కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 2/15 పేజీలు 18-22
  • “చిన్న మందా, భయపడకుడి”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “చిన్న మందా, భయపడకుడి”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • చిన్న మంద
  • సంఖ్య తగ్గిపోవుట
  • “భయపడకుడి”
  • ఒక విశేషమైన నిరీక్షణ
  • ‘మీ మధ్యనున్న దేవుని మందను కాయండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • వారు గొర్రెపిల్లలను కనికరముతో కాయుదురు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • దేవుని మందనుండి తప్పిపోయినవారికి సహాయం చేయండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • పాఠకులనుండి ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 2/15 పేజీలు 18-22

“చిన్న మందా, భయపడకుడి”

“చిన్న మందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నది.”—లూకా 12:32.

1. “చిన్న మందా భయపడకుడి” అనే యేసు మాటల ఆధారమేమైయుండెను?

‘దేవుని రాజ్యమును వెదకుడి.’ (లూకా 12:31) యేసు తన శిష్యులకు ఈ మాటలు చెప్పినప్పుడు, ఆయన కాలం నాటి నుండి మన కాలం వరకు క్రైస్తవుల ఆలోచనను నడిపించిన ఒక సూత్రాన్ని ఆయన వ్యక్తపర్చాడు. దేవుని రాజ్యం మన జీవితాల్లో మొట్ట మొదటి స్థానాన్ని తీసుకోవాలి. (మత్తయి 6:33) అయితే, లూకా వృత్తాంతంలో, యేసు ఒక ప్రత్యేకమైన క్రైస్తవుల గుంపుతో ప్రియమైన, ధైర్యానిచ్చే మాటలు మాట్లాడాడు. ఆయనిలా చెప్పాడు: “చిన్న మందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నది.” (లూకా 12:32) మంచి గొర్రెల కాపరిగా, తన సన్నిహిత శిష్యులకు కష్టతరమైన కాలాలు రానైయున్నాయని యేసుకు తెలుసు. కాని వారు దేవుని రాజ్యాన్ని వెదుకుతూనే ఉంటే వారు భయపడనవసరం లేదు. గనుక, యేసు ఉద్బోధ కఠినమైన ఆజ్ఞ కాదు. బదులుగా అది, నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించడానికి సహాయం చేసిన ప్రేమపూర్వకమైన వాగ్దానం.

2. చిన్న మందలో ఎవరు చేరి ఉంటారు, వారు ఎందుకు ప్రత్యేకంగా ఆధిక్యతనొందినవారు?

2 యేసు తన శిష్యులతో మాట్లాడుతూ, వారిని “చిన్న మందా” అని పిలిచాడు. యెహోవా ‘రాజ్యమును అనుగ్రహించే’ వారితో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. తర్వాతి కాలాల్లో యేసును అంగీకరించే విస్తారమైన సమూహాలతో పోలిస్తే, వాస్తవంగా ఈ గుంపు కొద్దిమందే. వారు అమూల్యమైన వారిగా కూడా లెక్కించబడ్డారు ఎందుకంటే, వారు విశేషమైన భవిష్యత్తు కొరకు అంటే రాజ సేవలో ఉపయోగించుకోడానికి ఎన్నుకొనబడినవారు. వారి తండ్రియైన గొప్ప గొర్రెలకాపరియగు యెహోవా, క్రీస్తు యొక్క మెస్సీయా రాజ్యానికి సంబంధించి పరలోక వారసత్వాన్ని పొందే ఉద్దేశంతో చిన్నమందను పిలుస్తాడు.

చిన్న మంద

3. చిన్న మందను గూర్చిన ఏ మహిమాన్వితమైన దర్శనాన్ని యోహాను చూశాడు?

3 మరి, అలాంటి అద్భుతమైన ఉత్తరాపేక్షవున్న ఈ చిన్న మందలో ఎవరు చేరివుంటారు? పరిశుద్ధాత్మచే అభిషేకించబడే యేసుక్రీస్తు అనుచరులు. (అపొస్తలుల కార్యములు 2:1-4) తమ చేతుల్లో వీణెలు పట్టుకొనివున్న పరలోక గాయకులుగా వారిని చూసి, అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “మరియు నేను చూడగా, ఇదిగో, ఆ గొఱ్ఱెపిల్ల సీయోను పర్వతముమీద నిలువబడియుండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్లయందు లిఖింపబడియున్న నూట నలువది నాలుగు వేలమంది ఆయనతోకూడ ఉండిరి. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునైయుండి, గొఱ్ఱెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడింతురు; వీరు దేవుని కొరకును గొఱ్ఱెపిల్లకొరకును ప్రథమఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడినవారు. వీరినోట ఏ అబద్ధమును కనబడలేదు; వీరు అనింద్యులు.”—ప్రకటన 14:1, 4, 5.

4. నేడు భూమి మీద చిన్నమందకు ఏ స్థానమున్నది?

4 సా.శ. 33 పెంతెకొస్తు నాటి నుండి, అభిషేకింప బడినవారు, పరిశుద్ధాత్మ మూలంగా జన్మించినవారునైన వీరు భూమిపై క్రీస్తుకు ప్రతినిధులుగా సేవచేశారు. (2 కొరింథీయులు 5:20) నేడు, వారిలో కేవలం ఒక శేషం మాత్రమే మిగిలి ఉండి, నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతిగా కలిసి సేవ చేస్తున్నారు. (మత్తయి 24:45; ప్రకటన 12:17) ప్రాముఖ్యంగా 1935వ సంవత్సరం నుండి, భూ నిరీక్షణ కలిగి ఇప్పుడు లక్షలాదిమందిగావున్న క్రైస్తవులైన “వేరే గొఱ్ఱెలు” వీరితో కలిశారు. భూమియందంతటా సువార్త ప్రకటించడంలో వీరు సహాయం చేస్తారు.—యోహాను 10:16.

5. చిన్న మందలోని మిగిలివున్న వారి దృక్పథమేమిటి, వారు ఎందుకు భయపడకూడదు?

5 ఇంకా భూమి మీదవున్న ఈ చిన్న మందలోని మిగిలినవారి దృక్పథం ఏమిటి? వారు ‘నిశ్చలమైన రాజ్యమును’ స్వతంత్రించుకొన బోతున్నామని తెలుసుకొని, వారు తమ పరిశుద్ధ సేవను దైవభయం మరియు భక్తితో అర్పిస్తారు. (హెబ్రీయులు 12:28) తమది, అపరిమితమైన ఆనందాన్ని తీసుకువచ్చే అమూల్యమైన ఆధిక్యత అని వారు వినయంగా గుర్తిస్తారు. రాజ్యాన్ని గూర్చి మాట్లాడినప్పుడు యేసు సూచించిన “అమూల్యమైన యొక ముత్యమును” వారు కనుగొన్నారు. (మత్తయి 13:46) మహాశ్రమ సమీపిస్తుండగా, దేవుని అభిషక్తులు నిర్భయంగా నిలబడతారు. “ప్రభువు [యెహోవా] ప్రత్యక్షమగు మహా దినము” వచ్చినప్పుడు, మానవ ప్రపంచం మీదికి ఏమి వచ్చినప్పటికీ వారికి భవిష్యత్తును గూర్చిన రోగగ్రస్తమైన భయం ఉండదు. (అపొస్తలుల కార్యములు 2:19-21) వారికా భయం ఎందుకుండాలి?

సంఖ్య తగ్గిపోవుట

6, 7. (ఎ) ఇంకా భూమిపై మిగిలివున్న చిన్న మంద యొక్క సంఖ్య ఎందుకు కొద్దిగా ఉంది? (బి) తాను పొందబోయే నిరీక్షణను ప్రతి వ్యక్తి ఎలా దృష్టించాలి?

6 ఇటీవలి సంవత్సరాల్లో, భూమిపై మిగిలివున్న చిన్నమందలోని వారి సంఖ్య చాలా తగ్గిపోయింది. ఇది 1994 జ్ఞాపకార్థదిన రిపోర్టు ద్వారా విశదమయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవా ప్రజల 75,000 సంఘాలలో, కేవలం 8,617 మంది మాత్రమే చిహ్నములలో భాగం వహించడం ద్వారా తాము శేషములోని సభ్యులమని చూపించారు. (మత్తయి 26:26-30) దానికి భిన్నంగా, మొత్తం హాజరైనవారు 1,22,88,917. ఇది అపేక్షించవలసినదే అని అభిషక్త క్రైస్తవులకు తెలుసు. చిన్నమంద అగుటకు యెహోవా ఒక పరిమిత సంఖ్యను మాత్రమే అంటే 1,44,000 మందిని మాత్రమే ఏర్పరచాడు. దానిని ఆయన సా.శ. 33 పెంతెకొస్తు నాటి నుండి సమకూరుస్తున్నాడు. కారణసహితంగా, సంఖ్య ముగింపుకొస్తున్నప్పుడు చిన్నమందలోని వారిని పిలవడం ఆగిపోతుంది, ఈ ప్రత్యేకంగా ఆశీర్వదింపబడిన వారి సాధారణ సమకూర్పు 1935లో ముగిసిందన్నదానికి ఆధారముంది. అయితే, అంత్యకాలంలో ఉండే వేరే గొర్రెలు “ప్రతి జనములోనుండియు, ప్రతి వంశములో నుండియు, ఆయా భాషలు మాటలాడు వారిలో నుండి వచ్చిన ఎవరునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము”గా పెరుగుతారని ప్రవచింపబడింది. భూ పరదైసుపై నిత్యజీవాన్ని పొందే నిరీక్షణ గల గొప్ప సమూహాన్ని యెహోవా సమకూర్చడం 1935 నుండి కొనసాగుతున్నది.—ప్రకటన 7:9; 14:15, 16; కీర్తన 37:29.

7 భూమిపైనున్న చిన్నమందలోని మిగిలినవారు ఇప్పుడు తమ 70, 80, 90 పడులలో ఉన్నారు. కొందరు జీవితంలో తమ 100వ సంవత్సరాన్ని కూడా దాటిపోయారు. వీరందరు, వారి వయస్సు ఏదైనప్పటికీ, వారు పరలోక పునరుత్థానం ద్వారా చివరికి యేసుక్రీస్తుతో ఐక్యమై, ఆయన మహిమాన్విత రాజ్యంలో ఆయనతో కలిసి పరిపాలిస్తారని వారికి తెలుసు. గొప్ప సమూహపు వారు రాజైన క్రీస్తుకు భూ సంబంధమైన విధేయులుగా ఉంటారు. తనను ప్రేమించేవారి కొరకు యెహోవా ఇవ్వబోయేవాటి గురించి మనలో ప్రతి ఒక్కరం ఆనందిద్దాము. ఏ నిరీక్షణ పొందాలన్నది ఎన్నుకోవడం మన వంతు కాదు. అది నిర్ణయించ వలసింది యెహోవాయే. పరలోక రాజ్యంలోనైనా లేక ఆ రాజ్యం క్రింద భూ పరదైసులోనైనా ఇరు వర్గాల వారు తమ సంతోషకరమైన భవిష్యత్తును గూర్చిన నిరీక్షణను బట్టి ఉత్సహించవచ్చు.—యోహాను 6:44, 65: ఎఫెసీయులు 1:17-19.

8. ఒక లక్ష నలువది నాలుగు వేలమందిని ముద్రించడం ఎంతవరకు జరిగింది, అది ముగిసినప్పుడు ఏమి జరుగుతుంది?

8 ఒక లక్ష నలువది నాలుగు వేలమందితో కూడిన చిన్నమంద “దేవుని ఇశ్రాయేలు,” దేవుని సంకల్పాలలో ఇది సహజ ఇశ్రాయేలుకు మారుగా తీసుకొనబడింది. (గలతీయులు 6:16) గనుక, భూమిపై ఇంకా మిగిలివున్న ఆ ఆత్మీయ జనాంగములోని మిగతావారు శేషముగా ఉన్నారు. అలాంటి మిగిలివున్న వారు యెహోవా యొక్క చివరి అంగీకారం కొరకు ముద్రించబడతారు. అపొస్తలుడైన యోహాను ఒక దర్శనంలో, ఇది జరగడం చూసి, ఇలా నివేదించాడు: “సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశనుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగజేయుటకై అధికారముపొందిన ఆ నలుగురు దూతలతో ఈ దూత—మేము మా దేవుని దాసులను వారి నొసళ్లయందు ముద్రించువరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. మరియు ముద్రింపబడినవారి లెక్క చెప్పగా వింటిని. [ఆత్మీయ] ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింపబడినవారు లక్ష నలువది నాలుగు వేలమంది.” (ప్రకటన 7:2-4) ఆత్మీయ ఇశ్రాయేలీయులను ముద్రించే ఈ పని స్పష్టంగా ముగింపుకు వస్తుండగా, త్వరలో జరుగనైయున్న ఉత్తేజకరమైన సంఘటనలు సూచించబడ్డాయి. ఒకటేమిటంటే, భూమిపైకి నాశనం యొక్క నాలుగు దిక్కుల వాయువులను విడిచిపెట్టే సమయం అంటే, “మహాశ్రమలు” అతి సమీపంలో ఉండివుండవచ్చు.—ప్రకటన 7:14.

9. గొప్ప సమూహము యొక్క పెరుగుతున్న సంఖ్యను చిన్నమంద ఎలా దృష్టిస్తుంది?

9 ఇప్పటికే సమకూర్చబడిన గొప్ప సమూహపు వారు లక్షల సంఖ్యలో ఉన్నారు. శేషింపబడినవారి హృదయాలను ఇది ఎంతగా పులకింపజేస్తుంది! ఇంకా భూమిపై మిగిలివున్న చిన్నమందలోని వారి సంఖ్య తగ్గిపోవడంలో కొనసాగుతున్నప్పటికీ, దేవుని విస్తరిస్తున్న భూ సంస్థకు సంబంధించిన బాధ్యతలను చేపట్టేలా గొప్పసమూహంలోని అర్హులైన పురుషులకు వారు శిక్షణనిచ్చి, సిద్ధపరిచారు. (యెషయా 61:5) యేసు సూచించినట్లుగా, మహాశ్రమలను తప్పించుకొనే వారుంటారు.—మత్తయి 24:22.

“భయపడకుడి”

10. (ఎ) దేవుని ప్రజలపై ఏ దాడి జరుగనైయుంది, అది దేనికి నడిపిస్తుంది? (బి) మనలో ప్రతి ఒక్కరి గురించి ఏ ప్రశ్నలు అడుగబడతాయి?

10 సాతాను అతని దయ్యాలు భూ పరిధిలోకి పడద్రోయబడ్డారు. అతడు, అతని దయ్యాలు యెహోవా ప్రజలపై సంపూర్ణంగా దాడి చేయడానికి పథకం వేసుకున్నారు. బైబిలునందు చెప్పబడిన ఈ దాడి, గోగు మాగోగు యొక్క దాడిగా వర్ణించబడింది. అపవాది తన దాడిని ప్రత్యేకంగా ఎవరి వైపుకు గురిపెట్టాడు? సమాధానముగా “భూమి నట్టనడుమ నివసించు”చున్న దేవుని ఆత్మీయ ఇశ్రాయేలైన చిన్నమందలోని చివరి సభ్యులపైకాదా? (యెహెజ్కేలు 38:1-12) అవును, నమ్మకమైన అభిషక్త తరగతి శేషము, విశ్వాసులైన తమ సహవాసులగు వేరే గొర్రెలతో కలిసి, సాతాను దాడి యెహోవా దేవునికి సంబంధించి ఆకస్మిక ప్రతిస్పందనను ఎలా త్వరపెడుతుందో చూస్తారు. తన ప్రజలకు రక్షణగా ఆయన జోక్యం చేసుకుంటాడు, అది “యెహోవాయొక్క భయంకరమైన ఆ మహాదినము” రావడానికి కారణమవుతుంది. (యోవేలు 2:31) నేడు, నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు యెహోవా కలుగజేసుకోనైయున్న ఈ జోక్యాన్ని గూర్చి హెచ్చరించడమనే ఒక అత్యవసరమైన, జీవాన్ని రక్షించే సేవ చేస్తున్నాడు. (మలాకీ 4:5; 1 తిమోతి 4:16) యెహోవా రాజ్యాన్ని గూర్చిన సువార్తను ప్రకటించడంలో భాగం వహించడమనే ఆ సేవకు మీరు చురుకుగా మద్దతునిస్తున్నారా? భయంలేని రాజ్య ప్రచారకునిగా మీరు అలా చేయడంలో కొనసాగుతారా?

11. నేడు ధైర్యంతో కూడిన దృక్పథం కలిగివుండడం ఎందుకు ప్రాముఖ్యము?

11 ప్రస్తుత ప్రపంచ పరిస్థితి దృష్ట్యా, “చిన్నమందా భయపడకుడి” అని యేసు వారికి చెప్పిన మాటలను చిన్నమంద అంగీకరించడం ఎంత సమయోచితమైనది! యెహోవా సంకల్పానికి అనుగుణ్యంగా ఇప్పుడు జరుగుతున్న దాని అంతటి దృష్ట్యా అలాంటి ధైర్యంతో కూడిన దృక్పథం కలిగివుండడం ఆవశ్యకం. వ్యక్తిగతంగా, చిన్నమందలోని ప్రతి ఒక్కరు అంతం వరకు సహించుకొని ఉండవలసిన అవసరతను గుర్తిస్తారు. (లూకా 21:19) చిన్నమంద యొక్క ప్రభువుగా మరియు యజమానిగా యేసు క్రీస్తు, తన భూ జీవిత ముగింపు వరకు సహించుకొని, నమ్మకస్థునిగా నిరూపించుకున్నాడు, గనుక శేషములోని ప్రతి ఒక్కరు సహించుకొని, నమ్మకస్థులుగా నిరూపించుకోవాలి.—హెబ్రీయులు 12:1, 2.

12. యేసు వలె పౌలు భయపడవద్దని అభిషక్త క్రైస్తవులను ఎలా ఉద్బోధించాడు?

12 అభిషక్తులందరు అపొస్తలుడైన పౌలు కలిగివున్న దృక్పథాన్నే కలిగివుండాలి. అభిషేకింపబడిన బహిరంగ ప్రచారకునిగా పునరుత్థానాన్ని గూర్చిన ఆయన మాటలు, భయపడవద్దని చెప్పిన యేసు ఉద్బోధతో ఎలా అనుగుణ్యంగా ఉన్నాయో గమనించండి. పౌలు ఇలా వ్రాశాడు: “నా సువార్త ప్రకారము, దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకముచేసికొనుము. నేను నేరస్థుడనై యున్నట్టు ఆ సువార్తవిషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి యుండలేదు. అందుచేత ఏర్పరచబడినవారు నిత్యమైన మహిమతోకూడ క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారికొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను. ఈ మాట నమ్మదగినది, ఏదనగా—మనమాయనతోకూడ చనిపోయినవారమైతే ఆయనతోకూడ బ్రదుకుదుము. సహించిన వారమైతే ఆయనతోకూడ ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన యెరుగననును. మనము నమ్మదగని వారమైనను, ఆయన నమ్మదగినవాడుగా ఉండును; ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు.”—2 తిమోతి 2:8-13.

13. చిన్నమంద సభ్యులకు ఏ లోతైన నమ్మకాలు ఉన్నాయి, ఏమి చేయడానికి ఇది వారిని పురికొల్పుతుంది?

13 అపొస్తలుడైన పౌలువలె, అభిషక్త చిన్నమందలోని మిగిలినవారు దేవుని వాక్యంలోవున్న శక్తివంతమైన వర్తమానాన్ని ప్రకటిస్తుండగా, శ్రమను సహించడానికి ఇష్టపడుతున్నారు. రక్షణను గూర్చిన దైవిక వాగ్దానాలందు వారు తదేకంగా విశ్వసిస్తుండగా వారి నమ్మకాలు లోతుగా నాటుకుంటాయి, వారు మరణం వరకు నమ్మకంగా నిరూపించుకున్నట్లయితే వారికి “జీవ కిరీటం” ఇవ్వబడుతుంది. (ప్రకటన 2:10) తక్షణ పునరుత్థానం మరియు మార్పు అనుభవించడం ద్వారా, వారు క్రీస్తుతోపాటు రాజులుగా పరిపాలించడానికి ఆయనతో ఐక్యం చేయబడతారు. ప్రపంచ విజేతలుగా యథార్థతను కాపాడుకున్న వారి చర్యకు ఎంతటి విజయం!—1 యోహాను 5:3, 4.

ఒక విశేషమైన నిరీక్షణ

14, 15. చిన్న మంద యొక్క పునరుత్థాన నిరీక్షణ ఎలా విశేషమైనది?

14 చిన్నమంద పొందబోయే పునరుత్థాన నిరీక్షణ విశేషమైనది. ఏ విధాలుగా? ఒక విషయం ఏమిటంటే, అది “నీతిమంతులకును అనీతిమంతులకును” జరిగే సాధారణ పునరుత్థానానికి ముందు జరుగుతుంది. (అపొస్తలుల కార్యములు 24:15) వాస్తవానికి, 1 కొరింథీయులు 15:20, 23నందు కనుగొనబడే ఈ మాటలు స్పష్టంగా ధృవీకరిస్తున్నట్లు, అభిషక్తుల పునరుత్థానం ఒక ప్రాముఖ్యమైన క్రమంలో జరుగుతుంది: “నిద్రించినవారిలో ప్రథమఫలముగా క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రదికింపబడును; ప్రథమ ఫలము క్రీస్తు; తరువాత క్రీస్తు వచ్చినపుడు ఆయనవారు బ్రదికింపబడుదురు.” యేసు ప్రదర్శించినటువంటి సహనం, విశ్వాసం కలిగివుండడం ద్వారా, తాము తమ భూ జీవితాన్ని ముగిస్తుండగా, ప్రాముఖ్యంగా 1918లో నిజమైన ప్రభువు తీర్పు తీర్చడానికి తన ఆలయానికి వచ్చాడు గనుక, తమ కొరకు ఏమి భద్రపరచబడివుందో చిన్నమందకు తెలుసు.—మలాకీ 3:1.

15 ఈ పునరుత్థానాన్ని విశేషమైనదిగా దృష్టించడానికి పౌలు మనకు మరొక కారణాన్ని ఇస్తున్నాడు. మొదటి కొరింథీయులు 15:51-53నందు వ్రాయబడి ఉన్నట్లుగా, ఆయనిలా వ్రాశాడు: “ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మన మందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్ప పాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. . . . క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసియున్నది; మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసియున్నది.” ఈ మాటలు క్రీస్తు ప్రత్యక్షత సమయంలో మరణించే చిన్నమందలోని వారికి వర్తిస్తాయి. మరణమందు ఎక్కువ సమయము నిద్రించనవసరం లేకుండా, వారు “నిమిషములో, ఒక రెప్పపాటున” అమర్త్యతను సంతరించుకుంటారు.

16, 17. తమ పునరుత్థాన నిరీక్షణను గూర్చి, అభిషక్త క్రైస్తవులు నేడు ప్రత్యేకంగా ఎలా ఆశీర్వదించబడ్డారు?

16 ఈ గ్రహింపు వెలుగులో, ప్రకటన 14:12, 13నందు కనుగొనబడే అపొస్తలుడైన యోహాను మాటలలోని భావాన్ని మనం గ్రహించవచ్చు. ఆయనిలా వ్రాశాడు: “దేవుని ఆజ్ఞలను యేసునుగూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. అంతట—ఇప్పటినుండి ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకమునుండి యొక స్వరము చెప్పగా వింటిని, నిజమే; వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు; వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు.”

17 చిన్న మంద యొక్క శేషమునకు ఎంతటి విశేషమైన ప్రతిఫలం లభించనైయుంది! వారికి పునరుత్థానం వెంటనే, వారు మరణమందు నిద్రించినప్పుడే ఉంటుంది. వారు ఆత్మీయ లోకంలో తమ నియామకాన్ని చేపట్టిన వెంటనే వారు ఎంతటి చెప్పుకోదగిన మార్పును అనుభవిస్తారు! చిన్నమంద ఆ విధంగా మహిమపర్చబడడం జరుగుతుండగా, ప్రముఖ బైబిలు ప్రవచనాలు ముగింపుకొస్తుండగా, చిన్నమందలోని మిగిలిన చివరి సభ్యులు నిజంగా “భయపడ”నవసరం లేదు. భూమి తాను ఎదుర్కొనుచున్న మునుపెన్నడూ అనుభవించని అత్యంత శ్రమతో కూడిన సమయాల నుండి విడుదలను నిరీక్షిస్తుండగా వారు నిర్భయంతో కూడిన అలాంటి దృక్పథాన్నే అలవర్చుకోవలసిన గొప్ప సమూహపు వారిని ప్రోత్సహించడానికి చిన్నమంద యొక్క నిర్భయత్వం సహాయ పడుతుంది.

18, 19. (ఎ) మనం జీవిస్తున్న సమయం ఎందుకు అత్యవసరమైనది? (బి) అభిషక్తులు మరియు వేరే గొర్రెలు ఇరువురు ఎందుకు భయపడకూడదు?

18 చిన్న మంద యొక్క చర్యలను తిరిగి జ్ఞాపకం చేసుకోవడం వారు, అలాగే గొప్ప సమూహపు వారు సత్య దేవుని యందు భయం కలిగి ఉండడంలో కొనసాగడానికి సహాయం చేస్తుంది. ఆయన తీర్పు తీర్చే సమయం సమీపించింది, గనుక మిగిలివున్న అనుకూలమైన సమయం చాలా ప్రశస్తమైనది. వాస్తవానికి, ఇతరులు చర్య గైకొనడానికున్న సమయం పరిమితమైనది. అయితే, మనం, దేవుని సంకల్పం విఫలమౌతుందని భయపడము. అది తప్పకుండా విజయవంతమౌతుంది!

19 “ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయెను; ఆయన యుగయుగముల వరకు ఏలున”ని చెప్పబడిన పరలోకంలోని పెద్ద స్వరములు ఇప్పటికే వినబడ్డాయి. (ప్రకటన 11:15) నిజంగా, గొప్ప కాపరియైన యెహోవా, తన గొర్రెలనందరిని “తన నామమునుబట్టి నీతిమార్గములలో . . . నడిపించుచున్నాడు.” (కీర్తన 23:3) చిన్నమంద తప్పకుండా తమ పరలోక ప్రతిఫలాన్ని పొందుతారు. క్రీస్తు యేసు పరిపాలన క్రింద దేవుని మహిమాన్విత రాజ్యం యొక్క భూ పరిధిలో నిత్యజీవాన్ని పొందడానికి వేరే గొర్రెలు మహాశ్రమల నుండి సురక్షితంగా విడుదల చేయబడతారు. గనుక, యేసు మాటలు చిన్న మందకు చెప్పబడినప్పటికీ, “భయపడకుడి” అనే ఆయన మాటలను భూమిపైనున్న దేవుని సేవకులందరు వినడానికి కచ్చితంగా కారణమున్నది.

మీరు వివరించగలరా?

◻ చిన్న మందలోని మిగిలిన వారి సంఖ్య తగ్గుతుందని మనం ఎందుకు అపేక్షించాలి?

◻ అభిషక్త శేషము యొక్క పరిస్థితి నేడు ఏమిటి?

◻ మాగోగు యొక్క గోగు దాడి సమీపిస్తున్నప్పటికీ, క్రైస్తవులు ఎందుకు భయపడకూడదు?

◻ ప్రాముఖ్యంగా నేడు, 1,44,000 మంది యొక్క పునరుత్థాన నిరీక్షణ ఎందుకు విశేషమైనది?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి