కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 1/1 పేజీలు 24-26
  • ‘బాలుర నోటి నుండి’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘బాలుర నోటి నుండి’
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఉపశీర్షికలు
  • మంచి ప్రవర్తన ఒక సాక్ష్యం
  • ప్రభావవంతమైన యౌవన సాక్షులు
  • బాలల ధైర్యం మంచి సాక్ష్యమిస్తుంది
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 1/1 పేజీలు 24-26

‘బాలుర నోటి నుండి’

సమూయేలు చిన్నపిల్లవానిగా వున్నప్పుడు, ప్రధానయాజకుడైన ఏలీ కుమారులు దుష్టత్వంతో వున్నప్పటికీ అతడు సరైన సూత్రాలను దృఢంగా చేపట్టాడు. (1 సమూయేలు 2:22; 3:1) ఎలీషా కాలంలో, సిరియాలో బందీగావున్న ఇశ్రాయేలీయురాలైన చిన్నది తన యజమానురాలికి ధైర్యంగా సాక్ష్యమిచ్చింది. (2 రాజులు 5:2-4) యేసు 12 సంవత్సరాల వయస్సులో ఉండగా, చూసేవారిని ఆశ్చర్యచకితులను చేసేలా, ప్రశ్నలడుగుతూ సమాధానాలిస్తూ ఆయన ఇశ్రాయేలు బోధకులతో ధైర్యంగా మాట్లాడాడు. (లూకా 2:46-48) చరిత్రంతటిలో యెహోవా తన యౌవన ఆరాధికులచే నమ్మకంగా సేవించబడ్డాడు.

ఈనాడు కూడా బాలలు అలాంటి విశ్వాసంగల స్ఫూర్తినే చూపిస్తున్నారా? అవును, వాస్తవంగా చూపిస్తున్నారు! విశ్వసిస్తున్న అనేకానేక మంది బాలలు యెహోవా సేవలో “ఇష్టపూర్వకంగా” అర్పించుకొనుచున్నారని వాచ్‌టవర్‌ సంస్థ బ్రాంచి కార్యాలయాల నుండి వచ్చిన నివేదికలు చూపిస్తున్నాయి. (కీర్తన 110:3) వారి ప్రయాసల మంచి ఫలితాలు క్రైస్తవులమైన మనలనందరిని, బాలలను వృద్ధులను “మేలుచేయుట యందు విసుకక [వుండునట్లు]” ప్రోత్సహిస్తాయి.—గలతీయులు 6:9.

ఆరు సంవత్సరాల వయస్సులో ప్రచారకురాలై, తన తరగతిలోని వారికందరికి సాక్ష్యమివ్వడాన్ని తన గమ్యంగా పెట్టుకున్న అయూమి అనే జపాను బాలిక, ఒక మంచి ఉదాహరణ. తన పాఠశాలలోని సహవిద్యార్థులు వేసే ప్రశ్నలకు సమాధానం యిచ్చేందుకు సిద్ధపడడానికి తరగతి గ్రంథాలయంలో అనేక ప్రచురణలను వుంచేందుకు ఆమెకు అనుమతి లభించింది. దాదాపు ఆమె తరగతిలోని వారందరు, అలాగే ఆమె ఉపాధ్యాయురాలు ప్రచురణల గురించి తెలుసుకున్నారు. తన ఆరేళ్ల ప్రాథమిక పాఠశాల విద్యా కాలంలో, అయూమి 13 బైబిలు పఠనాలు ఏర్పాటు చేసింది. ఆమె నాలుగవ తరగతిలో వుండగా బాప్తిస్మం తీసుకుంది, తాను పఠనం చేసిన తన స్నేహితురాలు ఆరవ తరగతిలో వుండగా బాప్తిస్మం తీసుకుంది. అంతేగాక, ఆ బైబిలు విద్యార్థి తల్లి, యిద్దరు అక్కలు కూడా పఠనం చేసి బాప్తిస్మం తీసుకున్నారు.

మంచి ప్రవర్తన ఒక సాక్ష్యం

“అన్యజనుల . . . మధ్యను మంచి ప్రవర్తనగలవారై” వుండాలని అపొస్తలుడైన పేతురు చెప్పాడు, యౌవన క్రైస్తవులు ఈ ఆజ్ఞను గంభీరంగా తీసుకుంటారు. (1 పేతురు 2:12) ఫలితంగా, వారి మంచి ప్రవర్తన తరచూ మంచి సాక్ష్యమిస్తుంది. ఆఫ్రికా దేశమైన కామెరూన్‌లో, ఒక వ్యక్తి యెహోవా సాక్షుల సంఘానికి రెండవసారి వచ్చి ఒక బాలిక ప్రక్కన కూర్చోవడం జరిగింది. ప్రసంగీకుడు బైబిలులోని ఒక వాక్యాన్ని చూద్దామని ప్రేక్షకులను ఆహ్వానించినప్పుడు, ఆ బాలిక తన స్వంత బైబిలులో ఆ వచనాన్ని వెంటనే కనుగొని, చదువుతుండగా దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ఆ వ్యక్తి గమనించాడు. ఆమె వైఖరి అతన్ని ఎంతగా ప్రభావితం చేసిందంటే, అతడు కూటం ముగిసిన వెంటనే, ప్రసంగీకుని దగ్గరికెళ్లి యిలా చెప్పాడు: “ఈ చిన్న బాలిక నేను మీతో కలిసి బైబిలు పఠించడాన్ని యిష్టపడేలా చేసింది.”

దక్షిణాఫ్రికాలో 25 మంది విద్యార్థులు యెహోవాసాక్షుల పిల్లలున్న ఒక పాఠశాల ఉంది. వారి మంచి ప్రవర్తన యెహోవాసాక్షులకు మంచి పేరు తేవడానికి కారణమయ్యింది. ప్రాముఖ్యంగా తన చర్చి యౌవనులకు సహాయం చేయడంలో అసమర్థమైనదిగా నిరూపించబడింది గనుక, సాక్షులు తమ పిల్లలకు అంత చక్కగా ఎలా తర్ఫీదు యివ్వగలుగుతున్నారన్నది తనకు అర్థం కావడం లేదని ఒక ఉపాధ్యాయురాలు ఒక సాక్షి తండ్రి(తల్లి)తో చెప్పింది. పాఠశాలలో పని చేయడానికి మరో క్రొత్త ఉపాధ్యాయురాలు వచ్చి, సాక్షుల పిల్లల మంచి ప్రవర్తనను వెంటనే గుర్తించింది. తాను కూడా యెహోవాసాక్షులలో ఒకరవ్వాలంటే తానేమి చేయాలని ఆమె సాక్షులైన అబ్బాయిలలో ఒకరిని అడిగింది. ఆమె బైబిలు పఠనం చేయాలని అతడు వివరించి, తన తల్లిదండ్రులు ఆమెను దర్శించడానికి ఏర్పాటు చేశాడు.

కోస్టా రికాలో, త్రిత్వము, ఆత్మ, నరకాగ్ని వంటివాటిని గూర్చిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి తన తరగతి విద్యార్థులిద్దరు బైబిల్‌ నుపయోగించినప్పుడు రిగోబెర్‌టో సత్యాన్ని గుర్తించాడు. వాళ్లు చెప్పింది ఆయనపై మంచి ప్రభావాన్ని చూపించింది ఎందుకంటే, వారు లేఖనాలను ఉపయోగించడంలో కలిగివున్న సామర్థ్యాన్ని బట్టి మాత్రమే కాదు గాని, క్రైస్తవమత సామ్రాజ్య చర్చీలలో తాను చూసిన దాని నుండి ఎంతో వేరుగావున్న వారి మంచి ప్రవర్తనను బట్టి కూడా. కుటుంబంలో వ్యతిరేకత వున్నప్పటికీ, రిగోబెర్‌టో తన బైబిలు పఠనమందు మంచి అభివృద్ధి సాధిస్తున్నాడు.

స్పెయిన్‌లో ఇద్దరు యెహోవాసాక్షులు—వారిలో ఒకరికి తొమ్మిది సంవత్సరాలు—ఓనోఫ్రి అనే వ్యక్తిని దర్శించారు. పెద్దవాడైన సాక్షి ఎక్కువగా మాట్లాడుతుండగా, బాలుడైన సాక్షి చదువబడుతున్న లేఖనాలను జాగ్రత్తగా చూసుకుంటూ, తాను జ్ఞాపకముంచుకున్న కొన్ని బైబిలు లేఖనాలు చెప్పాడు. ఓనోఫ్రి చాలా ప్రభావితుడయ్యాడు. ఆ చిన్న బాలుడు లేఖనాలను అంత చక్కగా ఉపయోగించడం ఎక్కడ నేర్చుకున్నాడో అక్కడే తనకు కూడా బైబిలు పఠనం చేయాలని వుందని ఆయన నిశ్చయించుకున్నాడు. గనుక, తరువాతి ఆదివారం ఉదయాన్నే, అతను రాజ్య మందిరానికి వెళ్లాడు. తమ కూటం కొరకు సాక్షులు మధ్యాహ్నం వచ్చేంత వరకు అతడు బయటే వేచివుండ వలసివచ్చింది. అప్పటి నుండి, అతడు మంచి అభివృద్ధి సాధించి, యిటీవలనే నీటి బాప్తిస్మం ద్వారా తన సమర్పణను సూచించాడు.

ప్రభావవంతమైన యౌవన సాక్షులు

అవును, దీనహృదయులను చేరడానికి యెహోవా బాలలను, అలాగే పెద్దవారిని కూడా ఉపయోగించుకుంటాడు. హంగేరీ నుండి వచ్చిన ఒక అనుభవంలో దీన్ని చూడవచ్చు. అక్కడ, ఒక పది సంవత్సరాల రోగిని చూడడానికి సందర్శకులు వచ్చినప్పుడల్లా, వారు ఆమె చదువుకోడానికి పుస్తకాలు అలాగే ఆహారం తేవడాన్ని ఒక ఆసుపత్రి నర్సు గమనించింది. ఆ యౌవన బాలిక ఏమి చదవడానికి అంత ఆసక్తి కలిగివుందా అని ఆమె ఆశ్చర్యపోయింది, అది బైబిలని ఆమె తెలుసుకుంది. ఆ నర్సు ఆమెతో మాట్లాడి, తర్వాత యిలా చెప్పింది: “ఆమె మొదటి క్షణం నుండి నాకు నేర్పించడం ప్రారంభించింది.” యౌవన బాలిక ఆసుపత్రి విడిచి వెళ్లేటప్పుడు, ఒక సమావేశానికి రమ్మని నర్సును ఆహ్వానించింది, కాని నర్సు నిరాకరించింది. అయితే ఆమె తర్వాత “స్వచ్ఛమైన భాష” జిల్లా సమావేశానికి హాజరు కావడానికి అంగీకరించింది. తర్వాత వెంటనే, ఆమె బైబిలు పఠనం ప్రారంభించింది, ఒక సంవత్సరం తర్వాత ఆమె బాప్తిస్మం తీసుకుంది—యిదంతా కూడా ఒక చిన్న బాలిక ఆసుపత్రిలో తన విరామ సమయాన్ని బైబిలు సాహిత్యాన్ని చదవడానికి ఉపయోగించిన దాని ఫలితమే.

ఎల్‌ సాల్వడార్‌లో, ఆనా రూత్‌ జూనియర్‌ కళాశాల విద్య రెండవ సంవత్సరం చదువుతుండేది. ఇష్టమైతే ఇతరులు ఎవరైనా చదవడానికి తన బల్లపై బైబిలు సాహిత్యాన్ని విడిచిపెట్టే అలవాటు ఆమెకు వుండేది. సాహిత్యం లేకుండాపోయి మళ్లీ కొంత సమయం తర్వాత తిరిగి అక్కడ వుండడం గమనించి, అనా రూత్‌ తనతోటి పాఠశాల విద్యార్థినియైన ఎవెలిన్‌ దాన్ని చదువుతుండినదని తెలుసుకుంది. కొంతకాలం తర్వాత ఎవెలిన్‌ పఠనానికి అంగీకరించి, సంఘ కూటాలకు హాజరు కావడం ప్రారంభించింది. చివరికి, ఆమె బాప్తిస్మం తీసుకుంది, ఇప్పుడు ఆమె క్రమ సహాయ పయినీర్‌గా సేవచేస్తున్నది. ఆనా రూత్‌ క్రమ పయినీర్‌గా వుంది.

పనామాలో ఒక సహోదరి ఒక స్త్రీతో పఠనం ప్రారంభించింది, కాని ఆ స్త్రీ భర్త సత్యాన్ని ఎంతగా వ్యతిరేకించడం మొదలుపెట్టాడంటే, దాదాపు పఠనం ఆగిపోయింది. అయితే, మెల్లిగా భర్త దృక్పథం మారింది. కొంతకాలం తర్వాత, సాక్షియైన ఆయన స్వంత అన్న, తన యింట్లో (దొంగలు వచ్చినప్పుడు హెచ్చరించే) అలారమ్‌ బిగించమని అతన్ని కోరాడు. ఆయన అలారమ్‌ బిగిస్తున్నప్పుడు, అతని తొమ్మిది సంవత్సరాల అన్న కూతురు ఎంతో విచారంతో యింటికి తిరిగి వచ్చింది. ఏమైందని అతడు ఆ బాలికను అడిగాడు, తాను తన అక్క బైబిలు పఠనం నిర్వహించడానికి వెళ్లాము కాని, ఆ వ్యక్తి ఇంటివద్ద లేడు, కాబట్టి ఈ రోజు తాను యెహోవా కొరకు ఏమి చేయలేక పోయానని చెప్పింది. ఆమె చిన్నాన్న యిలా చెప్పాడు: “నాకెందుకు ప్రకటించకూడదు? అప్పుడు నీవు యెహోవా కొరకు కొంత చేయగలుగుతావు.” అతని అన్నకూతురు తన బైబిలు తెచ్చుకోడానికి సంతోషంగా పరుగెత్తింది, ఒక పఠనం ప్రారంభించ బడింది.

ఆ బాలిక తల్లి (ఆ వ్యక్తి వదిన) వింటూంది. యిదంతా కేవలం తమాషా అని ఆమె అనుకుంది, కాని ఆ వ్యక్తి వాళ్ల యింటికెళ్లిన ప్రతిసారి, అతడు తన అన్నకూతుర్ని బైబిలు పఠనం కొరకు అడిగేవాడు. తన మరిది గంభీరంగానే అడుగుతున్నాడని, అతనికి కొన్ని కష్టమైన ప్రశ్నలు వున్నాయని ఆ బాలిక తల్లి గుర్తించినప్పుడు, తన కుమార్తె కూడా వుండగా తానే పఠనం నిర్వహించడానికి నిర్ణయించుకుంది. అతడు వారానికి రెండుసార్లు పఠించడం ప్రారంభించి మంచి అభివృద్ధి సాధించాడు. చివరికి, అతడు సమర్పించుకునే స్థితికి చేరి, అతని భార్య బాప్తిస్మం తీసుకున్న సమావేశంలోనే తాను బాప్తిస్మం తీసుకున్నాడు—అంతా అతని అన్న కూతురి చక్కని దృక్పథం వల్లనే జరిగింది.

బాలల ధైర్యం మంచి సాక్ష్యమిస్తుంది

బైబిలు యిలా చెబుతుంది: “ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము.” (కీర్తన 27:14) ఈ మాటలు దేవుని సేవకులందరికీ వర్తిస్తాయి, యౌవనులు అలాగే పెద్దలు గడిచిన సంవత్సరంలో వాటిని అన్వయించుకున్నారు. ఆస్ట్రేలియాలో, ఒక ఐదు సంవత్సరాల బాలిక ఒక క్రొత్త పాఠశాలలో చేరినప్పుడు, ఆమె తల్లి యెహోవాసాక్షుల నమ్మకాల గురించి ఉపాధ్యాయురాలికి వివరించడానికి వెళ్లింది. ఉపాధ్యాయురాలు యిలా చెప్పింది: “మీరు నమ్మేదేమిటో నాకు తెలుసు. మీ కుమార్తె నాకు అంతా వివరించింది.” ఈ బాలిక తన విశ్వాసాన్ని గూర్చి తన ఉపాధ్యాయురాలికి తానే స్వంతగా వివరించేందుకు ఆమెను సమీపించడానికి వెనుకాడలేదు.

రుమేనియా నందలి ఐదు సంవత్సరాల ఆండ్రేయా కూడా ధైర్యాన్ని ప్రదర్శించింది. ఆమె తల్లి తాను సాక్షి కావడానికి ఆర్థడాక్స్‌ విశ్వాసాన్ని విడిచిపెట్టినప్పుడు, వారి పొరుగువారు ఆమె చెప్పేది వినడానికి నిరాకరించారు. ఒకరోజు సంఘ పుస్తక పఠనం వద్ద, తమ పొరుగువారికి ప్రకటించవలసిన అవసరతను గూర్చి సేవాధ్యక్షుడు నొక్కిచెప్పడాన్ని ఆండ్రేయా విన్నది. దీని గురించి ఆమె గంభీరంగా తలంచి, యింటికి వచ్చాక తన తల్లితో యిలా చెప్పింది: “నీవు పని కొరకు వెళ్లిపోయిన తర్వాత, నేను లేచి, నీవు చేసినట్లే నేను నా సంచిలో సాహిత్యాలు వుంచుకుని, మమ్మీ, పొరుగువారితో సత్యాన్ని గూర్చి మాట్లాడడానికి కావలసిన సహాయాన్ని యివ్వమని నేను యెహోవాను ప్రార్థిస్తాను.”

మరునాడు ఆండ్రేయా తాను వాగ్దానం చేసినట్లే చేసింది. తర్వాత, ధైర్యం కూడగట్టుకుని, ఆమె ఒక పొరుగువారి బెల్‌ నొక్కింది. పొరుగువారు తలుపు తీసినప్పుడు, ఈ చిన్న బాలిక యిలా చెప్పింది: “మా అమ్మ సాక్షి అయినప్పటి నుండి ఆమె అంటే మీకు యిష్టం లేదని నాకు తెలుసు. మీతో మాట్లాడాలని ఆమె చాలాసార్లు ప్రయత్నించింది, కాని ఆమె చెప్పేది వినడం మీకు యిష్టంలేదు. ఇది ఆమెను బాధపెడుతుంది. కాని మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నామని మీరు తెలుసుకోవాలని నేనిష్టపడుతున్నాను.” తర్వాత, ఆండ్రేయా మంచి సాక్ష్యం యివ్వడంలో కొనసాగింది. ఒక్కరోజులో ఆమె ఆరు పుస్తకాలు, ఆరు పత్రికలు, నాలుగు చిన్న పుస్తకాలు, నాలుగు కరపత్రాలు పంచిపెట్టింది. అప్పటినుండి, ఆమె ప్రాంతీయ సేవలో క్రమంగా పాల్గొంటుంది.

అక్కడున్న పోరాటాన్ని బట్టి, రువాండాలోని మన సహోదరులు గొప్ప ధైర్యం చూపించవలసి యుంది. ఒక సందర్భంలో ఒక సాక్షుల కుటుంబం ఒక గదిలో వేయబడ్డారు, అక్కడ సైనికులు వారిని చంపడానికి సిద్ధపడ్డారు. కాని మొదట ప్రార్థించడానికి అనుమతి యివ్వమని ఆ కుటుంబం కోరింది. అనుమతి యివ్వబడింది, కుమార్తెయైన డెబోరా తప్ప అందరూ నిశ్శబ్దంగా ప్రార్థించారు. ఒక నివేదిక ప్రకారం, డెబోరా బిగ్గరగా యిలా ప్రార్థించింది: “యెహోవా, ఈ వారం నేను, నాన్న ఐదు పత్రికలు అందజేశాము. వారికి జీవం కలిగేలా సహాయం చేయడానికి వారికి సత్యం నేర్పించేందుకు మేము మళ్లీ వాళ్ల దగ్గరికి ఎలా వెళ్లగలం? అంతేగాక, నేనిప్పుడు ప్రచారకురాలిని ఎలా కాగలను? నిన్ను సేవించడానికి నేను బాప్తిస్మం తీసుకోవాలని యిష్టపడుతున్నాను.” యిది విన్న తర్వాత ఒక సైనికుడు యిలా చెప్పాడు: “ఈ చిన్న బాలిక గురించి మేము మిమ్మల్ని చంపలేము.” డెబోరా వెంటనే “కృతజ్ఞతలు” తెలియజేసింది. ఆ కుటుంబం తప్పించుకుంది.

యేసు తన భూజీవిత అంతంలో యెరూషలేములోకి విజయోత్సాహంతో ప్రవేశిస్తున్నప్పుడు, ఆయనను పెద్ద సంఖ్యలో జనులు సంతోషంతో అభినందించారు. ఆ సమూహాలలో పిల్లలు పెద్దలు కూడా వున్నారు. నివేదిక ప్రకారం, యౌవన బాలలు “దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయు” చుండిరి. ప్రధాన యాజకులు మరియు శాస్త్రులు దీన్ని వ్యతిరేకించినప్పుడు, యేసు యిలా సమాధానమిచ్చాడు: “బాలురయొక్కయు చంటిపిల్లలయొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అను మాట మీరెన్నడును చదువలేదా?”—మత్తయి 21:15, 16.

ఈనాడు కూడా యేసు మాటలు నిజమని తెలుసుకోవడం అద్భుతంగా లేదా? “బాలురయొక్కయు చంటిపిల్లలయొక్కయు . . . నోట” నుండి—యౌవనస్థుల, యౌవన పురుషుల మరియు యౌవన స్త్రీల నోట నుండి అని మనం జతచేయవచ్చు—యెహోవా స్తోత్రమును పొందాడు. వాస్తవానికి, యెహోవాను స్తుతించడం విషయంలో, కనీస వయోపరిమితి అంటూ వుండదు.—యోవేలు 2:28, 29.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి