కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 10/15 పేజీలు 16-21
  • యేసు బోధించినట్లు మీరు బోధిస్తారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యేసు బోధించినట్లు మీరు బోధిస్తారా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆయన బోధ హృదయాన్ని చేరింది
  • ప్రేమ అనుకూలతను కోరినప్పుడు యేసు దాన్ని కనపర్చాడు
  • “ఆజ్ఞా పుత్రుడు” కావడం
  • యేసు పిల్లలను ప్రేమించి అర్థం చేసుకుంటాడు
  • “గడియ వచ్చియున్నది!”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • యేసుక్రీస్తు—సర్వోత్తమ మిషనరీ
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • యేసు “దేవుని తెలివిని” వెల్లడిచేశాడు
    యెహోవాకు దగ్గరవ్వండి
  • “మీకు మాదిరి ఉంచాను”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 10/15 పేజీలు 16-21

యేసు బోధించినట్లు మీరు బోధిస్తారా?

“జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రులవలె కాక అధికారముగలవానివలె వారికి బోధించెను.”—మత్తయి 7:28, 29.

1. యేసు గలిలయలో బోధించినప్పుడు ఆయనను ఎవరు అనుసరించారు, యేసు ప్రతిస్పందన ఎలా ఉంది?

యేసు ఎక్కడికి వెళ్లినా జనసమూహములు ఆయనను చుట్టు ముట్టాయి. “యేసు వారి సమాజమందిరములలో బోధించుచు, (దేవుని) రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయయందంతట సంచరించెను.” ఆయన కార్యములను గూర్చిన సమాచారం వ్యాపించినప్పుడు, “గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయయను ప్రదేశములనుండియు యొర్దానునకు అవతలనుండియు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను.” (మత్తయి 4:23, 25) వారిని చూచి ఆయన “వారు కాపరిలేని గొఱ్ఱెల వలె విసికి చెదరియున్నందున వారిమీద కనికర”పడ్డాడు. ఆయన వారికి బోధించేటప్పుడు ఆయనకు వారి యెడల గల కనికరం లేక ఔదార్యంతో కూడిన అనురాగాలను వారు చవి చూడగల్గారు; అది తమకు తగిలిన దెబ్బలకు ఉపశమనాన్నిచ్చే మందులా ఉండి, అది వారిని ఆయన వద్దకు ఆకర్షించింది.—మత్తయి 9:35, 36.

2. యేసు చేసిన అద్భుతాలకు తోడుగా, ఆయన చుట్టూ గొప్ప సమూహాలను ఏది ఆకర్షించింది?

2 కుష్టురోగులను శుద్ధులను చేయడం, చెవిటివారు వినేలా చేయడం, గుడ్డివారు చూసేట్లు చేయడం, కుంటివారు నడిచేట్లు చేయడం, చనిపోయినవారిని పునరుత్థానం చేయడం వంటి ఎంతో అద్భుతమైన భౌతిక స్వస్థతలను యేసు చేశాడు. తప్పకుండా యేసు ద్వారా పనిచేసే యెహోవా శక్తి యొక్క ఈ అద్భుతమైన ప్రదర్శనలు ప్రజలను గొప్ప సంఖ్యలో ఆకర్షిస్తాయి! అయితే ప్రజలను ఆకర్షించింది అద్భుతాలు మాత్రమేకాదు; యేసు బోధించేటప్పుడు అందించబడిన ఆత్మీయ స్వస్థత కొరకు కూడా ప్రజలు పెద్ద గుంపులుగా ఆయన వద్దకు వచ్చారు. ఉదాహరణకు, ప్రఖ్యాతిగాంచిన ఆయన కొండమీది ప్రసంగం విన్న తర్వాత వారి ప్రతిస్పందనను గమనించండి: “యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రులవలె కాక అధికారముగలవానివలె వారికి బోధించెను.” (మత్తయి 7:28, 29) వారి బోధకులు తమ బోధలకు ఆధారంగా ప్రాచీనకాల గురువుల నోటిమాట పారంపర్యాలను ఎత్తిచెప్పేవారు. దేవుని నుండి పొందిన అధికారంతో యేసు వారికి బోధించేవాడు: “నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను.”—యోహాను 12:50.

ఆయన బోధ హృదయాన్ని చేరింది

3. యేసు తన సమాచారాన్ని అందించే విధానం శాస్త్రులు పరిసయ్యుల విధానం నుండి ఎలా భిన్నంగా ఉంది?

3 యేసు బోధకు శాస్త్రులు పరిసయ్యుల బోధకు మధ్య ఉన్న తేడా, మానవుల భారమైన మౌఖిక పారంపర్యాలకు విరుద్ధంగా దేవుని నుండి వచ్చిన సత్యాలు అనే విషయం ఒక్కటే కాదు గానీ, అది బోధించబడిన విధానం కూడా. శాస్త్రులు పరిసయ్యులు చాలా గర్వంగా కఠినంగా, అహంకారంతో ఘనమైన బిరుదులను కోరుతూ ప్రజలను ‘శాపగ్రస్తమైన జనసమూహము’ అని తక్కువచూపు చూసేవారు. అయితే యేసు సాత్వికుడు, సౌమ్యుడు, కారుణ్యుడు, జాలిగలవాడు, తరచూ అనుకూలంగా మారే వాడు అంతేకాకుండా, ఆయన వారియెడల కనికరంతో కదలింపబడ్డాడు. యేసు కేవలం యింపైన మాటలను బోధించడమే కాకుండా తన హృదయంలోనుండి వచ్చే దయగల మాటల ద్వారా బోధించేవాడు, ఆయన చెప్పేది వినేవారి హృదయాల్లోకి నేరుగా చేరుతుంది. ఆయన ఆనందమయమైన వర్తమానం ఆయన వద్దకు ప్రజలు వచ్చేటట్లు, వారు ఆయన చెప్పేదానిని వినేందుకుగాను త్వరగా ఆలయానికి వచ్చేటట్లు, వారు ఆయన్ను సన్నిహితంగా అనుసరించేటట్లు, అంతేకాక ఆయన చెప్పేవాటిని ఆనందంతో వినేటట్లు చేసింది. “ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదు,” అని చాటుతూ ఆయన చెప్పేవాటిని వినేందుకు ప్రజలు తండోపతండాలుగా వచ్చేవారు.—యోహాను 7:46-49; మార్కు 12:37; లూకా 4:22; 19:48; 21:38.

4. యేసు బోధలో ప్రాముఖ్యంగా ఏ విషయం అనేకమంది ప్రజలను ఆకర్షించింది?

4 తప్పకుండా, ఆయన బోధలకు ప్రజలు ఆకర్షించబడ్డానికి ఆయన ఉపమానాలను ఉపయోగించేందుకుగల కారణాల్లో ఒకటి, యితరులు చూసినవాటినే యేసు చూశాడు, అయితే వారు ఎన్నడూ ఆలోచించని వాటిని ఆయన ఆలోచించాడు. పొలాల్లో పూసే లిల్లీలు, పక్షులు గూడ్లు కట్టుకోవడం తప్పిపోయిన గొర్రెపిల్లలను కాపరులు తీసుకురావడం, పాత దుస్తులపై స్త్రీలు మాసికలు వేయడం, సంతవీధుల్లో పిల్లలు ఆటలాడడం, చేపలుపట్టేవారు తమ వలలను నేయడం వంటి అందరూ చూసే సర్వసామాన్యమైన విషయాలు యేసు దృష్టికి ఎన్నడూ సామాన్యమైనవిగా లేవు. దృష్టిసారించిన ప్రతి దానిలోనూ దేవుని గూర్చి, ఆయన రాజ్యాన్ని గూర్చి ఏ ఉపమానాన్ని యివ్వవచ్చా అని లేక తన చుట్టూ ఉన్న మానవ సమాజాన్ని గూర్చి ఒక విషయాన్ని చెప్పవచ్చా అని చూశాడు.

5. యేసు తన ఉపమానాలకు వేటిని ఆధారంగా తీసుకున్నాడు, మరి ఏవి ఆయన ఉపమానాలు అంత ప్రభావంతం చేశాయి?

5 యేసు ఉపమానాలు, ప్రజలు అనేక మార్లు చూసిన ప్రతిదిన విషయాలపై అధారపడి ఉన్నాయి, ఈ సుపరిచిత విషయాలతో సత్యాలు జత చేయబడి ఉన్నప్పుడు, అవి వినేవారి మనస్సులపై త్వరగా, లోతుగా ముద్రవేస్తాయి. కనుక అలాంటి సత్యాలు వినడమేకాదు; మానసిక కళ్లతో వాటిని చూడడం జరుగుతుంది, ఆ తర్వాత వాటిని సులభంగా జ్ఞాపకంచేసుకోవచ్చు. సరళత కల్గివుండడం, సత్యం విషయంలో వారికి గల అవగాహనను ఆటంకపర్చే అనవసరమైన సమాచారం ఉండకపోవడం యేసు ఉపమానాల్లోని విశేషలక్షణాలు. ఉదాహరణకు, స్నేహశీలుడైన సమరయుని ఉపమానాన్ని పరిశీలించండి. ఒక మంచి పొరుగువాడు ఎలా ఉంటాడన్న విషయాన్ని మీరు స్పష్టంగా చూస్తారు. (లూకా 10:29-37) తర్వాత యిద్దరు కుమారుల దృష్టాంతం—ద్రాక్షాతోటలో పనిచేస్తానని చెప్పి చేయనివాడు, చేయనని చెప్పి చేసినవాడు. దీనిలో నిజమైన విధేయతకు అవసరమైన విషయం ఏవిటో మీరు వెంటనే గమనిస్తారు—యిచ్చిన పనిని చేయడం. (మత్తయి 21:28-31) యేసు చైతన్యవంతంగా బోధించేటప్పుడు ఎవ్వరూ మగతలో ఉండరు లేక మరో లోకంలో డండరు. వారి మనస్సులు వినడం చూడడం రెండింటిలోనూ నిమగ్నమై ఉండేటట్లు చేసేవాడు.

ప్రేమ అనుకూలతను కోరినప్పుడు యేసు దాన్ని కనపర్చాడు

6. సహేతుకంగా ఉండడం లేక అనుకూలంగా ఉండడం ప్రత్యేకంగా ఎప్పుడు సహాయకరంగా ఉంటుంది?

6 సహేతుకంగా ఉండడం అని బైబిలు మాట్లాడిన అనేకమార్లు, దాని భావం అనుకూలంగా ఉండడమని ఒక అథఃస్సూచి చూపిస్తుంది. దేవుని నుండి వచ్చే జ్ఞానము, అననుకూల పరిస్థితుల్లో అనుకూలంగా ఉంటుంది. కొన్నిసార్లు మనం సహేతుకంగా లేక అనుకూలంగా ప్రవర్తించాల్సి ఉంటుంది. అది అవసరమని ప్రేమ చూపించినప్పుడు, పశ్చాత్తాపం దానికి ఆధారమైనప్పుడు పెద్దలు అనుకూలంగా ఉండేందుకు సుముఖత చూపాలి. (1 తిమోతి 3:3; యాకోబు 3:17) కనికరం లేక జాలి అనుకూలత అవసరమని సూచించినప్పుడు సామాన్య నియమాల్లో కొన్ని మార్పులు చేస్తూ యేసు అనుకూలత విషయంలో అద్భుతమైన ఉదాహరణలు ఉంచాడు.

7. యేసు అనుకూలంగా ఉన్నాడనేందుకు గల కొన్ని ఉదాహరణలేవి?

7 ఒక సారి యేసు యిలా చెప్పాడు: “మనుష్యుల యెదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోక మందున్న నా తండ్రియెదుట నేనును ఎరుగనందును.” కాని పేతురు ఆయన్ను ఎరుగనని మూడుసార్లు చెప్పినప్పటికీ ఆయన పేతురును తృణీకరించలేదు. యేసు పరిగణలోకి తీసుకున్న కొన్ని అననుకూల పరిస్థితులున్నాయి. (మత్తయి 10:33; లూకా 22:54-62) అపవిత్రమైన ఒక స్త్రీ రక్తస్రావంతో, మోషే ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి గుంపులోకి వచ్చినప్పుడు కూడా అననుకూల పరిస్థితులున్నాయి. ఆమెను కూడా యేసు ఖండించలేదు. ఆమె నిరాశా పరిస్థితిని ఆయన అర్థం చేసుకున్నాడు. (మార్కు 1:40-42; 5:25-34; లూకా 5:12, 13 కూడా చూడండి.) యేసు తన అపొస్తలులతో తాను మెస్సియ అని చెప్పవద్దని చెప్పాడు, అయినా బావివద్ద సమరయ స్త్రీతో తాను మెస్సియా అని తెలియజేసుకున్నప్పుడు యేసు ఆ నియమాన్ని పట్టుకువేలాడలేదు. (మత్తయి 16:20; యోహాను 4:25, 26) ఈ సందర్భాలన్నింటిలోనూ, ప్రేమ, కనికరం, జాలి ఈ అనుకూలతను సరైనవిగా చేశాయి.—యాకోబు 2:13.

8. శాస్త్రులు పరిసయ్యుల నియమాలను ఎప్పుడు మలచుకుంటారు, ఎప్పుడు మలచుకోరు?

8 అనుకూలతలేని శాస్త్రులు, పరిసయ్యుల విషయం వేరుగా ఉంది. తమకు అవసరమైన విషయాల్లో, తమ ఎద్దును నీళ్లు తాగించేందుకు వారు సబ్బాతు ఆచారాలను అతిక్రమిస్తారు. లేక వారి ఎద్దుగానీ లేక వారి కుమారుడుగానీ బావిలో పడితే, వాణ్ణి బయటికి తీసేందుకు వారు సబ్బాతును అధిగమిస్తారు. అయితే, సామాన్య ప్రజలకు మాత్రం వారు కొంచెం కూడా అనుకూలంగా ఉండరు! వారు “తమ వేలితోనైననూ వాటిని కదలింపనొల్లరు.” (మత్తయి 23:4; లూకా 14:5) యేసుకు అనేక నియమాలకంటే ప్రజలే ముఖ్యం; పరిసయ్యులకు ప్రజలకంటే నియమాలే ముఖ్యము.

“ఆజ్ఞా పుత్రుడు” కావడం

9, 10. యెరూషలేముకు తిరిగి వచ్చిన తర్వాత, యేసు తలిదండ్రులు ఆయన్ను ఎక్కడ కనుగొన్నారు, యేసు ప్రశ్నల తాత్పర్యమేమిటి?

9 యేసు చిన్నతనంలో జరిగిన ఒకేఒక సంఘటనే వ్రాయబడి ఉందని కొందరు వాపోతుంటారు. అయినప్పటికీ అనేకులు ఆ సంఘటన యొక్క గొప్ప విశిష్టతను గ్రహించలేరు. అది మన కొరకు లూకా 2:46, 47 నందు రాయబడివుంది: “మూడు దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి, వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలడుగుచు ఉండగా చూచిరి. ఆయన మాటలు వినినవారందరు ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయ మొందిరి.” ఈ సందర్భంలో “ప్రశ్నించడం” అన్న దానికి ఉపయోగించిన గ్రీకు పదం కేవలం ఓ పిల్లవాని జిజ్ఞాస కాదనే ఆలోచనను కిట్టిల్‌ వారి థియోలాజికల్‌ డిక్ష్నరీ ఆఫ్‌ ది న్యూ టెస్టమెంట్‌ కలుగజేస్తుంది. ఆ పదం న్యాయ విచారణ, పరిశీలన, అడ్డు పరీక్షలందు ఉపయోగించే ప్రశ్నలను మరి కొన్నిసార్లు, మార్కు 10:2 మరియు 12:18-23 నందు ప్రస్తావించబడినట్లు “విమర్శనాత్మకమైన, కపటముతో కూడిన పరిసయ్యులూ సద్దూకయ్యుల ప్రశ్నలను” కూడా సూచిస్తుంది.

10 అదే నిఘంటువు యింకా యిలా చెబుతోంది: “ఈ వాడుక దృష్ట్యా . . . [లూకా] 2:46 పిల్లవాని ప్రశ్నించే జిజ్ఞాసను సూచించడంలేదుగానీ, ఆయన ఫలవంతంగా తర్కించడాన్ని అది సూచిస్తుందా అనే ప్రశ్న అడగవచ్చు. తర్వాత చూపిన వైఖరికి 47వ [వచనం] సరిగ్గా సరిపోతుంది.”a రోథర్‌హామ్‌ అనువాదం 47వ వచనానికి నాటకీయ ఎదిరింపును అందిస్తోంది: “ఆయన అవగాహననుబట్టి ఆయన జవాబులను బట్టి ఆయన మాట్లాడగ విన్నవారందరూ అధిక ఉత్సాహంతో నిండిపోయారు.” వారు అలా ఎడతెగక ఆశ్చర్యపోవడం అంటే “వారు గుడ్లు మిటకరించుకుని అధిక ఆశ్చర్యంలో మునిగిపోయారని” రాబర్ట్‌సన్‌ రాసిన వర్డ్‌ పిక్చర్స్‌ యిన్‌ ది న్యూ టెస్టమెంట్‌ చెప్పింది.

11. మరియ, యోసేపులు చూసిన విన్నవాటి విషయంలో వారి ప్రతిస్పందన ఎలా ఉంది, ఒక వేదాంత నిఘంటువు ఏమి సూచిస్తోంది?

11 చివరికి యేసు తలిదండ్రులు ఆలయానికి వచ్చినప్పుడు “మిక్కిలి ఆశ్చర్యపడిరి.” (లూకా 2:48) ఈ పదానికి గల గ్రీకు పదం భావం “ఖంగుతినడం లేక అబ్బురపడడం” అని రాబర్ట్‌సన్‌ చెబుతున్నాడు. అంతేకాకుండా యోసేపు మరియలు తాము చూసిన, విన్న విషయాలను బట్టి “అబ్బురపడ్డారని” కూడా చెప్పాడు. ఒక భావంలో, యేసు అప్పటికే అద్భుతమైన బోధకుడు. ఆలయంలో జరిగిన ఈ సంఘటన దృష్ట్యా, “యేసు అప్పటికే తన చిన్నతనంలోనే మత నాయకులతో తన వివాదాన్ని ప్రారంభించాడని అందులో తన విరోధులు చివరికి ఒప్పుకోవల్సి వచ్చిందని” కీటల్‌ రాసిన పుస్తకం చెబుతోంది.

12. మత నాయకులతో యేసు తర్వాత చేసిన చర్చలను ఏది సూచించింది?

12 వాళ్లు ఒప్పుకున్నారు! సంవత్సరాల తర్వాత, అలా ప్రశ్నించడంతో పరిసయ్యులు “ఆ దినమునుండి ఎవడును ఆయనను ఒక ప్రశ్నయు అడుగ తెగింపలే”నట్టుగా యేసు వారిని ఓడించాడు. (మత్తయి 22:41-46) అలాగే సద్దూకయులు పునరుత్థానం విషయంలో నోరు మూయించడం జరిగింది, అంతేకాదు, “వారాయనను మరేమియు అడుగ తెగింపలేదు.” (లూకా 20:27-40) శాస్త్రులు కూడా ఏమీ మినహాయించబడలేదు. వారిలో ఒకరు యేసుతో చర్చించిన తర్వాత “ఎవడును ఆయనను ఏ ప్రశ్నయు అడుగ తెగింపలేదు.”—మార్కు 12:28-34.

13. యేసు జీవితంలో ఆలయం వద్ద జరిగిన ఆ సంఘటనను ఏది అంత ప్రాముఖ్యమైనదిగా చేసింది, అది యింకా ఏ మెలకువను అందిస్తుంది?

13 ఆలయం వద్ద యేసు, బోధకులు ఉన్న ఈ సంఘటన మాత్రమే తన చిన్నతనం నుండి ఎందుకు ప్రత్యేకంగా ఎన్నుకోబడి కథనం చేయబడింది? యేసు జీవితంలో అదొక మలుపు. ఆయనకు సుమారు 12 ఏళ్ల వయస్సప్పుడు, యూదులు పేర్కొనే ప్రకారంగా ఆజ్ఞలన్నిటినీ ఆచరించినవాడైన “ఆజ్ఞా పుత్రుడయ్యాడు.” తనకు యోసేపుకు యేసు తెచ్చిన మనఃక్షోభను గూర్చి మరియ ఆయనకు ఫిర్యాదు చేసినప్పుడు, ఆయన జన్మించిన అద్భుతమైన విధానమూ మెస్సియగా ఆయన భవిష్యత్తు ఆయనకు అప్పటికే తెలుసునని తన కుమారుని జవాబు సూచించింది. దేవుడు తనకు తండ్రి అని ఆయన సూటిగా సూచించడంలో అది కనిపిస్తుంది: “మీరేల నన్ను వెదకు చుంటిరి? నేను నా తండ్రి పనులమీద నుండవలెనని మీరెరుగరా?” సందర్భవశాత్తు, బైబిల్లో రాయబడిన యేసు మొట్టమొదటి మాటలు యివే. ఆయనను భూమ్మీదికి పంపించిన యెహోవా సంకల్పం విషయంలో ఆయన మెలకువతను సూచిస్తున్నాయి. కాబట్టి, ఈ భాగమంతా కూడా ఎంతో ప్రాముఖ్యమైనది.—లూకా 2:48, 49.

యేసు పిల్లలను ప్రేమించి అర్థం చేసుకుంటాడు

14. యేసు యౌవన జీవితంలో ఆలయం వద్ద జరిగిన సంఘటనలోని ఏ ఆసక్తికరమైన విషయాలను యౌవనులు తెలుసుకొనేలా చేస్తుంది?

14 ఈ వివరణ యౌవనులకు ప్రత్యేకంగా ఉప్పొంగింపజేసేదిగా ఉండాలి. యేసు పెద్దవాడయ్యేకొలది ఎంత శ్రద్ధగా పఠించేవాడో యిది చూపుతుంది. ఈ 12 ఏండ్ల “ఆజ్ఞా పుత్రుని” వివేకాన్ని చూసి ఆలయంలోని బోధకులు ఆశ్చర్యపోయారు. ఆయన వడ్రంగి దుకాణంలో యోసేపుతో పనిచేస్తూ, ఆయనకు మరియకు “లోబడియుండెను,” అంతేకాక “దేవుని దయయందును మనుష్యుల దయయందును” వర్థిల్లుతూ వచ్చాడు.—లూకా 2:51, 52.

15. యేసు తన భూ పరిచర్యలో ఎలా యౌవనులకు మద్దతుగా ఉండేవాడు, నేటి యౌవనులకు యిది ఏ భావాన్ని కల్గివుంది?

15 యేసు భూ పరిచర్యలో యౌవనులకు ఎంతో మద్దతుదారునిగా ఉన్నాడు: “ప్రధానయాజకులును శాస్త్రులును ఆయన చేసిన వింతలను—దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి—వీరు చెప్పుచున్నది వినుచున్నావా? అని ఆయనను అడిగిరి అందుకు యేసు—వినుచున్నాను; బాలురయొక్కయు చంటిపిల్లలయొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అను మాట మీరెన్నడును చదువలేదా? అని వారితో” చెప్పాడు. (మత్తయి 21:15, 16; కీర్తన 8:2) నేడు యథార్థతను కాపాడుకుంటూ స్తుతిని చెల్లిస్తున్న వందల కొలది యౌవనులకు ఆయన కూడా ఎంతో మద్దతునిచ్చేవానిగా ఉన్నాడు. వారిలో కొందరు తమ జీవితాలనే పణంగా పెట్టి అలా చేశారు!

16. (ఎ) ఒక చిన్న పిల్లవాడిని తన అపొస్తలుల మధ్య నిలబెట్టి యేసు వారికి ఏ పాఠాన్ని నేర్పించాడు? (బి) యేసు జీవితంలో ఏ క్లిష్టమైన సమయంలో కూడా పిల్లల కొరకు ఆయన సమయాన్ని కల్గివున్నాడు?

16 తన అపొస్తలులు తమలో ఎవరు గొప్ప అనే విషయంపై తర్కించుకుంటున్నప్పుడు, యేసు ఆ పన్నెండుగురితో యిలా చెప్పాడు: “ఎవడైనను మొదటి వాడైయుండ గోరినయెడల, వాడందరిలో కడపటివాడును అందరికి పరిచారకుడునై యుండవలెనని చెప్పి యొక చిన్న బిడ్డను తీసికొని వారి మధ్యను నిలువబెట్టి, వానిని ఎత్తి కౌగిలించుకొని—ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును; నన్ను చేర్చుకొనువాడు నన్ను గాక నన్ను పంపినవానిని చేర్చుకొనును.” (మార్కు 9:35-37) అంతేకాకుండా, ప్రాణాంతకమైన విచారణ, మరణాన్ని ఎదుర్కోడానికి చివరిసారిగా యెరూషలేముకు ప్రయాణమౌతుండగా ఆయన పిల్లలకొరకు కొంత సమయాన్ని వెచ్చించాడు: “చిన్నబిడ్డలను నాయొద్దకు రానియ్యుడి, వారి నాటంకపరచవద్దు; దేవునిరాజ్యము ఈలాటివారిదే.” ఆ తర్వాత ఆయన “బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని, వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను.”—మార్కు 10:13-16.

17. పిల్లలతో మాట్లాడడం యేసుకు ఎందుకు సులభంగా ఉండేది, పిల్లలు ఆయన్ను గూర్చి ఏమి జ్ఞాపకముంచుకోవాలి?

17 పెద్దల లోకంలో చిన్న పిల్లలుగా ఉండడం అంటే ఏమిటో యేసుకు తెలుసు. ఆయన పెద్దవాళ్లతో జీవించాడు, వారితో పనిచేశాడు, వారికి విధేయుడై ఉన్న అనుభవం ఉంది, అంతేకాకుండ అనురాగాన్ని, వాళ్లు తన్ను ప్రేమిస్తున్నారనే సురక్షిత భావాన్ని కల్గివున్నాడు. పిల్లల్లారా, ఆ యేసు మీ స్నేహితుడు; ఆయన మీ కొరకు చనిపోయాడు, ఆయన ఆజ్ఞలను మీరు పాటిస్తే మీరు నిరంతరం జీవిస్తారు.—యోహాను 15:13, 14.

18. ప్రత్యేకంగా ఒత్తిడి లేక అపాయమున్న సమయంలో ఏ పులకరిపజేసే ఆలోచనను మనం మనస్సులో ఉంచుకోవాలి?

18 యేసు చెప్పినట్లుగా చేయడం అనుకున్నంత కష్టమేమీ కాదు. యౌవనులారా, మత్తయి 11:28-30 నందు మనం చదువునట్లుగా ఆయన మీకూ అలాగే యితరులందరికీ అందుబాటులో ఉన్నాడు: “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని [లేక “నాతో నాకాడి క్రిందికి రండి” (NW Rbi 8) అథఃస్సూచి] నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.” ఒకసారి ఊహించుకోండి, మీరు యెహోవాను సేవిస్తూ జీవితంలో పయనిస్తుండగా, మీ కాడిని సుళువుగానూ మీ భారమును తేలికగాను చేస్తూ యేసు మీ పక్కనే నడుస్తున్నాడు. అది మనందరికి ఎంత పులకరింపజేసే ఆలోచనగా ఉంటుంది!

19. యేసు బోధనా పద్ధతులను గూర్చి ఏ ప్రశ్నలను మనం తరచూ పునఃసమీక్షించుకోవాలి?

19 యేసు బోధించిన కొన్ని పద్ధతులను పునఃపరిశీలించిన తర్వాత ఆయన బోధించినట్లే మనం బోధిస్తున్నామా? శారీరకంగా అస్వస్థులైన లేక ఆత్మీయ ఆహారం లేక అలమటిస్తున్న వారిని చూసినప్పుడు వారికి మనం చేతనైనంత సహాయం చేసేందుకు జాలి మనలను కదలిస్తోందా? మనం యితరులకు బోధిస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని బోధిస్తున్నామా, లేక పరిసయ్యుల్లా మన స్వంత ఆలోచనలను బోధిస్తున్నామా? ఆత్మీయ సత్యాల అవగాహనను స్పష్టపర్చేందుకు, ఊహించేందుకు, సమకూర్చేందుకు, వృద్ధి చేసుకునేందుకు మనం ప్రతి దిన సంగతులను గమనించేందుకు మెలకువను కల్గివున్నామా? పరిస్థితులను బట్టి ప్రేమ కనికరాలను సరైన రీతిలో కనపర్చేట్లు కొన్ని నియమాల అన్వయింపులో మనం అనుకూలంగా ఉండవల్సివచ్చినప్పుడు ఆ నియమాలను గట్టిగా పట్టుకుని ఉండడం నివారిస్తామా? మరి పిల్లల విషయమేమిటి? యేసు చూపిన అదే మృదువైన శ్రద్ధనూ ప్రేమ కనికరాలను మనం వారి యెడల కనపరుస్తామా? యేసు పిల్లవానిగా ఉన్నప్పుడు చేసినట్లుగా పఠించడానికి మీరు మీ పిల్లలను ప్రోత్సహిస్తున్నారా? యేసు చేసినట్లుగా మీరు దృఢంగా ప్రవర్తిస్తారా, అయితే కోడి తన రెక్కల కిందికి పిల్లలను చేర్చుకున్నట్లుగా పశ్చాత్తాపపడినప్పుడు మీరు వెంటనే వారిని ప్రేమగా అంగీకరిస్తారా?—మత్తయి 23:27.

20. మనం దేవున్ని సేవించేటప్పుడు ఏ ఆనందభరితమైన ఆలోచన మనలను ఓదార్చాలి?

20 యేసు బోధించినట్లుగా బోధించేందుకు మనం గట్టిగా కృషి చేస్తే, ఆయన తప్పకుండా ‘ఆయనతో పాటు ఆయన కాడి క్రింద’ మనలను ఉండనిస్తాడు.—మత్తయి 11:28-30.

[అధస్సూచీలు]

a యేసు తన కంటే పెద్దవారైనవారికి, ప్రత్యేకంగా తల నెరిసినవారికి, యాజకులకూ సరైన గౌరవాన్ని కనపరుస్తాడని నమ్మడానికి నిస్సందేహంగా మనకు అనేక కారణాలున్నాయి.—లేవీయకాండము 19:32; అపొస్తలుల కార్యములు 23:2-5 పోల్చండి.

మీకు జ్ఞాపకమున్నాయా?

◻ జన సమూహాలు యేసు వద్దకు ఎందుకు చేరాయి?

◻ యేసు కొన్ని నియమాల విషయంలో అనుకూలతను ఎందుకు చూపాడు?

◻ ఆలయ బోధకులను యేసు ప్రశ్నించడం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

◻ పిల్లలతో యేసు సంబంధం విషయంలో మనం ఏ పాఠాలను నేర్చుకోగలము?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి