మీరు జ్ఞాపకమునకు తెచ్చుకొనగలరా?
ఇటీవలి కావలికోట సంచికలు మీకు ఆచరణాత్మకంగా ఉన్నట్లు కనుకొన్నారా? అట్లయిన క్రింది ప్రశ్నలతో మీ జ్ఞాపకశక్తిని ఎందుకు పరీక్షించుకోకూడదు:
▫ యెహోవాసాక్షులు తమ పొరుగువారిని ఎందుకు దర్శిస్తూనే ఉంటారు?
యెహోవాసాక్షులు తమకు దేవుని ఆశీర్వాదాలు వాగ్దాన రాజ్యం ద్వారా కావాలని కోరుకుంటారు, అంతేకాకుండ తమ పొరుగువారి యెడల ప్రేమను బట్టి ఆ ఆశీర్వాదాలను వారు కూడా పొందాలని కోరుకుంటారు. కాబట్టి, యేసు ఉదాహరణను అనుసరించడం ద్వారా, తమ పొరుగువారిని సందర్శించడానికి వారి నిస్వార్థ ప్రేమ వారిని బలవంతం చేస్తుంది. (మత్తయి 6:9, 10; 22:37-39)—8/15, 8, 9 పేజీలు.
▫ పరిణామ సిద్ధాంతంలో నమ్మకం కల్గివుండడం విశ్వాస సంబంధమైంది ఎందుకు అవుతుంది?
వైజ్ఞానికులు ఉత్పరివర్తనాలను—కనీసం ప్రయోజనకరమైన ఉత్పరివర్తనాలనైనా యింతవరకూ చూడలేదు, అయినప్పటికీ ఈ పద్ధతి ప్రకారమే కొత్త జాతులు ఉనికిలోకి వచ్చాయని పరిణామ సిద్ధాంత వాదులు చెబుతున్నారు. పరిణామ సిద్ధాంత వాదులు ఆకస్మిక జీవజననాన్ని చూడలేదు, అయినా ఆ విధంగానే జీవం ప్రారంభమైందని వారు పదేపదే చెబుతుంటారు.—9/1, 5వ పేజీ.
▫ మన జీవితంలోని నిర్బంధాల వల్ల వచ్చే నిరుత్సాహాన్ని మనం శ్రేష్ఠమైన రీతిలో ఎలా ఎదుర్కొనగలము?
జీవితంలో మన స్థితి ఏదైనప్పటికీ, మనం చేయ లేని దాని గురించి కలతచెందే బదులు మనం చేయ గల దానిపై శ్రద్ధ నిలిపినట్లైతే, జీవితం సంతృప్తికరంగా ఉంటుంది, మరియు మనం దేవుని సేవలో ఆనందాన్ని కనుగొంటాము. (కీర్తన 126:5, 6)—9/1, 28వ పేజీ.
▫ క్షమించడం యొక్క ప్రయోజనాలు ఏవి?
ఇతరులను క్షమించడం సత్సంబంధాలను వృద్ధి చేస్తుంది (ఎఫెసీయులు 4:32); అది తోటి మానవులతో కలిగి ఉండే సమాధానాన్నే కాకుండా, అంతరంగ సమాధానాన్ని కూడా తెస్తుంది (రోమీయులు 14:19; కొలొస్సయులు 3:13-15); ఇతరులను క్షమించడం మన పాపాలనుండి క్షమించబడేందుకు మార్గాన్ని సుగమం చేస్తుంది (మత్తయి 6:14); అంతేకాకుండ, మనకు కూడా క్షమాపణ అవసరమన్న విషయాన్ని జ్ఞాపకముంచుకోడానికి అది మనకు సహాయం చేస్తుంది. (రోమీయులు 3:23)—9/15, 7వ పేజీ.
▫ ప్రవక్తైన ఆమోసు మాదిరి, మన ప్రకటన పనిలో మనకు ఎలా సహాయపడుతుంది?
ఆమోసువలె, దేవుని సమాచారాన్ని మనం మార్చము లేక దాని ప్రభావాన్ని తగ్గించము. బదులుగా, వినేవారి ప్రతిస్పందన ఎలా ఉన్నప్పటికీ మనం విధేయతతో దానిని ప్రకటిస్తాము.—9/15, 17వ పేజీ.
▫ దేవుడు కల్గివున్న ఏ లక్షణాలను మనం అనుకరించాలి?
యెహోవాకు గల సంస్థీకరించే సామర్థ్యం, ఆయన సంతోషం రెండూ ప్రాముఖ్యమైనవి. (1 కొరింథీయులు 14:33; 1 తిమోతి 1:11) ఒక లక్షణం మరొకదానికంటే అద్వితీయమైంది కాకుండా ఉండేలా దేవుడు కల్గివున్న ఈ లక్షణాలు సమతుల్యంగా ఉన్నాయి.—10/1, 10వ పేజీ.
▫ తమ పిల్లలు యెహోవాను సేవించేటట్లు సహాయపడేందుకు తలిదండ్రులు తీసుకున్న కొన్ని అనుకూలమైన విషయాలేమిటి?
దీనికి ముఖ్యమైన కీలకం త్వరగా మొదలు పెట్టడం. తొలి సంవత్సరాల్లో పొందిన ప్రభావాలు, నేర్చుకున్న పాఠాలు జీవితాంతం ఉంటాయి. (సామెతలు 22:6) అన్ని కూటాల్లోనూ యెహోవా మరియు ఆయన ఆరాధన యెడల విధేయత, గౌరవాలను వారికి నేర్పించడం ప్రాముఖ్యం. విజయవంతమైన తలిదండ్రులు తమ పిల్లల చెడు గుణాలను గుర్తించడం నేర్చుకోవాలి, వాటిని సరిచేసుకోడానికి తమ పిల్లలకు సహాయం చేస్తారు. (సామెతలు 22:15) చివరిగా, పిల్లవాడు కారణసహితంగా చేరుకోగల దైవపరిపాలనా గమ్యాలను తొలి ప్రాయంలోనే ఏర్పర్చండి.—10/1, 27-8 పేజీలు.
▫ యెహోవా క్షమాపణను గూర్చిన ఏ ప్రత్యేక విషయాన్ని మనం ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నించాలి?
యెహోవా క్షమించడమే కాకుండ ఆ విషయాన్ని మర్చిపోతాడు. (యిర్మీయా 31:34) అలా మానవులు చేయడం చాలా కష్టం. మత్తయి 6:14, 15 నందు రాయబడినట్లుగా, అలా చేయడంలోని ప్రాముఖ్యతను యేసు నొక్కి వక్కాణించాడు.—10/15, 25-6 పేజీలు.
▫ మనం కనికరం గలవారిగా ఉండకుండా చేసే మూడు అడ్డంకులేవి?
మన పాపభూయిష్ట మానవ తత్వం వల్ల, మత్సర భావాలు నాటుకుని పోగలవు. మనం ఒకరిని చూసి వ్యసనపడినట్లైతే వారితో మనం కనికరంగా ఎలా వ్యవహరించగలము? అనవసరంగా మనకైమనమే దౌర్జన్యంతో కూడిన వాతావరణంలో ఉండడం మరో అడ్డంకు. అది మనం యితరులు అనుభవించే బాధల యెడల భావరహితంగా ప్రవర్తించేటట్లు చేస్తుంది. అంతేకాకుండ, స్వార్థపరులైన వ్యక్తులు కనికరం లేకుండా ఉండవచ్చు. (1 యోహాను 3:17)—11/1, 19, 20 పేజీలు.
▫ యోబు విషయంలోని లేఖనాధారమైన వృత్తాంతంనుండి ఏ పాఠాలను నేర్చుకోవచ్చు?
యోబు వృత్తాంతం, సాతాను తంత్రాల విషయంలో మనం మరింత అప్రమత్తంగా ఉండేందుకు అలాగే మానవ యథార్థతకు యెహోవా విశ్వ సర్వాధిపత్యం ఎలా సంబంధాన్ని కల్గివుందో మనం చూసేందుకు సహాయపడుతుంది. యోబు వలె దేవున్ని ప్రేమించేవారు తప్పక పరీక్షించబడాలి. మనము కూడా యోబువలె సహించి, సాతాను అబద్ధికుడని నిరూపించి, దేవుని రాజ్యంలోని ఆశీర్వాదాలను ఆనందించగలము.—11/15, 20వ పేజీ.
▫ ప్రతి పెద్దకు తగిన గుర్తింపును, పెద్దల సభకు అధ్యక్షత వహించేవారు ఎలా యివ్వగలరు?
చర్చించబోయే ప్రతి దాన్ని జాగ్రత్తగాను ప్రార్థనా పూర్వకంగాను యితర పెద్దలు పరిశీలించేలా, వీలున్నప్పుడెల్లా అధ్యక్షుడు ఒక అజెండాను ముందుగానే యివ్వాలి. పెద్దల కూటంలో, అతను పెద్దల దృక్పథాలను రూపుదిద్దేందుకు ప్రయత్నించకుండా చర్చించే విషయాల విషయంలో ‘నిస్సంకోచంగా మాట్లాడడానికి’ ప్రోత్సహిస్తాడు. (1 తిమోతి 3:13)—12/1, 30వ పేజీ.