కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 9/15 పేజీలు 25-26
  • విఫలంకాని ధైర్యానికి మూలము

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విఫలంకాని ధైర్యానికి మూలము
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • క్రైస్తవులకు ఒక పాఠం
  • ఒక మతం మిగిలి ఉంటుంది
    తేజరిల్లు!—1996
  • మంచి ధైర్యముతో ఉండండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • యెహోవాయే నా ధైర్యం
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ‘నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 9/15 పేజీలు 25-26

విఫలంకాని ధైర్యానికి మూలము

“ఒక హుష్‌ అనే శబ్దం మేము అమాంతంగా ఆగిపోయేలా చేసింది. తర్వాత, మా ఎడమవైపునున్న పొదలో నుండి, రెక్కలు వెడల్పుగా చాచి ఉన్న రెండు పక్షులు మావైపుకు రివ్వున ఎగురుతూ వచ్చాయి. మా ముందు, చిన్న సందులో రెండు గుడ్లున్నాయి. ఆ పక్షులు మేము వాటి గూడును అనుకోకుండా త్రొక్కి వేయకుండా ఆపాయి. గోధుమ వర్ణంగల చుక్కలున్న చక్కని గుడ్లకు దగ్గరగా వెళ్లి వాటి ఫోటోగ్రాఫ్‌లను తీసుకోవాలని మేము ప్రయత్నించిన ప్రతిసారి, ఆ పక్షులు మాపైకి ఎగిరాయి. ‘ఎంత ధైర్యమో,’ అని మేమనుకున్నాము.”

చుక్కలుండే డిక్కూప్‌ గూడు దగ్గరకు నలుగురు పెద్దవారు వెళ్లడానికి ప్రయత్నించినప్పుడు ఎదురైన అనుభవమది. ఆ చిన్న పక్షి, ఆఫ్రికాజాతి ఉల్లంకిపిట్ట. ఎవ్రివన్స్‌ గైడ్‌ టు సౌత్‌ ఆఫ్రికన్‌ బర్డ్స్‌ అనే పుస్తకంలో, పక్షిశాస్త్ర నిపుణులైన సింక్లేర్‌ మరియు మెండెల్‌సన్‌ యిలా వివరిస్తున్నారు: “పొదిగే పక్షుల జతలు తమ గూళ్లను, పిల్లలను ఎంతో జాగ్రత్తగా కాపాడతాయి మరి ఎవరైనా దగ్గరకు రాదలచితే ఎంతో రెచ్చిపోతాయి. అలా వచ్చేవాళ్ల పరిమాణాన్నిబట్టి కూడా అవి భయపడవు, పైకి ఎగురుతూ గట్టిగా అరుస్తూ, మానవులను కూడా తరమడానికి అవి భయంలేకుండా క్రిందకు దూసుకు వస్తాయి.”

ఎంతో పెద్దగా ఉన్న ఏనుగులు అనుకోకుండా ఒక ఆఫ్రికాజాతి ఉల్లంకిపిట్ట గూడు దగ్గరకు వస్తే, ఆ పక్షి మళ్లీ తన రెక్కలను తెరిచి తన ఆకాశ విన్యాసాలను మొదలెట్టడాన్ని కొందరు తిలకించారు. తిరుగు దారిపట్టడం ద్వారా ఏనుగులు తరచూ లోబడతాయి.

పక్షులకు అటువంటి ధైర్యం ఎక్కడనుండి వస్తుంది? వాటిని సృష్టించిన సృష్టికర్త వద్దనుండి అది వచ్చింది. ఈ చిన్న ప్రాణులు తమ గూళ్లకు లేక తమ పిల్లలకు హాని చేయడానికి వచ్చే పెద్ద జంతువులను ఆపాలన్న ప్రకృతి సిద్ధమైన జ్ఞానాన్ని యెహోవా దేవుడు వాటికి యిచ్చాడు.

క్రైస్తవులకు ఒక పాఠం

క్రైస్తవులు ప్రకృతి సిద్ధమైన జ్ఞానంకంటే ఎక్కువే కలిగి ఉండాలని యిష్టపడినా, వారు దీనినుండి ఒక పాఠం నేర్చుకోవచ్చు. దేవుని ఆజ్ఞలకు నిర్భయంగా విధేయుడైన వారి యజమానియగు యేసుక్రీస్తును అనుకరించాలని వారు ప్రోత్సహింపబడుతున్నారు. (హెబ్రీయులు 12:1-3) దేవున్ని సేవించడానికి భయపడే పిరికివారిని బైబిలు ఖండిస్తుంది. (హెబ్రీయులు 10:39; ప్రకటన 21:8) అదే సమయంలో, మనం అసంపూర్ణంగా నిర్మింపబడ్డామని యెహోవా అర్థం చేసుకుంటాడు, మనం కొన్నిసార్లు పాపం చేస్తామని లేక ఆయన చిత్తం చేయడానికి అవసరమైన ధైర్యం కలిగి ఉండలేమని ఆయనకు తెలుసు. (కీర్తన 103:12-14) సరైనది చేయకుండా భయం తనను పట్టి పీడిస్తే ఒక వ్యక్తి ఏమి చేయగలడు?

ఒక క్రైస్తవుడు శ్రమలను తట్టుకోడానికి శక్తి కొరకు ప్రార్థనాపూర్వకంగా దేవునివైపు తిరగాలి మరి దైవిక చిత్తాన్ని చేయడంలో ఎడతెగక కొనసాగాలి. యెహోవా సహాయాన్ని గూర్చిన ఓదార్పునిచ్చే ఈ వాగ్దానాన్ని బైబిలు కలిగి ఉంది: “సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు యౌవనస్థులు తప్పక తొట్రిల్లుదురు యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు.” (యెషయా 40:29-31) అనేకమంది అసంపూర్ణ మానవులు ఈ మాటల సత్యత్వాన్ని అనుభవించారు మరి ‘బలహీనులుగా ఉండి బలపర్చబడ్డారు.’ (హెబ్రీయులు 11:34) క్రైస్తవ అపొస్తలుడైన పౌలు ఒక మంచి ఉదాహరణగా ఉన్నాడు, ఆయనిలా వ్రాశాడు: “నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును, అన్య జనులందరును దాని విను నిమిత్తమును, ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను.”—2 తిమోతి 4:17.

యేసుక్రీస్తు అనుచరులు కావాలని యిష్టపడుతున్న క్రొత్తగా ఆసక్తి కలిగిన ప్రజలు కూడా అటువంటి శక్తినిచ్చే సహాయాన్ని అనుభవించగలరు. హెన్రీ అనే పేరుగల దక్షిణాఫ్రికా వ్యక్తిని గమనించండి, ఆయన తన చర్చిలో డబ్బు విషయాలు చూచుకునే వాడు, తన పాస్టర్‌ ప్రక్క యింట్లో నివసించేవాడు. హెన్రీ సత్యం కొరకు వెదుకుతున్నాడు. చర్చితో తనకు సంబంధాలు ఉన్నప్పటికీ, యెహోవాసాక్షులతో ఉచిత బైబిలు పఠనం కొరకు ఒక రోజు యివ్వబడిన ఆహ్వానాన్ని అంగీకరించాడు. యుక్తకాలానికి, తాను కూడా ఒక సాక్షి అవ్వాలన్న తన అభిలాషను వ్యక్తం చేసి, ఆ గమ్యాన్ని చేరాలంటే తాను ఏ చర్యలను గైకొనాలని అడిగాడు. అతను మొదట తన చర్చికి రాజీనామా చేయవలసి ఉంటుందని అతనికి వివరించబడింది. (ప్రకటన 18:4) పాస్టరు తన పొరుగువాడు మరియు స్నేహితుడు గనుక, తాను కేవలం రాజీనామా చేస్తున్నానని ఉత్తరం వ్రాయడం కాక ముఖాముఖిగా వివరించవలసిన అవసరం ఉంటుందని హెన్రీ భావించాడు. అతను దాన్ని ధైర్యంగా చేశాడు.

పాస్టరు ఆశ్చర్యచకితుడై, తర్వాత హెన్రీని దర్శించడానికి మాడరేటర్‌ను, యితర చర్చి సభ్యులను తీసుకువెళ్లాడు. దేవుని పరిశుద్ధాత్మ లేదని వారు భావించే మతం యొక్క సభ్యుడవ్వడానికి అతను తమ చర్చిని ఎందుకు వదిలాడో వారు తెలుసుకోదలచారు. “మొదట, వారికి జవాబివ్వాలంటే నాకు భయం కలిగింది, ఎందుకంటే వాళ్లకు ఎప్పుడూ నాపైన ఎంతో ప్రభావం ఉండేది. కానీ సహాయం కొరకు నేను యెహోవాకు ప్రార్థించాను, నేను ఈ విధంగా ప్రత్యుత్తరమివ్వడానికి ఆయన నాకు సహాయం చేశాడు: ‘అంతర్జాతీయ మతాలన్నింటిలో, దేవుని నామమైన యెహోవాను ఏది మాత్రమే ఉపయోగిస్తుంది? కేవలం యెహోవాసాక్షులే కదా? దేవుడు, వారు తన నామాన్ని ధరించడానికి అనుమతించి, వారికి తన పరిశుద్ధ ఆత్మను యివ్వకుండా ఉంటాడని మీరు భావిస్తున్నారా?’” అని హెన్రీ వివరించాడు. అటువంటి తర్కనను చర్చి అధికారులు త్రోసిపుచ్చలేక పోయారు. దేవుడు అనుగ్రహించే జ్ఞానము మరియు శక్తినిబట్టి కృతజ్ఞత కలిగి ఉండి, హెన్రీ యిప్పుడు యెహోవాసాక్షులతో కలిసి యింటింటి పరిచర్యలో ధైర్యంగా పాల్గొంటున్నాడు.

అవును, నిజమైన క్రైస్తవుడుగా ఉండాలంటే ధైర్యం అవసరం. ఈ ప్రపంచాంతం దగ్గరౌతుండగా, విశ్వాసానికి పరీక్షలు అధికమౌతాయి. యెహోవాకు వారు చూపించే యథార్థతను విచ్ఛినం చేయడానికి ప్రయత్నించడం ద్వారా దేవుని ప్రజల నిత్యజీవాన్ని గూర్చిన అద్భుతమైన ఉత్తరాపేక్షను దోచుకోవాలని సాతాను యిష్టపడుతున్నాడు. (ప్రకటన 2:10 పోల్చండి.) కానీ మనం ఎప్పుడూ వదిలిపెట్ట కూడదు. భయాన్నిబట్టి మనం తాత్కాలికంగా వెనక్కి తగ్గినా, మనం తిరిగి బలం పుంజుకోడానికి యెహోవా మనకు సహాయం చేయగలడు. ఆయన చిత్తాన్ని ఎడతెగక చేయడానికి ఆయనవైపు ఎడతెగక చూడండి. జ్ఞాపకముంచుకోండి, భయం లేని పక్షులను సృష్టించిన ఆయనే విఫలంకాని ధైర్యానికి మూలము. వాస్తవానికి, నిజ క్రైస్తవులు “ప్రభువు (యెహోవా NW) నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? అని మంచి ధైర్యముతో చెప్పగల” వారై ఉండాలి.—హెబ్రీయులు 13:6.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి