక ఉండవచ్చు కానీ ఆ అర్హతలను చేరుకోలేమని వారు భావించవచ్చు. కీర్తనల గ్రంథకర్త చెప్పిన మాటలను వారు గుర్తుచేసుకోవడం మంచిది: “కొండల తట్టు నా కన్ను లెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడనుండి వచ్చును? యెహోవావలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు.” (కీర్తన 121:1, 2) స్పష్టంగా, యెహోవా ఆలయం మరియు భూమ్మీది దైవ పరిపాలనకు పీఠం ఉన్న యెరూషలేము పర్వతములమీదికి కీర్తనల గ్రంథకర్త తన కన్నులను ఎత్తాడు. దేవున్ని స్తుతించేందుకు మరియు రాజ్య వర్తమానాన్ని ప్రకటించేందుకు మనకు సహాయం కేవలం యెహోవా మరియు ఆయన సంస్థనుండి మాత్రమే వస్తుందని మనం సరైన నిర్దారణకు రాగలము.—కీర్తన 3:4; దానియేలు 6:10.
నేడు, యెహోవాను ఆరాధించాలనుకునేవారు ఆయన భూలోక సంస్థనుండి ప్రేమపూర్వక సహాయాన్ని అపేక్షించగలరు. ఉదాహరణకు, యెహోవాసాక్షులు ఆసక్తిగలవారితో ఉచిత బైబిలు పఠనాలను నిర్వహించడం ద్వారా సహాయాన్ని అందిస్తారు. ఈ విద్యాబోధన కార్యక్రమంలో బైబిలు సిద్ధాంతాలను నేర్చుకోవడం కంటే ఎక్కువే ఇమిడివుంది. తాను నేర్చుకుంటున్న వాటి యెడల మరియు యెహోవా ఉపయోగించుకుంటున్న సంస్థ యెడల మెప్పుదలను పెంచుకునేలా ఆ విద్యార్థికి అది సహాయపడుతుంది.
దీనికి అనుగుణ్యంగా, బైబిలు పఠనాన్ని నిర్వహిస్తున్న సాక్షి క్రొత్త సత్యాలు అతని మెదడులోకే కాదు, అతని హృదయంలోకి కూడా చేరుకునేలా ప్రయత్నిస్తాడు. యెహోవా భూమ్మీద తన సంకల్పాన్ని సాధించేందుకు ఆయన తన సంస్థను ఎలా ఉపయోగిస్తున్నాడో చూపేందుకు ఆ బోధకుడు వెనుకంజవేయకూడదు. ప్రపంచవ్యాప్తంగా యెహోవాసాక్షులు ఐక్యంగా దేవుని చిత్తాన్ని చేయడం అనే బ్రోషూర్ మరియు యెహోవాసాక్షులు—ఆ నామము వెనుకనున్న సంస్థ అనే వీడియో టేప్ దీన్ని సాధించడంలో సహాయకారిగా ఉంటాయి.
యెహోవా యొక్క బావి స్తుతికర్తలకు సహాయపడేందుకు క్రైస్తవ కూటాలు ప్రాముఖ్యమైన పాత్రను వహిస్తాయి. ఒక బైబిలు విద్యార్థి తొలి స్థితిలో, క్రైస్తవ కూటాలకు హాజరుకమ్మని ఆహ్వానించవచ్చు. సకాలంలో, సంఘ కూటాలన్నింటికీ హాజరుకావడం మరియు వాటిలో పాల్గొనడంలోని ప్రాముఖ్యతను అతను తెలుసుకుంటాడు. (హెబ్రీయులు 10:24, 25) ఆత్మీయంగా అభివృద్ధిదాయకమైన మరియు ఆచరణయుక్తమైన కూటాలకు సిద్ధపడడం ద్వారా సంఘ పర్యవేక్షకులు, తోటి విశ్వాసులకు యెహోవా స్తుతికర్తలు కాబోయేవారికి అమూల్యమైన సహాయాన్ని అందించగలరు.
పిల్లలు యెహోవాను ఆరాధించేందుకు సహాయపడండి
సమీప భవిష్యత్‌నందు సువార్త ప్రచారకులుకాగల అనేకుల్లో పిల్లలున్నారు. “ప్రభువుయొక్క (యెహోవా NW) శిక్షలోను బోధలోను వారిని” పెంచాల్సిన బైబిలాధారిత బాధ్యత ప్రత్యేకంగా తలిదండ్రులపై ఉంది. (ఎఫెసీయులు 6:4) దైవభక్తిగల తలిదండ్రులు సరైన శిక్షణనిచ్చినప్పుడు, చంటి పిల్లలు సహితం యెహోవాను స్తుతించాలనే కోరికను పెంచుకుంటారు.
అర్జెంటీనాలోని ఒక చిన్న పాప తాను రాజ్య ప్రచారకురాలయ్యేలా అర్హతను సంపాదించేందుకు సంఘ పెద్దల సహాయాన్ని కోరుతూ అనేక నెలల వరకూ పదేపదే వారిని సమీపించింది. సకాలంలో ఆమె తలిదండ్రులూ పెద్దలూ ఆమె బాప్తిస్మము తీసుకోని ప్రచారకురాలయ్యేందుకు అనుమతించడానికి అంగీకరించారు. ఆమె అప్పటికే రాజ్య వర్తమానాన్ని ఇళ్లవద్ద చక్కగా అందిస్తుంది. ఆ పాప కేవలం అయిదేళ్ళదై చదవడం రాకపోయినప్పటికీ, బైబిలు లేఖనాల్లో కొన్ని ఎక్కడ ఉన్నాయన్న దాన్ని జ్ఞాపకం పెట్టుకుంది. ఒక లేఖనాన్ని కనుగొన్న తర్వాత, దాన్ని చదవమని ఆ ఇంటివారితో చెబుతుంది, ఆ తర్వాత దాన్ని ఆమె వివరిస్తుంది.
యెహోవా స్తుతికర్తలయ్యేందుకు అభివృద్ధి చెందుతున్న వారిని ప్రోత్సహించడం మరియు సహాయపడడం ద్వారా పెద్దలూ తలిదండ్రులూ ఎంతో సాధించగలరు.—సామెతలు 3:27.
యెహోవాతో నిత్య సంబంధం
అయితే, మీరే యెహోవాసాక్షులతో కొంతకాలం నుండి సహవసిస్తూ వారి ప్రకటించే పనిలో ఇంకా వారితో చేరకపోయినట్లైతే, అప్పటి విషయమేమిటి? మీకై మీరు ఈ క్రింది ప్రశ్నలను వేసుకోవడం ప్రయోజనకరమౌతుంది. ‘నేను సత్యాన్ని కనుగొన్నాననీ, యెహోవాయే సత్య దేవుడనీ నేను విశ్వసిస్తున్నానా? దేవుని రాజ్యమొక్కటే మానవజాతి సమస్యలకు పరిష్కారమని నేను కచ్చితంగా తెలుసుకున్నానా? యెహోవాను బాధపర్చే అబద్ధమతాన్ని, లౌకిక ఆచారాలను, అలవాట్లనూ నేను విడిచిపెట్టానా? దేవుని యెడల మరియు ఆయన నీతియుక్త కట్టడల యెడల నాకు లోతైన ప్రేమ ఉందా?’ (కీర్తన 97:10) ఈ ప్రశ్నలకు మీరు యథార్థంగా అవుననే జవాబు చెప్పినట్లైతే, మీరు యెహోవాను స్తుతించడంలో మిమ్మల్ని ఏది నివారిస్తుంది?—అపొస్తలుల కార్యములు 8:36 పోల్చండి.
యెహోవాను స్తుతించడంలో సువార్తను ప్రకటించడంకంటే ఎక్కువ ఇమిడివుంది. మీరు సరైన జ్ఞానాన్ని తీసుకుని, నిజమైన విశ్వాసాన్ని కల్గివుండి మరియు దైవిక కట్టడలకు తగినట్లుగా మీరు మీ జీవితాన్ని మలచుకున్నట్లైతే, దేవునితో మీ వ్యక్తిగత సంబంధాన్ని మీరు మరింత గట్టిగా చేసుకోవాల్సిన అవసరముంది. ఎలా? ప్రార్థనలో ఆయనకు మిమ్మల్ని సమర్పించుకుని, తర్వాత దాన్ని నీటి బాప్తిస్మం ద్వారా కనపర్చుకోవాలి. నిత్యజీవం ప్రమాదంలో ఉంది. కనుక, యేసు సలహా ప్రకారం నడుచుకోండి: “ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే.”—మత్తయి 7:13, 14.
ప్రస్తుత విధానం దాని వినాశక అంతానికి సమీపిస్తున్న ఈ సమయం వెనుకంజ వేయవల్సిన సమయంకాదు. యెహోవాతో నిత్య సంబంధాన్ని కల్గివుండేందుకు చర్యలను వెంటనే గైకొనండి. మీరు యెహోవాను స్తుతిస్తారా? అనే ప్రశ్నకు అనుకూలంగా ప్రతిస్పందించేందుకు వాస్తవానికి, ఇదే సరైన సమయము.