విశ్వాస పక్షంగా పలికిన స్వరాలు
గత శతాబ్దం ముగిసినప్పుడు, విజ్ఞానం, తత్వజ్ఞానం, లౌకికవాదం పక్షపు స్వరాలు దేవుని యెడల మరియు బైబిలు ప్రేరణ విషయంలో విశ్వాసంపై ఎంతో ప్రభావాన్ని కల్గివున్నాయి.
అయితే వినిపించింది ఆ స్వరాలు మాత్రమేకాదు. నాస్థికత్వం పక్షంగా మాట్లాడేకన్నా దేవునియందు విశ్వాసాన్ని కల్గివుండే విషయంలో చెప్పేందుకు ఎంతో ఎక్కువ ఉందని అనేకమంది పరిశోధకులు కనుగొన్నారు. అంతేకాకుండా బైబిలు దేవుని ప్రేరేపిత వాక్యమనేందుకు అవసరమైన అనేక రుజువులను వారి పరిశోధన బయల్పర్చింది.
ఒక ప్రాముఖ్యమైన స్వరం సి. టి. రస్సల్‌ది. పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ప్రచురించబడిన యుగాలను గూర్చిన దైవిక ప్రణాళిక (ఆంగ్లం) అనే అయన సంపుటిని వేలాదిమంది చదివారు. అందులో ఉన్న శక్తివంతమైన అధ్యాయం “జ్ఞానవంతుడైన సర్వోన్నత సృష్టికర్త ఉనికి నిరూపించబడుట.”
తర్వాతి దశాబ్దాల్లో, దేవునియందు, బైబిలునందు నమ్మకం కల్గివుండేందుకు గల కారణాలను అందించే శీర్షికలను, కరపత్రాలను, పుస్తకాలను, రస్సల్ రాశారు. వీటిని వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీవారు ప్రచురించారు. దాని రెండవ అధ్యక్షుడైన జె. ఎఫ్. రూథర్‌ఫోర్డ్, విశ్వాస పక్షంగా స్వరాన్ని పెంచిన సృష్టి (ఆంగ్లం) (1927) మరియు వేరే పుస్తకాలను రాశారు.
ఆ సంస్థ, ఈ విషయాలను గూర్చి యిటీవల సరి కొత్త అదనపు సమాచారాన్ని తయారుచేసింది. మీరు జ్ఞానయుక్తంగా పరిశీలించేందుకు యెహోవాసాక్షులు అలాంటి వాటిని మీకు అందించగలరు.
మీరు యింకా ఎక్కువ తెలుసుకోవాలంటే లేదా ఉచితంగా మీతో బైబిలును పఠించడానికి ఎవరైనా మీ ఇంటికి రావాలంటే, దయచేసి Watchtower, H-58 Old Khandala Road, Lonavla 410 401, Mah., India లేదా రెండవ పేజీలో ఇవ్వబడిన చిరునామాలలో మీ కనుకూలమైన దానికి వ్రాయండి.