డొమినికన్ రిపబ్లిక్—కనుగొనేందుకు ఇంకా తెరవబడే ఉంది
క్రిష్టాఫర్ కొలంబస్ ఒక యౌవనునిగా తన జీవితాన్ని సముద్రం వద్ద ప్రారంభించాడు, తుదకు అది, వెస్ట్ ఇండీస్ అని పిలువబడే దీవులను కనుగొనేందుకు నడిపింది. డిశంబరు 1492 నందు ఆయన ముఖ్య ఓడైన సాన్టా మారియా, హాయిటీ మరియు డొమినికన్ రిపబ్లిక్లు కలిసి ఉన్న హిస్పనోలియ దీవి అని పిలువబడుతున్న ఎస్పనోల దీవి యొక్క ఉత్తర తీరానికి దూరంగా ఉన్న ప్రాంతం వద్ద ఆగింది. అక్కడ కొలంబస్, మొదటి ఐరోపా నివాసమును తొందరగా నిర్మించి, దానికి ల నవిదాద్ అని పేరుపెట్టాడు. ఈ దీవి అతని మరిన్ని అన్వేషణలకు కేంద్రమైంది.
ఆ దీవిలో ఉదారులైన, నమ్మకస్థులైన, ఆతిథ్యదాయక ప్రజలైన టెయినో ఇండియన్లు నివసిస్తున్నారని కొలంబస్ కనుగొన్నాడు. వారు ఆ సమయంలో సుమారు 1,00,000 మంది ఉండేవారు. అయితే, బంగారాన్ని కనుక్కోవడమే ముఖ్య ఆసక్తిగాగల దోపిడీదార్ల వ్యవహారంవల్ల స్థానిక జనసంఖ్య త్వరగా తగ్గడం ప్రారంభమైంది. పదిహేనువందల డెబ్భై కల్లా అక్కడ సుమారు 500 మంది టెయినో ఇండియన్లు మాత్రమే ఉండేవారు.
నేడు, డొమినికన్ రిపబ్లిక్లో అనేక జాతులూ, వర్ణాల ప్రజలున్నారు, వారి పితరులు ఇక్కడికి వలసవచ్చారు. అయినప్పటికీ, స్నేహశీలంగానూ అరమరికలులేని ప్రజలుగాను ఉంటూ, టెయినోల చక్కని లక్షణాలనేకం వారు కల్గివున్నట్లనిపిస్తుంది. దేవునియందు యథార్థమైన విశ్వాసము మరియు బైబిలు యెడల గౌరవాలతో కూడిన ఈ లక్షణం, ఈ ప్రాంతంలో యెహోవాసాక్షుల ప్రకటించే, బోధించే పనిని అది అద్భుతంగా విజయవంతం చేసింది.
మరో రకమైన అన్వేషణ
మొదట వాచ్‌టవర్ మిషనరీలైన లేనార్ట్ మరియు వర్జీనియా జాన్స్‌న్ డొమినికన్ రిపబ్లిక్లోకి, ట్రుజిల్లో నియంతృత్వ పాలనా శకంలో వచ్చారు. తమ బైబిలు వర్తమానానికి త్వరగా మరియు అనుకూలంగా ప్రతిస్పందించే అనేకమంది ప్రజలను కనుగొని వారు ఆనందించారు. అయితే, అధికారులు మరియు వారి మత సలహాదారులకు ఇది నచ్చలేదు. త్వరలోనే హింసా తరంగం పెల్లుబికింది, మరి డొమినికన్ రిపబ్లిక్‌లోని తొలి సాక్షుల విశ్వాసం గంభీరమైన పరీక్షకు గురైంది. నేటిదాకా, మరణము వరకూ వారు కనపర్చిన యథార్థత మరియు విశ్వాసాలను గూర్చి తరచూ ముచ్చటిస్తారు.
నేడు ఆ ప్రాంతంలో ఉన్న 16,000 మంది యెహోవాసాక్షులు ఎంతో పేరుగాంచారు. కొంత కాలం ముందు, అయిదు దూరదర్శని స్టేషన్లు యెహోవాసాక్షులు—ఆ నామము వెనుకనున్న సంస్థa అనే వీడియోను దేశవ్యాప్తంగా చూపించారు.
ఇది సాక్షుల పనికి, పెద్ద పెద్ద నగరాల్లోనే కాకుండ చిన్న చిన్న పట్టణాల్లోనూ మరియు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎంతో ప్రాచుర్యాన్ని తెచ్చింది. దానిననుసరించి, ఈ సుదూర ప్రాంతాలకు రాజ్య సువార్తను తీసుకువెళ్లేందుకు ఒక ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని వారు ఏర్పాటుచేశారు.
చేరినందుకు ఆశీర్వాదములు
అనేకమంది యౌవన, శక్తిమంతులైన, ఆసక్తిగల సాక్షులు, ఈ సుదూర ప్రాంతాల్లో ప్రకటించేందుకు రెండు నెలల కాలాన్ని స్వచ్ఛందంగా వెచ్చించారు. వారి ప్రయత్నాలకు మంచి ఫలితాలు లభించాయి. ఒక ప్రాంతంలో ఇద్దరు సాక్షులు అసాధారణమైన ఆసక్తిని కనుగొన్నారు. అది, యేసు వార్షిక మరణ జ్ఞాపకార్థాన్ని ఆచరించే సమయం గనుక, ఏర్పాటులను చేసి ప్రజలను ఆహ్వానించారు. హాలు పూర్తిగా నిండిపోయింది, మరి వారు కూటాన్ని నిర్వహించారు. అది అయిపోయినప్పుడు, లోపలికి ప్రవేశించేందుకు బైట వేచివున్న ప్రజల మరో పెద్దగుంపును చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. కనుక వారు వాళ్లను లోపలికి ఆహ్వానించి అదే కార్యక్రమాన్ని పునర్విహించారు. ఆ ప్రాంతంలో ఇప్పుడొక సంఘం ఉంది.
ఆ ప్రజల ఉదార మరియు స్నేహశీల స్వభావం వారు తమ కుటుంబం మరియు ఇతరులతో కలిసి నేర్చుకున్న బైబిలు సత్యాలను పంచుకునేందుకు తరచూ వారిని కదిలిస్తుంది. ఒక బైబిలు విద్యార్థి ఇంటింటి పరిచర్యలో పాల్గొనేలా అర్హతను సంపాదించినందుకు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఆయన అప్పటికే తన పొరుగువారితో అయిదు బైబిలు పఠనాలను నిర్వహిస్తున్నాడు, అయితే సేవలో మరింత ఎక్కువ భాగాన్ని వహించేందుకు ఆయన సంతోషిస్తున్నాడు.
రాజ్య ప్రచారకులు తరచూ సందర్శించని ప్రాంతం ఎక్కువగా ఉండడం వల్ల, బస్సుల్లోనూ మరియు నగరాల్లో వ్యాపారం చేసేందుకు వచ్చిన లేక దుకాణాలకు వచ్చిన ప్రజలకు ప్రకటించే ప్రయత్నం చేయడం జరిగింది. ఇది, బ్రాంచి కార్యాలయం అందుకున్న లేఖల సంబంధిత అనుభవం ద్వారా ఉదహరించబడినట్లుగా, ఆనందదాయకమైన ఫలితాలకు నడిపింది. బైబిలు పఠనం కావాలని కోరిన ఒక గ్రామీణ ప్రాంతంలోని ఇద్దరు వ్యక్తుల నుండి అది వచ్చింది. ఒక సాక్షి వారిని సందర్శించినప్పుడు, ఆ “వ్యక్తులు” 10, 11 ఏండ్ల పిల్లలని తేలింది. అయితే వారు బైబిలు పఠన ఏర్పాటును గూర్చి ఎలా తెలుసుకున్నారు? ఆ గ్రామం నుండి ఒక వ్యక్తి ఏదో వ్యాపారరీత్యా రాజధానికి వచ్చాడు. ఆయన వీధిలో ఒక సాక్షిని కలిశాడు, అతను ఆయన చేతికి ఒక కరపత్రాన్ని ఇచ్చి ఉచిత గృహ బైబిలు పఠనాన్ని అందించాడు. ఆయన తన గ్రామానికి తిరిగి వచ్చి, ఆ కరపత్రాన్ని 12 ఏండ్ల పొరిగింటి అమ్మాయికి ఇచ్చి బైబిలు పఠన ఏర్పాటును గూర్చి చెప్పాడు. తర్వాత ఆ అమ్మాయి ఆ సమాచారాన్ని ఇద్దరు బాలురకు అందించింది, వారు వెంటనే ఉత్తరం రాశారు. ఆ బాలురతోను, బాలికతోనూ ఆ వ్యక్తితోనూ ఆయన పిల్లలిద్దరితోనూ బైబిలు పఠనం ప్రారంభించడం జరిగింది.
యౌవనులు చూపించిన మంచి ప్రతిస్పందన
వాస్తవానికి, సత్యంలో పెరిగిన యౌవనులూ మరియు ఇతరులూ తమ దేవుని ఆరాధనను గంభీరంగా తీసుకుంటున్నట్లుగా ఉంది. ఉదాహరణకు, టామర్ మరియు ఆమె సహోదరి కేలా 10 ఏండ్ల ప్రాయంలో బాప్తిస్మము తీసుకుని 11 ఏండ్ల ప్రాయంలో పూర్తికాల పయినీరు సేవను ప్రారంభించారు. వెన్డే కారోలినా తన సమర్పణను నీటిబాప్తిస్మము ద్వారా కనపర్చుకున్నప్పుడు ఆమె 12 సంవత్సరాల వయస్సుగలది. రెండు సంవత్సరాల తర్వాత, 1985లో, అంటే ఆమె క్రమ పయినీరు సేవను ప్రారంభించింది. నేడు ఆమె మంచి బోధకురాలిగా ఉంది, పూర్తికాల సేవలో ఇంకా ఆనందిస్తోంది. యౌవన హోవాని 10వ ఏట బాప్తిస్మం తీసుకున్నాడు 11వ ఏట క్రమ పయినీర్ సేవను ప్రారంభించి, నాలుగు గృహ బైబిలు పఠనాలను నిర్వహిస్తున్నాడు. సెకెండ్ హాండ్ పుస్తకాలను అమ్మేవాని దగ్గర యెహోవాసాక్షులు ప్రచురించిన చిన్న పుస్తకం ఉన్నట్లు రే కనుగొన్నప్పుడు, దాన్ని కొనమని రే తన తల్లిని బ్రతిమాలాడు. దాన్ని అతను మొదటినుండి చివరివరకూ చదివాడు. అధిక బైబిలు సాహిత్యాల కొరకు అతను అన్వేషించడం అతను బ్రాంచి కార్యాలయాన్ని సంప్రదించేందుకు కారణమైంది. ఈ రోజు అతను పూర్తికాల సేవను ఆనందిస్తున్నాడు, మరి అతని తల్లి కూడా దేవున్ని సేవిస్తున్నది.
వీరు అలాగే ఇతర యౌవనులు కూడా ఆత్మీయ విషయాల విలువను గుణగ్రహించేందుకు ఏది సహాయపడింది? అనేకుల విషయంలో తలిదండ్రుల సరైన నడిపింపు ప్రాముఖ్యమైన పాత్రను వహించింది. యోస్వా విషయంలో అదే జరిగింది, తన తలిదండ్రులు పాఠశాల అధ్యాపకులు. వారి పిల్లల్లో కనీసం ఒకరైనా పూర్తికాల సేవ చేసేలా సహాయపడమని ప్రాంతీయ కాపరి తలిదండ్రులకు సలహానిచ్చినప్పుడు వారు యోస్వా యెడల అవధానమివ్వడం ప్రారంభించారు. మంచి తెలివిగల విద్యార్థిగా, ఇంజినీరింగ్ చదివేందుకు యోస్వాకు ప్రభుత్వ ఉపకార వేతనం లభించింది. విశ్వవిద్యాలయంలో ఒకటిన్నర సంవత్సరాల తర్వాత, డొమినికన్ రిపబ్లిక్ నందు యెహోవాసాక్షుల కొరకు నిర్మించాలకున్న ముఖ్య కార్యాలయాన్ని నిర్మించే పనిలో చేరేందుకు ఇచ్చిన ఆహ్వానాన్ని ఆయన అంగీకరించాడు. ఆయన తలిదండ్రులు తమ పిల్లవాన్ని యెహోవా సేవకొరకు ఇచ్చినందుకు ఎంతో సంతృప్తిని కనపర్చారు.
ఇతర దేశాలనుండి వచ్చిన “అన్వేషకులు”
“కోత విస్తారమేగానీ పనివారు కొద్దిగా ఉన్నారు” అన్న యేసు మాటలు ఇక్కడి ప్రాంతానికి నిజంగానే అన్వయించబడవచ్చు. (మత్తయి 9:37) గొప్ప అవసరత మరియు చక్కని ప్రతిస్పందన ఇతర దేశాలనుండి సాక్షులు ఇక్కడికి వచ్చి, నిజమైన ఆధునిక దిన నిధులైన యథార్థమైన సత్యాన్వేషకులను కనుగొనేందుకుగాను ఈ ప్రాంతాన్ని అన్వేషించడంలో భాగం వహించేందుకు పురికొల్పబడుతున్నారు.
డొమినికన్ రిపబ్లిక్నందలి వివిధ ప్రాంతాలందు, సేవచేసి నిజమైన సంతృప్తిని పొందిన సాక్షుల కుటుంబాలు సమీప దీవియైన ప్యూర్టోరికో నుండి వచ్చారు. ఒక కుటుంబ యజమాని ఇలా చెప్పాడు: “వినేవారికి మీ విశ్వాసాన్ని నిరీక్షణను వ్యక్తపర్చగలగడం నిజంగా సత్యాన్ని సజీవం చేస్తుంది!” ఇక్కడి అవసరతను తెలుసుకుని స్వీడన్ నుండి సిసిలియ, అమెరికా నుండి నియ, మరితర యౌవన పూర్తికాల పరిచారకురాండ్రతో కలిసి పని చేసేందుకు వచ్చారు. వారు ఎత్తైన మరియు ప్రశాంత నెమ్మదిగల వాతావరణాన్ని కనుగొనగల లోతట్టు ప్రాంతంలో సేవచేస్తున్నారు. అదే విధంగా, చల్లని దేవదారువృక్షాలున్న పర్వతాల్లో, కెనడాకు చెందిన రెండు కుటుంబాలు, అమెరికా నుండి తిరిగి వచ్చిన డొమినికన్ కుటుంబంతో చేరాయి. వారు ఒక చిన్న సంఘంలో భాగస్తులు అంతేకాకుండ పది సంవత్సరాల వరకు యెహోవాసాక్షులు సందర్శించని ప్రజలను సందర్శించగల్గుతున్నారు.
ఆల్ఫెర్డో, లౌర్డిస్ మరియు వారి అయిదుగురు పిల్లలు న్యూ యార్క్ పట్టణం నుండి తిరిగి వచ్చి, సముద్రపు తీరానవున్న ఒక అందమైన పర్యటన పట్టణంలో ఉన్న చిన్న సంఘంతో సహవసించారు. యథార్థ హృదయులైన వారిని కనుగొని సంఘ ఎదుగుదలకు సహాయపడడంలో ఎంతో ఆనందిస్తున్నారు. ఆస్ట్రేలియా నుండి వచ్చిన కంప్యూటర్ ఆపరేటరైన రెనాల్డ్, ఆయన భార్యయైన యుటా ఆ దేశంలో దక్షిణానున్న వెచ్చని, మెట్ట ప్రాంతంలో నివాసమేర్పర్చుకున్నారు. వారు వచ్చిన తర్వాత ఒక కొత్త సంఘం తయారవ్వడం చూసి ఆనందించారు. పొరుగునవున్న పట్టణంలో, ముగ్గురు పయినీర్ సహోదరీలు మరియు కాలిఫోర్నియా నుండి వచ్చిన దంపతులతో కూడిన గుంపు, తాము నిర్వహించలేనన్ని బైబిలు పఠనాలున్నాయని నివేదించారు. కనుక ప్రాంతీయ రాజ్య మందిరానికి హాజరుకావల్సిందిగా ఆసక్తిగలవారిని ప్రోత్సహించారు మరి బైబిలు పఠనాల వెయిటింగ్ లిస్టులో తమ పేర్లు రాయించుకోమని చెప్పారు. యూటు సహోదరుడైన స్టీఫెన్, ఈశాన్యానున్న సమానా అనే చక్కని పట్టణంలోని ఒక చిన్న సంఘంలో నమ్మకంగా సేవ చేస్తున్నాడు. కేవలం రెండు సంవత్సరాల్లో రాజ్య ప్రచారకుల సంఖ్య రెండింతలైంది.
సహాయార్థమై వచ్చిన వీరు మరితరులు కనపర్చిన ప్రేమ, ఆసక్తి నిజంగా మెచ్చుకోదగినవే. విభిన్న సంస్కృతులు, ఆచారాలుగల కొత్త ప్రాంతానికి అలవాటుపడడమే కాకుండా, గొర్రెలాంటి ప్రజల ఆత్మీయావసరతల యెడల శ్రద్ధ వహించేందుకు అనేక సందర్భాల్లో ఒక కొత్త భాషను నేర్చుకునే సవాలును వారు గైకొన్నారు. వారి ప్రయత్నాలు స్థానిక ప్రజలనుండి ఒక అనుకూల ప్రతిస్పందనను తెచ్చింది.
కొన్ని డొమినికన్ కుటుంబాలు పెద్ద నగరాల్లోని సౌఖ్యాలను వదులుకుని గ్రామాలకు మారారు. యథార్థమైన సత్యాన్వేషకులనే నిజమైన నిధిని కనుగొనే ఆనందం ద్వారా వారందరూ గొప్పగా ఆశీర్వదించబడ్డారు.
నాటి 15వ శతాబ్దపు నిధి అన్వేషకులు స్థానిక టొయినో ప్రజలకు ఆశీర్వాదాలను కాదు కానీ దాస్యాన్ని, తీరని బాధలను తెచ్చారు. కొలంబస్ సహితం కొత్త లోకంలోని నిధి నుండి ప్రయోజనం పొందలేకపోయాడు. చివరికి అతన్ని చెరపట్టి, అతను కనుగొన్న దీవినుండి అతన్ని బంధీగా స్పెయిన్‌కి పంపించివేశారు.
నేడు మరొక విధమైన అన్వేషణ సాగుతోంది, మరెంతో విలువైన నిధి కనుగొనబడుతోంది. యెహోవా ప్రజలు, రాజ్య సువార్తకు ప్రతిస్పందిస్తున్న యథార్థమైన ప్రజలను వెదకడంలో పనిరద్దీని కల్గివున్నారు. దాని ఫలితం, దేవుని వాక్యం మాత్రమే తీసుకురాగల స్వేచ్ఛను నిరంతరం పెరిగే గుంపు, అనుభవిస్తున్నారు. (యోహాను 8:32) పర్వతాలు, చక్కని జలపాతాలూ అందమైన సముద్ర తీరాలూ మైమరపించే గుహలున్న ఈ ప్రాంతం పరదైసు దీవిగా మాత్రమేకాకుండ, పూర్తి భూమిని చుట్టే నూతన లోకంలో ఒక భాగమయ్యే కాలం కొరకు వారు ఎదురుచూస్తున్నారు.—2 పేతురు 3:13.
[అధస్సూచీలు]
a వాచ్‌టవర్ సొసైటి ఆఫ్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటి వారు ప్రచురించినది.
[24వ పేజీలోని చిత్రం]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
డొమినికన్ రిపబ్లిక్
[24, 25వ పేజీలోని చిత్రాలు]
పూర్తికాల సేవను వెంబడించడం ద్వారా యౌవనులు ఆత్మీయ విషయాల విలువను కనుగొంటున్నారు