జీవం మీకు ఎంత ప్రశస్తమైనదిగా ఉంది?
ఓ యౌవనుడు ఒక అపార్ట్మెంటులోని ఎనిమిదవ అంతస్థునుండి దూకి చనిపోయాడు. “వేదన, అసౌకర్యం లేక భయాలు లేనిది; బదులుగా అది బాగుంటుంది,” అని మరణించేలా పైనుండి దూకడాన్ని వర్ణించే ఒక పుస్తకాన్ని అతను చదివాడు. జపాను నందు ప్రచురించబడిన ఈ పుస్తక రచయిత, “ఆత్మహత్యను జీవిత ఎంపికల్లో ఒకదానిగా” మాత్రమే అందించాను అని చెప్పుకున్నాడు.
నేడు, జీవం యెడల అలక్ష్యతను కనపర్చేది ఆత్మహత్య చేసుకునే వ్యక్తులు మాత్రమే కాదు. అలక్ష్యంగా నడిపించే డ్రైవర్లు, జీవం యెడల చాలా తక్కువ గౌరవాన్ని కనపరుస్తారు. కొందరైతే త్రాగేసి బండ్లను నడిపిస్తుంటారు, అనేకులు అతి వేగంగా వెళ్లి ప్రాణాంతకమైన ప్రమాదాలకు గురౌతారు.
ఇతరులు, సుఖానుభవాలకు ప్రాముఖ్యతనిస్తూ జీవం యెడల తమకు ఆదరణ లేదని చూపుతున్నారు. పొగత్రాగడం మరణకరమైనప్పటికీ, మరి అది నెమ్మదిగా చేసుకునే ఆత్మహత్య అని పిలువబడినప్పటికీ పొగత్రాగేవారు దాన్ని విడనాడేందుకు నిరాకరిస్తారు. లైంగిక పిచ్చి గల ఈ లోకంలో అనేకులు తమ పవిత్రతను కాపాడుకునే బదులుగా తరచూ మరణానికి నడిపించే విచక్షణరహితమైన పద్ధతిని అవలంభిస్తున్నారు.
అసలు వీటిని గూర్చి తెలుసుకోకుండానే, కొందరు మితిమీరి తినడం, మితిమీరి త్రాగడం, సరిపడ వ్యాయామం చేయకపోవడం, సుఖానుభవాలను యిచ్ఛయించడం ద్వారా తమ ఆయుష్షును వారు తగ్గించుకుంటున్నారు. జపాను రచయితయైన షిన్యా నిషిమారూ యిలా హెచ్చరించాడు: “అదుపులేని ఆహారాలవాట్లు భౌతిక కార్యకలాపాలను దెబ్బతీస్తాయి, అంతేకాకుండ అనుకూలత మరియు ప్రీతిని ఎడతెగక వెంబడించడం ప్రజల జీవాన్ని తినేస్తుంది.” “రేపు చచ్చిపోదుము గనుక తిందము త్రాగుదము” అని ప్రాచీన కాలంలో చెప్పినవారి దృక్పథంతో కొందరు ఏకీభవిస్తారు.—యెషయా 22:13; 1 కొరింథీయులు 15:32.
అవును, జీవం యెడల అలక్ష్యత నేడు ప్రబలంగా ఉంది. కనుక, జీవం మీకు ఎంత ప్రశస్తమైనది? అని ప్రశ్నించడం ఉచితమే. ఏది ఏమైనా జీవాన్ని కాపాడుకోవల్సిందేనా? మరి మన ప్రస్తుత జీవం కంటే ప్రాముఖ్యమైనది వేరే ఏదైనా ఉందా?