యథార్థతను కాపాడుకునే జనాంగము
“సత్యము నాచరించు నీతిగల జనము [జనాంగము] ప్రవేశించునట్లు ద్వారములను తీయుడి.”—యెషయా 26:2.
1. “నీతియుక్త జనాంగము” గూర్చిన యెషయా వ్యాఖ్యానం ఎందుకు ఆశ్చర్యకరంగా ఉండవచ్చు?
ఈనాడు, అన్ని రకాల జనాంగాలున్నాయి. కొన్ని ప్రజాప్రభుత్వాలు, కొన్ని నిరంకుశపాలనలు. కొన్ని సంపన్న దేశాలు, కొన్ని నిరుపేద దేశాలు. ఒక్క విషయం మాత్రం అందరికీ ఉంది: సాతాను దేవునిగా ఉండే లోకంలో అందరూ భాగస్వాములే. (2 కొరింథీయులు 4:4) దీని దృష్ట్యా, యెషయా యిలా అన్నప్పుడు ఆయన మాటలు కొందరికి ఆశ్చర్యం కల్గించగలవు: “సత్యము నాచరించు నీతిగల జనాంగము ప్రవేశించునట్లు ద్వారములను తీయుడి.” (యెషయా 26:2) ఒక నీతియుక్త జనాంగమా? అవును, ఒక నీతియుక్త జనాంగము, మన కాలంలో ఉందని ప్రవచనం సూచిస్తోంది కనుక అలాంటి జనాంగం ఉంది. ఈ అనూహ్యమైన జనాంగం ఎలా గుర్తించబడగలదు?
2. “నీతియుక్త జనాంగం” అంటే ఏమిటి? అది మనకెలా తెలుసు?
2 యెషయా 26:2ను నూతనలోక అనువాదము ఆ జనాంగము “నీతియుత ప్రవర్తనను కల్గివుంది” అని అనువదించింది. కింగ్ జేమ్స్ వర్షన్ (మార్జిన్) ఆ వచనాన్ని ఈ విధంగా అనువదించింది: “సత్యము నాచరించు నీతిగల జనము.” రెండూ సరైన వర్ణనలే. వాస్తవానికి, నీతియుక్త జనాంగాన్ని గుర్తించడం సులభమే, ఎందుకంటే రాజైన క్రీస్తుకు లోబడి ఉండడం ద్వారా సాతాను లోకంలో భాగం కాకుండా ఉండే ఏకైక జనాంగం అది ఒక్కటే. (యోహాను 17:16) అదే విధంగా, దాని సభ్యులు ‘అన్యజనుల . . . మధ్యను మంచి ప్రవర్తన గలవారై’ ఉంటారు. దేవున్ని మహిమపర్చే జీవన విధానాన్ని వారు అనుసరిస్తారు. (1 పేతురు 2:12) అంతేకాకుండ, వారు ప్రపంచంలో ఏ భాగంలో ఉన్నప్పటికీ వారు “జీవముగల దేవుని సంఘములో, . . . ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై యున్న” దానిలో భాగమైయున్నారు. (1 తిమోతి 3:15) సత్యానికి మద్దతునిస్తూ క్రైస్తవమత సామ్రాజ్యం బోధించే అన్యమత తత్వాన్ని వారు తిరస్కరించి, ‘నిర్మలమైన వాక్యమను పాల’ పక్షం, అంటే, దేవుని వాక్యమైన బైబిలు పక్షం వహిస్తారు. (1 పేతురు 2:2) అంతేకాకుండ, వారు “ఆకాశము క్రింద ఉన్న సమస్తసృష్టికి” రాజ్య సువార్తను ఆసక్తితో ప్రకటిస్తారు. (కొలొస్సయులు 1:23) అభిషక్త క్రైస్తవుల సంఘమైన “దేవుని ఇశ్రాయేలు” నందు శేషించబడిన వారిగా ఉండేవారే ఈ జనాంగమనడంలో ఏ సందేహమైనా ఉండగలదా? లేనేలేదు!—గలతీయులు 6:16.
జనాంగము ఉద్భవించింది
3. “నీతియుక్త జనాంగం” ఎలా ఉద్భవించిందో వివరించండి.
3 “నీతియుక్త జనాంగము” ఎప్పుడు ఉద్భవించింది? దాని ప్రారంభం యెషయా గ్రంథంలో ప్రవచించబడింది. యెషయా 66:7, 8 నందు మనం యిలా చదువుతాము: “ప్రసవవేదన పడకమునుపు ఆమె [సీయోను] పిల్లను కనినది నొప్పులు తగులకమునుపు మగపిల్లను కనినది. . . . సీయోనునకు ప్రసవవేదన కలుగగానే ఆమె బిడ్డలను కనెను.” ఎంతో చిత్రంగా, దేవుని పరలోక సంస్థయైన సీయోను తాను ప్రసవవేదన పడకమునుపే “మగపిల్లను” కనవల్సిన అవసరముంది. పరలోకమందు 1914లో మెస్సీయా రాజ్యము ఉద్భవించింది. (ప్రకటన 12:5) ఆ తర్వాత మొదటి ప్రపంచ యుద్ధంలో అనేక దేశాలు పాల్గొన్నాయి, మరియు అభిషక్త క్రైస్తవులు, బాధా హింసలను అనుభవించారు. చివరికి, 1919లో భూమ్మీద ఆత్మీయ జనాంగం, అంటే “మగపిల్లవాడు జన్మించాడు. ఆ విధంగా, సీయోను నూతన “నీతియుక్త జనాంగపు” అభిషక్త సభ్యులను ‘ఆమె కుమారులను కనెను’ అంతేకాకుండ వీరు నిరంతరం అభివృద్ధి చెందుతున్న సాక్ష్యపు పని కొరకు సంస్థీకరించబడ్డారు.—మత్తయి 24:3, 7, 8, 14; 1 పేతురు 2:9.
4. దేవుని నీతియుక్త జనాంగం యథార్థతను కాపాడుకునేందుకు ఎందుకు శ్రమపడాల్సి వచ్చింది?
4 దాని ప్రారంభం నుండి, ఈ జనాంగము తీవ్రమైన యథార్థతా పరీక్షలను ఎదుర్కొంటూనే ఉంది. ఎందుకు? పరలోక రాజ్యం ఉద్భవించినప్పుడు, సాతాను వాని దూతలూ భూమ్మీదికి పరలోకంనుండి పడద్రోయబడ్డారు. ఒక పెద్ద స్వరం యిలా ప్రకటించింది: “రాత్రింబగళ్లు మన దేవునియెదుట మన సహోదరులమీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడియున్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను; ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను. వారు గొఱ్ఱెపిల్ల రక్తమునుబట్టియు, తామిచ్చిన సాక్ష్యమునుబట్టియు వానిని జయించియున్నారు గాని, మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు.” పరిస్థితుల్లోని ఈ మార్పుకు సాతాను గొప్ప రౌద్రంతో ప్రతిస్పందించి, “దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసునుగూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్రతీరమున నిలిచెను.” సాతాను ముట్టడిని ఎదిరిస్తూ అభిషక్త క్రైస్తవులు దృఢంగా నిలుచున్నారు. ఈ రోజువరకు కూడా దేవుని నీతియుక్త జనాంగంలోని ఆసక్తిగల సభ్యులు యేసు విమోచనగా అర్పించిన రక్తమందు విశ్వాసాన్ని కల్గివుండి, “మరణము వరకు” వారు తమ యథార్థతను కాపాడుకోవడం ద్వారా నిందించే వానికి విరుద్ధంగా యెహోవాకు మంచి జవాబును అందిస్తున్నారు.—ప్రకటన 12:1, 5, 9-12, 17; సామెతలు 27:11.
5. ఆధునిక దిన సాక్షుల ఏ చక్కని ప్రవర్తన వారు యథార్థతను కాపాడుకునేందుకు సహాయపడింది?
5 దేవుని రాజ్యపు ఆధునిక దిన సాక్షులు, అంటే అప్పట్లో బైబిలు విద్యార్థులు అని పిలువబడే యెహోవాసాక్షులు 1919 నందు ప్రారంభమైనప్పుడు వారు చాలా కొద్దిగా ఉండేవారు, కానీ విశ్వాసమందు వారు దృఢంగా ఉండేవారు. వారు ‘బలమైన పట్టణము, . . . రక్షణను దానికి ప్రాకారముగాను బురుజులుగాను నియమించిన’ దానిలో పునాదిని వేసిన సభ్యులుగా ఉన్నారు. వారు “యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము,” ఆయనయందు నమ్మకముంచారు. (యెషయా 26:1, 3, 4) పూర్వమందలి మోషేలా వారు యిలా ప్రకటించారు: “నేను యెహోవా నామమున ప్రకటించెదను మన దేవుని మహాత్మ్యమును కొనియాడుడి. ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు; ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నియు న్యాయములు ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు యథార్థవంతుడు.”—ద్వితీయోపదేశకాండము 32:3, 4.
6. ఈ అంత్యదినాల్లో యెహోవా తన ప్రజలను ఏ విధంగా ఆశీర్వదించాడు?
6 ఆ నాటి నుండి, 1,44,000 మంది అభిషక్త క్రైస్తవుల్లో శేషించినవారు మొదట సమకూర్చబడుతుండగా మరి యిప్పుడు ‘వేరే గొఱ్ఱెలు’ యెహోవా రాజ్య సంకల్పాలను ప్రకటించడంలో చేరుతుండగా దేవుని రాజ్య ఏర్పాటు ద్వారాలు విశాలంగా తెరుచుకుని ఉంటాయి. (యోహాను 10:16) అదే విధంగా, దాన్ని ఆనందంగా యిలా ప్రకటించవచ్చు: “యెహోవా, నీవు జనమును వృద్ధిచేసితివి జనమును వృద్ధిచేసితివి. దేశముయొక్క సరిహద్దులను విశాలపరచి నిన్ను నీవు మహిమపరచుకొంటివి.” (యెషయా 26:15) నేడు మనం లోకమనే పొలాన్ని గమనించినప్పుడు, ఆ మాటలు ఎంతో నిజంగా ఉన్నాయని మనం చూస్తాము. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, రాబోతున్న క్రీస్తు రాజ్యమును గూర్చిన సాక్ష్యం “భూదిగంతములవరకును” యివ్వబడుతోంది. (అపొస్తలుల కార్యములు 1:8) ఈ పత్రికలో 12, 15 పేజీల్లో కనిపించే ప్రపంచవ్యాప్త యెహోవాసాక్షులు 1994 సేవా సంవత్సర నివేదికనుబట్టి ఆ విస్తరణను అంచనా వేయవచ్చు.
ప్రచారకుల్లో కొత్త శిఖరాగ్ర సంఖ్య
7, 8. (ఎ) దేవుని ప్రజలు తమ ‘త్రాళ్లను పొడుగు చేసుకోవాలనే’ ఏ రుజువు ఉంది? (బి) గత 1994 సేవా సంవత్సర నివేదికను చూసి, ‘సరిహద్దులను’ విశేషంగా ‘విస్తృతపర్చుకునే’ ఏ రంగాలను మీరు గమనించారు?
7 ఈ నివేదికల్లోని కొన్ని ఉన్నతాంశాలను పరిశీలించండి. ప్రాంతీయ సేవలోని రాజ్య ప్రచారకుల శిఖరాగ్ర సంఖ్య 49,14,094కి చేరుకుంది! ‘ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చిన, . . . యొక గొప్ప సమూహము . . . తెల్లని వస్త్రములు ధరించుకొనినవారై, . . . గొఱ్ఱెపిల్లయెదుట నిలుచునేందుకు’ ఎడతెగక సమకూర్చబడడాన్ని చూడడం ఎంత అద్భుతంగా ఉంటుంది! అవును, వారు కూడా యథార్థతను కాపాడుకున్నవారయ్యారు. “గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొని,” యేసు విమోచన క్రయధన బలియందు విశ్వాసముంచడం ద్వారా వారు నీతిమంతులుగా ఎంచబడ్డారు.—ప్రకటన 7:9, 14.
8 ప్రత్యేకంగా 1919 నుండి, యెహోవా సంస్థకు ఈ ఆజ్ఞ యివ్వబడింది: “నీ గుడారపు స్థలమును విశాలపరచుము నీ నివాసస్థలముల తెరలు నిరాటంకముగ సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగుచేయుము నీ మేకులను దిగగొట్టుము.” (యెషయా 54:2) దానికి ప్రతిస్పందనగా, ప్రకటించే పని నిర్విరామంగా కొనసాగుతోంది. కొన్నిసార్లు వారాల వరకు వాతావరణం 45 నుండి 50 డిగ్రీల సెల్సియస్‌కు కూడా తగ్గిపోయే అవకాశమున్న అలస్కా సరిహద్దున ఉన్న మంచు ప్రాంతమైన యుకొన్ నందు కూడా కష్టపడి పనిచేసే సామర్థ్యమున్న పూర్తికాల సేవకుల గుంపు సహిస్తూనే ఉంది. ఇటీవలి సంవత్సరాల్లో యథార్థతను కాపాడుకునే యెహోవా జనాంగంలోకి సమూహాలు ఎంతో వేగంగా ప్రవాహాలుగా వస్తున్నాయి. క్రైస్తవమత సామ్రాజ్యం కాని ఆసియా దేశాలు ఒకప్పుడు సామ్యవాదం బాగా నాటుకుని ఉన్న దేశాలు, అనేక ఆఫ్రికా దేశాలు, మరియు కాథోలిక్కులు అధికారంలో ఉన్న ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్ మరియు దక్షిణమరికా వంటి ప్రాంతాలనుండి వీరిని ఆహ్వానించేందుకు ద్వారాలు ఎంతో విశాలంగా తెరువబడ్డాయి. నిర్వాసితులు మరో ప్రాంతాన్ని కూడా ప్రారంభించారు. ఉదాహరణకు, ఇంగ్లాండులో విదేశీ భాషలు మాట్లాడే 13 జాతుల అవసరతల యెడల సాక్షులు శ్రద్ధ వహిస్తున్నారు.
‘దీనిని చేస్తూనే ఉండండి’
9. (ఎ) పందొమ్మిదివందల తొంభైనాలుగు జ్ఞాపకార్థదిన హాజరు దేన్ని సూచిస్తుంది? (బి) అసమాన్యమైన హాజరుతో జ్ఞాపకార్థ దినం జరిగిన కొన్ని దేశాలు ఏవి?
9 వార్షిక నివేదిక యొక్క మరొక ఉన్నతాంశం జ్ఞాపకార్థ దిన హాజరు. ఆయన చనిపోక కొద్ది సమయం ముందు, యేసు తన మరణ దిన జ్ఞాపకార్థ ఆచరణను ప్రారంభించి, తన శిష్యులతో యిలా చెప్పాడు: “నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడి.” (1 కొరింథీయులు 11:24) ఆ ఆజ్ఞకు విధేయులై, 1994లో 1,22,88,917 మంది—చురుకైన ప్రచారకుల సంఖ్యకు రెండింతలు కంటే ఎక్కువ మంది, అటు అందులో భాగం వహించేవారిగా గానీ లేక దాన్ని ఆచరించేవారిగా గానీ చూడడం ఉప్పొంగింపజేసేదిగా ఉంది. కొన్ని దేశాల్లో ప్రచారకుల సంఖ్యకు పోలిస్తే జ్ఞాపకార్థ దినానికి హాజరైన వారి నిష్పత్తి యింకా అధికంగా ఉంది. ఎస్టోనియా, లటివియా, లిథువానియాలోని 4,049 మంది ప్రచారకులు, 12,879 మంది జ్ఞాపకార్థ దినానికి హాజరైనందుకు ఎంతగానో సంతోషించారు—అది అక్కడి ప్రచారకుల సంఖ్యకు మూడింతలు అధికం. అంతేకాకుండ, బెనిన్ నందు 16,786 మంది జ్ఞాపకార్థ దినానికి హాజరైనవారు, అక్కడున్న ప్రచారకుల సంఖ్యకు సుమారు ఐదు రెట్లు ఎక్కువ మంది ఉన్నారు. ఒక సంఘంలో 45 మంది సభ్యులుంటే 831 మంది హాజరయ్యారు!
10. (ఎ) జ్ఞాపకార్థ దినం నాడు వచ్చిన గొప్ప హాజరు మనపై ఏ బాధ్యతనుంచుతోంది? (బి) జ్ఞాపకార్థ దినానికి హాజరైన వాళ్లు యింకా సహాయం పొందినప్పుడు ఏమి జరుగగలదో వివరించండి.
10 ఆ శుభ సందర్భంలో ఆసక్తిగలవారనేకులు తమతో చేరడం వల్ల యెహోవాసాక్షులు ఎంతగానో ఆనందించారు. తమ అవగాహనలోనూ సత్యం యెడల గల ప్రేమలోనూ యిప్పుడు వారు యింకా అభివృద్ధి సాధించేందుకు సహాయపడాలని వీరు యిష్టపడుతున్నారు. కొందరు రష్యానందలి ఆలా ప్రతిస్సందించినట్లు ప్రతిస్పందించగలరు. ఆలా ఒక ప్రత్యేక పయినీరుతో పఠించింది. కానీ అభివృద్ధిని చేసుకోకపోవడం వల్ల ఆ పఠనాన్ని ఆపివేయడం జరిగింది. అయినప్పటికీ, జ్ఞాపకార్థ దినానికి హాజరయ్యేందుకు అందించిన ఆహ్వానాన్ని ఆలా నిరాకరించలేదు. ఎంతో ప్రాముఖ్యతగల ఆ కూటం ఆమెపై చెరగని ముద్రను వేసింది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, ఆమె తన విగ్రహాలన్నింటినీ పారేసి, సహాయం కొరకు యెహోవాకు ప్రార్థించింది. రెండు రోజుల తర్వాత ఆలా జ్ఞాపకార్థ దినంలో వేటిని ఆమె యిష్టపడిందో తెలుసుకుందామని ఆ పయినీర్ సహోదరి ఆలాను సందర్శించింది. ఫలవంతమైన చర్చ జరిగింది. ఆలాతో పఠనం తిరిగి ప్రారంభించబడింది. త్వరలోనే ఆమె సాక్ష్యపు పనిలో పాల్గొనడం ప్రారంభించింది. ఈ అనుభవం, జ్ఞాపకార్థ దినానికి హాజరైన వారిని తిరిగి సందర్శించడం ఎంత విలువైనదో చూపుతోంది. బహుశ అనేకులు ఆలా వలె ప్రతిస్పందించగలరు.
“సమాజముగా కూడుట మానక”
11-13. (ఎ) నీతియుక్త జనాంగపు నమ్మకమైన ప్రవర్తన ఏ పాత్రను కల్గివుంది? (బి) నిజమైన క్రైస్తవులు ఎందుకు కూటాలకు హాజరు కావాలి?
11 జ్ఞాపకార్థ దినం యెహోవాసాక్షుల కాలెండరులో అతి ప్రాముఖ్యమైన కూటము, కానీ అది ఒక్కటే కాదు. అపొస్తలుడైన పౌలు మాటలకు విధేయులుగా ప్రతి వారమూ యెహోవా సాక్షులు కూడుకుంటారు: “కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట . . . చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.” (హెబ్రీయులు 10:24, 25) నమ్మకమైన ప్రవర్తన వల్ల గుర్తించబడే యెహోవా నీతియుక్త జనాంగముతో వారు సహవసిస్తున్నారు. నమ్మకమైన ప్రవర్తనలో నమ్మకంగా కూటాలకు హాజరుకావడం కూడా యిమిడి ఉంది.
12 ఫిలిప్పైన్స్‌లో ఈ విషయం చక్కగా అర్థమౌతుంది, అక్కడ ఆదివారం కూటాల్లోని ప్రచారకుల సరాసరి సంఖ్య, 125 శాతం ఉంటుంది. అర్జెంటీనాలోని ఒక గుంపు సాక్షులు ఆసక్తిగల వ్యక్తుల నుండి కూడా దాన్ని యింకా బాగా అర్థం చేసుకోవచ్చు. వారు రాజ్య మందిరమునుండి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో జీవిస్తున్నారు. అయినప్పటికీ, అనారోగ్య పరిస్థితిలో తప్ప ఒక్కరూ కూటాలను ఎన్నడూ మానరని ప్రాంతీయ కాపరి నివేదించాడు. వారు నాలుగు గంటల పాటు గుర్రపు బండిలో గానీ లేక గుర్రం మీద గానీ ప్రయాణిస్తారు, మరి చలికాలంలో వారు రాత్రి చీకటిలో తిరిగి ప్రయాణిస్తారు.
13 ఈ విధానాంతం సమీపిస్తుండగా, జీవితం మరింత కష్టతరమౌతుంది, సమస్యలు అధికమౌతాయి, మరి కూటాలకు క్రమంగా హాజరవ్వడం పెద్ద సవాలు కాగలదు. అయితే, కేవలం అలాంటి సందర్భాల్లో, అలాంటి కూటాల్లో మాత్రమే లభించే ఆత్మీయ ఆహారం అనురాగంతో కూడిన సహవాసాల అవసరం మునుపెన్నటికంటే కూడా యిప్పుడు ఎక్కువగా ఉంది.
“దానిని త్వరిత భావంతో చేయండి”
14. యెహోవాసాక్షులు తమ పరిచర్య విషయంలో అత్యవసర భావాన్ని ఎందుకు కల్గివుంటారు, మరి దీన్ని ఏ ఫలితాలు ప్రదర్శిస్తున్నాయి?
14 గత సంవత్సరం, ఇటలీ నందలి కాథోలిక్ చర్చి యెహోవాసాక్షులు చేసే పనిని “క్రూరమైన మత మార్పిడి” అని సూచించింది. అయితే, వాస్తవానికి సాక్షులు చేసే పనిలో క్రూరమైనవేమీ లేవు. బదులుగా, తమ పొరుగువారి యెడల వారికి గల లోతైన ప్రేమకు ప్రతిరూపమే వారి పరిచర్య. అది పౌలు మాటలకు చూపిన విధేయతకు రుజువుగా కూడా ఉంది: “వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయమందును త్వరిత భావముతో చేయుము.” (2 తిమోతి 4:2 NW) గత 1994 నందు తమ పొరుగువారికి ప్రకటించడంలోను, పునర్దర్శనాలను చేయడంలోనూ మొత్తం 1,09,60,65,354 గంటలను వ్యయపర్చడం మరియు 47,01,357 బైబిలు పఠనాలను నిర్వహించడమందు కనిపించినట్లుగా, యెహోవాసాక్షులు తమ పరిచర్య యందు ఆసక్తిగా పనిచేసే త్వరిత భావన వారికి సహాయపడుతుంది. అనేకులు పయినీరు సేవలో భాగం వహించేందుకు వీలుపడింది, అంటే పయినీర్ స్ఫూర్తి ఉందనీ అది వర్థిల్లుతుందనీ అది చూపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సరాసరి 6,36,202 పయినీర్ల సంఖ్య దాన్ని నిరూపిస్తుంది.
15, 16. (ఎ) చిన్నపెద్దలిరువురూ పయినీర్ స్ఫూర్తిని ఎలా ప్రదర్శించారు? (బి) గత 1994 సేవా సంవత్సర నివేదికలో ఒక్కో దేశాన్ని చూచినప్పుడు, పయినీర్ల విశేషమైన సంఖ్యను మీరు ఎక్కడ కనుగొంటారు?
15 పయినీర్లు అనేక మంది యౌవనులున్నారు. అమెరికా నందు, ఉన్నత పాఠశాలలో చదువుతున్న వారిలో కొందరు క్రమ పయినీర్లుగా చేస్తున్నారు, వారి ముఖ్యమైన ప్రాంతం వారి తరగతి గదే. ఆ ప్రాంతంలోని అనేక పాఠశాలల్లో ప్రబలంగా ఉన్న మాదక ద్రవ్యాలూ అనైతికత, దౌర్జన్యం నుండి తమను తాము రక్షించుకునేందుకు పయినీరు సేవ ఎంతో శ్రేష్ఠమైన మార్గమని వారు కనుగొన్నారు. అనేకమంది యౌవనులు, తమ పాఠశాలను విడిచిన తర్వాత పయినీర్ సేవ చేయాలన్న గమ్యాన్ని కల్గివున్నారు. యుక్రేన్‌లోని ఐరీనా తాను పట్టభద్రురాలైన తర్వాత పయినీర్ సేవను చేపట్టేందుకు వీలుగా ఆమె ఉన్నత పాఠశాలలో ఉన్నప్పుడే సహాయ పయినీర్ సేవను చేసింది. ఆమె తన పాఠశాల చదువును ముగించినప్పుడు, క్రమ పయినీరు సేవ ద్వారా తమకు ప్రాతినిధ్యం వహించేందుకుగాను లౌకిక ఉద్యోగం విషయంలో కుటుంబం తనకు సహకరిస్తామని చెప్పింది. ఆర్థికపరంగా, యుక్రేన్‌లోని పరిస్థితులు అంత బాగోలేవు. అయితే, ఐరినా యిలా చెప్పింది: “నేను చేసే పని నాకే కాకుండ నేను బోధించేవారికి కూడా జీవాన్నిచ్చే పని అని నాకు తెలుసు.” ఐరినా వలె ఆలోచించే అనేకమంది యౌవనులను నేడు చూడడం నిజంగా ఆనందదాయకం. ‘యువతీ యువకులు తమ లేతప్రాయాల్లో తమ మహోన్నత సృష్టికర్తను జ్ఞాపకం’ చేసుకునేందుకు మరే శ్రేష్ఠమైన మార్గమున్నది?—ప్రసంగి 12:1.
16 అనేక మంది పయినీర్‌లు వయస్సు మళ్లినవారు. రెండవ ప్రపంచ యుద్ధంలో, ఆమె తండ్రి సోదరుడు యుద్ధం చేస్తుండగా మరణించారు, మరియు ఆమె అమ్మ, సోదరీ యూదుల ప్రాంతంలో కాల్చి చంపబడ్డారు అని ఒక స్త్రీ నివేదించింది. తర్వాత ఆమె కుమారుడు చనిపోయాడు. ఇప్పుడు, తన వార్ధక్య స్థితిలోనూ, అనారోగ్య పరిస్థితిని అనుభవిస్తూ, ఆమె పోగొట్టుకున్న దానికంటే క్రైస్తవ సంఘంలో మరి పెద్ద కుటుంబాన్ని యెహోవా యిచ్చాడు, మరి ఒక క్రమ పయినీర్‌గా యితరులకు సహాయం చేయడంలో ఆమె ఎంతో ఆనందాన్ని పొందుతోంది.
17, 18. పయినీర్లమైనా కాకపోయినా, మనలోని ప్రతి ఒక్కరమూ పయినీర్ స్ఫూర్తిని ఎలా కనపర్చగలము?
17 నిస్సందేహంగా, ప్రతి ఒక్కరూ పయినీర్లు కాలేరు. మన పదొవవంతునంతటినీ, మనం అందించగలదానినంతటినీ అంగీకరించేందుకు యెహోవా ఎంతో సంతోషిస్తున్నాడు, అది మన విషయంలో ఏమైనప్పటికీ. (మలాకీ 3:10, అథఃస్సూచి NW) వాస్తవానికి, మనమందరమూ ఈ ఆసక్తిగల పయినీర్ల స్ఫూర్తిని పెంపొందించుకోగలము, సువార్తను ప్రకటించడంలో అధికంగా పాల్గొనేందుకు మన పరిస్థితులు అనుమతించేవాటిని చేయాలి.
18 ఉదాహరణకు, ఆస్ట్రేలియా నందు వీధి సాక్ష్యం కొరకు ఏప్రిల్ 16 ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. ఆ నెలలోని కొత్త ప్రచారకుల శిఖరాగ్ర సంఖ్య 58,780 పెరగడం చూపించినట్లుగా ఈ ఏర్పాటుకు పయినీర్లు ప్రచారకులూ మంచి మద్దతునిచ్చారు. అంతేకాకుండ, గత సంవత్సరంలోని ఆ నెలకు పోలిస్తే, 90,000 పత్రికలు అధికంగా అందించబడ్డాయి. ఆ ప్రత్యేక దినం నాడు, ఓ సహోదరి ఒక వ్యక్తికి పత్రికలను యిచ్చింది, మరి తిరిగి సందర్శించేందుకుగాను ఆయన పేరు చిరునామాను రాసుకునే సమయంలో వారు బంధువులని ఆమె కనుగొంది! ఒకరినొకరు 30 సంవత్సరాలు చూడని పెద్దమ్మ చిన్నమ్మ పిల్లలని వారు కనుగొన్నారు. అది ఎంతో ఆనందమయ పునర్దర్శనాలకు చోటునిచ్చింది!
అంతంవరకు యథార్థతను కాపాడుకోండి
19. యెహోవా నీతియుక్త జనాంగం యథార్థతను చివరి వరకు కాపాడుకోవడం ఎందుకు అత్యవసరం?
19 సాతాను లోకం దాని అంతపు చివరి ఘట్టంలోకి వెళ్తుండగా దేవుని నీతియుక్త జనాంగము యథార్థతను కాపాడుకోవడం ఎంతో అత్యవసరం. త్వరలోనే, యెహోవా పరిశుద్ధ జనాంగము ఈ పిలుపును వింటుంది: “నీవు వెళ్లి నీ అంతఃపురములలో ప్రవేశించుము నీవు వెళ్లి నీ తలుపులు వేసికొనుము. ఉగ్రత తీరిపోవువరకు కొంచెముసేపు దాగియుండుము.” రక్తాపరాధి అయిన ఈ లోకం దైవిక తీర్పును తప్పకుండా ఎదుర్కొంటుంది. “నా జనమా, ఇదిగో వారి దోషమునుబట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములోనుండి వెడలి వచ్చుచున్నాడు. భూమి తనమీద చంపబడినవారిని ఇకను కప్పకుండ తాను త్రాగిన రక్తమును బయలుపరచును.” (యెషయా 26:20, 21) యెహోవా నీతియుక్త జనాంగంతో సహవసించే మనలోని ప్రతి ఒక్కరమూ యథార్థతను కాపాడుకునే క్రైస్తవులుగా దృఢంగా ఉండాలని. అప్పుడు క్రీస్తు రాజ్యమందు భూమ్మీదగానీ పరలోకంలోగానీ నిత్యజీవాన్ని పొందడమందు మనం ఆనందిస్తాము.
మీకు జ్ఞాపకమున్నాయా?
◻ “నీతియుక్త జనాంగము” ఎప్పుడు ఉద్భవించింది?
◻ ఈ అంత్య దినాల్లో దేవుని ప్రజలకు సహనం ఎందుకు అవసరమైంది?
◻ గత 1994 సేవా సంవత్సర నివేదికలో కనిపిస్తున్నట్లుగా, ప్రచారకుల సంఖ్యలోనూ అలాగే పరిచర్య యందు గడిపిన సమయంలోనూ వచ్చిన పెరుగుదల దేన్ని ప్రదర్శిస్తోంది?
◻ లోకం అంతానికి చేరుకునే కొలది కూటాలకు హాజరు కావడం ఎందుకు అంత ప్రాముఖ్యం?
◻ దేవుని నీతియుక్త జనాంగంతో సహవసిస్తున్న వారందరూ యథార్థతను ఎందుకు కాపాడుకోవాలి?
[12-15వ పేజీలోని చిత్రం]
యెహోవాసాక్షులు 1994 సేవా సంవత్సరపు ప్రపంచవ్యాప్త నివేదిక
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
[18వ పేజీలోని చిత్రం]
యెహోవా నీతియుక్త జనాంగంలోని యథార్థతను కాపాడుకునేవారు, పరిపూర్ణతకు ఎదిగి నిత్య జీవాన్ని పొందుతారు