కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 1/15 పేజీలు 4-7
  • వాస్తవమైన జీవాన్ని విలువైందిగా ఎంచండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వాస్తవమైన జీవాన్ని విలువైందిగా ఎంచండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘వాస్తవమైన జీవమునకు’ నడుపు మార్గము
  • మన ప్రస్తుత జీవాన్ని కాపాడుకోవల్సిన అవసరం
  • రక్తం విషయంలో ప్రాముఖ్యమైన నియమము
  • వాస్తవమైన జీవాన్ని విలువైందిగా ఎంచడం
  • జీవం విషయంలో దేవుని దృక్కోణం
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • ప్రాణం అనే బహుమానాన్ని గౌరవించండి
    బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
  • మీ జీవవరాన్ని అత్యంత విలువైనదిగా పరిగణించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • జీవములను వాస్తవముగా కాపాడు రక్తము
    రక్తము నీ జీవమును ఎట్లు కాపాడగలదు?
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 1/15 పేజీలు 4-7

వాస్తవమైన జీవాన్ని విలువైందిగా ఎంచండి

జీవితం అంటే యింతేనా? “వాస్తవమైన జీవితమును సంపాదించుకొను” అని మనలను ప్రోత్సహించడం ద్వారా, యింతకంటే ఎక్కువ ఉంది అని బైబిలు సూచిస్తోంది. (1 తిమోతి 6:17-19) మన ప్రస్తుత జీవం వాస్తవమైన జీవం కాకపోతే, మరింకేది అయ్యుంటుంది?

దేవునికి భయపడే వ్యక్తి సంపాదించుకోవల్సినది “నిత్యజీవము” అని పైన చెప్పిన లేఖన సందర్భము చూపుతోంది. (1 తిమోతి 6:12) అనేకులకు దాని అర్థం, భూమిపై నిత్యజీవం. మొదటి మానవుడైన ఆదాముకు, పరదైసు భూమిపై నిరంతరం జీవించే ఉత్తారాపేక్ష ఉండేది. (ఆదికాండము 1:26, 27) “మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను” తింటే మాత్రమే అతను చనిపోతాడు. (ఆదికాండము 2:17) అయితే ఆదాము అతని భార్యయైన హవ్వ, ఆజ్ఞను ఉల్లంఘిస్తూ వృక్ష ఫలాన్ని తిన్నారు గనుక దేవుడు వారికి మరణశిక్ష విధించాడు. ‘వారు దాన్ని తిన్న దినమునుండి’ దేవుని దృష్టిలో చనిపోయారు, అంతేకాకుండ వారు భౌతిక మరణంలోకి జారడం ప్రారంభించారు. ఆ తర్వాత వారి జీవం మొదట అనుభవించినంత శ్రేష్ఠంగా లేదు.

‘వాస్తవమైన జీవమునకు’ నడుపు మార్గము

‘వాస్తవమైన జీవమును’ సాధ్యపర్చేందుకుగాను, యెహోవా దేవుడు మానవ జాతిని రక్షించేందుకు ఒక ఏర్పాటును చేశాడు. ఈ ఏర్పాటును అర్థం చేసుకోడానికి సహాయపడేందుకు ఓ చిన్న కర్మాగారాన్ని మనం ఊహించుకుందాం. అందులోని యంత్రాలన్నీ లోపం కలవే, మరి సంవత్సరాల క్రితం మొట్ట మొదటి పనివాడు ఆపరేటర్‌ పుస్తకాన్ని (మాన్యూలును) అలక్ష్యం చేసి, యంత్రాలన్నింటినీ పాడుచేశాడు కనుక, ప్రస్తుతమున్న ఆపరేటర్లకు అది అసౌకర్యాన్ని కల్గిస్తోంది. ప్రస్తుత ఆపరేటర్లు, ఉన్నవాటితో పనిచేసేందుకు వారికి వీలైనంత మేరకు శ్రేష్ఠమైనది మాత్రమే చేయగలరు. ఆ కర్మాగార యజమాని తన పనివారికి సహాయపడేందుకుగాను, ఆ యంత్రాలను బాగుచేయించాలని అనుకుంటున్నాడు, మరి ఆ సంకల్పం కొరకు అవసరమైన నిధిని ప్రక్కనుంచుతున్నాడు.

మొదటి ‘యంత్ర ఆపరేటరైన’ ఆదాము, అతనికి యివ్వబడిన జీవాన్ని విలువైందిగా ఎంచలేదు. కాబట్టి, సరిగ్గా పనిచేయని యంత్రాన్ని పోలిన అపరిపూర్ణ జీవాన్ని తన పిల్లలకు సంక్రమింపజేశాడు. (రోమీయులు 5:12) ఆ పరిస్థితిని మెరుగుపర్చలేని, కర్మాగారంలోని తర్వాతి ఆపరేటర్లలా ఆదాము సంతానము వాస్తవమైన జీవాన్ని పొందలేకపోయింది. (కీర్తన 49:7) నిరాశాజనకమైన ఈ పరిస్థితిని మెరుగుపర్చేందుకు, మానవజాతికి నిత్యజీవమును తిరిగి సంపాదించి యిచ్చేందుకు యెహోవా తన అద్వితీయ కుమారుని భూమ్మీదికి పంపించాడు. (లూకా 1:35; 1 పేతురు 1:18, 19) మానవజాతి కొరకు బలిగా మరణించడం ద్వారా, దేవుని అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు, నిధిని—ఆదాము పోగొట్టుకున్న దానికి సమానమైన జీవాన్ని అందించాడు. (మత్తయి 20:28; 1 పేతురు 2:22) ఈ అమూల్యమైన బలి ద్వారా, వాస్తవమైన జీవాన్ని అందించేందుకు యెహోవాకు యిప్పుడు ఆధారం ఉంది.

విధేయులైన మానవజాతికి, యేసు విమోచన క్రయధన బలి అంటే పరదైసు భూమ్మీద నిత్యజీవమనే భావాన్నిస్తుంది. (కీర్తన 37:29) ఈ నిరీక్షణ, అర్మగిద్దోనుగా సూచించబడిన, “సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధము”ను తప్పించుకునే వారందరికీ అందించబడింది. (ప్రకటన 16:14-16) అది భూమ్మీది దుష్టత్వాన్నంతటినీ నిర్మూలిస్తుంది. (కీర్తన 37:9-11) ఆ సమయానికి ముందే మరణించి దేవుని జ్ఞాపకంలో ఉన్నవారు భూమిపై పునరుద్ధరించబడిన పరదైసులో పునరుత్థానమౌతారు, అంతేకాకుండ దేవునికి విధేయులయ్యే వారందరికి అందుబాటులో ఉండే వాస్తవమైన జీవాన్ని అనుభవించే ఉత్తరాపేక్షను వారు కల్గివుంటారు.—యోహాను 5:28, 29.

మన ప్రస్తుత జీవాన్ని కాపాడుకోవల్సిన అవసరం

మన ప్రస్తుత జీవిత పవిత్రత యెడల మనం అలక్ష్యం కనపర్చవచ్చని దీని భావంకాదు. కర్మాగార యజమాని యంత్రాన్ని శ్రద్ధగా చూసుకోలేని పనివాని కొరకు తన సమయాన్ని డబ్బును వ్యయపర్చి ఆ యంత్రాన్ని బాగుచేసి యిస్తాడా? బదులుగా, పాతదాన్ని బాగా చూసుకోడానికి శాయశక్తులా కృషి చేసిన పనివానికి బాగుచేయించిన యంత్రాన్ని అప్పగించడా?

జీవం యెహోవానుండి వచ్చిన అమూల్యమైన బహుమానం. ఆ బహుమానాన్ని దయతో యిచ్చినవానిగా, దాన్ని మనం విలువైందిగా ఎంచాలని ఆయన కోరుకుంటున్నాడు. (కీర్తన 36:9; యాకోబు 1:17) భూమ్మీద జీవించే ప్రజల యెడల యెహోవాకు గల శ్రద్ధను గూర్చి మాట్లాడుతూ, యేసు యిలా చెప్పాడు: “మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడియున్నవి.” (లూకా 12:7) హత్య చేయవద్దని యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు, యిక దానిలో తమను తాము హత్యచేసుకోకుండా ఉండడం సహజంగానే చేరివుంది. (నిర్గమకాండము 20:13) ఇది ఆత్మహత్యను మనం ఒక ఎంపికగా దృష్టించకుండా ఉండేందుకు సహాయపడుతుంది.

మన శ్రేయస్సు యెడల యెహోవాకు గల ప్రేమపూర్వక శ్రద్ధను గూర్చి తెలుసుకోవడం ద్వారా, దేవునికి భయపడే ప్రజలు, ఆధునిక దిన క్రియలు ఎంత మట్టుకు సమంజసమని అంచనావేయడంలో బైబిలు సూత్రాలను అన్వయిస్తారు. ఉదాహరణకు, నిజమైన క్రైస్తవులు ‘దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసికొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి తమను తాము పవిత్రులను చేసుకోవాలి’ కనుక, వారు మనస్సును మార్చేసే మాదక ద్రవ్యాలనూ పొగాకును ఉపయోగించరు.—2 కొరింథీయులు 7:1.

‘సాత్వికమైన మనస్సును’ కాపాడుకోమని మరియు అవినీతికరమైన ప్రవర్తనను విడనాడమని దేవుడిచ్చిన సలహాలో మానవ జీవంపై దేవుని శ్రద్ధ యింకా కనిపిస్తుంది. (సామెతలు 14:30; గలతీయులు 5:19-21) ఈ ఉన్నత ప్రమాణాలకు హత్తుకుని ఉండడం ద్వారా, ఆరోగ్యానికి హానికరమైన కోపం మరియు లైంగికతవల్ల కలిగే రోగాలనుండి మనం కాపాడబడతాము.

తన ప్రజలయెడల యెహోవాకు గల శ్రద్ధ, అధికంగా తినడం త్రాగడం విసర్జించాలన్న తన ఉద్బోధనుండి వ్యక్తమౌతోంది. (ద్వితీయోపదేశకాండము 21:18-21; సామెతలు 23:20, 21) పేరాశగల వ్యక్తులూ త్రాగుబోతులూ దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరని క్రైస్తవులకు హెచ్చరిక యివ్వబడింది, అంటే, వారు ఎన్నడు వాస్తవమైన జీవాన్ని అనుభవించరు. (1 కొరింథీయులు 6:9, 10; 1 పేతురు 4:3) మితంగా ఉండాలని ప్రోత్సహించడం ద్వారా, మన ప్రయోజనార్థమే యెహోవా మనకు బోధిస్తాడు.—యెషయా 48:17.

దేవుని ప్రమాణాల ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడు, మనం మన ప్రస్తుత జీవాన్ని విలువైందిగా ఎంచుతున్నామని మనం కనపరుస్తాము. వాస్తవమైన జీవం అంతకంటే ప్రాముఖ్యమైందనుకోండి. అది నిత్యమైంది గనుక, నిజమైన క్రైస్తవులు ప్రస్తుత జీవం కంటే దానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. యేసుక్రీస్తు తన జీవాన్ని అర్పించినప్పుడు, ఆయన తనను తాను యెహోవా చిత్తానికి అప్పగించుకున్నాడు. భూమ్మీది తన జీవం కంటేకూడా తన తండ్రికి విధేయతను కనపర్చడమే ఆయనకు ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉండేది. యేసు జీవిత విధానం తాను పునరుత్థానమయ్యేటట్లుగానూ, పరలోకమందు అమర్త్యమైన జీవాన్ని ఆయన పొందేటట్లుగాను చేసింది. (రోమీయులు 6:9) ఆయన విమోచన క్రయధనమందు విశ్వాసముంచే విధేయులైన మానవజాతికి ఆయన మరణం అంటే నిత్యజీవం అనే అర్థం కూడా ఉంది.—హెబ్రీయులు 5:8, 10; 12:2.

రక్తం విషయంలో ప్రాముఖ్యమైన నియమము

యేసు అనుచరులు ఆయన ఆలోచనా విధానాన్నే ప్రతిబింబిస్తారని మనం అర్థంచేసుకోగలము. యేసు చేసినట్లుగానే, వారు అన్ని విషయాల్లోనూ దేవున్ని ప్రీతిపర్చేందుకు ప్రయత్నించారు. ఒక విషయమేమంటే, కొందరు వైద్యులు జీవాన్ని కాపాడేది అని పేర్కొనే రక్త మార్పిడిని వీరు అంగీకరించకపోవడానికి గల కారణాన్ని యిది వివరిస్తుంది. ఒక వ్యక్తి రక్త మార్పిడిని తిరస్కరించడం ద్వారా తాను వాస్తవ జీవాన్ని విలువైందిగా ఎంచుతున్నాడని ఎలా చూపుతున్నాడో మనం చూద్దాం.

యేసుక్రీస్తులా, నిజమైన క్రైస్తవులు దేవుని దృష్టిలో సజీవులుగా ఉండాలని కోరుకుంటారు, మరి దానికొరకు ఆయనకు పూర్తిగా లోబడడం అవసరం. దేవుని వాక్యం క్రీస్తు అనుచరులను యిలా ఆజ్ఞాపిస్తోంది: “విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విసర్జింపవలెను.” (అపొస్తలుల కార్యములు 15:28, 29) క్త్రెస్తవులు విధిగా పాటించాల్సిన ఆజ్ఞల్లో రక్తాన్ని గూర్చిన ఈ నియమం ఎందుకు చేర్చడం జరిగింది?

ఇశ్రాయేలీయులకు యిచ్చిన ఆజ్ఞ రక్తాన్ని విసర్జించాలని కోరింది. (లేవీయకాండము 17:13, 14) క్రైస్తవులు మోషే ధర్మశాస్త్రం క్రింద లేరు. అయితే రక్తాన్ని విసర్జించాలన్న ఆజ్ఞ ధర్మశాస్త్రానికి ముందుగానే యివ్వబడిందని వారు గ్రహిస్తారు; అంతకుముందే, జలప్రళయం తర్వాత ఆ ఆజ్ఞ నోవహుకు యివ్వడం జరిగింది. (ఆదికాండము 9:3, 4; కొలొస్సయులు 2:13-15) భూమ్మీది జనాంగాలన్నీ ఉద్భవించేందుకు కారణమైన నోవహు సంతానమంతటికీ ఈ ఆజ్ఞ వర్తించింది. (ఆదికాండము 10:32) దానికి తోడు, రక్త పవిత్రతను దేవుడు ఎందుకు నొక్కి చెప్పాడో చూసేందుకు మోషే ధర్మశాస్త్రం మనకు సహాయపడుతుంది. ఏ విధంలోనైనా రక్తాన్ని తీసుకోవడాన్ని విసర్జించమని ఇశ్రాయేలీయులకు చెప్పిన తర్వాత, దేవుడు యిలా అన్నాడు: “రక్తము దేహమునకు ప్రాణము. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠముమీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమునుబట్టి ప్రాయశ్చిత్తము చేయును.” (లేవీయకాండము 17:11) బలిపీఠంపై అర్పణకొరకు ఉపయోగించేందుకుగాను దేవుడు రక్తాన్ని ప్రత్యేకించాడు. రక్త పవిత్రతపై ఆయన నియమం, భూమ్మీది జీవులన్నిటిపై ఆయన అధికారాన్ని బయల్పరుస్తోంది. (యెహెజ్కేలు 18:4; ప్రకటన 4:11) మన జీవాన్ని యెహోవా దేవుని దృష్టితో చూస్తే, అది మనకు చెందింది కాదుగానీ దేవుడు దాన్ని మనకు కేవలం అప్పగించాడని మనం గ్రహిస్తాము.

మన ఉదాహరణలో యంత్రాన్ని చూసుకోవల్సిన బాధ్యతగల ఆపరేటర్‌లా, మన ప్రస్తుత జీవం మనకు అప్పగింపబడింది. మీ యంత్రాన్ని బాగు చేయవల్సిన అవసరం వచ్చిందనుకోండి, ఆపరేటర్ల మాన్యూలు నందు ఏ భాగాలనైతే ప్రత్యేకంగా ఉపయోగించవద్దని ఉందో సరిగ్గా వాటినే ఉపయోగించి దాన్ని బాగుచేయమని మీ మెకానిక్కు, సలహానిస్తే మీరేమి చేస్తారు? ఆ మాన్యూలు నందు యివ్వబడిన సూచనల ప్రకారం బాగుచేసేందుకు వీలౌతుందా లేదా అని మీరు యితర మెకానిక్కులను సంప్రదించరా? మానవజీవం ఓ యంత్రం కంటే కూడా ఎంతో ప్రాముఖ్యమైంది, ఎంతో క్లిష్టమైంది. తన ప్రేరేపిత వాక్యంలో, మానవులను సజీవులుగా ఉంచడం ఎలా అని చూపించే మాన్యూలు నందు జీవాన్ని కాపాడుకునేందుకు రక్త ఉపయోగాన్ని విసర్జించమని మన సృష్టికర్త చెబుతున్నాడు. (ద్వితీయోపదేశకాండము 32:46, 47; ఫిలిప్పీయులు 2:16) ఆ మాన్యూలు కోరుతున్నవాటికి హత్తుకుని ఉండడం సమంజసంకాదా?

నిజానికి, రక్తం లేకుండా తమ రోగానికి చికిత్సచేయమని కోరే క్రైస్తవ రోగులు అన్ని విధాల వైద్య చికిత్సను నిరాకరించడం లేదు. కేవలం తమ ప్రస్తుత మరియు భవిష్యత్‌ జీవితాలకు గౌరవాన్ని చూపించే చికిత్సనే వారు కోరుతున్నారు. క్రైస్తవులు తీసుకున్న స్థానాన్ని ధైర్యంగా గౌరవించే వైద్యులు, వారి విన్నపానికి తగినట్లుగా వారికి చికిత్స చేయడంలోని ప్రయోజనాలకు సాక్ష్యాన్నిస్తున్నారు. “యెహోవాసాక్షులను కలవడం నన్ను కొత్త విలువలవైపుకు నడిపించింది,” అని తన చికిత్సలో రక్తాన్ని ఎక్కువగా ఉపయోగించే ఒక శస్త్రవైద్యుడు చెప్పాడు. సాక్షులు కానివారికి సహితం రక్తం లేకుండ చికిత్స చేసేందుకు ఆయన యిప్పుడు ప్రయత్నిస్తున్నాడు.

వాస్తవమైన జీవాన్ని విలువైందిగా ఎంచడం

యెహోవాసాక్షులకు చికిత్సచేయడం ద్వారా ఈ శస్త్రవైద్యుడు ఏ కొత్త విలువలను కనుగొన్నాడు? ఒక వ్యక్తికి చికిత్స చేయడం అంటే శరీరంలో రోగం ఉన్న ఆ భాగానికి మాత్రమే చికిత్స చేయడం కాదుకానీ మొత్తం మనిషికి చికిత్స చేయడం అని యిప్పుడు ఆయన గ్రహిస్తున్నాడు. ఒక రోగి, ఆమె లేక ఆయన శారీరక, ఆత్మీయ మరియు భావోద్రేక క్షేమం యెడల శ్రేష్ఠమైన శ్రద్ధ కనపర్చబడాలని కోరేందుకు అనుమతించబడకూడదా?

కుమీకో అనే 15 సంవత్సరాల అమ్మాయికున్న ప్రాణాంతకమైన లుకేమీయా వ్యాధిని చికిత్స చేయడంలో రక్త మార్పిడి చేయడం అసంభవమైన ఎంపిక అయ్యింది. ఆమె జీవాన్ని కొన్ని వారాలూ, నెలలూ లేక సంవత్సరాలకు పొడిగించే ప్రయత్నం దీర్ఘకాలమందు ఆమెకు దొరకబోయే మూల్యానికి ఏమాత్రం తగినది కాదు. తన ప్రస్తుత జీవాన్ని యెహోవా దేవుని సాక్షుల్లో ఒకరిగా ఆయనకు సమర్పించుకున్నదై, జీవానికి మరియు రక్తానికున్న పవిత్రతను ఆమె గౌరవించింది. ఆమె తండ్రి యితర బంధువులూ ఆమె తీసుకున్న స్థానాన్ని దృఢంగా వ్యతిరేకించినప్పటికీ, కుమీకో దృఢంగా నిలిచింది. ఆమె వైద్యుడు ఆమెను ఒకసారి యిలా ప్రశ్నించాడు: “మీ దేవుడు పొరపాట్లను క్షమిస్తే, మీరు రక్తమార్పిడిని అంగీకరించినప్పటికీ ఆయన మిమ్మల్ని క్షమించడా?” కుమీకో రాజీపడడానికి, తద్వారా తన బైబిలు ఆధారిత నమ్మకాన్ని త్యజించేందుకు నిరాకరించింది. “జీవవాక్యమును చేత పట్టుకొని” ఆమె తన స్థానాన్ని కాపాడుకుంది. (ఫిలిప్పీయులు 2:16) అవిశ్వాసియైన ఆమె నాన్నమ్మ చెప్పినట్లుగా: “కుమీకో తన విశ్వాసాన్ని త్యజించదు.” కొద్దికాలానికి అవిశ్వాసియైన ఆమె తండ్రి, నాన్నమ్మ అలాగే ఆమెకు వైద్యం చేసే వైద్యుల దృక్పథం మారింది.

ఆమెను మరణం నుండి పునరుత్థానం చేయగల యెహోవా దేవుని యందు కుమీకోకు గల విశ్వాసం అనేక హృదయాలను కదిలించింది. ఇంకా జీవించి ఉన్నప్పుడు తన తండ్రిని ఆమె యిలా బ్రతిమాలింది: “నేను చనిపోయినప్పటికీ, పరదైసులో నేను పునరుత్థానమౌతాను. కానీ మీరు హార్మగిద్దోనులో నాశనమైపోతే, నేను మిమ్మల్ని చూడలేను. కనుక దయచేసి, బైబిలును పఠించండి.” ఆమె నాన్న యిలా చెబుతూ వచ్చాడు: “నువ్వు బాగుపడిన తర్వాత నేను నేర్చుకుంటాలే.” అయితే క్రూరమైన తన అనారోగ్యం వల్ల కుమీకో మరణించినప్పుడు, ఆమె తండ్రి యిలా ఒక చీటీ రాసి, ఆమె శవపేటికలో పెట్టాడు: “కుమీకో, నేను నిన్ను పరదైసులో కలుసుకుంటాను.” అంత్యక్రియల తర్వాత, అక్కడ హాజరైన వారితో మాట్లాడి, యిలా అన్నాడు: “నేను పరదైసులో కలుసుకుంటానని కుమీకోకు మాటిచ్చాను. నేను కావల్సినంత పఠించలేదు కనుక యిప్పటికీ నేను దాన్ని నమ్మలేకపోతున్నా కూడా నేను దాన్ని లోతుగా పరిశీలించాలని నిశ్చయించుకున్నాను. దయచేసి నాకు సహాయం చేయండి.” ఆమె కుటుంబంలోని యితరులు కూడా బైబిలును పఠించడం ప్రారంభించారు.

కుమీకోకు జీవంపై నిజమైన గౌరవం ఉండేది మరి జీవించాలి అనే కోరిక కూడా ఉండేది. ఆమె ప్రస్తుత జీవాన్ని కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలన్నిటినీ ఆమె మెచ్చుకుంది. అయితే, సృష్టికర్త మాన్యూలునందున్న సూచనలకు బద్ధురాలై ఆమె తన వాస్తవమైన జీవాన్ని సంపాదించుకుందని నిరూపించుకుంది. లక్షలాది మందికి అది పరదైసు భూమిపై నిత్యజీవమై ఉంటుంది. వారిలో మీరు కూడా ఉంటారా?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి