రాజ్య ప్రచారకుల నివేదిక
దేవుని ప్రజలు తమను తాము ఇష్టపూర్వకంగా అర్పించుకుంటారు
ఆయన పేరు యోసేపు, ఆయన కుప్ర దీవినివాసి. క్రైస్తవత్వ పురోగతికి ఆర్థికంగా సహాయపడేందుకు పొలములను ఇండ్లను అమ్మిన తొలి శతాబ్ద క్రైస్తవులలో ఆయన ఒకడు. అతడు తన హృదయపూర్వక ప్రేమ మరియు ఉదారతల వలన ‘ఆదరణ పుత్రుడు’ అనే అర్థం గల బర్నబా అనే పేరుతో పిలువబడ్డాడు.—అపొస్తలుల కార్యములు 4:34-37.
ఇతరుల యెడల ఇలాంటి నిజమైన ఆసక్తి అనేది ఎల్లవేళలా యెహోవా సత్యారాధికుల చిహ్నముగా ఉంది. సాలమన్ దీవులలోని అనుభవం నొక్కిచెబుతున్నట్లుగా నేడు యెహోవాసాక్షులకు కూడా తేడా ఏమీ లేదు.
ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్‌ల నుండి 60 కంటే ఎక్కువ మంది ఉన్న సాక్షుల గుంపు సాలమన్ దీవుల రాజధానియైన హోనియారాకు గ్యాడల్కెనాల్ మీదుగా ప్రయాణం చేసివచ్చారు. వారు పెద్ద క్రైస్తవ సమావేశాల కొరకైన సమావేశ మందిర (అసెంబ్లీ హాల్) నిర్మాణంలో సహాయపడేందుకు వచ్చారు. దాదాపు 1,200 మంది కూర్చునేంతటి సౌకర్యమున్న మందిరాన్ని కట్టడానికి వారికి దాదాపు రెండు వారాలు మాత్రమే పట్టింది!
అదే సమయంలో, న్యూ జార్జియా దీవిలోని ముండా అనే చిన్న నగర అధికారులు యెహోవాసాక్షుల సంఘానికి నగర నడిబొడ్డున ఒక స్థలాన్ని కలిగివుండే హక్కును మంజూరు చేశారు. వారు ఒక రాజ్యమందిరాన్ని అంటే ఒక ఆరాధనా స్థలాన్ని నిర్మించాలని అనుకున్నారు. వారికి నిజంగా ఒక మందిరం అవసరముంది. వారు ఒక చిన్న తడికె ఇంట్లోని ముందు గదిలో కూడుకునేవారు, కాని రాజ్య మందిరాన్ని కట్టుకునేందుకు వారికి వనరులు లేవు.a ఆ సంఘంలో ఎక్కువగా వృద్ధులు, బలహీనులైన ప్రజలు, పిల్లలు ఉన్నారు, వారిలో నిర్మాణపనిలో అనుభవమున్న వారెవ్వరూ లేరు.
దాదాపు 380 కిలోమీటర్ల దూరంలోనున్న గ్యాడల్కెనాల్ దీవిలోని హోనియారాలోవున్న సాక్షులు తమను తాము ఇష్టపూర్వకంగా సమర్పించుకున్నారు. (కీర్తన 110:3) వారు ఇలా యుక్తంగా చెప్పారు: “ఇతర దేశాల్లోని మన సహోదరులు మన కొరకు సమావేశ మందిరాన్ని రెండు వారాల్లో నిర్మించడానికి సిద్ధపడితే, మనం ముండాలో ఉన్న మన సహోదరులకు రెండు వారాల్లో రాజ్యమందిరాన్ని నిర్మించడంలో తప్పకుండా సహాయపడగలము.”
అలాగే జరిగింది. ఒకరోజు ఆసక్తిగల స్వచ్చంధ సేవకులైన సాక్షులతో నిండిన ఏటి పడవ ముండాను చేరుకుంది. పురుషులు, స్త్రీలు, వృద్ధులు, యువకులు అందరూ తమకు తామే తమ ఓడనుండి పరికరాలను దించడంలో నిమగ్నమయ్యారు. వారి కంటే ముందే ముండాకు చేరుకున్న కలపతోను, సిమెంటుతోను, పైకప్పుకు కావలసిన ఇనుముతోను, మరితర పరికరాలతోను నిర్మాణ పనిని ఆరంభించడానికి వారు సిద్ధమయ్యారు.
పని ఆరంభించిన కొద్ది సమయంలోనే, విద్యుద్ఘాతం నగరంలోని నీటి సరఫరాకు అంతరాయం కలిగించింది. అయినను, ఇది పెద్ద అధిగమించలేని సమస్య కాదని తేలింది. సాక్షులు ఒక బావిని త్రవ్వారు, అది నిర్మాణ పని సమయమంతటిలో నీటిని సరఫరా చేసింది. పనివారికందరికి కావలసిన ఆహార విషయమేమి? అది కూడా ఒక సమస్య కాలేదు. హోనియారా నుండి వచ్చిన స్వచ్చంధ సేవకులకు వారి ప్రయాణంలో సరిపడా ఆహారం హోనియారా సంఘాలు అందించాయి. వాళ్ళు తమ స్వంత వంటగాళ్ళను కూడా తెచ్చుకున్నారు!
పథకం ప్రగతిని పొరుగువారు ఆశ్చర్యంతో తిలకించారు. వారిలో ఒకరు ఈ విధంగా చెప్పాడు: “ఇక్కడ పనులు కొన్ని రోజుల్లో జరుగవు. వాటికి సంవత్సరాలు పడతాయి.” మరొక పొరుగువాడైన, ఒక మతనాయకుడు, తమ చర్చి నిర్మాణపు పని గత 20 సంవత్సరాలుగా జరుగుతుంది, కాని అది ఇంతవరకు పూర్తికాలేదని ఒప్పుకున్నాడు. దానికి భిన్నంగా, ముండాలోని యెహోవాసాక్షుల క్రొత్త రాజ్యమందిరం కేవలం పది రోజుల్లోనే పూర్తయ్యింది!
[అధస్సూచీలు]
a పొదలనుండి, అడవి నుండి నరుక్కు వచ్చిన వస్తువులతో చేసిన తడికె ఇల్లు. దాని చట్రము కర్రలతోను, గుంజలతోను చేయబడింది, కర్రలపై ఆకులను మడిచి, తీగెలతో కుట్టి తయారు చేసిన దడితో పై కప్పు, గోడలు కప్పబడ్డాయి.
[24వ పేజీలోని చిత్రం]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
దక్షిణ పసిఫిక్ మహాసముద్రం
సాలమన్ దీవులు
ముండా
గ్యాడల్కెనాల్
హోనియారా
[చిత్రం]
ఆస్ట్రేలియా
న్యూ జిలాండ్