కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 11/15 పేజీలు 4-7
  • మృతులు ఎక్కడ ఉన్నారు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మృతులు ఎక్కడ ఉన్నారు?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పరలోకానికి ఎవరు వెళతారు?
  • పరలోకానికి వెళ్లనివారు
  • మరణమందు నిద్రించడం
  • మన పితరులకు ఓ నూతన జీవితం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • మరణించిన మన ప్రియమైనవారికి ఏమి సంభవిస్తుంది?
    నిత్యజీవానికి నడిపించే జ్ఞానము
  • మరణించిన మీ ప్రియమైనవారు—వారిని మీరు మరలా చూడగలరా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఏకైక పరిష్కారం!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 11/15 పేజీలు 4-7

మృతులు ఎక్కడ ఉన్నారు?

“భూమి ఒక సంత; స్వర్గమే మన యిల్లు,” అనేవి పశ్చిమాఫ్రికాలోని యురూబా వారి వాడుక మాటలు. ఈ ఆలోచన అనేక మతాల్లో ప్రతిధ్వనిస్తుంది. భూమి అన్నది కొంచెంసేపు సందర్శించి, తర్వాత విడిచిపెట్టే సంతవంటిదనే ఆలోచనను యిది కలిగిస్తుంది. ఈ నమ్మకం ప్రకారం, మరణించినప్పుడు మన నిజ నివాసమైన పరలోకానికి వెళతాము.

కొందరు పరలోకానికి వెళతారని బైబిలు నిజంగానే బోధిస్తుంది. యేసు తన నమ్మకమైన అపొస్తలులతో యిలా చెప్పాడు: “నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, . . . మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను. నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును.”—యోహాను 14:2, 3.

మంచి ప్రజలందరూ పరలోకానికి వెళతారని లేక పరలోకం మానవుల యిల్లని యేసు మాటల భావం కాదు. భూమ్మీద పరిపాలించేందుకు గాను కొందరు పరలోకానికి తీసుకోబడతారు. మానవ ప్రభుత్వాలు భూమ్మీది కార్యాలను ఎన్నడూ విజయవంతంగా నిర్వహించలేవని యెహోవా దేవునికి తెలుసు. కనుక, చివరికి భూమిని అదుపులోకి తీసుకుని, మొట్టమొదట అది ఎలా ఉండాలని ఆయన సంకల్పించాడో అదే విధంగా దాన్ని పరదైసుకు మార్చే పనిని చేసే ఓ పరలోక ప్రభుత్వాన్ని, లేక రాజ్యాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. (మత్తయి 6:9, 10) దేవుని రాజ్యానికి యేసు రాజుగా ఉంటాడు. (దానియేలు 7:13, 14) ఆయనతో పరిపాలించేందుకుగాను యితరులను భూమ్మీది మానవజాతి మధ్య నుండి ఎన్నుకోబడతారు. పరలోకానికి తీసుకొనబడేవారు, మన “దేవునికి . . . ఒక రాజ్యముగాను యాజకులనుగాను” ఉండి, “భూలోకమందు ఏలుదురు.” అని బైబిలు ప్రవచించింది.—ప్రకటన 5:10.

పరలోకానికి ఎవరు వెళతారు?

ఈ పరలోక పరిపాలకులు కల్గివుండగల గొప్ప బాధ్యతను గూర్చి పరిశీలిస్తే వారు కచ్చితమైన కట్టడను చేరుకోవాలనేది ఆశ్చర్యపర్చనక్కర్లేదు. పరలోకానికి వెళ్లే వారు యెహోవాను గూర్చి కచ్చితమైన జ్ఞానాన్ని కల్గివుండాలి అంతేకాక వారు ఆయనకు విధేయులుగా ఉండాలి. (యోహాను 17:3; రోమీయులు 6:17, 18) వారు యేసుక్రీస్తు విమోచన క్రయధనమందు విశ్వాసముంచాలి. (యోహాను 3:16) అయినప్పటికీ దానిలో అంతకంటే ఎక్కువే ఉంది. వారిని దేవుడు తన కుమారుని ద్వారా పిలిచి, ఎన్నుకోవాల్సి ఉంటుంది. (2 తిమోతి 1:9, 10; 1 పేతురు 2:9) అంతేకాకుండ, దేవుని పరిశుద్ధాత్మ వలన కల్గినదై, వారు “తిరిగి జన్మించ” బడిన బాప్తిస్మాన్ని పొందిన క్రైస్తవులై ఉండాలి. (యోహాను 1:12, 13; 3:3-6) వారు మరణం వరకూ దేవుని యెడల తమ యథార్థతను కూడా కాపాడుకోవాల్సిన అవసరముంది.—2 తిమోతి 2:11-13; ప్రకటన 2:10.

జీవించి మరణించిన అనేకమంది ప్రజలు ఈ అర్హతలను సంపాదించుకోలేదు. సత్య దేవుని గూర్చి నేర్చుకునే అవకాశం తక్కువగా ఉండివుండేది. ఇతరులు బైబిల్ని ఎన్నడు చదవలేదు, యేసుక్రీస్తును గూర్చి వారికి కొంచమే తెలుసు లేక అసలు ఏమీ తెలియదు. నేడు భూమ్మీద ఉన్న నిజక్రైస్తవుల నుండి కూడా, కొందరిని మాత్రమే పరలోక జీవితానికి దేవుడు ఎన్నుకున్నాడు.

తత్ఫలితంగా, పరలోకానికి వెళ్లేవారి సంఖ్య చిన్నదిగా ఉంటుంది. అలాంటివారిని యేసు “చిన్న మంద” అని పేర్కొన్నాడు. (లూకా 12:32) తర్వాత, క్రీస్తుతో కూడా పరలోకమందు పరిపాలించేందుకు “భూలోకములోనుండి కొనబడిన” వారి సంఖ్య కేవలం 1,44,000 అని అపొస్తలుడైన యోహానుకు బయల్పర్చడం జరిగింది. (ప్రకటన 14:1, 3; 20:6) భూమ్మీద జీవించిన వేలాదిమంది ప్రజలతో పోల్చి చూస్తే, అది నిజంగానే చాలా చిన్న సంఖ్య.

పరలోకానికి వెళ్లనివారు

పరలోకానికి వెళ్లనివారికి ఏమి సంభవిస్తుంది? కొన్ని మతాలు బోధించేస్తున్నట్లుగా వారు నిరంతర బాధను అనుభవిస్తున్నారా? కానేకాదు, ఎందుకంటే యెహోవా ప్రేమాస్వరూపియైన దేవుడు. ప్రేమించే తలిదండ్రులు తమ పిల్లలను అగ్నిలో పారేయరు, మరి యెహోవా తన ప్రజలను ఆవిధంగా బాధించడు.—1 యోహాను 4:8.

చనిపోయినవారిలో అనేకులకు గల ఉత్తరాపేక్ష భూ పరదైసులో పునరుత్థానం చేయబడడం. యెహోవా భూమిని “నివాసస్థానంగా” ఉండేటట్లు సృష్టించాడు అని బైబిలు చెబుతోంది. (యెషయా 45:18) కీర్తనల రచయిత యిలా ప్రకటించాడు: “ఆకాశములు యెహోవావశము భూమిని ఆయన నరుల కిచ్చియున్నాడు.“ (కీర్తన 115:16) మానవజాతి శాశ్వత గృహం భూమేగాని పరలోకం కాదు.

యేసు యిలా ప్రవచించాడు: “ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన [అది “మనుష్య కుమారుడైన” యేసు] శబ్దము విం”దురు. (యోహాను 5:27-29) క్రైస్తవ అపొస్తలుడైన పౌలు యిలా ఉద్బోధించాడు: ‘నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నదని . . . నేను . . . దేవునియందు నిరీక్షించుచున్నాను.’ (అపొస్తలుల కార్యములు 24:15) హింసా కొయ్యపైన, పశ్చాత్తాపపడిన ఒక తప్పిదస్థునికి భూపరదైసులో పునరుత్థానం ద్వారా జీవాన్నిస్తానని యేసు వాగ్దానం చేశాడు.—లూకా 23:43.

అయితే, భూమ్మీది జీవితానికి పునరుత్థానం చేయబడబోయే మృతులు ప్రస్తుత స్థితి ఏమిటి? యేసు జీవితంలోని ఒక సంఘటన ఈ ప్రశ్నకు జవాబునిచ్చేందుకు సహాయపడుతుంది. తన స్నేహితుడైన లాజరు మరణించాడు. యేసు అతన్ని పునరుత్థానం చేయడానికి వెళ్లేముందు, తన శిష్యులతో యిలా చెప్పాడు: “మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు; అతని మేలుకొలుప వెళ్లుచున్నాను.” (యోహాను 11:11) ఆ విధంగా యేసు, మరణాన్ని నిద్రతో, కలలు లేని గాఢనిద్రతో పోల్చాడు.

మరణమందు నిద్రించడం

మరణ మందు నిద్రించడం అనే ఈ ఆలోచనతో యితర లేఖనాలు కూడా ఏకీభవిస్తున్నాయి. మరణించినప్పుడు ఆత్మల లోకానికి వెళ్లే అమర్త్యమైన ఆత్మ మానవులకు ఉందని అవి బోధించడంలేదు. బదులుగా బైబిలు యిలా అంటోంది: “చచ్చినవారు ఏమియు ఎరుగరు: . . . వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు, . . . నీవు పోవు పాతాళమునందు [సమాధినందు] పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.” (ప్రసంగి 9:5, 6, 10) అంతేకాకుండ, మానవులు “మంటిపాలగుదురు వారి సంకల్పములు నాడే నశించును” అని కీర్తనల రచయిత, ప్రకటించాడు.—కీర్తన 146:4.

మరణమందు నిద్రిస్తున్నవారు మనలను చూడలేరని వినలేరని లేఖనాలు స్పష్టంచేస్తున్నాయి. వారు అటు ఆశీర్వాదాలనుగానీ లేక యిటు నాశనాన్ని గానీ తేలేరు. వారు అటు పరలోకంలోనూ యిటు పితరుల సమాజంలోనూ జీవించడంలేదు. వారికి జీవంలేదు, వారు ఉనికిలో లేరు.

దేవుని నియమిత సమయంలో, యిప్పుడు మరణమందు నిద్రిస్తూ దేవుని జ్ఞాపకంలో ఉన్నవారు పరదైసు భూమిపై జీవితానికి తిరిగి మేల్కొల్పబడతారు. ఆ భూమి, నేడు మానవ జాతి అనుభవిస్తున్న కాలుష్యము, శ్రమలూ సమస్యలు లేకుండ శుభ్రం చేయబడిన భూమిగా ఉంటుంది. అది ఎంత ఆనందభరితమైన సమయంగా ఉంటుందో! ఆ పరదైసులో వారు నిరంతరం జీవించే ఉత్తరాపేక్షను కల్గివుంటారు, ఎందుకంటే కీర్తన 37:29 మనకు యీ అభయాన్నిస్తుంది: “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.”

[6, 7వ పేజీలోని బాక్సు]

నేను మృతులను ఆరాధించడం మానుకున్నాను

“నేను పిల్లవానిగా ఉన్నప్పుడు, మా నాన్నగారు, చనిపోయిన వాళ్ల నాన్నగారికి బలి అర్పించేటప్పుడు నేను ఆయనకు సహాయపడేవాణ్ణి. ఒక సందర్భంలో, మా నాన్నగారు తీవ్ర అనారోగ్యం నుండి కోలుకున్నప్పుడు, తాను కోలుకున్నందుకు మెప్పుదలగా తన తండ్రికి ఒక మేకను, పెండలం దుంపలను, కోనా గింజలను, మత్తుపానీయాలను అర్పించాలని మంత్రగాడు ఆయనతో చెప్పాడు. భవిష్యత్తులో ఏ అనారోగ్యమూ విపత్తూ రాకుండా కాపాడమని మరణించిన తన పితరులకు మనవి చేసుకోమని అతను సలహానిచ్చాడు.

“మా తాతగారి సమాధి దగ్గర జరగబోయే బలికవసరమైన వస్తువులనన్నింటినీ మా అమ్మ కొనుగోలు చేసింది. స్థానిక ఆచారానికి తగినట్లుగా సమాధి సరిగ్గా మా యింటి ప్రక్కనే ఉంది.

“స్నేహితులూ, బంధువులు అంతేకాక పొరుగువారు ఆ అర్పణను ఆచరించేందుకు ఆహ్వానించబడ్డారు. సందర్భానికి తగినట్లుగా మా నాన్నగారు చక్కటి దుస్తులు ధరించుకుని, అంతకు ముందు అర్పణకు ఉపయోగించిన అనేక మేకల పుర్రెలను క్రమంగా అమర్చిన గోపురానికి ఎదురుగా కుర్చీలో కూర్చున్నారు. నా పనేమిటంటే, ఒక సీసాలోనుండి ఒక చిన్న మగ్గులోకి ద్రాక్షారసాన్ని పోసి, దాన్ని మా నాన్నగారికి అందించడం. తిరిగి ఆయన దాన్ని అర్పణగా నేలమీద పోసేవారు. మా నాన్నగారు తన నాన్నగారి పేరును మూడుసార్లు పలికి భవిష్యత్‌ విపత్తునుండి తప్పించమని ఆయనకు ప్రార్థించారు.

“కోలా గింజలను అర్పించారు, మేకను వధించి, ఉడకబెట్టి, అక్కడ హాజరైనవారందరూ తిన్నారు. నేను భోజనంలో భాగం వహించాను, డప్పుల తాళానికీ పాటకు తగినట్లుగా నాట్యం చేశాను. మా నాన్నగారికి వయస్సు పైబడినా ఎంతో అద్భుతంగానూ ఉద్ధృతంగాను నాట్యం చేశారు. మధ్య మధ్యలో అక్కడ హాజరైనవారందరినీ ఆశీర్వదించమని ఆయన తన పితరులకు ప్రార్థించేవారు, అప్పుడు నాతో సహా ప్రజ లందరూ కలిసి యీసె, అంటే ‘అలా జరగునుగాక’ అని పలికేవారం. నేను మా నాన్నగారివైపు ఎంతో ఆసక్తితో మెప్పుదలతో చూసేవాణ్ని, మృతుల అర్పణలను అర్పించేంత పెద్దవాణ్ణి అయ్యే రోజు కొరకు ఆశతో ఎదురు చూశాను.

“ఎన్నో అర్పణలు అర్పించినప్పటికీ, కుటుంబంలో శాంతి లేకుండా పోయింది. అమ్మకు జన్మించిన ముగ్గురు కొడుకులు సజీవంగావుంటే పుట్టిన ముగ్గురు కూతుర్లలో ఒక్కరూ ఎక్కువకాలం బ్రతకలేదు: అందరూ చిన్నతనంలోనే మరణించారు. మా అమ్మ మరలా గర్భవతి అయినప్పుడు, మా నాన్నగారు ఆ బిడ్డ క్షేమంగా పుట్టాలని విస్తృతార్పణలను అర్పించారు.

“అమ్మ మరో పాపకు జన్మనిచ్చింది. రెండు సంవత్సరాల తర్వాత ఆ పాప జబ్బున పడి, మరణించింది. మంత్రగాన్ని మా నాన్న కలిశారు, ఆ మరణానికి ఓ శత్రువు కారణమని అతను చెప్పాడు. ఆ పాప ‘ఆత్మ’ తిరిగి పోరాటం జరిపేందుకు మండే ఒక చెక్కముక్క, ఒక సీసా మత్తుపానీయం, ఒక కుక్కపిల్ల బలి అర్పణకవసరమని మాంత్రికుడు చెప్పాడు. మండే చెక్కముక్కను సమాధి మీద ఉంచాలి, ఆ మత్తుపానీయాన్ని సమాధిమీద చిలకరించాలి, అంతేకాకుండ కుక్క పిల్లను సజీవంగా సమాధి దగ్గర సమాధి చేయాలి. తన మరణానికి ప్రతీకారం తీసుకునేందుకు మరణించిన ఆ అమ్మాయి ఆత్మను మేల్కొల్పుతుందని భావించబడుతోంది.

“నేను మత్తుపానీయపు సీసానూ మండే చెక్కముక్కనూ సమాధి వద్దకు తీసుకు వెళ్లాను, మరి మానాన్నగారు కుక్క పిల్లను తీసుకువచ్చి, దాన్ని మంత్రగాడి ఉపదేశాల ప్రకారంగా సమాధి చేశారు. ఆ పాప అకాల మరణానికి కారణమైన వ్యక్తిని ఏడు రోజుల్లో ఆమె ఆత్మ నాశనం చేస్తుందని మేమందరం నమ్మాము. రెండు నెల్లైనా చుట్టు ప్రక్కల ఏ మరణ వార్తా వినిపించలేదు. నా భ్రమంతా మటుమాయమైంది.

“ఆ సమయంలో నాకు 18 సంవత్సరాలు. ఆ తర్వాత కొద్ది రోజులకు నేను యెహోవాసాక్షులను కలిశాను, జీవించి ఉన్న వారి మంచికి గాని చెడుకు గాని మృతులు చేయలేరని వారు లేఖనాలనుండి నాకు చూపించారు. దేవుని వాక్యపు జ్ఞానం నా మనస్సులో నాటుకుంటుండగా, మరణించినవారికి బలులర్పించడంలో నేనిక ఏ మాత్రము నాన్నగారికి మద్దతునివ్వనని మా నాన్నగారితో చెప్పేశాను. ఆయన వ్యక్తపర్చినట్లుగా, ఆయన్ను ఒంటరివానిగా చేసినందుకు మొదట కోప్పడ్డాడు. అయితే, నేను కొత్తగా కనుగొన్న విశ్వాసాన్ని పరిత్యజించేందుకు యిష్టపడడం లేదని ఆయన గమనించినప్పుడు, నేను యెహోవాను ఆరాధించడాన్ని ఆయన వ్యతిరేకించలేదు.

“ఏప్రిల్‌ 18, 1948లో నేను నా సమర్పణను నీటి బాప్తిస్మం ద్వారా సూచించాను. ఆ నాటి నుండి, మనకు అటు సహాయం చేయలేని లేక హాని కలిగించలేని మరణించిన పితరుల ఆరాధననుండి యితరులు విముక్తులయ్యేందుకు సహాయపడుతూ, ఎంతో ఆనందం సంతృప్తితో నేను యెహోవాను సేవించడంలో కొనసాగాను.”—నైజీరియాలోని బెనిన్‌ పట్టణానికి చెందిన జె. బి. ఓమీగ్బి యిచ్చిన ఉచిత వ్యాసం.

[7వ పేజీలోని చిత్రం]

పరదైసు భూమిపై మృతులు పునరుత్థానం చేయబడినప్పుడు గొప్ప ఆనందంగా ఉంటుంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి