యెహోవా భూమిని రక్షిస్తాడు
మాల్దీవుల్లో ఉన్న ఒక విమానాశ్రయం ప్రతి రోజు అనేక గంటలపాటు మూసివేయబడి ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే ఉవ్వెత్తున ఎగసే అలల నీళ్లు విమానం దిగే రన్‌వేను ముంచివేస్తాయి కనుక, అక్కడ విమానాలు దిగడం చాలా కష్టమౌతుంది. రాబోయే శతాబ్దంలో మాల్దీవుల వద్ద సముద్రమట్టం కనీసం ఒక మీటరు ఎత్తుకు పెరుగుతుందని కొందరు శాస్త్రజ్ఞులు భయపడుతున్నారు. ఇది అంత పెద్ద విషయంగా కనిపించకపోయినా, ఈ పెరుగుదల ఏడు దీవుల దేశాల్ని పూర్తిగా నాశనం చేయగలదు. వాస్తవానికి, యుఎన్ క్రానికల్ ప్రకారం, రెండు మీటర్ల పెరుగుదల అన్ని ద్వీపపుంజాల్ని దాదాపు 1,200 ద్వీపాల్ని ముంచివేయగలదు!
పెరిగే సముద్రమట్టానికి కారణమేమిటి? యుఎన్ ఎన్‌విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ ప్రకారం, “హరితగృహ వాయువులు” భూ వాతావరణాన్ని కలుషితం చేయడం, వెచ్చని ప్రదేశాల్లో ఉన్న సముద్రాలు విస్తరించేలా, మంచు కప్పులూ మంచుగడ్డలూ కరిగేలా చేస్తుంది, మరి తద్వారా సముద్రమట్టం పెరుగుతుంది. లండన్‌లో ఉన్న పానొస్ ఇన్స్‌టిట్యూట్, కాలుష్యం, “భూమి సముద్రాల సరిహద్దులను మార్చగల మెల్లగా వచ్చే లోకవ్యాప్త వినాశనాన్ని ఆరంభించి ఉండవచ్చనని” చెబుతోంది.
భూగోళమంతా వెచ్చనవ్వడాన్ని గూర్చి శాస్త్రజ్ఞులు ఇంకా వాదించుకుంటున్నారు. అయితే, పర్యావరణ సమస్యలు దేవుని సంకల్పాన్ని ఆపలేవనే హామి మనకు ఉంది. ‘భూలోకము ఫలవంతమైన భూమి’ అని బైబిలు పేర్కొంటోంది. ‘అది కదల్చబడదు.’ (1 దినవృత్తాంతములు 16:30) భూమి పర్యావరణం యెహోవా ఆధీనంలో ఉంది, మరి ఆయన త్వరలోనే భూమినీ మానవజాతిని నాశనం నుండి రక్షిస్తాడని మనం సంతోషించగలము.—కీర్తన 24:1, 2; 135:6; 2 పేతురు 3:13.
[31వ పేజీలోని చిత్రసౌజన్యం]
Drawing based on NASA photo