కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 12/15 పేజీలు 26-29
  • రువాండా నందలి విషాదకర సంఘటనకు—ఎవరు బాధ్యులు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • రువాండా నందలి విషాదకర సంఘటనకు—ఎవరు బాధ్యులు?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • హుటు మరియు టుట్సీ
  • దానికి ఎవరు బాధ్యులు?
  • మతం పాత్ర
  • నిజమైన క్రైస్తవులు వేరుగా ఉంటారు
  • రువాండానందలి విషాదకర సంఘటనా బాధితులను సంరక్షించుట
    తేజరిల్లు!—1995
  • పొరుగువారి మీద ప్రేమ ఏమైపోయింది?
    తేజరిల్లు!—1999
  • యెహోవా అనుగ్రహిస్తున్న ఆదరణను పంచుకొనుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • మానవులందరూ ఎప్పటికైనా ఒకరినొకరు ప్రేమిస్తారా?
    మానవులందరూ ఎప్పటికైనా ఒకరినొకరు ప్రేమిస్తారా?
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 12/15 పేజీలు 26-29

రువాండా నందలి విషాదకర సంఘటనకు—ఎవరు బాధ్యులు?

“ఒక 23 ఏళ్ల మెకానిక్కు తలను పగలగొట్టక ముందు, ముట్టడించిన వారిలో ఒకడు హిటియిసాతో యిలా చెప్పాడు: ‘నువ్వు టుట్సీవి గనుక నువ్వు చావాల్సిందే’” అని యు.ఎస్‌.న్యూస్‌ & వర్ల్‌డ్‌ రిపోర్ట్‌ చెప్పింది.

చిన్నదైన మధ్య ఆఫ్రికా దేశమైన రువాండాలో ఏప్రిల్‌, మే మాసాల్లో అలాంటి దృశ్యాలు ఎంతో తరచుగా కనిపించాయి! ఆ సమయంలో, రువాండా రాజధానియైన కిగాలిలోనూ, దాని చుట్టుప్రక్కనున్న ప్రాంతాల్లోనూ 15 సంఘాల్లో యెహోవాసాక్షులు ఉండేవారు. నగరాధ్యక్షుడైన టాబానా ఊబా టుట్సీవాడు. దౌర్జన్యపు ఉద్రిక్తత రేగిన సమయంలో మొట్ట మొదట చంపబడిన వారిలో ఆయన, ఆయన భార్య, ఆయన కుమారుడు ఆయన తొమ్మిదేళ్ల కుమార్తైన షామి ఉన్నారు.

వేలాదిమంది రువాండా దేశీయులు ప్రతి దినం—ప్రతి వారం—చంపబడేవారు. “కంబోడియా యందు, 1970 మధ్యకాలంలో జరిగిన కమేర్‌రూజ్‌ రక్తపాతంతో పోటీపడే జాతి నిర్మూలనమూ పగతీర్చుకోవడంలో గత ఆరు వారాలుగా, సుమారు 2,50,000 మంది ప్రజలు మరణించారు,” అని మే మధ్య కాలంలో పైన పేరొన్న వార్తా పత్రిక నివేదించింది.

టైమ్‌ పత్రిక యిలా చెప్పింది: “నాజీ జర్మనీ దృశ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, 500 మంది ప్రజల మధ్యనుండి పిల్లలను బైటికి లాగారు ఎందుకంటే వారు టుట్సీ వారిలా కనిపించారు . . . టుట్సీ యువతిని వివాహం చేసుకున్న దక్షిణ బుటారే పట్టణపు మేయరుకు [కలవరపర్చే] ఎంపికను హుటు జాతీయులు యిచ్చారు: అదేమిటంటే, తన భార్య తలిదండ్రులను ఆమె చెల్లెల్ని చంపేందుకు అప్పగించినట్లైతే, తన భార్యను, తన పిల్లలను విడిచిపెడతారు. ఆయన ఆ ఒప్పందానికి సమ్మతించాడు.”

కిగాలిలోని యెహోవాసాక్షుల అనువాద కార్యాలయంలో ఆరుగురు వ్యక్తులు పనిచేసేవారు. అందులో నలుగురు హుటువారు యిద్దరు టుట్సీవారు. టుట్సీలు ఎవరంటే—అనాని మోబాందా, ముకాగిసగారా డెనీస్‌. దోపిడీదార్లతో సహా ప్రత్యేక సైనిక దళం ఆ యింటికి వచ్చినప్పుడు, హుటువారు టుట్సీవారు కలిసి జీవించడం చూసి వారికి కోపం వచ్చింది. వారు మెబాందా డెనీస్‌లను చంపాలనుకున్నారు.

“మా మధ్య వారి శత్రువులు ఉన్నారు గనుక, మమ్మల్ని చంపుతామని బెదిరిస్తూ వారు తమ చేతి బాంబుల పిన్నులను తీయడం ప్రారంభించారు. . . . వారికి పెద్ద మొత్తంలో డబ్బు కావాలి. మా దగ్గిర ఉన్న డబ్బునంతటినీ వారికి అందించాము కానీ వారు దానితో తృప్తిపడలేదు. దానికి బదులుగా, అనువాదం కొరకు మేము ఉపయోగించే లాప్టాప్‌ కంప్యూటరూ, మా దగ్గరున్న ఫోటోకాపీయర్‌, మా రేడియోలూ మా బూట్లూ, వగైరాలను వారు ఉపయోగించుకోగల్గిన ప్రతిదాన్ని తీసుకున్నారు. అకస్మాత్తుగా వారు మాలో ఒక్కరిని కూడా చంపకుండా వెళ్లిపోయారు, కానీ వారు తర్వాత వస్తామని చెప్పారు” అని హుటు సహోదరుల్లో ఒకరైన ఇమానువెల్‌ నగీరంత చెప్పారు.

తర్వాతి రోజుల్లో ఆ దోపిడీదార్లు మరలా మరలా వచ్చారు, మరి ప్రతిసారీ హుటు సహోదరులు తమ టుట్సీ స్నేహితుల ప్రాణాలకొరకు ప్రాధేయపడ్డారు. చివరికి, మెబాందా డెనీస్‌లు యింకా అక్కడ ఉండడం ప్రమాదకరమైనప్పుడు, యితర టుట్సీ శరణార్థులతో కలిసి సమీపంలో ఉన్న ఒక పాఠశాలకు వెళ్లే ఏర్పాట్లు చేయబడ్డాయి. ఆ పాఠశాల ముట్టడించబడినప్పుడు మెబాందా డెనీస్‌ తప్పించుకోగల్గారు. వారు అనేక రహదారి అడ్డంకులను అధికమించడంలో సఫలమయ్యారు, కానీ చివరికి ఒకదాని దగ్గిర టుట్సీలందరినీ ప్రక్కకు తీసుకు వెళ్లారు, మెబాందా చంపబడ్డారు.

సైనికులు మరలా అనువాద కార్యాలయానికి తిరిగి వచ్చి, టుట్సీ సాక్షులు వెళ్లిపోయారని గుర్తించి, హుటు సహోదరులను వారు ఘోరంగా కొట్టారు. అప్పుడు సమీపంలో ఒక ఫిరంగీ ప్రేలడంతో, సహోదరులు తమ ప్రాణాలతో తప్పించుకోగల్గారు.

దేశమంతటా ఈ హత్యలు కొనసాగడంతో, మరణించినవారి సంఖ్య ఐదు లక్షలకు చేరింది. చివరికి, రువాండా నందున్న 80 లక్షలమంది ప్రజల్లో 20 నుండి 30 లక్షలమంది తమ యిళ్లను విడిచి వెళ్లారు. అనేకులు, సమీపంలోని జైర్‌, టాన్జానియాల్లో శరణుజొచ్చారు. కొన్ని వందలమంది యెహోవాసాక్షులు హతులయ్యారు, అంతేకాకుండ ఆ దేశం వెలుపల శిబిరాలకు పారిపోయినవారిలో యితరులనేకులున్నారు.

ఎక్కడాలేని అలాంటి మారణకాండనూ జనసమూహాలు తరలిపోవడాన్ని ఏది రేపింది? అది నివారించబడగల్గేదేనా? దౌర్జన్యం ప్రారంభం కాకముందు పరిస్థితి ఎలా ఉంది?

హుటు మరియు టుట్సీ

రువాండా మరియు దాని ప్రక్కనున్న దేశమైన బురుండిలో, సహజంగా పొట్టిగా బొద్దుగా ఉండే బాన్‌టు ప్రజలైన హుటులు అలాగే మామూలుగా పొడవుగా కాస్త ఎర్రగా ఉండే, వతూసి అని కూడా పిలవబడే టుట్సీ ప్రజలు నివసిస్తున్నారు. రెండు దేశాలందలి జనాబాలోనూ హుటువారు 85 శాతం మంది ఉంటారు మరి టుట్సీలు 14 శాతం మంది ఉంటారు. ఈ జాతుల మధ్య జరుగుతున్న పోరాటం 15 శతాబ్దాల క్రితం నమోదు చేయబడింది. అయినప్పటికీ, వారు ఎక్కువ మట్టుకు శాంతియుతంగా జీవించారు.

జైర్‌కు తూర్పున ఉన్న కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న రూగాండా గ్రామంలో జీవిస్తున్న 3,000 మంది హుటు మరియు టుట్సీలను గూర్చి, “మేము శాంతియుతంగా కలిసి జీవించేవాళ్ళము,” అని 29 ఏళ్ల స్త్రీ చెప్పింది. అయినప్పటికీ, హుటు ముఠాల దాడులు ఆ గ్రామంలోని యించుమించు టుట్సీ జనాబానంతటినీ హతమార్చింది. ది న్యూయార్క్‌ టైమ్స్‌ యిలా వివరించింది:

“ఆ గ్రామం కథ రువాండా కథలాంటిదే: హుటు మరియు టుట్సీలు, హుటు ఎవరు టుట్సీలు ఎవరన్న విషయాన్ని పట్టించుకోకుండానే లేక తెలుసుకోలేనంతగా కలిసి మెలిసి జీవిస్తూ, జాత్యంతర వివాహాలను చేసుకుంటున్నారు.

“అప్పుడు ఏదో అకస్మాత్తుగా సంభవించింది. ఏప్రిల్‌లో, టుట్సీలు ఎక్కడ కనిపించినా చంపుతూ దేశమంతటా హుటు దండ్లు హింసను రేపారు. ఆ హత్యలు ప్రారంభమైనప్పుడు, రక్షణ కొరకు టుట్సీలు చర్చీలకు పారిపోయారు. పరిశుద్ధ స్థలాలను రక్తసిక్తమైన సమాధి స్థలాలుగా తయారు చేస్తూ దండ్లు వారిని తరిమాయి.”

ఆ హత్యలను ఏది ప్రేరేపించింది? ఏప్రిల్‌ 6వ తేదీన కిగాలి నందు సంభవించిన విమాన దుర్ఘటనలో రువాండా మరియు బురుండిల అధ్యక్షుల మరణాలే దానికి కారణం మరి వారిద్దరు హుటువారే. ఈ సంఘటన ఎలాగో టుట్సీలను హతమార్చేందుకు దారితీయడమే కాకుండ, వారి యెడల కనికరించారని భావించబడిన ఏ హుటుకైనా కూడా మరణకరమైంది.

అదే సమయంలో, పోరాట శక్తులైన టుట్సీ ఆధిపత్య ఆర్‌.పీ.ఎఫ్‌. (రువాండా పేట్రియాట్రిక్‌ ఫ్రంట్‌) మరియు ఒక హుటు ఆధిపత్య ప్రభుత్వ శక్తుల మధ్య పోరాటం తీవ్రమైపోయింది. జూలై కల్లా ఆర్‌.పీ.ఎఫ్‌. ప్రభుత్వ దళాలను ఓడించి, కిగాలీ అలాగే మిగతా రువాండాలో అధిక భాగాన్ని అదుపులోకి తీసుకుంది. ప్రతీకారం తీసుకుంటారని భయపడి, జూలై తొలి భాగంలో, వేలాదిమంది హుటువారు ఆ దేశం నుండి పారిపోయారు.

దానికి ఎవరు బాధ్యులు?

ఈ దౌర్జన్యం ఏప్రిల్‌లో అకస్మాత్తుగా ఎందుకు చెలరేగిందో వివరించమని అడిగినప్పుడు ఓ టుట్సీ వ్యవసాయదారుడు యిలా చెప్పాడు: “దానికి కారణం చెడ్డ నాయకులే.”

వాస్తవానికి, శతాబ్దం పొడుగునా రాజకీయనాయకులు తమ శత్రువులను గూర్చి అబద్ధాలను వ్యాప్తిచేశారు. ‘ఈ లోకాధికారియైన’ అపవాదియగు సాతాను నడిపింపు క్రింద లౌకిక రాజకీయవేత్తలు తమ స్వంత ప్రజలనే మరో జాతి, తెగ, లేక దేశానికి చెందినవారికి వ్యతిరేకంగా పోరాడమనీ వారిని చంపమనీ ప్రోత్సహించారు. (యోహాను 12:31; 2 కొరింథీయులు 4:4; 1 యోహాను 5:19) రువాండా నందలి పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. ది న్యూయార్క్‌ టైమ్స్‌ యిలా చెప్పింది: “రాజకీయ నాయకులు జాతి యెడల యథార్థతను, జాతీయ భయాలను అధికం చేసేందుకు పదేపదే ప్రయత్నించారు—హుటు వారి విషయంలో, ప్రభుత్వాన్ని తమ అదుపులో ఉంచుకునేందుకు, టుట్సీల విషయంలో తిరుగుబాటుచేసిన సైన్యానికి మద్దతునిచ్చే ప్రయత్నం చేశారు.

రువాండా ప్రజలు అనేక విషయాల్లో ఒకే విధంగా ఉన్నారు గనుక, వారు ఒకరినొకరు ద్వేషించుకుని చంపుకుంటారని ఎవ్వరూ ఊహించరు. “హుటు వారు టుట్సీవారు ఒకే భాషను మాట్లాడతారు, ఒకే ఆచారాలను కల్గివున్నారు,” అని విలేఖరి బోనెర్‌ రేమండ్‌ చెప్పాడు. “అనేక తరాల జాత్యంతర వివాహాల తర్వాత శారీరక తేడాలు—టుట్సీలు, పొడవుగా సన్నగా ఉండడం, హుటులూ పొట్టిగా లావుగా ఉండడం వంటి లక్షణాలు ఎంతగా కనుమరుగయ్యాయంటే ఒకరు హుటునా లేక టుట్సీనా అన్న విషయాన్ని రువాండా వారు గుర్తించలేకపోతున్నారు.

అయినప్పటికీ, యిటీవలి ప్రచారపు పరంపర నమ్మలేని ప్రభావాన్ని కల్గించింది. ఈ విషయాన్ని దృష్టీకరిస్తూ, ఆఫ్రికా హక్కుల గుంపు యొక్క అధ్యక్షుడైన అలెక్ష డె వాల్‌ యిలా చెప్పారు: “ఆర్‌.పీ.ఎఫ్‌. అధ్యక్షత వహించే ప్రాంతాల్లోని వ్యక్తులు, టుట్సీ సైనికులకు కొమ్ములూ తోకలూ చీకట్లో మెరిసే కళ్లూ లేవని తరచుగా విస్మయమొందుతున్నారు.—వారు వినే రేడియో ప్రసారం అలా ఉంటుంది.”

ప్రజల ఆలోచనను మలచేది రాజకీయ నాయకులే కాదు మతం కూడా. రువాండాలోని ముఖ్యమైన మతాలేమిటి? విషాదకర సంఘటనకు అవి కూడా బాధ్యులా?

మతం పాత్ర

ది వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా (1994) రువాండాను గూర్చి యిలా చెబుతోంది: “అనేక మంది ప్రజలు రోమన్‌ కాథోలిక్‌లే . . . రోమన్‌ కాథోలిక్‌ మరితర క్రైస్తవ చర్చీలు అనేకమైన ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలను నడిపిస్తున్నారు.” నేషనల్‌ కాథోలిక్‌ రిపోర్టర్‌ వాస్తవానికి రువాండాను “70 శాతం కాథోలిక్‌ రాష్ట్రం” అని పిలిచింది.

గ్రేట్‌ బ్రిటన్‌కు చెందిన ది అబ్సర్వర్‌, యిలా వివరిస్తూ రువాండాలోని మతపరమైన పరిస్థితికి మూలాన్ని వివరిస్తోంది: “విద్యాభ్యాస విధానాన్ని అదుపులో పెట్టుకునేందుకు చర్చీలు పోరాడుతున్న 1930లందు కాథోలిక్‌లు టుట్సీ కులీనవర్గ పరిపాలన పక్షం వహిస్తే ప్రొటస్టెంట్లు అణగద్రొక్కబడిన హుటు అధిక సంఖ్యాక వర్గంతో చేరారు. హుటు వారు 1959 నందు అధికారాన్ని చేజిక్కించుకుని, కాథోలిక్‌ మరియు ప్రొటస్టెంటుల మద్దతును త్వరగా అనుభవించగల్గారు. హుటు మెజారిటీకి ప్రొటస్టెంట్‌ మద్దతు ఎంతో బలంగా ఉంటుంది.”

ఉదాహరణకు, ప్రొటస్టెంట్‌ చర్చి నాయకులు ఆ హత్యలను ఖండించారా? ది అబ్సర్వర్‌ యిలా జవాబు చెబుతోంది: “రువాండా చర్చీల ఆసనాలను శిరచ్ఛేధము గావించబడిన పిల్లల కళేబరాలతో నింపిన హంతకులను ఖండించారా అని ఇద్దరు [ఆంగ్లికన్‌] చర్చి సభ్యులను ప్రశ్నించారు.

“వారు దానికి జవాబు చెప్పేందుకు నిరాకరించారు. వారు ప్రశ్నలను తప్పించుకుని, కోపచిత్తులై, వారి స్వరాలు ఉచ్ఛస్థాయిని చేరుకున్నాయి, అంతేకాకుండ రువాండా సంక్షోభం బయటపడింది—హత్యలను ప్రచారం చేసి నదులను రక్తంతో నింపిన రాజకీయ నాయకులకు వర్తకులుగా పనిచేసిన ఆంగ్లికన్‌ చర్చి అతి సీనియర్‌ సభ్యులు వారు.”

వాస్తవానికి, రువాండాలోని క్రైస్తవ మత సామ్రాజ్య చర్చీలు మరే యితర చర్చీలకు భిన్నంగా లేవు. ఉదాహరణకు, మొదటి ప్రపంచ యుద్ధంలో రాజకీయ నాయకులకు అది యిచ్చిన మద్దతును గూర్చి బ్రిటీష్‌ బ్రిగేడియర్‌ జనరల్‌ ఫ్రాంక్‌. పి. క్రోజెర్‌ యిలా చెప్పాడు: “రక్తం చిందించడాన్ని ఎక్కువగా ప్రేరేపించే వాటిలో మన క్రైస్తవ చర్చీలే అగ్రగణ్యమైనవి, వాటిని మనం మితి లేకుండా ఉపయోగించుకున్నాము.”

అవును, జరిగిన దానికి మతనాయకులు అధిక బాధ్యత వహిస్తారు! జూన్‌ 3, 1994 నేషనల్‌ కాథోలిక్‌ రిపోర్టర్‌ యిలా నివేదించింది: “ఆఫ్రికా దేశంలోని పోరాటాలలో ‘నిజమైన మరియు జాతివిధ్వంసం ఉన్నాయి, అనుకోకుండా దానికి కాథోలిక్‌లు కూడా బాధ్యులే’ అని పోపు చెప్పాడు.”

స్పష్టంగా, యెషయా 2:4 మరియు మత్తయి 26:52 వంటి లేఖనాలపై ఆధారపడిన నిజమైన సూత్రాలను బోధించడంలో చర్చీలు విఫలమయ్యాయి. ఫ్రెంచ్‌ వార్తా పత్రికైన లె మందె ప్రకారం ఓ ప్రీస్టు బాధతో యిలా చెప్పాడు: “పూర్తిగా వారు సహోదరులన్న విషయాన్ని మర్చిపోయి, వారు ఒకరినొకరు వధించుకుంటున్నారు.” రువాండాలోని మరో ప్రీస్టు యిలా ఒప్పుకున్నాడు: “ప్రేమా క్షమాపణపై ఒక శతాబ్దం పొడుగునా ప్రసంగాలను విన్న తర్వాత కూడా క్రైస్తవులు యితర క్రైస్తవులను చంపుకున్నారు. అది విఫలమయ్యింది. లె మందె యిలా ప్రశ్నించింది: “బురుండీ రువాండాల్లో యుద్ధంచేస్తున్న టుట్సీలు హుటులు, ఒకే క్రైస్తవ మిషనరీల వద్ద శిక్షణను పొందారనీ, ఒకే చర్చికి హాజరయ్యేవారనీ తలంచకుండా ఎలా ఉండగలము?”

నిజమైన క్రైస్తవులు వేరుగా ఉంటారు

యేసుక్రీస్తు నిజమైన అనుచరులు, “ఒకరినొకరు ప్రేమింపవలెను” అనే ఆయన ఆజ్ఞకు బద్ధులుగా ఉంటారు. (యోహాను 13:34) యేసు గానీ ఆయన అపొస్తలులుగానీ ఎవరినైనా చంపేందుకు పెద్దకత్తి తీసుకుని నరకడం మీరు ఊహించగలరా? అలాంటి అవినీతికరమైన హత్యలను చేసే ప్రజలు ‘అపవాది పిల్లలుగా’ గుర్తించబడతారు.—1 యోహాను 3:10-12.

రువాండాలో యెహోవాసాక్షులు యుద్ధాల్లో, విప్లవాల్లో, లేక అపవాదియైన సాతాను ఆధిపత్యంలో ఉన్న ప్రపంచ రాజకీయవేత్తలు ప్రబోధించే యితర విభేదాల్లోనూ ఏ భాగం వహించరు. (యోహాను 17:14, 16; 18:36; ప్రకటన 12:9) బదులుగా, యెహోవాసాక్షులు ఒకరి యెడల ఒకరు నిజమైన ప్రేమను ప్రదర్శిస్తారు. ఆ విధంగా, హత్యల సమయంలో హుటు సాక్షులు టుట్సీ సహోదరులను కాపాడే ప్రయత్నంలో యిష్టపూర్వకంగా తమ జీవితాలను అపాయంలో పడేసుకున్నారు.

అయినప్పటికీ, అలాంటి విషాద సంఘటనలు ఆశ్చర్యకరంగా ఉండనవసరంలేదు “యుగసమాప్తిని గూర్చిన ప్రవచనంలో ఆయన యిలా ప్రవచించాడు: “అప్పుడు జనులు మిమ్మును . . . చంపెదరు.” (మత్తయి 24:3, 9) సంతోషకరంగా మృతుల పునరుత్థాన సమయంలో, నమ్మకమైన వారు జ్ఞాపకం చేసుకోబడతారని యేసు వాగ్దానం చేస్తున్నాడు—యోహాను 5:28, 29.

ఈ మధ్య కాలంలో, రువాండాలోని మరియు యితర అన్ని ప్రాంతాల్లో యెహోవాసాక్షులు, ఒకరినొకరు ప్రేమించడం ద్వారా తాము క్రీస్తు శిష్యులని నిరూపించుకుంటూ ఉండాలనే దృఢనిశ్చయాన్ని కల్గివున్నారు. (యోహాను 13:35) “శరణార్థి శిబిరాల్లోని సాక్షులు” అనే దీనితో ఉన్న నివేదిక బయల్పరుస్తున్నట్లుగా, వారి ప్రేమ ప్రస్తుతం ఉన్న ఈ కష్టాల్లో సహితం సాక్ష్యమిస్తోంది. యేసు తన ప్రవచనంలో చెప్పిన విషయాన్ని మనమందరమూ జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరముంది: “అంతమువరకు సహించువా డెవడో వాడే రక్షించబడును.”—మత్తయి 24:13.

[29వ పేజీలోని బాక్సు]

శరణార్థి శిబిరాల్లోని సాక్షులు

ఈ సంవత్సరం జూలైలోవలె సుమారు 4,700 మంది సాక్షులూ తమ సహవాసులు శరణార్థి శిబిరాల్లో ఉన్నారు. జైర్‌నందలి, గోమాలో 2,376 మంది, బుకావులో 454 మంది, ఉవిరాలో 1,592 మంది ఉన్నారు. దానికి తోడు, టాన్జానియా నందలి 162 మంది బెనాకోలో సుమారు 230 మంది ఉన్నారు.

శరణార్థి శిబిరాల్లోకి చేరుకోవడం సులభంకాదు. టాన్జానియాలో ఉన్న శరణార్థి శిబిరాలకు వెళ్లేందుకు ముఖ్య దారియైన రుసూమో వంతెనను 60 మంది సాక్షులున్న ఒక సంఘం దాటేందుకు ప్రయత్నించింది. వారు దాన్ని దాటేందుకు అనుమతించబడకపోయినప్పుడు వారు నది ఒడ్డున ఒక వారం పాటు తిరుగులాడారు. ఆ తర్వాత వారు చిన్న పడవల ద్వారా దాటేందుకు ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారు. వారలా చేయగల్గారు, మరి కొన్ని రోజుల తర్వాత వారు టాన్జానియాలోని శిబిరానికి చేరుకున్నారు.

ఇతర దేశాల్లోని యెహోవాసాక్షులు విస్తారమైన పునరావాస పనులను ప్రయత్నాలను ఏర్పాటు చేశారు. ఫ్రాన్స్‌ నందలి సాక్షులు, వంద టన్నుల బట్టలు తొమ్మిది టన్నుల చెప్పులు అలాంటి మరితర సామాగ్రిని పోషకాహారం మందులతో సహా అవసరమైన ప్రాంతాలకు ఓడల సహాయంతో తరలించారు. అయితే, తరచుగా శరణార్థి శిబిరంలోని సహోదరులు మొట్టమొదట అడిగింది, ఒక బైబిలును లేక కావలికోట లేక తేజరిల్లు! పత్రికలనే.

నిర్వాసితులైన తమ సహోదరులకు సహాయపడి వారిని సందర్శించిన జయర్‌, టాన్జానియాలోని సాక్షులు చూపించిన ప్రేమను బట్టి చూసేవారనేకులు ముగ్ధులయ్యారు. “మిమ్మల్ని మీ మతంలోని ప్రజలు వచ్చి సందర్శించారు, కానీ మా దానిలోనుండి ఒక్క ప్రీస్టయినా సందర్శించేందుకు రాలేదు” అని శరణార్థులు చెబుతుంటారు.

సాక్షుల ఐక్యత, క్రమబద్ధత, మరియు ప్రేమపూర్వక వైఖరి వల్లనే వారు శిబిరాల్లో ఎక్కువగా పేరు గాంచారు. (యోహాను 13:35) టాన్జానియా నందలి బెనాకో శిబిరంలో ఉన్న దాదాపు 2,50,000 మంది ప్రజల్లో తమ తోటి సాక్షులైన శరణార్థులను గుర్తించేందుకు సాక్షులకు కేవలం 15 నిమిషాలు మాత్రమే పట్టిందని గమనించడం ఆసక్తికరంగా ఉంటుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి