కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 12/15 పేజీలు 2-4
  • క్రిస్టమస్‌ మీకు ఏ భావాన్నిస్తుంది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • క్రిస్టమస్‌ మీకు ఏ భావాన్నిస్తుంది?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఒక “వ్యాపార వ్యవస్థ”
  • క్రిస్మస్‌—ప్రాచ్య దేశాల్లో కూడా ఎందుకుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఆధునిక క్రిస్మస్‌ మూలాధారాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • క్రిస్మస్‌ సమయం దేనికి ప్రాధాన్యత ఇవ్వబడుతోంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • యెహోవాసాక్షులు క్రిస్మస్‌ ఎందుకు చేసుకోరు?
    తరచూ అడిగే ప్రశ్నలు
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 12/15 పేజీలు 2-4

క్రిస్టమస్‌ మీకు ఏ భావాన్నిస్తుంది?

మీరు ఎలా జవాబిస్తారు? క్రిస్టమస్‌ అంటే (1) మీ కుటుంబంతో గడిపే సమయం; (2) పార్టీలు చేసుకునే సమయం; (3) మతపరమైన సమయం; (4) ఒత్తిడి గల సమయం (5) మధుర స్మృతుల సమయం; (6) ముమ్మరమైన వ్యాపార సమయం.

బ్రిటన్‌లో సర్వే చేయబడిన 1,000 కంటే ఎక్కువమందిలో కేవలం 6 శాతం మంది మాత్రమే క్రిస్టమస్‌ ప్రాథమికంగా ఒక మతపర సందర్భంగా పరిగణించడం ఆశ్చర్యకరం అనిపించవచ్చు. దానికి విరుద్ధంగా, 48 శాతం మంది, క్రిస్టమస్‌ అంటే తమ కుటుంబాలతో కలిసి ఉండే సమయమని భావించేవారు. వాస్తవానికి, పిల్లలకు అది ఒక ప్రత్యేకమైన సమయమని అనేకులు తలస్తారు. అదే విధంగా, ఒక పదకొండేళ్ల అమ్మాయి, క్రిస్టమస్‌ గూర్చి ఆమెకు ఏది ఎక్కువ యిష్టమని అడిగినప్పుడు, యిలా జవాబిచ్చింది: “ఆ ఉత్సాహం, ఆనందమయ భావన, [మరియు] బహుమతులను యివ్వడం.” “‘పారంపర్య’ క్రిస్టమస్‌ నిస్సందేహంగా యిళ్లు, కుటుంబం మరి ప్రత్యేకంగా పిల్లలపై ఎంతో ప్రాముఖ్యతను కల్గివుంది” అని ది మేకింగ్‌ ఆఫ్‌ ది మోడ్రన్‌ క్రిస్టమస్‌ అంగీకరిస్తోంది.

అయితే, ప్రత్యేకంగా పాశ్చాత్య క్రైస్తవమత సామ్రాజ్యంలోనే, క్రిస్టమస్‌ కుటుంబమంతా కలిసిగడిపే సమయం, అప్పుడు బంధువులు ఒక చోటికి చేరి బహుమతులను యిచ్చిపుచ్చుకుంటారు. ఈస్టర్‌ ఆర్థడాక్స్‌ చర్చి ప్రబలమైన ప్రభావాన్ని కల్గివున్న దేశాల్లో, ప్రజలు ఈస్టరుకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు; అయినా, క్రిస్టమస్‌ సమయం తరచూ సెలవు కాలంగా ఉంటుంది.

ఒక “వ్యాపార వ్యవస్థ”

క్రిస్టమస్‌ “పూర్తిగా వ్యాపార . . . పద్ధతి అయ్యింది” అని ది న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా పేర్కొంది. జపానులో కన్నా యిది మరే ప్రాంతంలోనూ యింత నిజమైవుండదు.

“జపాను దేశీయులు మతపరమైన పండుగగా క్రిస్టమస్‌ను త్యజించి, దానిని పూర్తిగా వ్యాపారంగా మార్చేశారు,” అని వాషింగ్టన్‌ డెయిలీ రికార్డ్‌ నివేదించింది. జపాన్‌లోని క్రిస్టమస్‌, “వ్యాపారంపై ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ, మతపర విషయాలపై తక్కువ ప్రాధాన్యతనిస్తున్న ఓ పెద్ద వేడుక” అని కూడా అది చెప్పింది.

క్రైస్తవ దేశాలు అని పిలువబడే అనేక దేశాల్లో సహితము, ఈ “మతపరమైన విషయాన్ని” కనుక్కోవడం కష్టం. సుమారు 40 సంవత్సరాల క్రితం, ఒక క్రిస్టమస్‌ వ్యతిరేక కరపత్రం విచారంతో యిలా చెప్పింది: “క్రిస్టమస్‌ వ్యాపార లోకంనుండి ప్రోత్సాహాన్ని పొందుతోంది. అది సంవత్సరం మొత్తంలో అధిక ధనమార్జించే కాలం. నామకార్థ క్రైస్తవ వ్యాపార వ్యక్తులు క్రీస్తు కొరకు కాదు గానీ ఆర్థిక లాభాల కొరకే వారు క్రిస్టమస్‌ రోజుల కొరకు ఎదురుచూస్తారు.” నేడు ఆ మాటలు ఎంత నిజం! అనేక దేశాల్లో మనం సంవత్సరపు చివరి మూడు నెల్లకు చేరుకునే ముందే, రాబోయే క్రిస్టమస్‌కు బహుమతులను కొనేందుకు యింకా ఎన్ని రోజులున్నాయో గుర్తు చేసుకోవడం ప్రారంభమౌతుంది. అంగడ్ల వార్షిక అమ్మకంలో సుమారు నాలుగవ వంతు క్రిస్టమస్‌ సమయంలోనే వస్తూ, ఆ సంవత్సరం ముగుస్తుండగా వ్యాపారం బాగా పెరుగుతుంది.

ఇప్పుడు క్రిస్టమస్‌ మీకు ఏ భావాన్నిచ్చినప్పటికీ, అది ఎలా ప్రారంభమైందో అని మీరు ఆలోచించవచ్చు. వాస్తవానికి క్రిస్టమస్‌ బహుమతులివ్వడానికి బైబిలు మద్దతునిస్తుందా? నేటి క్రిస్టమస్‌ వేడుకలు నిజంగా క్రైస్తవత్వానికి చెందినవేనా? మనం చూద్దాము.

[2వ పేజీలోని చిత్రసౌజన్యం]

Cover: Thomas Nast/Dover Publications, Inc., 1978

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి