కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 10/15 పేజీలు 21-26
  • యెహోవా క్షమిస్తున్నట్లు మీరు క్షమిస్తారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా క్షమిస్తున్నట్లు మీరు క్షమిస్తారా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మోషే మధ్యవర్తిత్వం వహించినప్పుడు—యెహోవా ఆలకించాడు
  • మనష్షే విగ్రహారాధన, దావీదు వ్యభిచారం
  • సొలొమోను ఆలయ ప్రతిష్ఠ
  • క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో క్షమాపణ
  • ‘ఒకని నొకడు క్షమించుడి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • యెహోవా, “క్షమించుటకు సిద్ధమైన మనస్సుగల” దేవుడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • యెహోవా అందరికంటే గొప్పగా క్షమిస్తాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
  • ఎందుకు క్షమాగుణాన్ని కలిగి ఉండాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 10/15 పేజీలు 21-26

యెహోవా క్షమిస్తున్నట్లు మీరు క్షమిస్తారా?

“మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయినయెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు.”—మత్తయి 6:14, 15.

1, 2. మనకు ఎలాంటి దేవుడు అవసరం, ఎందుకు?

“యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపాసమృద్ధిగలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యెమాడువాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములనుబట్టి మనకు ప్రతికారము చేయలేదు మన దోషములనుబట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు. భూమికంటె ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయనయందు భయభక్తులు గలవారియెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచి యున్నాడు. తండ్రి తన కుమారులయెడల జాలిపడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసి కొనుచున్నాడు.”—కీర్తన 103:8-14.

2 పాపములో గర్భమునందుండి పాపముతో పుట్టి, పాపపు నియమంలోకి మనలను ఎల్లప్పుడూ తీసుకువెళ్లే వారసత్వ అపరిపూర్ణతలుగల, ‘మంటివారమని జ్ఞాపకముంచుకునే’ దేవుడు మనకు అవసరం. కీర్తన 103లో యెహోవాను గూర్చి దావీదు ఎంతో రమ్యంగా వర్ణించిన మూడువందల సంవత్సరాల తర్వాత మరో బైబిలు రచయితయైన మీకా, మునుపు చేసిన పాపములను దయతో క్షమించిన అదే దేవున్ని అదే విధంగా యించుమించు యిలా ఘనపర్చాడు: “అపరాధములను పరిహరించి, చేసిన అతిక్రమములను క్షమించి, కోపాన్ని ఎల్లకాలం ఉంచుకోక కనికరం కనపర్చడంలో ఆనందించే నీతో పోల్చగల్గే దేవుడున్నాడా? మరొక్కసారి మాపై జాలిచూపించు, మా దోషములను అణచి వేయుము, మా పాపములన్నింటినీ సముద్ర అగాధములో పడవేయుము.”—మీకా 7:18, 19, ది జెరూషలెమ్‌ బైబిల్‌.

3. క్షమించడం అంటే ఏమిటి?

3 గ్రీకు లేఖనాల్లో “క్షమించు” అనే పదానికి భావం “పోనివ్వడం.” పైన చెప్పబడిన దావీదు, మీకా అదే భావాన్ని మనోహరమైన, వివరణాత్మకమైన మాటల్లో అందించారని గమనించండి. యెహోవా క్షమాగుణపు ఆశ్చర్యకరమైన విస్తృతిని మనం పూర్తిగా గుణగ్రహించేందుకు, దాని అనేక క్రియాత్మక ఉదాహరణల్లో కొన్నింటిని మనం పునఃపరిశీలిద్దాం. యెహోవా మనస్సు, నాశనం చేయకుండా క్షమించేందుకు మారలగలదని మొదటిది చూపిస్తోంది.

మోషే మధ్యవర్తిత్వం వహించినప్పుడు—యెహోవా ఆలకించాడు

4. యెహోవా శక్తి ఏ విధాలుగా ప్రదర్శించబడిన తర్వాత కూడా ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోకి ప్రవేశించేందుకు భయపడ్డారు?

4 యెహోవా ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు నుండి, తాను నివాసస్థానంగా యిస్తానని వాగ్దానం చేసిన ప్రాంతానికి క్షేమంగా తీసుకువచ్చాడు. కానీ, కేవలం కనాను మనుష్యులకు భయపడి, వారు ముందడుగు వేసేందుకు నిరాకరించారు. యెహోవా పది తెగుళ్ల ద్వారా వారిని ఐగుప్తునుండి విడిపించడం, ఎర్ర సముద్రం గుండా తప్పించుకునే త్రోవను తెరవడం, వారిని అనుసరించాలని ప్రయత్నించిన ఐగుప్తు సేనను నాశనం చేయడం, వారిని యెహోవా ఎన్నుకున్న జనాంగంగా చేసిన ధర్మశాస్త్ర నిబంధనను సీనాయి పర్వతం వద్ద ప్రారంభించడం అంతేకాకుండా, వారి పోషణ కొరకు ప్రతిదినం పరలోకం నుండి మన్నాను కురిపించడం వంటి వాటిని చూసిన తర్వాత కూడా, కేవలం కొందరు భీకరాకారులైన కనానీయులను చూసి వాగ్దాన దేశంలోకి ప్రవేశించేందుకు వారు భయపడ్డారు!—సంఖ్యాకాండము 14:1-4.

5. నమ్మకమైన యిద్దరు వేగులవారు, ఇశ్రాయేలీయులకు ధైర్యమివ్వడానికి ఎలా ప్రయత్నించారు?

5 మోషే అహరోనులు ప్రజల భయాన్ని చూసి అయోమయంలోపడ్డారు. యెహోషువా కాలేబు అనే యిద్దరు నమ్మకమైన వేగులవారు ఇశ్రాయేలీయులకు ధైర్యం చెప్పేందుకు ప్రయత్నించారు: ‘ఆ దేశము మిక్కిలి మంచి దేశము, అది పాలూ తేనెలు ప్రవహించే దేశం. మనుష్యులకు భయపడకుడి, యెహోవా మనకు తోడైయున్నాడు!’ అలాంటి మాటలకు ప్రోత్సహించబడే బదులు బెదిరిపోయి, ఎదురుతిరిగిన ప్రజలు యెహోషువా కాలేబులపైకి రాళ్లు విసిరేందుకు ప్రయత్నించారు.—సంఖ్యాకాండము 14:5-10.

6, 7. (ఎ)వాగ్దాన దేశంలోకి ప్రవేశించేందుకు ఇశ్రాయేలీయులు నిరాకరించినప్పుడు ఏమి చేయాలని యెహోవా నిర్ణయించాడు? (బి) ఇశ్రాయేలుపై యెహోవా తీర్పుకు మోషే ఎందుకు అభ్యంతరం చెప్పాడు, దాని పరిణామమేమైంది?

6 యెహోవాకు కోపం వచ్చింది! “యెహోవా—ఎన్నాళ్లవరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్లవరకు నేను వారి మధ్యను చేసిన సూచకక్రియలన్నిటిని చూచి నన్ను నమ్మకయుందురు? నేను వారికి స్వాస్థ్యమియ్యక తెగులుచేత వారిని హతముచేసి, యీ జనముకంటె మహా బలముగల గొప్ప జనమును నీవలన పుట్టించెదనని మోషేతో చెప్పగా మోషే యెహోవాతో ఇట్లనెను—అలాగైతే ఐగుప్తీయులు దానిగూర్చి విందురు; నీవు నీ బలముచేత ఈ జనమును ఐగుప్తీయులలో నుండి రప్పించితివిగదా; వీరు ఈ దేశనివాసులతో ఈ సంగతి చెప్పియుందురు. . . . కాబట్టి, నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపినయెడల నీ కీర్తినిగూర్చి వినిన జనములు—ప్రమాణపూర్వకముగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తిలేక యెహోవా వారిని అరణ్యములో సంహరించెనని చెప్పుకొందురు.”—సంఖ్యాకాండము 14:11-16.

7 యెహోవా నామము కొరకు మోషే క్షమాపణను కోరాడు: “ఐగుప్తులోనుండి వచ్చినది మొదలుకొని యిదివరకు నీవు ఈ ప్రజలదోషమును పరిహరించియున్నట్లు నీ కృపాతిశయమునుబట్టి ఈ ప్రజలదోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా యెహోవా—నీ మాటచొప్పున నేను క్షమించియున్నాను,” అని అన్నాడు.—సంఖ్యాకాండము 14:19, 20.

మనష్షే విగ్రహారాధన, దావీదు వ్యభిచారం

8. యూదా రాజైన మనష్షే ఏ చరిత్రను సాధించాడు?

8 యెహోవా క్షమాగుణం యొక్క విశేషమైన మాదిరి, మంచి రాజగు హిజ్కియా కుమారుడైన మనష్షే విషయంలో కనిపిస్తుంది. యెరూషలేములో మనష్షే పాలించడం ప్రారంభించేటప్పటికి ఆయనకు 12 ఏళ్లు. ఆయన ఉన్నత స్థలాలను కట్టించాడు, బయలుకు బలిపీఠములు కట్టించాడు, దేవతాస్తంభాలను చేయించాడు, ఆకాశ నక్షత్రాలను పూజించాడు, దయ్యాల మాధ్యమాలను జ్యోతిష్కులనూ ఏర్పాటు చేశాడు, యెహోవా ఆలయంలో చెక్కిన విగ్రహాన్ని పెట్టాడు అంతేకాకుండా తన స్వంత పిల్లలను హిన్నోము లోయలోనున్న అగ్ని గుండాన్ని దాటించాడు. “యెహోవా దృష్టికి బహుగా చెడునడత నడచుచు, . . . యూదావారిని యెరూషలేము కాపురస్థులను మోసపుచ్చినవాడై, ఇశ్రాయేలీయులయెదుట ఉండకుండ యెహోవా నశింపజేసిన అన్యజనులకంటెను మరింత అక్రమముగా వారు ప్రవర్తించునట్లు చేయుటకు కారకుండాయెను.”—2 దినవృత్తాంతములు 33:1-9.

9. మనష్షే విషయంలో యెహోవా కోపాన్ని ఎలా తగ్గించుకున్నాడు, దాని ఫలితమేమిటి?

9 చివరికి, యెహోవా అష్షూరీయులను యూదాకు వ్యతిరేకంగా తీసుకువచ్చాడు అంతేకాకుండా, వారు మనష్షేను చెరపట్టి, బబులోనుకు తీసుకువెళ్లారు. “అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, తన పితరుల దేవుని సన్నిధిని తన్నుతాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా, ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసికొని” వచ్చాడు. (2 దినవృత్తాంతములు 33:11-13) అప్పుడు మనష్షే అన్య దేవతలను విగ్రహాలను, బలిపీఠాలను, తీసేసి, పట్టణం వెలుపల వాటిని పారేయించాడు. అతను యెహోవా ఆలయంలో బలులను అర్పించడం మొదలుపెట్టాడు, మరి యూదా నిజమైన దేవున్ని ఆరాధించేందుకు ప్రారంభించేటట్లు చేశాడు. వినయం, ప్రార్థన, చెడునడతను సరిచేసుకునే క్రియలు పశ్చాత్తాపానికి తగిన ఫలాలను ఫలించినప్పుడు యెహోవా క్షమించేందుకు యిష్టతను కనపర్చాడనడంలో యిది ఓ అద్భుతమైన ఉదాహరణ.—2 దినవృత్తాంతములు 33:15, 16.

10. దావీదు తాను ఊరియా భార్యతో చేసిన పాపాన్ని ఎలా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు?

10 హిత్తీయుడైన ఊరియా భార్యతో రాజైన దావీదు, చేసిన వ్యభిచార పాపము అందరికీ తెలిసినదే. ఆయన ఆమెతో వ్యభిచరించడమేకాదు, ఆమె గర్భం ధరించినప్పుడు దాన్ని కప్పిపుచ్చుకునే ఉపాయం కూడా యోచించాడు. ఊరియా తన యింటికి వెళ్లి తన భార్యతో శయనిస్తాడని ఆశిస్తూ యుద్ధానికి వచ్చే పని లేకుండా రాజు సెలవిచ్చాడు. అయితే, యుద్ధంలో ఎక్కువగా పోరాటం జరిగే స్థలంలో ఉన్న తన తోటి సైనికుల యెడల గౌరవంతో ఊరియా వెళ్లలేదు. ఆ తర్వాత దావీదు అతన్ని భోజనానికి ఆహ్వానించి తాగించాడు, అయినా ఊరియా తన భార్య దగ్గరకు వెళ్లలేదు. తర్వాత దావీదు, ఊరియాను యుద్ధం ఎక్కువగా జరిగే స్థలంలో ఉంచి అతను చంపబడేటట్లు చూసేలా తన సైన్యాధిపతికి కబురు పంపాడు, సరిగ్గా అలాగే జరిగింది.—2 సమూయేలు 11:2-25.

11. దావీదు తాను చేసిన పాపం విషయంలో ఎలా పశ్చాతాపపడేటట్లు చేయబడ్డాడు, అయినప్పటికీ ఆయన ఏమి అనుభవించాడు?

11 రాజైన దావీదు చేసిన పాపాన్ని బయటపెట్టేందుకు యెహోవా తన ప్రవక్తయైన నాతానును పంపాడు. “నేను పాపముచేసితినని దావీదు నాతానుతో అనగా నాతాను—నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను.” (2 సమూయేలు 12:13) దావీదు తాను చేసిన పాపానికి అపరాధం చేశానని ఎంతగానో భావించాడు, అంతేకాకుండ యెహోవాకు చేసిన హృదయపూర్వకమైన ప్రార్థనలో తన పశ్చాతాపాన్ని ఆయన వ్యక్తపర్చాడు: “నీవు బలిని కోరువాడవుకావు కోరినయెడల నేను అర్పించుదును దహనబలి నీకిష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు.” (కీర్తన 51:16, 17) విరిగిన హృదయంతో దావీదు చేసిన ప్రార్థనను యెహోవా అలక్ష్యం చేయలేదు. అయినా, “దోషులను ఎన్నడు నిర్దోషులుగా ఎంచడు,” అని నిర్గమకాండము 34:6, 7 నందు క్షమాపణను గూర్చిన యెహోవా వ్యాఖ్యానానికి అనుగుణ్యంగా, దావీదు భారమైన శిక్షను అనుభవించాడు.

సొలొమోను ఆలయ ప్రతిష్ఠ

12. ఆలయ ప్రతిష్ఠ సమయంలో సొలొమోను ఏ విన్నపం చేశాడు, దానికి యెహోవా ఎలా ప్రతిస్పందించాడు?

12 సొలొమోను యెహోవా ఆలయాన్ని నిర్మించడం పూర్తియైన తర్వాత ఆలయ ప్రతిష్ఠాపన ప్రార్థనచేస్తూ ఆయన యిలా అన్నాడు: “నీ సేవకుడును నీ జనులైన ఇశ్రాయేలీయులును ఈ స్థలముతట్టు తిరిగి చేయబోవు ప్రార్థనలను నీవు ఆలకించుము, ఆకాశముననున్న నీ నివాసస్థలమందు ఆలకించుము, ఆలకించునప్పుడు క్షమించుము.” అందుకు యెహోవా యిలా బదులిచ్చాడు: “వాన కురియకుండ నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనులమీదికి తెగులు రప్పించినప్పుడేగాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థనచేసి నన్ను వెదకి తమ చెడుమార్గములను విడిచినయెడల, ఆకాశమునుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును.”—2 దినవృత్తాంతములు 6:21; 7:13, 14.

13. ఒక వ్యక్తిని యెహోవా ఎలా దృష్టిస్తాడన్న విషయాన్ని యెహెజ్కేలు 33:13-16 ఏమి చూపుతోంది?

13 యెహోవా మీ తట్టు చూసినప్పుడు, ప్రస్తుతం మీరేమైయున్నారో అన్న దాన్ని బట్టి ఆయన అంగీకరిస్తాడు గానీ మీరు ముందు ఎలా ఉన్నారన్న దాన్ని బట్టి కాదు. అది యెహెజ్కేలు 33:13-16 నందు చెప్పినట్లుగా ఉంటుంది: “నీతిమంతుడు నిజముగా బ్రదుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారముచేసికొని పాపము చేసినయెడల అతని నీతి క్రియలన్నిటిలో ఏదియు జ్ఞాపకమునకు తేబడదు, తాను చేసిన పాపమునుబట్టి యతడు మరణము నొందును. మరియు నిజముగా మరణము నొందుదువని దుర్మార్గునికి నేను సెలవియ్యగా అతడు తన పాపము విడిచి, నీతి న్యాయములను అనుసరించుచు కుదువసొమ్మును మరల అప్పగించుచు, తాను దొంగిలినదానిని మరల ఇచ్చివేసి పాపము జరిగింపక యుండి, జీవాధారములగు కట్టడలను అనుసరించినయెడల అతడు మరణము నొందక అవశ్యముగా బ్రదుకును. అతడు చేసిన పాపములలో ఏదియు అతని విషయమై జ్ఞాపకమునకు తేబడదు, అతడు నీతిన్యాయములను అనుసరించెను గనుక నిశ్చయముగా అతడు బ్రదుకును.”

14. యెహోవా యిచ్చే క్షమాపణ విషయంలో విశిష్టమైనదేది?

14 యెహోవా దేవుడు మనకు యిచ్చే క్షమాపణకు విశిష్టమైన లక్షణం ఉంది, అది మానవులు ఒకరినొకరు క్షమించుకునేటప్పుడు కనపర్చడానికి కష్టమైన విషయం అదేమిటంటే, ఆయన క్షమించి మర్చిపోతాడు, ‘నువ్వు చేసినదాన్ని నేను క్షమిస్తానుగాని, నేను దాన్ని మర్చిపోలేను (లేక మర్చిపోను),’ అని కొందరంటారు. దానికి విరుద్ధంగా యెహోవా ఏమి చేస్తానని చెబుతున్నాడో గమనించండి: “దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను.”—యిర్మీయా 31:34.

15. క్షమాగుణం విషయంలో యెహోవాకు ఎలాంటి చరిత్ర ఉంది?

15 యెహోవా వేల సంవత్సరాలుగా భూమిపైని తన ఆరాధికులను క్షమిస్తూ వచ్చాడు. తాము పాపం చేస్తున్నామని తెలిసి చేసినవాటిని యెహోవా క్షమిస్తూ వచ్చాడు అలాగే, తెలియక చేసిన అనేకమైన వాటిని కూడా ఆయన క్షమించాడు. కనికరం, దీర్ఘశాంతం, క్షమాగుణాలను ఆయన అందించడం కొనసాగుతూనే ఉంది. యెషయా 55:7 యిలా అంటోంది: “భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు మన దేవునివైపు తిరిగినయెడల ఆయన వారియందు జాలిపడును వారు యెహోవావైపు తిరిగినయెడల ఆయన బహుగా క్షమించును.”

క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో క్షమాపణ

16. క్షమించే విషయంలో యేసు యెహోవాకు అనుగుణంగా ఉన్నాడని ఎందుకు చెప్పవచ్చు?

16 క్రైస్తవ గ్రీకు లేఖనాల్లోని నివేదికలు దేవుని క్షమాగుణపు వృత్తాంతాలతో నిండివున్నాయి. ఈ విషయంలో తాను యెహోవా మనస్సుకు అనుగుణంగా ఉన్నానని చూపుతూ, దాన్ని గూర్చి యేసు తరచూ మాట్లాడుతూ ఉండేవాడు. యేసు ఆలోచన యెహోవా నుండి వస్తుంది, ఆయన యెహోవాను ప్రతిబింబిస్తున్నాడు, ఆయన యెహోవా యొక్క కచ్చితమైన ప్రాతినిధ్యము; ఆయన్ను చూడడం అంటే యెహోవాను చూడడము.—యోహాను 12:45-50; 14:9; హెబ్రీయులు 1:3.

17. “విస్తృతమైన రీతిలో” యెహోవా క్షమాగుణాన్ని యేసు ఎలా దృష్టాంతపర్చాడు?

17 యెహోవా గొప్పగా క్షమిస్తాడనే విషయం యేసు చెప్పిన ఒకానొక ఉపమానాల్లో సూచించబడింది. అదేంటంటే, తనకు 10,000 (సుమారు 33,000,000 అమెరికన్‌ డాలర్లు) తలాంతులు అచ్చి ఉన్న ఓ దాసున్ని క్షమించిన ఒక రాజును గూర్చినది. అయితే, ఆ దాసుడు వంద దినారాలు అచ్చివున్న తనతోటి దాసున్ని క్షమించనప్పుడు రాజు ఆగ్రహించాడు. “చెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని; నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి యుండెను గదా అని వానితో చెప్పెను. అందుచేత వాని యజమానుడు కోపపడి, తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధపరచువారికి వాని నప్పగించెను.” ఆ తర్వాత యేసు దాన్ని యిలా అన్వయించాడు: “మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపనియెడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీయెడల చేయుననెను.”—మత్తయి 18:23-35.

18. క్షమాపణ విషయంలో పేతురు వైఖరి, యేసు వైఖరితో ఎలా పోల్చబడింది?

18 పై ఉపమానాన్ని యివ్వకముందు పేతురు యేసు దగ్గరకు వచ్చి యిలా అడిగాడు: “ప్రభువా, నా సహోదరుడు నాయెడల తప్పిదము చేసిన యెడల నేనెన్నిమారులు అతని క్షమింపవలెను? ఏడు మారులమట్టుకా?” పేతురు తాను చాలా ఉదార స్వభావం కలవాడనని అనుకున్నాడు. క్షమించడం విషయంలో శాస్త్రులు పరిసయ్యులు పరిధులను ఏర్పర్చినప్పటికీ, యేసు పేతురుతో యిలా అన్నాడు: “ఏడుమారులుమట్టుకే కాదు, డెబ్బది ఏళ్ల మారులమట్టుకు.” (మత్తయి 18:21, 22) “మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసినయెడల అతని గద్దించుము; అతడు మారుమనస్సు పొందిన యెడల అతని క్షమించుము. అతడు ఒక దినమున ఏడుమారులు నీయెడల తప్పిదము చేసి యేడు మారులు నీ వైపుతిరిగి—మారుమనస్సు పొందితిననినయెడల అతని క్షమింపవలెనని,” యేసు చెప్పినట్లుగా రోజుకు ఏడు మారులు క్షమించడం సరిపోదు. (లూకా 17:3, 4) సంతోషకరంగా, యెహోవా క్షమించినప్పుడు, ఆయన మన పాపాలను గుర్తుంచుకోడు.

19. యెహోవా క్షమాపణను పొందడానికి మనం ఏమి చేయాలి?

19 పశ్చాతాపపడి, మనం చేసిన పాపాలను ఒప్పుకునే దీనత్వం మనకున్నట్లైతే, మన పక్షంలో అనుకూలంగా ప్రతిస్పందించేందుకు యెహోవా అంగీకరిస్తాడు: “మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.”—1 యోహాను 1:9.

20. పాపాన్ని క్షమించే విషయంలో స్తెఫెను ఎలాంటి యిష్టతను కనపర్చాడు?

20 యేసు అనుచరుడైన స్తెఫెను, ఒక గుంపు ఉద్రేకంతో తన మీదికి రాళ్లు రువ్వుతున్నప్పుడు, అద్భుతమైన క్షమాగుణంతో బిగ్గరగా యిలా విన్నవించుకున్నాడు: “యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుము.” ఆ తర్వాత “అతడు మోకాళ్లూని—ప్రభువా, వారిమీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను; ఈ మాట పలికి నిద్రించెను.”—అపొస్తలుల కార్యములు 7:59, 60.

21. యేసు రోమా సైనికులను క్షమించేందుకు యిష్టతను చూపించడం ఎందుకు అంత ఆశ్చర్యకరమైనది?

21 క్షమించేందుకు సముఖతను చూపడంలో మరి అద్భుతమైన మాదిరిని యేసు ఉంచాడు. ఆయన శత్రువులు ఆయన్ను చెరపట్టారు, అన్యాయంగా ఆయనపై విచారణ జరిపించారు, నిందమోపారు, అవహేళన చేశారు, కొట్టారు, బహుశ చిన్న చిన్న ఎముకలూ లోహపు ముక్కలు గల తోలుపట్టీలతో చేసిన కొరడాతో కొట్టారు, చివరికి కొన్ని గంటలవరకు ఆయన్ను మ్రానుపై మేకులతో కొట్టి వ్రేలాడదీశారు. దీనిలో రోమన్ల పాత్ర ఎంతగానో ఉంది. అయినా, ఆ హింసా కొయ్యపై యేసు మరణిస్తూ తన్ను మ్రానుపై వేలాడదీసిన సైనికులను గూర్చి తన పరలోకపు తండ్రికి ఆయన యిలా ప్రార్థించాడు: “తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము.”—లూకా 23:34.

22. కొండ మీది ప్రసంగంలోని ఏ మాటలను మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి?

22 కొండమీది తన ప్రసంగంలో యేసు యిలా అన్నాడు: “మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి.” భూమ్మీద తన పరిచర్య చివరి వరకు ఆ సూత్రాన్ని ఆయన తానే అనుసరించాడు. అపరిపూర్ణ శరీర బలహీనతలతో పోరాడుతున్న మనకు అది మరీ కష్టంగా ఉందా? యేసు తన అనుచరులకు మాదిరి ప్రార్థననిచ్చిన తర్వాత వారికి బోధించిన మాటలను ఆచరణలో పెట్టడానికైనా మనం ప్రయత్నించాలి: “మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయినయెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. (మత్తయి 5:44; 6:14, 15) యెహోవా క్షమించినట్లు మనం క్షమిస్తే, మనం క్షమించి మరిచిపోతాము.

మీకు జ్ఞాపకమున్నాయా?

◻ యెహోవా మన పాపాలతో ఎలా వ్యవహరిస్తాడు, ఎందుకు?

◻ మనష్షే తన రాజ్యధికారాన్ని తిరిగి ఎందుకు పొందాడు?

◻ యెహోవా క్షమాగుణంలోని ఏ విశేషమైన విషయం మానవులు అనుకరించేందుకు కష్టతరమైనది?

◻ యేసు క్షమాగుణం ఎలా అంత అద్భుతమైనది?

[24వ పేజీలోని చిత్రం]

దావీదు దేవుని క్షమా గుణాన్ని చూసేందుకు నాతాను సహాయపడ్డాడు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి